అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం! | Ram Charan And Upasana Konidela To Attend Anant Ambani And Radhika Merchant Pre Wedding, Deets Inside - Sakshi
Sakshi News home page

Anant Ambani Pre Wedding: అంబానీ ఇంట పెళ్లి వేడుక.. సతీసమేతంగా వెళ్లనున్న మెగాహీరో

Mar 1 2024 3:58 PM | Updated on Mar 1 2024 5:27 PM

Ram Charan And Upasana Attend Anant Ambani Wedding - Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీకి ఈ ఏడాది జూలైలో పెళ్లి జరగనుంది. రాధిక మర్చంట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడు. అయితే పెళ్లికి ఇంకా చాలా టైముంది. కానీ ముందస్తు పెళ్లి వేడుక మాత్రం అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. గుజరాత్‌లోని జామ్‪‌నగర్‌ దీనికి వేదికగా నిలిచింది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

మార్చి 1-3వ తేదీ వరకు కళ్లు చెదిరే రీతిలో జరిగే ఈ వేడుకకు మార్క్ జుకర్‌బర్గ్, ఇవాంకా ట్రంప్ లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ స్టార్స్ అందరూ దాదాపుగా హాజరు కానున్నారు. ఇకపోతే టాలీవుడ్ నుంచి మాత్రం కేవలం రామ్ చరణ్ దంపతులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.

'ఆర్ఆర్ఆర్' సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న చరణ్.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా చాలా ఈవెంట్స్‌కు హాజరయ్యాడు. అలా ఇప్పుడు అంబానీ ఇంట జరిగే ముందస్తు పెళ్లి వేడుకలో తన భార్య ఉపాసనతో కలిసి కనిపించబోతున్నాడు. శుక్రవారం ఉదయానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ ఒక్కొక్కరుగా జామ్ నగర్‌కి చేరుకుంటున్నారు. చరణ్ దంపతులు కూడా ఈ సాయంత్రానికి అక్కడికి చేరుకోవచ్చు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ షోకి వెళ్లొచ్చాక నన్ను బ్యాన్ చేశారు: అలీ రెజా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement