
అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదుచేసింది. ఈ మూవీ తర్వాత సుకుమార్‌కు బాలీవుడ్‌లో క్రేజ్ పెరిగింది. దీంతో ఆయన తర్వాత డైరెక్ట్ చేయబోయే సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సుకుమార్ గురించి బాలీవుడ్ నుంచి ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతుంది.
పుష్ప2 విజయం తర్వాత రామ్‌చరణ్‌తో (Ram Charan) చేయనున్న సినిమా కోసం స్క్రిప్ట్ పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే.. అయితే, సుకుమార్- షారుక్‌ఖాన్(Shah Rukh Khan) కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతుందని బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఈమేరకు షారుక్ టీమ్‌తో చర్చలు కూడా జరిగిపోయాయని తెలుస్తోంది. రాజకీయం నేపథ్యం ఉన్న ఒక గ్రామీణ కథను షారుక్‌ఖాన్‌కు సుక్కు వినిపించారట.. అది ఆయనకు కూడా బాగా నచ్చేసిందని టాక్. కానీ, ఈ కథలో షారుక్ వ్యతిరేక (విలన్) పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి.
'పుష్ప 1, 2'లకు సీక్వెల్‌గా పార్ట్ -3 ఉంటుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆపై చరణ్ ప్రాజెక్ట్ కూడా సుకుమార్ చేతిలో ఉంది. మరి షారుక్‌ఖాన్ కూడా రీసెంట్‌గా తన సొంత బ్యానర్ నుంచి ఒక సినిమాను ప్రకటించారు. ఇలా ఇద్దరూ ఫుల్ బిజీగా తమ వర్క్‌లో ఉన్నారు. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అయితే, వారిద్దరి నుంచి కూడా ఈ వార్త గురించి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment