భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా | Interesting Facts And Unknown Details About Actor Sri Simha Wife With Unseen Photos | Sakshi
Sakshi News home page

Sri Simha: పెళ్లి తర్వాత భార్య గురించి యంగ్ హీరో తొలి పోస్ట్

Dec 22 2024 7:36 AM | Updated on Dec 22 2024 7:09 PM

Sri Simha Wedding And Wife Details

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా పెళ్లి చేసుకున్నాడు. దుబాయిలో డిసెంబర్ 14న డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో సింహా కొత్త జీవితం ప్రారంభించాడు. పెళ్లి ఫొటోలు అనధికారికంగా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు శ్రీ సింహా స్వయంగా తన భార్య గురించి స్పెషల్ పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్‌)

'ఇప్పటికి ఆరేళ్లయింది. ఎప్పటికీ ఇలానే' అని రాసిపెట్టడంతో పాటు 'రాసిపెట్టుంది' అని య్యాష్ ట్యాగ్ ఒకటి పెట్టాడు. దీనిబట్టి చూస్తుంటే గత ఆరేళ్లుగా రాగ మాగంటితో ప్రేమలో ఉన్న శ్రీ సింహా.. కొన్నాళ్ల క్రితం పెద్దల్ని ఒప్పించాడు. కొన్నిరోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. ఈ నెల 14న దుబాయిలోని ఓ ఐలాండ్‌లో పెళ్లి జరిగింది. ఇందులో రాజమౌళి డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి.

మురళీ మోహన్‌కు కొడుకు రామ్ మోహన్ కుమార్తె రాగ. విదేశాల్లో బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసింది. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు చూసుకుంటోంది. శ్రీసింహ విషయానికి వస్తే 'యమదొంగ' సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా చేశాడు. 'మత్తు వదలరా' రెండు చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్‌ తదితర సినిమాల్లోనూ హీరోగా నటించాడు. కీరవాణి పెద్దబ్బాయి కాలభైరవకు ఇంకా పెళ్లి కాలేదు. ఈలోపే చిన్నబ్బాయికి పెళ్లి జరిగిపోయింది.

(ఇదీ చదవండి: సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement