
దేవర సినిమాతో చుట్టమల్లే తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఈ సినిమా విడుదలకుముందే రామ్‌చరణ్ (Ram Charan)తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కూడా మొదలైంది. బుచ్చి బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ #RC16 మూవీ నుంచి జాన్వీ బర్త్‌డే రోజు స్పెషల్ పోస్టర్ కూడా వదిలారు.
దక్షిణాది వంటకాలంటే ఇష్టం
జాన్వీ ఉండేది ముంబైలో అయినా దక్షిణాది వంటకాలంటే తనకెంతో ఇష్టం. వీలు దొరికినప్పుడల్లా తిరుపతికి వస్తుంది. అప్పుడు సౌత్ ఫుడ్‌ను ఎంతో ఇష్టంగా తింటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఉపాసన (Upasana Konidela) ఓ గిఫ్ట్ ఇచ్చింది. ఆ బహుమతి మరేంటో కాదు.. అత్తమ్మాస్ కిచెన్ నుంచి ఓ గిఫ్ట్ హ్యాంపర్‌ను ఇచ్చింది. అసలే భోజనప్రియురాలైన జాన్వీ దాన్ని ఎంతో సంతోషంగా స్వీకరించింది జాన్వీ.
ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే..
దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఇంటిభోజనాన్ని మిస్ అవకూడదన్న ఆలోచనలో నుంచి పుట్టిందే అత్తమ్మాస్ కిచెన్. అప్పటికప్పుడు ఈజీగా ఇంటి భోజనం తయారయ్యేలా ఇన్‌స్టంట్ మిక్స్‌లు రెడీ చేసి అమ్ముతున్నారు. ఎలాంటి కృత్రిమ ప్రిజర్వేటివ్స్ వాడకుండా వీటిని మార్కెట్‌లోకి తీసుకువచ్చారు. ఉప్మా, పులిహోర, రసం, పొంగల్.. ఇలా పలురకాల ఉత్పత్తులను వీరు విక్రయిస్తున్నారు.
చదవండి: ఫిబ్రవరిలో ఒక్కటి తప్ప అన్నీ ఫ్లాపే.. ఒక సినిమాకైతే రూ.10 వేలే