అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్ | Shah Rukh Disrespectful With Ram Charan In Anant Ambani Pre Wedding | Sakshi
Sakshi News home page

Ram Charan: చరణ్‌ని అలా పిలిచి అవమానించారు.. స్టేజీ దిగిపోయా

Published Mon, Mar 4 2024 7:14 PM | Last Updated on Mon, Mar 4 2024 7:42 PM

Shah Rukh Disrespectful With Ram Charan In Anant Ambani Pre Wedding - Sakshi

జామ్ నగర్‌లో అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా అయ్యాయి. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకల్లో దేశవ్యాప్తంగా టాప్ సెలబ్రిటీలు అందరూ పాల్గొన్నారు. బాలీవుడ్ మొత్తం అంబానీ ఈవెంట్‌లో కనిపించింది. టాలీవుడ్ నుంచి మాత్రం రామ్ చరణ్ దంపతులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఇదే వేడుకలో రామ్ చరణ్‌ని షారుక్ ఖాన్ అవమానించిన విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్టు బయటపెట్టింది.

'బాహుబలి' తర్వాత తెలుగు సినిమా రోజురోజుకీ పెరుగుతూ పోతోంది. ఎంతలా అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లు. ఇప్పుడు మాత్రం టాలీవుడ్ అంటున్నారు. అలానే 'ఆర్ఆర్ఆర్' పాటకు ఆస్కార్ రావడంతో చరణ్.. నేషనల్, ఇంటర్నేషనల్ వైడ్ పాపులర్ అయిపోయాడు. అందులో భాగంగానే తాజాగా అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో ఆహ్వానం మేరకు పాల్గొన్నాడు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?)

'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు' పాటకు సల్మాన్-షారుక్-ఆమిర్ ఖాన్‌లతో స్టేజీపై రామ్ చరణ్ స్టెప్పులు కూడా వేశాడు. ఇది అందరికీ తెలుసు. అయితే స్టేజీపైకి పిలిచే క్రమంలోనే చరణ్‌ని 'ఇడ్లీ-వడ' అని సంభోదించి షారుక్ పిలిచారని, దీంతో కోపమొచ్చి స్టేజీ దిగిపోయానని ఉపాసన మేకప్ ఆర్టిస్టు జెబా హాసన్ చెప్పింది. ఇదే విషయాన్ని తన ఇన్ స్టా స్టోరీలో పెట్టింది. దీంతో అందరూ షాకవుతున్నారు. అదే టైంలో బాలీవుడ్ హీరోల్ని 'వడాపావ్', 'భేల్ పూరి' అని పిలిస్తే ఊరుకుంటారా అని ఫ్యాన్స్ కౌంటర్స్ వేస్తున్నారు.

ఏదేమైనా ఫన్నీగా అయినా సరే షారుక్.. చరణ్‌ని ఇలా పిలవడంపై మెగా ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అలానే బాలీవుడ్ హీరోలకు టాలీవుడ్ హీరోల రేంజ్ పెరిగిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇంకా లోపల మంట అలానే ఉన్నట్లుంది. అందుకే ఇలా పిలిచి ఉంటాడని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement