ఫ‍్యాన్స్‌కు చెర్రీ హోలీ ట్రీట్.. ఆ స్టార్‌ డైరెక్టర్‌తో మరో సినిమా! | Global Stra Ram Charan, Director Sukumar and Composer Devi Sri Prasad joining hands for RC17. - Sakshi
Sakshi News home page

Ram Charan: ఆ స్టార్‌ డైరెక్టర్‌తో మరోసారి రామ్ చరణ్.. అఫీషియల్ ప్రకటన!

Published Mon, Mar 25 2024 3:31 PM | Last Updated on Mon, Mar 25 2024 4:44 PM

Ram Charan Works With Once Again Star Director Sukumar After Rangasthalam - Sakshi

ప్రస్తుత గేమ్ ఛేంజర్‌ సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇటీవలే ఆర్సీ16 పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. అంతలోనే మరో క్రేజీ డైరెక్టర్‌తో గ్లోబల్‌ స్టార్‌ జతకట్టారు. టాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్‌తో కలిసి పని చేయనున్నారు. హోలీ సందర్భంగా ఈ విషయాన్ని పంచుకున్నారు.ఈ మూవీ వర్కింగ్ టైటిల్‌ ఆర్సీ17 పేరుతో మైత్రి మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది. 

కాగా.. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.  మరోవైపు సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప-2 సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement