2024 చివరకొచ్చేసింది. ఈ ఏడాది తెలుగు సినిమా రేంజ్ చాలా ఎత్తుకు ఎదిగింది. జనవరిలో 'హనుమాన్' దగ్గర నుంచి డిసెంబర్‌లో రిలీజైన 'పుష్ప 2' వరకు తగ్గేదే లే అన్నట్లు దూసుకుపోయింది. మధ్యలో 'కల్కి', 'దేవర' లాంటి మూవీస్ పాన్ ఇండియా లెవల్లో తమదైన వసూళ్లు సాధించాయి. మిగతా భాషలతో పోలిస్తే తెలుగు చిత్రాలకు ఈసారి లాభాలు బాగానే వచ్చాయని చెప్పొచ్చు. మరి ఈ ఏడాది అత్యధికంగా లాభపడిన మూవీ ఏంటి? ఎంతొచ్చాయి?
తెలుగులో ఈ ఏడాది థియేటర్లలో రిలీజై మంచి వసూళ్లు సాధించిన సినిమాల అంటే.. హనుమాన్, కల్కి, దేవర, పుష్ప 2, టిల్లు స్క్వేర్, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, గుంటూరు కారం ఉంటాయి. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న 'పుష్ప 2' దేశవ్యాప్తంగా ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. హిందీలోనూ రూ.645 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుని.. వందేళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)
లాభాల పరంగా చూసుకుంటే 'పుష్ప 2' సినిమా అగ్రస్థానంలో ఉంటుందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే 'పుష్ప 2'కి అటుఇటుగా రూ.500 కోట్లకు పైనే బడ్జెట్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే 150-200 శాతం మధ్యలోనే ఉంది. కల్కి, దేవర చిత్రాల్ని తీసుకున్నా సరే పెట్టిన బడ్జెట్‌కి కొంతమేర లాభాలు వచ్చాయి తప్పితే మరీ ఎక్కువ అయితే రాలేదు.
కానీ జనవరిలో రిలీజైన 'హనుమాన్' మూవీకి మాత్రం రూ.40 కోట్లు బడ్జెట్ పెడితే.. రూ.300-350 కోట్ల వరకు వచ్చాయి. దాదాపు 600 శాతానికి పైగా వసూళ్లు వచ్చినట్లే. బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్‌కి లాభాల్లో షేర్ ఇచ్చినా సరే నిర్మాత ఈ సినిమాతో బాగానే లాభపడినట్లే! దీనిబట్టి చూస్తే 2024లో 'హనుమాన్' మోస్ట్ ప్రాఫిటబుల్ తెలుగు సినిమా అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 'పుష్ప 2' మూవీ ఇంకా థియేటర్లలో ఉంది కాబట్టి.. రన్ పూర్తయ్యేసరికి లాభాల్లో పర్సంటేజ్ ఏమైనా మారుతుందేమో చూడాలి?
(ఇదీ చదవండి: నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు: అల్లు అర్జున్)
Comments
Please login to add a commentAdd a comment