రామ్‌ చరణ్‌ కొత్త కారు.. దేశంలోనే రెండోది | Ram Charan New Car Video Viral | Sakshi
Sakshi News home page

రామ్‌ చరణ్‌ కొత్త కారు.. దేశంలోనే రెండోది

Jul 11 2024 5:28 PM | Updated on Jul 11 2024 5:56 PM

Ram Charan New Car Video Viral

గ్లోబల్‌స్టార్‌ రామ్ చరణ్ దంపతులు అనంత్‌ అంబానీ- రాధికా మర్చెంట్‌ల వివాహానికి హైదరాబాద్‌ నుంచి బయల్దేరారు. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు వివాహానికి భారీగా వెళ్తున్నారు. అయితే ఇప్పుడు రామ్‌ చరణ్‌ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఇప్పుడా వీడియో నెట్టింట భారీగా వైరల్‌ అవుతుంది.

టాలీవుడ్‌ టాప్‌ హీరోల వద్ద లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌  గ్యారేజీలో మెర్సిడేజ్, రోల్స్ రాయిస్ ఫాంథ‌మ్, ఫెరారీ, ఆస్టో మార్టిన్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. తాజాగా చరణ్‌ దంపతులు అనంత్‌ అంబానీ-రాధికా మర్చెంట్‌ వివాహానికి వెళ్లేందుకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అయితే, రామ్‌ చరణ్‌ కొత్త రోల్స్‌ రాయిస్‌ స్పెక్టార్‌ను డ్రైవ్‌ చేసుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు.  దీని ధర దాదాపు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ కారు ఇండియాలో రెండోది కావడం విశేషం. సౌత్‌ ఇండియాలో మొదటి కారు కావడం గమనార్హం.

రోల్స్ రాయిస్ కారుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చాలా తక్కువ మంది వద్దే ఈ కెంపెనీకి చెందిన కార్లు ఉంటాయి. మెగాస్టార్​ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ లేటెస్ట్‌ వర్షన్‌ రోల్స్ రాయిస్ కారును కొన్నారు. జనవరి 2024లో ఈ మోడల్‌ లాంఛ్‌ అయింది. ఈ కారు  అందుకున్న రెండో వ్యక్తిగా రామ్‌ చరణ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement