ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ‘కిష్కింధకాండమ్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
మన జీవితమనేది ఒడుదుడుకుల ప్రయాణం. ఎప్పుడు ఏ అడ్డంకి వస్తుందో చెప్పలేం. కానీ ఎటువంటి అడ్డంకి వచ్చినా ఎదురొడ్డి దాటుకొని ప్రయాణం చేస్తేనే మనకు మిగతా జీవితం. అలాంటి అడ్డంకుల ఆధారంగా అల్లుకున్న కథే ‘కిష్కింధకాండమ్’. ఏడు కోట్లు పెట్టి తీసిన ఈ సినిమా 75 కోట్లకు పైనే ఆర్జించి పెట్టింది. అంతటి ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాలో ఏముందో ఓసారి చూద్దాం. ఈ మలయాళ సినిమా హాట్ స్టార్ ఓటీటీ వేదికగా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లోనూ లభ్యమవుతోంది. ఈ చిత్రానికి దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించారు. ఆసిఫ్ ఆలీ, అపర్ణా బాలమురళి, విజయ రాఘవన్, నిళల్‌గళ్ రవి తదితరులు నటించారీ చిత్రంలో. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే.. ఫారెస్ట్ ఆఫీసరైన హీరో అజయ్ పెళ్లితో సినిమా ప్రారంభమవుతుంది.
అజయ్ రెండో పెళ్లిగా అపర్ణను చేసుకుంటాడు. అజయ్‌కి మొదటి పెళ్లి కారణంగా చాచు అనే కొడుకుంటాడు. అలాగే అజయ్ తండ్రి అప్పుపిల్లా ఓ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. అప్పుపిల్లా అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అజయ్ ఫారెస్ట్ ఆఫీసరవడం వల్ల ఓ దట్టమైన అడవిలో తన నివాసం ఉంటుంది. చుట్టూ ఎక్కువగా కోతులు ఉంటాయి. ఆ కోతులు అన్ని ఇళ్ళలోంచి వస్తువులు ఎత్తుకుపోతూ ఊళ్లోవాళ్లందరినీ ఇబ్బంది పెడుతుంటాయి. అజయ్, అపర్ణాలకు పెళ్ళై ఇంట్లో అడుగుపెట్టే సమయంలోపోలీసులు ఎదురుపడతారు. ఊర్లో ఎన్నికల సందర్భంగా అజయ్ తండ్రి తన లైసెన్స్ రివాల్వరునుపోలీస్ స్టేషన్‌లో అప్పజె΄్పాలనిపోలీసులు వస్తారు.
ఆ సమయంలోనే తెలుస్తుంది అజయ్ తండ్రి తన తుపాకీని రెండేళ్ల క్రిందటేపోగొట్టుకున్నాడని. అంతేకాదు అజయ్ కొడుకు చాచు కూడా కనబడకుండాపోతాడు. ఓ పక్క తుపాకీ... మరో పక్క పిల్లాడు... ఆపై మామ మతిమరుపు వ్యాధి... ఇన్ని విషయాలపై కొత్తగా పెళ్లై వచ్చిన అపర్ణ దృష్టి సారిస్తుంది. ఇక అక్కడ నుండి కథ అనేక అనూహ్యమైన మలుపులు తిరుగుతూ, చూసే ప్రేక్షకులను కథ సాగే కొద్దీ ఉత్కంఠను రేపుతుంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే మొదట్లో కాస్త నెమ్మదిగా ఉన్నాపోనుపోను ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అందుకే సినిమా అపరిమితమైన ప్రేక్షకాదరణను నోచుకుంది. ఓ ముఖ్య విషయం... ఇది పిల్లలతో చూడవలసిన సినిమా అయితే కాదు. వర్త్ టు వాచ్ దిస్ సైకలాజికల్ థ్రిల్లర్. – ఇంటూరు హరికృష్ణ
Comments
Please login to add a commentAdd a comment