ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు | Year Ender 2024: Here's The List Of Top 18 Malayalam Best Movies To Watch In OTT Platforms | Sakshi
Sakshi News home page

OTT Movies Malayalam 2024: ఈ ఏడాది రిలీజైన బెస్ట్ మలయాళ మూవీస్.. ఏది ఏ ఓటీటీలో?

Published Sun, Dec 22 2024 9:35 AM | Last Updated on Sun, Dec 22 2024 11:14 AM

Malayalam Best Movies 2024 In Various OTTs

ఈ ఏడాది తెలుగు సినిమా రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. మిగతా చిత్రపరిశ్రమల్లో ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రమే అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఎందుకంటే జనవరి నుంచి వరసగా మలయాళంలో ప్రతి నెలా ఒకటి రెండు హిట్ సినిమాలు వచ్చాయి. అవి కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి. అలా ఈ ఏడాది రిలీజైన కొన్ని మలయాళ బెస్ట్ మూవీస్.. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి. వాటి సంగతేంటనేది చూద్దాం.

(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)

మొత్తంగా 18 సినిమాల్ని వేరే ఆలోచన లేకుండా చూసేయొచ్చు. వీటిలో కామెడీ, యాక్షన్, హారర్, థ్రిల్లర్, రొమాంటిక్.. ఇలా అన్ని జానర్స్ ఉన్నాయి. పైపెచ్చు ఈ జాబితాలో ఉన్న సినిమాలన్నీ కూడా తెలుగు డబ్బింగ్‪‌తో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ ఏడాది మంచి సినిమాలు చూస్తూ ముగించాలనుకుంటే ఈ మూవీస్ బెస్ట్ ఆప్షన్. అస్సలు డిసప్పాయింట్ అయ్యే అవకాశముండదు.

ఈ ఏడాది రిలీజైన బెస్ట్ మలయాళ మూవీస్

  1. భ్రమయుగం - సోనీ లివ్ (తెలుగు)

  2. ఆవేశం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)

  3. మంజుమ్మల్ బాయ్స్ - హాట్‌స్టార్ (తెలుగు)

  4. ద గోట్ లైఫ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

  5. అడియోస్ అమిగో - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

  6. ఏఆర్ఎమ్ - హాట్‌స్టార్ (తెలుగు)

  7. ఆట్టం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)

  8. ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ - ముబి (మలయాళం)

  9. అన్వేషిప్పిన్ కండేతుమ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)

  10. గురువాయుర్ అంబలనడియిల్ - హాట్‌స్టార్ (తెలుగు)

  11. కిష్కింద కాండం - హాట్‌స్టార్ (తెలుగు)

  12. గోళం - అమెజాన్ ప్రైమ్ (తెలుగు)

  13. ప్రేమలు - ఆహా (తెలుగు)

  14. పని - సోనీ లివ్ (తెలుగు) (ఇంకా స్ట్రీమింగ్ కావాలి)

  15. తలవన్ - సోనీ లివ్ (తెలుగు)

  16. ఉళ్లోరుక్కు - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)

  17. సూక్ష‍్మదర్శిని - ఓటీటీలోకి రావాల్సి ఉంది

  18. వాళా - హాట్‌స్టార్ (తెలుగు)

(ఇదీ చదవండి: 2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement