రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' మూవీ మరికొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇదివరకే రిలీజైన పాటలు ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికాలోని డల్లాస్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజుతో పాటు దర్శకుడు సుకుమార్ కూడా వెళ్లాడు. ఈ మూవీ ఇప్పటికే చూసేశానని చెప్పి.. ఎలా ఉందో బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: గేమ్ ఛేంజర్ నుంచి 'దోప్' సాంగ్ రిలీజ్)
'నేను, చిరంజీవి గారు ఆల్రెడీ మూవీ చూశాం. ఫస్టాప్ అద్భుతంగా ఉంది. ఇంటర్వెల్ అయితే బ్లాక్ బస్టర్. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. క్లైమాక్స్‌లో చరణ్, అవార్డ్ విన్నింగ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు' అని సుకుమార్ చెప్పుకొచ్చాడు.
సుకుమార్ చెప్పిన దానిబట్టి చూస్తే సినిమా అదిరిపోయిందని తెలుస్తోంది. మరి ప్రేక్షకులు తీర్పు ఏంటనేది తెలియాలంటే జనవరి 10 వరకు ఆగాల్సిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.
(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)
Comments
Please login to add a commentAdd a comment