విజయ్‌ దేవరకొండకు హ్యాండిచ్చిన సుకుమార్‌? | Sukumar Project With Vijay Devarakonda Has Been Cancelled | Sakshi
Sakshi News home page

‘రంగస్థలం’ కాంబినేషన్‌ రిపీట్‌.. రౌడీ హీరోకి హ్యాండిచ్చిన సుకుమార్‌?

Published Fri, Mar 22 2024 1:41 PM | Last Updated on Fri, Mar 22 2024 1:50 PM

Sukumar Project With Vijay Devarakonda Has Been Cancelled - Sakshi

పుష్ప సినిమాతో సుకుమార్‌ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అయ్యాడు. ఆ చిత్రం సౌత్‌ కంటే నార్త్‌ ఆడియెన్స్‌నే ఎక్కువగా ఆకట్టుకుంది. సుకుమార్‌ మేకింగ్‌పై బాలీవుడ్‌ ప్రశంసలు కురిపించింది. ఇక ఇప్పుడు గ్లోబల్‌ ఆడియన్స్‌ను మెప్పించేలా పుష్ప 2ను తీర్చిదిద్దుతున్నాడు కుమార్‌. ఆలస్యమైనా సరే.. పుష్ప 2తో గ్లోబల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఆగస్ట్‌ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. ఈ మూవీ తర్వాత సుకుమార్‌ రామ్‌ చరణ్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

(చదవండి: నేను చనిపోవాలట.. వారికేం వస్తుందో మరి!: బుల్లితెర నటి)

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన  ‘రంగస్థలం’ (2018) బ్లాక్‌ బస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పుడు అంతకు మించిపోయే హిట్‌ స్టోరీని సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ నెల 27న రామ్‌చరణ్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక  ప్రకటన వెల్లడి కానుందని తెలిసింది. వాస్తవానికి పుష్ప తర్వాత సుకుమార్‌.. విజయ్‌ దేవరకొండతో సినిమా చేయాల్సింది. పుష్ప రిలీజ్‌కు ముందే అధికారిక ప్రకటన కూడా చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆ చిత్రం ఆగిపోయిందని వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా టీమ్‌ స్పందిస్తూ..కచ్చితంగా సినిమా ఉంటుందని పేర్కొంది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు.

విజయ్‌ దేవరకొండ నటించిన లైగర్‌ చిత్రం దారుణ పరాజయాన్ని మూటగట్టుకోవడంతో సుకుమార్‌ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం హిట్‌ అయితే విజయ్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యేవాడని.. అప్పుడు సినిమా తీస్తే అదే రేంజ్‌లో  విజయం సాధించొచ్చని సుక్కు భావించాడట. కానీ లైగర్‌ ఫ్లాప్‌ చూసి.. వెనుకడుగు వేశాడు. వెంటనే పుష్ప 2ని సెట్స్‌పైకి తీసుకెళ్లాడు. ఈ మూవీ తర్వాత అయినా విజయ్‌ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రామ్‌చరణ్‌ మూవీ తెరపైకి వచ్చింది. దీంతో ఇక విజయ్‌తో సినిమా లేనట్లే అని ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement