మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్‌వైట్‌లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.
ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్‌ను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో ది సబ్‌స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్‌స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్‌హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది.
(ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)
‘భ్రమయుగం’ కథేంటంటే..
తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.
అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్‌ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్‌లో అందుబాటులో ఉంది.
Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻
See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024
Comments
Please login to add a commentAdd a comment