Bramayugam Movie
-
ఓటీటీల్లో కచ్చితంగా చూడాల్సిన మలయాళ సినిమాలు
ఈ ఏడాది తెలుగు సినిమా రేంజు ఎక్కడికో వెళ్లిపోయింది. మిగతా చిత్రపరిశ్రమల్లో ఒక్క మలయాళ ఇండస్ట్రీ మాత్రమే అద్భుతమైన సక్సెస్ అందుకుంది. ఎందుకంటే జనవరి నుంచి వరసగా మలయాళంలో ప్రతి నెలా ఒకటి రెండు హిట్ సినిమాలు వచ్చాయి. అవి కలెక్షన్స్ అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్ని అమితంగా అలరించాయి. అలా ఈ ఏడాది రిలీజైన కొన్ని మలయాళ బెస్ట్ మూవీస్.. ఇంతకీ ఏయే ఓటీటీల్లో ఉన్నాయి. వాటి సంగతేంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: భార్యని పరిచయం చేసిన హీరో శ్రీసింహా)మొత్తంగా 18 సినిమాల్ని వేరే ఆలోచన లేకుండా చూసేయొచ్చు. వీటిలో కామెడీ, యాక్షన్, హారర్, థ్రిల్లర్, రొమాంటిక్.. ఇలా అన్ని జానర్స్ ఉన్నాయి. పైపెచ్చు ఈ జాబితాలో ఉన్న సినిమాలన్నీ కూడా తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ ఏడాది మంచి సినిమాలు చూస్తూ ముగించాలనుకుంటే ఈ మూవీస్ బెస్ట్ ఆప్షన్. అస్సలు డిసప్పాయింట్ అయ్యే అవకాశముండదు.ఈ ఏడాది రిలీజైన బెస్ట్ మలయాళ మూవీస్భ్రమయుగం - సోనీ లివ్ (తెలుగు)ఆవేశం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)మంజుమ్మల్ బాయ్స్ - హాట్‌స్టార్ (తెలుగు)ద గోట్ లైఫ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)అడియోస్ అమిగో - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)ఏఆర్ఎమ్ - హాట్‌స్టార్ (తెలుగు)ఆట్టం - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)ఆల్ వుయ్ ఇమేజిన్ యాజ్ లైట్ - ముబి (మలయాళం)అన్వేషిప్పిన్ కండేతుమ్ - నెట్‌ఫ్లిక్స్ (తెలుగు)గురువాయుర్ అంబలనడియిల్ - హాట్‌స్టార్ (తెలుగు)కిష్కింద కాండం - హాట్‌స్టార్ (తెలుగు)గోళం - అమెజాన్ ప్రైమ్ (తెలుగు)ప్రేమలు - ఆహా (తెలుగు)పని - సోనీ లివ్ (తెలుగు) (ఇంకా స్ట్రీమింగ్ కావాలి)తలవన్ - సోనీ లివ్ (తెలుగు)ఉళ్లోరుక్కు - అమెజాన్ ప్రైమ్ (మలయాళం)సూక్ష్మదర్శిని - ఓటీటీలోకి రావాల్సి ఉందివాళా - హాట్‌స్టార్ (తెలుగు)(ఇదీ చదవండి: 2024లో అత్యధిక లాభాలొచ్చిన తెలుగు సినిమా ఏదంటే?) -
మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా.. ఆ లిస్ట్‌లో ఏకంగా రెండో స్థానం!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్వైట్లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్‌ను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో ది సబ్‌స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది. (ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)‘భ్రమయుగం’ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్‌లో అందుబాటులో ఉంది.Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024 -
ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాలు ఏమున్నాయా అని చాలామంది చూస్తారు. ఈసారి థియేటర్లలో పెద్దగా చెప్పుకోదగ్గర మూవీస్ అయితే ఏం లేవు. 'తంత్ర', 'వెయ్ దరువెయ్', 'షరతులు వర్తిస్తాయి' లాంటి చిన్న చిత్రాలే ఉన్నాయి. వీటిలో ఏది పాజిటివ్ టాక్ తెచ్చుకుని నిలబడుతుందనేది చూడాలి. అదే టైంలో ఓటీటీలోకి మాత్రం మంచి క్రేజీ మూవీస్ వచ్చేశాయి. వీటిలో ఓ మూడు మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. భ్రమయుగం.. మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ఈ సినిమా, గత నెలలో థియేటర్లలో రిలీజై మలయాళం సెన్సేషన్ సృష్టించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ కావడం, కాస్త ల్యాగ్ ఉండటంతో తెలుగు ప్రేక్షకులకు సరిగా కనెక్ట్ కాలేదు. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అయిపోతుంది. 1970ల్లో జరిగిన ఓ విచిత్రమైన కథతో 'భ్రమయుగం'.. మీరు ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'లవర్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) తెలుగులో వెబ్ సిరీసులు రావడం ఏమో గానీ అవి హిట్ అయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువ. కానీ ఈ కామెడీ ఎంటర్టైనర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు దీని రెండో సీజన్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లోకి వచ్చేసింది. తొలి భాగాన్ని మించి ఉందని టాక్ అయితే వచ్చేసింది. మరి కామెడీ సిరీస్ చూడాలనుకుంటే దీన్ని ట్రై చేయండి. ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన తమిళ సినిమా 'మిషన్ చాప్టర్-1'. అరుణ్ విజయ్-అమీ జాక్సన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ థియేటర్ల సమస్య కారణంగా తెలుగు వెర్షన్ వాయిదా వేసుకున్నారు. తమిళంలో ఓ మాదిరి టాక్ తెచ్చుకున్న తండ్రి కూతుళ్ల డ్రామా.. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. సో అదన్నమాట విషయం. ఈ వీకెండ్లో చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చినప్పటికీ ఇవే కాస్తంత ఆసక్తి కలిగిస్తున్నాయి. (ఇదీ చదవండి: 'అన్వేషిప్పిన్ కండేతుమ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీ ప్రియులకు పండగే.. ఒక్క రోజే 12 చిత్రాలు స్ట్రీమింగ్!
మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఎప్పటిలాగే శుక్రవారం వస్తోందంటే సినిమాలు రిలీజ్‌కు సిద్ధమైపోతాయి. ఈ వారంలో థియేటర్లలో చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో వెయ్ దరువెయ్, రజాకార్, లంబసింగి, తంత్ర, యోధ అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. దీంతో సినీ ప్రియులు ఓటీటీ వైపు చూస్తున్నారు. మరి ఈ వీకెండ్లో సందడి చేసేందుకు క్రేజీ చిత్రాలు రెడీ ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో హనుమాన్ వచ్చే అవకాశముంది. కానీ ఇప్పటికే హిందీ వర్షన్ అధికారికంగా ప్రకటించగా.. దక్షిణాది భాషల్లో ఎప్పుడనేది క్లారిటీ లేదు. మరోవైపు మమ్ముట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు వస్తున్నాయి. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. నెట్‌ఫ్లిక్స్ 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15 అమెజాన్ ప్రైమ్ బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 హాట్‌స్టార్ గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 జీ5 మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 సోనీ లివ్ భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15 ఆపిల్ ప్లస్ టీవీ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 లయన్స్ గేట్ ప్లే నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15 బుక్ మై షో ద డెవిల్ కాన్స్పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15 జియో సినిమా హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17 -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్
ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలోకి వచ్చే చిత్రాల్లో దాదాపు అన్ని చిన్న సినిమాలే ఉన్నాయి. వీటిలో 'వెయ్ దరువెయ్', 'రజాకర్', 'తంత్ర'తో పాటు 'యోధ' అనే డబ్బింగ్ మూవీ కూడా ఉంది. మరోవైపు ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ తెలుగు చిత్రాలు-సిరీసులు స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. (ఇదీ చదవండి: ఆస్కార్-2024 విన్నింగ్ సినిమాలు.. ఏయే ఓటీటీలో ఉన్నాయంటే?) ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-సిరీసులు కూడా ఓటీటీల్లోకి రాబోతున్నాయి. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (మార్చి 11-17th వరకు) నెట్‌ఫ్లిక్స్ యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ సిరీస్) - మార్చి 11 జీసస్ రివల్యూషన్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 12 టర్నింగ్ పాయింట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 12 బండిడోష్ (స్పానిష్ సిరీస్) - మార్చి 13 24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 14 గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 చికెన్ నగ్గెట్ (కొరియన్ సిరీస్) - మార్చి 15 ఐరిష్ విష్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 ఐరన్ రియన్ (స్పానిష్ సిరీస్) - మార్చి 15 మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) - మార్చి 15 అమెజాన్ ప్రైమ్ లవ్ అదురా (హిందీ సిరీస్) - మార్చి 13 బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ సిరీస్) - మార్చి 14 ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 14 ఫ్రిడా (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 హాట్‌స్టార్ గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు సిరీస్) - మార్చి 15 టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 15 జీ5 మెయిన్ అటల్ హూ (హిందీ సినిమా) - మార్చి 14 సోనీ లివ్ భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) - మార్చి 15 ఆపిల్ ప్లస్ టీవీ మ్యాన్ హంట్ (ఇంగ్లీష్ సిరీస్) - మార్చి 15 లయన్స్ గేట్ ప్లే నో వే అప్ (ఇంగ్లీష్ చిత్రం) - మార్చి 15 బుక్ మై షో ద డెవిల్ కాన్స్పరసీ (ఇంగ్లీష్ సినిమా) - మార్చి 15 జియో సినిమా హనుమాన్ (హిందీ వెర్షన్ మూవీ) - మార్చి 16 ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లీష్ మూవీ) - మార్చి 17 (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఓటీటీలోకి మెగాస్టార్ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో క్రేజీ హిట్ సినిమా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది. మొన్నీమధ్య థియేటర్లలోకి వచ్చింది. ఇప్పుడు మూడు వారాలు తిరక్కుండానే సినీ ప్రేమికుల్ని అలరించేందుకు సిద్ధమైపోయింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో నెటిజన్స్ అలెర్ట్ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది? ఫిబ్రవరిలో మలయాళ ఇండస్ట్రీ వరస హిట్స్ కొట్టింది. ప్రేమలు, భ్రమయుగం, మంజుమల్ బాయ్స్.. ఇలా వారానికొకటి చొప్పున అద్భుతమైన సక్సెస్ అందుకున్నాయి. వీటిలో మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' మూవీ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్లో తీసి సాహసం చేశారు. అలానే కేవలం మూడే పాత్రలతో దాదాపు రెండున్నర గంటల సినిమా చూపించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) హారర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా తొలుత మలయాళంలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇది జరిగిన వారానికే అంటే ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేశారు. ఇక్కడ ఓ తరహా ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని సోని లివ్ ఓటీటీలో మార్చి 15 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. 'భ్రమయుగం' కథ విషయానికొస్తే.. 17వ శతాబ్దంలో మలబారు తీరం. ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్(అర్జున్ అశోకన్).. అడవిలో తప్పిపోయి కుముదన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటున్న ఇంటికి చేరుకుంటాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఆశ్రయం పొందుతాడు. అయితే ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా సరే దేవన్ అక్కడి నుంచి బయటపడలేకపోతాడు. చివరకు ఏమైంది? ఇంతకు పొట్టి ఎవరు? అనేది స్టోరీ. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) The iconic Mammootty stars in Bramayugam, a black and white masterpiece, shrouded in mystery and horror! Get ready for a cinematic experience unlike any other. Streaming on Sony LIV from March 15th.#Bramayugam #SonyLIV #BramayugamOnSonyLIV #Bramayugam starring @mammukka pic.twitter.com/os5y2t8hLH — Sony LIV (@SonyLIV) March 6, 2024 -
భారీగా 'భ్రమయుగం' కలెక్షన్స్.. బిగ్ మార్క్‌ను దాటేసిన మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన 'భ్రమయుగం' సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో రికార్డులు క్రియేట్ చేస్తుంది. మొదట మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 23న తెలుగులో రిలీజ్ అయింది. టాలీవుడ్లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ మూవీని విడుదల చేసింది. రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన ఈ సినిమాని చక్రవర్తి రామచంద్ర, ఎస్.శశికాంత్ సంయుక్తంగా నిర్మించారు. అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కేవలం మూడు పాత్రలతో అది కూడా బ్లాక్ అండ్ వైట్‌లో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి వచ్చిన కలెక్షన్స్ మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని భాషలతో కలుపుకుని రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు సితార ఎంటర్టైన్మెంట్ వారు ప్రకటించారు. సినిమా పట్ల మంచి టాక్ రావడంతో రూ. 100 కోట్ల మార్క్‌ను దాటుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరుస హిట్లతో సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మమ్ముట్టి సత్తా చాటుతున్నాడు. భ్రమయుగం ఓటీటీ రైట్స్ కూడా సుమారు రూ. 25 కోట్లకు పైగా సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల హక్కులు మొత్తం సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలిసింది. కేవలం రూ. 15 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతుంది. మార్చి చివరి వారంలో సోనీ లివ్‌లో భ్రమయుగం స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Sithara Entertainments (@sitharaentertainments) -
ఖైదీలా స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?
మమ్ముట్టి ఇప్పుడీ పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంచలనం.. ఏడు పదుల వయస్సు ధాటినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్. 'యాత్ర' సినిమాతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయాడు.. తాజాగా 'భ్రమయుగం' సినిమాతో ప్రేక్షకులను మరీంత ఆశ్చర్యపరిచాడు. బ్లాక్ అండ్ వైట్‌లో మూడే పాత్రలతో 'భ్రమయుగం' సినిమా తీసి తన సత్తా ఎంటో నిరూపించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? అనుకుంటే సాధ్యమే అని నిరూపించాడు. ఒక స్టార్ హీరో ఒక గే పాత్ర చేయడం అంటే అంత సులభం కాదు.. 'కాదల్ ది కోర్'లో చేశాడు మమ్ముట్టి. అందరి హీరోల మాదిరి కాకుండా కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, వైవిధ్యాన్ని చూపుతు తనదైన స్టైల్లో సినిమాలు తీస్తున్నాడు. తాజాగా ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. 'టర్బో' పేరుతో మరో భిన్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన ఈ ప్రాజెక్ట్.. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను మమ్ముట్టి షేర్ చేశారు. పోలీసుస్టేషన్లో ఖైదీల మధ్యలో కూర్చుని కొత్త అవతారంలో మమ్ముట్టి కనిపించారు. ఈ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇదే క్రమంలో ఆయన 'బజూక' అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. గేమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీనో డెన్నిస్ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. 'బజూక'లో బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే వైరల్ అవుతుంది. బజూక సినిమాలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, సుమిత్ నావల్, సిద్దార్ధ్ భరతన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ సరిగమ బ్యానర్లపై డోల్విన్ కురియాకోస్ జిన్ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్ ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. -
Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ
టైటిల్: భ్రమయుగం నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్,సిద్ధార్థ్ భరతన్ నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్ తెలుగు విడుదల:సితార ఎంటర్టైన్మెంట్స్ దర్శకత్వం: రాహుల్ సదాశివన్ సంగీతం: క్రిస్టో జేవియర్ సినిమాటోగ్రఫీ: షఫీక్ మహమ్మాద్ అలీ విడుదల తేది: 23 ఫిబ్రవరి 2024(తెలుగు) ‘భ్రమయుగం’ కథేంటంటే.. తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు. అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో భ్రమయుగం చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ప్రయోగాలు చేయడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్ అనే ఇమేజ్‌ని పక్కకి పెట్టి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. భ్రమయుగం కూడా మరో ప్రయోగాత్మక చిత్రమే. ఒక్క చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల పాటు కథను నడిపించడం మాములు విషయం కాదు. దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ విషయంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తం కేవలం మూడు పాత్రల చుట్టే తిప్పుతూ ఆడియన్స్‌ని సీట్ల నుంచి కదలకుండా చేశాడు. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించి మెప్పించాడు. మమ్ముట్టి నటన.. క్రిస్టో జేవియర్ బీజీఎం సినిమా స్థాయిని పెంచేసింది. కథగా చూస్తే భ్రమయుగంలో కొత్తగా ఏమి ఉండడు. పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు..అతని చేతిలో బంధి అయినా ఓ ఇద్దరి వ్యక్తుల కథే ఇది. పాయింట్ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. వాటిని మలిచిన తీరు అద్బుతంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించాడు. సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ ఉన్నా అంతగా భయపెట్టవు. థ్రిల్లర్ ఎమిమెంట్స్తోనే కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. పాత్రల పరిచయం వరకు కథ స్లోగా సాగుతుంది. పాడుబడ్డ భవన్‌లోకి తేవన్ వచ్చిన తర్వాత అక్కడే చోటు చేసుకునే కొన్ని సంఘటనలు ఉత్కంఠకు గురి చేస్తాయి. ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగినా.. కొన్ని సీన్స్ మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కురియన్ పొట్టి ఫ్లాష్ బ్యాక్.. చేతన్ స్టోరీ అవన్నీ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. సినిమా మొత్తం కాస్త నెమ్మదిగా సాగినా.. భ్రమయుగం ఓ ఢిపరెంట్ థ్రిల్లర్ మూవీ. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి నటననే. కుడుమన్ పొట్టి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై కొత్త మమ్ముట్టిని చూస్తారు. సినిమా మొత్త ఒకే డ్రెస్‌లో కనిపించి తనదైన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్‌లో ఆయన నటన అందరిని కట్టిపడేస్తుంది. దేవన్ పాత్రకు అర్జున్ అశోకన్ పూర్తి న్యాయం చేశాడు. సెకండాఫ్‌లో అయితే మమ్ముట్టిలో పోటీపడి నటించాడు. వంట మనిషిగా సిద్ధార్థ్ భరత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యక్షి పాత్ర ఆసక్తిరేకించినా.. ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో తెరపై సరిగా చూపించలేకపోయారు. టెక్నికల్ పరంగా సినిమా అదరిపోయింది. క్రిస్టో జేవియర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. షఫీక్ మహమ్మాద్ అలీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్‌లో సాగినా.. తెరపై ప్రతి సీన్ చాలా అందంగా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్