రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి మరో పాట రిలీజైంది. 'దోప్' అనే లిరిక్స్‌తో సాగుతూ మంచి కలర్‌ఫుల్‌గా ఉంది. కాకపోతే చాలావరకు ఇంగ్లీష్ లిరిక్స్ వినిపించాయి. ఒకటో రెండో తెలుగు పదాలు కనిపించాయి. విజువల్‌గా చూసుకుంటే మాత్రం చాలా రిచ్‌గా ఉంది.
(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)
తమిళ దర్శకుడు శంకర్ తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఉన్నాయి. అమెరికాలో ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. భారీ సంఖ్యలో జనాలు వచ్చారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆకట్టుకుంది. ఇప్పటికే విడుదలైన 'రా మచ్చా', 'నానా హైరానా', 'జరగండి' పాటలు అలరించగా.. ఇప్పుడొచ్చిన పాట కూడా మెల్లగా జనాలకు అలవాటు కావొచ్చనిపిస్తోంది.
జనవరి 10న థియేటర్లలో 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ కానుంది. ఇందులో చరణ్ సరసన కియారా అడ్వాణీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి తదితరులు నటించారు. దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ చేసుకున్న ఈ చిత్రం.. సంక్రాంతికి బిగ్ స్క్రీన్స్‌పైకి రానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment