Kishkindha Kaandam Movie
-
ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు
ఈ ఏడాది తెలుగు సినిమా రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. మిగతా చిత్రపరిశ్రమల్లో ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రమే అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఎందుకంటే జనవరి నుంచి వరసగా మలయాళంలో ప్రతి నెలా ఒకటి రెండు హిట్ సినిమాలు వచ్చాయి. అవి కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి. అలా ఈ ఏడాది రిలీజైన కొన్ని మలయాళ బెస్ట్ మూవీస్.. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి. వాటి సంగతేంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)మొత్తంగా 18 సినిమాల్ని వేరే ఆలోచన లేకుండా చూసేయొచ్చు. వీటిలో కామెడీ, యాక్షన్, హారర్, థ్రిల్లర్, రొమాంటిక్.. ఇలా అన్ని జానర్స్ ఉన్నాయి. పైపెచ్చు ఈ జాబితాలో ఉన్న సినిమాలన్నీ కూడా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ ఏడాది మంచి సినిమాలు చూస్తూ ముగించాలనుకుంటే ఈ మూవీస్ బెస్ట్ ఆప్షన్. అస్సలు డిసప్పాయింట్ అయ్యే అవకాశముండదు.ఈ ఏడాది రిలీజైన బెస్ట్ మలయాళ మూవీస్భ్రమయుగం - సోనీ లివ్ (తెలుగు)ఆవేశం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)మంజుమ్మల్ బాయ్స్ - హాట్‌స్టార్ (తెలుగు)ద గోట్ లైఫ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)అడియోస్ అమిగో - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)ఏఆర్ఎమ్ - హాట్‌స్టార్ (తెలుగు)ఆట్టం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ - ముబి (మలయాళం)అన్వేషిప్పిన్ కండేతుమ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)గురువాయుర్ అంబలనడియిల్ - హాట్‌స్టార్ (తెలుగు)కిష్కింద కాండం - హాట్‌స్టార్ (తెలుగు)గోళం - అమెజాన్ ప్రైమ్ (తెలుగు)ప్రేమలు - ఆహా (తెలుగు)పని - సోనీ లివ్ (తెలుగు) (ఇంకా స్ట్రీమింగ్ కావాలి)తలవన్ - సోనీ లివ్ (తెలుగు)ఉళ్లోరుక్కు - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)సూక్ష్మదర్శిని - ఓటీటీలోకి రావాల్సి ఉందివాళా - హాట్‌స్టార్ (తెలుగు)(ఇదీ చదవండి: 2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?) -
OTT Review: 'కిష్కింద కాండం'.. ఓ సైకలాజికల్ థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘కిష్కింధకాండమ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మన జీవితమనేది ఒడుదుడుకుల ప్రయాణం. ఎప్పుడు ఏ అడ్డంకి వస్తుందో చెప్పలేం. కానీ ఎటువంటి అడ్డంకి వచ్చినా ఎదురొడ్డి దాటుకొని ప్రయాణం చేస్తేనే మనకు మిగతా జీవితం. అలాంటి అడ్డంకుల ఆధారంగా అల్లుకున్న కథే ‘కిష్కింధకాండమ్’. ఏడు కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా 75 కోట్లకు పైనే ఆర్జించి పెట్టింది. అంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ మలయాళ సినిమా హాట్ స్టార్ ఓటీటీ వేదికగా తెలుగు డబ్బింగ్ వెర్షన్లోనూ లభ్యమవుతోంది. ఈ చిత్రానికి దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించారు. ఆసిఫ్ ఆలీ, అపర్ణా బాలమురళి, విజయ రాఘవన్, నిళల్గళ్ రవి తదితరులు నటించారీ చిత్రంలో. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే.. ఫారెస్ట్ ఆఫీసరైన హీరో అజయ్ పెళ్లితో సినిమా ప్రారంభమవుతుంది.అజయ్ రెండో పెళ్లిగా అపర్ణను చేసుకుంటాడు. అజయ్‌కి మొదటి పెళ్లి కారణంగా చాచు అనే కొడుకుంటాడు. అలాగే అజయ్ తండ్రి అప్పుపిల్లా ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అప్పుపిల్లా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అజయ్ ఫారెస్ట్ ఆఫీసరవడం వల్ల ఓ దట్టమైన అడవిలో తన నివాసం ఉంటుంది. చుట్టూ ఎక్కువగా కోతులు ఉంటాయి. ఆ కోతులు అన్ని ఇళ్ళలోంచి వస్తువులు ఎత్తుకుపోతూ ఊళ్లోవాళ్లందరినీ ఇబ్బంది పెడుతుంటాయి. అజయ్, అపర్ణాలకు పెళ్ళై ఇంట్లో అడుగుపెట్టే సమయంలోపోలీసులు ఎదురుపడతారు. ఊర్లో ఎన్నికల సందర్భంగా అజయ్ తండ్రి తన లైసెన్స్ రివాల్వరునుపోలీస్ స్టేషన్లో అప్పజె΄్పాలనిపోలీసులు వస్తారు. ఆ సమయంలోనే తెలుస్తుంది అజయ్ తండ్రి తన తుపాకీని రెండేళ్ల క్రిందటేపోగొట్టుకున్నాడని. అంతేకాదు అజయ్ కొడుకు చాచు కూడా కనబడకుండాపోతాడు. ఓ పక్క తుపాకీ... మరో పక్క పిల్లాడు... ఆపై మామ మతిమరుపు వ్యాధి... ఇన్ని విషయాలపై కొత్తగా పెళ్లై వచ్చిన అపర్ణ దృష్టి సారిస్తుంది. ఇక అక్కడ నుండి కథ అనేక అనూహ్యమైన మలుపులు తిరుగుతూ, చూసే ప్రేక్షకులను కథ సాగే కొద్దీ ఉత్కంఠను రేపుతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్నాపోనుపోను ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే సినిమా అపరిమితమైన ప్రేక్షకాదరణను నోచుకుంది. ఓ ముఖ్య విషయం... ఇది పిల్లలతో చూడవలసిన సినిమా అయితే కాదు. వర్త్ టు వాచ్ దిస్ సైకలాజికల్ థ్రిల్లర్. – ఇంటూరు హరికృష్ణ -
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు
మరో వారం వచ్చేసింది. గతవారం రిలీజైన 'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తేలిపోవడంతో కొత్తవి ఏమొస్తున్నాయా అని ప్రేక్షకులు చూస్తున్నారు. అందుకు తగ్గట్లే ఈ వారం 'మెకానిక్ రాకీ', 'దేవకీ నందన వాసుదేవ', 'మందిర', 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', 'కేసీఆర్' (కేశవ్ చంద్రా రమావత్) లాంటి చోటామెటా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 34 కొత్త మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి.. ప్రీ వెడ్డింగ్ ఫొటో వైరల్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే 'కిష్కింద కాండం' అనే డబ్బింగ్ బొమ్మ చాలా ఆసక్తి కలిగిస్తోంది. దీంతో పాటే నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, రానా హోస్ట్ చేసిన టాక్ షో ఉన్నంతలో చూడాలనిపిస్తున్నాయి. ఇవి తప్పితే మిగతావన్నీ హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు-వెబ్ సిరీసులే. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (నవంబర్ 18-24వ తేదీ వరకు)నెట్ఫ్లిక్స్నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ (డాక్యుమెంటరీ) - నవంబర్ 18వండరూస్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18జాంబీవర్స్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - నవంబర్ 19సీ హెర్ ఎగైన్ (కాంటోనీస్ సిరీస్) - నవంబర్ 20అడోరేషన్ (ఇటాలియన్ సిరీస్) - నవంబర్ 20ఏ మ్యాన్ ఆన్ ద ఇన్ సైడ్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 21టోక్యో ఓవర్ రైడ్ (జపనీస్ సిరీస్) - నవంబర్ 21జాయ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 22పోకెమన్ హారిజన్స్ ద సిరీస్ పార్ట్ 4 (జపనీస్ సిరీస్) - నవంబర్ 22స్పెల్ బౌండ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22ద హెలికాప్టర్ హెయిస్ట్ (స్వీడిష్ సిరీస్) - నవంబర్ 22ద పియానో లెసన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 22ట్రాన్స్‌మిట్హ్ (స్పానిష్ మూవీ) - నవంబర్ 22యే ఖాలీ ఖాలీ అంకైన్ సీజన్ 2 (హిందీ సిరీస్) - నవంబర్ 22ద ఎంప్రెస్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) - నవంబర్ 22అమెజాన్ ప్రైమ్క్యాంపస్ బీట్స్ సీజన్ 4 (హిందీ సిరీస్) - నవంబర్ 20వ్యాక్ గర్ల్స్ (హిందీ సిరీస్) - నవంబర్ 22పింపినెరో (స్పానిష్ మూవీ) - నవంబర్ 22ద రానా దగ్గుబాటి షో (తెలుగు టాక్ షో) - నవంబర్ 23హాట్స్టార్కిష్కింద కాండం (తెలుగు డబ్బింగ్ సినిమా) - నవంబర్ 19ఇంటీరియర్ చైనా టౌన్ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 19ఏలియన్: రొములస్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 21బియా & విక్టర్ (పోర్చుగీస్ సిరీస్) - నవంబర్ 22ఔట్ ఆఫ్ మై మైండ్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 22జియో సినిమాడ్యూన్: ప్రొపెసీ (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 18బేస్డ్ ఆన్ ఓ ట్రూ స్టోరీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 22ద సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజీ గర్ల్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - నవంబర్ 22హరోల్డ్ అండ్ ద పర్పుల్ క్రేయాన్ (ఇంగ్లీష్ సినిమా) - నవంబర్ 23మనోరమ మ్యాక్స్తెక్కు వడక్కు (మలయాళ సినిమా) - నవంబర్ 19ఆపిల్ ప్లస్ టీవీబ్లిట్జ్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22బుక్ మై షోఫ్రమ్ డార్క్నెస్ (స్వీడిష్ సినిమా) - నవంబర్ 22ద గర్ల్ ఇన్ ద ట్రంక్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22ద నైట్ మై డాడ్ సేవ్డ్ క్రిస్మస్ (స్పానిష్ సినిమా) - నవంబర్ 22లయన్స్ గేట్ ప్లేగ్రీడీ పీపుల్ (ఇంగ్లీష్ మూవీ) - నవంబర్ 22(ఇదీ చదవండి: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డ్ ఇదే.. డేట్ ఫిక్స్)