ఖైదీలా స్టార్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా? | Mammootty Turbo Movie Second Look Poster - Sakshi
Sakshi News home page

వరుస హిట్లు కొడుతున్న స్టార్‌ హీరో.. ఎవరో గుర్తుపట్టారా?

Published Sun, Feb 25 2024 7:34 AM | Last Updated on Sun, Feb 25 2024 11:40 AM

Mammootty Turbo Movie Look - Sakshi

మమ్ముట్టి ఇప్పుడీ పేరు ఇండియన్‌ సినీ ఇండస్ట్రీలో సంచలనం.. ఏడు పదుల వయస్సు ధాటినా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్‌ ఇస్తూ.. అభిమానులకు ఊపిరాడకుండా చేస్తున్నాడు ఈ పాన్ ఇండియా స్టార్ హీరో, మలయాళ మెగాస్టార్. 'యాత్ర' సినిమాతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయాడు.. తాజాగా 'భ్రమయుగం' సినిమాతో ప్రేక్షకులను మరీంత ఆశ్చర్యపరిచాడు.

బ్లాక్ అండ్ వైట్‌లో మూడే పాత్రలతో 'భ్రమయుగం' సినిమా తీసి తన సత్తా ఎంటో నిరూపించాడు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా సాధ్యమేనా..? అనుకుంటే సాధ్యమే అని నిరూపించాడు. ఒక స్టార్ హీరో ఒక గే పాత్ర చేయడం అంటే అంత సులభం కాదు.. 'కాదల్ ది కోర్‌'లో చేశాడు మమ్ముట్టి. అందరి హీరోల మాదిరి కాకుండా కొత్తదనాన్ని, ప్రయోగాన్ని, వైవిధ్యాన్ని చూపుతు తనదైన స్టైల్లో సినిమాలు తీస్తున్నాడు.

తాజాగా ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. 'టర్బో' పేరుతో మరో భిన్నమైన కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి అయిన ఈ ప్రాజెక్ట్‌.. నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్‌ను మమ్ముట్టి షేర్‌ చేశారు. పోలీసుస్టేషన్‌లో ఖైదీల మధ్యలో కూర్చుని కొత్త అవతారంలో మమ్ముట్టి కనిపించారు. ఈ లుక్‌లో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

ఇదే క్రమంలో ఆయన 'బజూక' అనే మరో విభిన్న చిత్రంలో నటిస్తున్నారు. గేమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీనో డెన్నిస్‌ కథనందిస్తూ డైరెక్ట్ చేస్తున్నాడు.  ఈ చిత్రం షూటింగ్‌ దశలో ఉంది. 'బజూక'లో బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న మమ్ముట్టి గడ్డంతో స్టైలిష్ లుక్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే  వైరల్ అవుతుంది. బజూక సినిమాలో గౌతమ్ వాసుదేవ్‌ మీనన్‌, సుమిత్‌ నావల్‌, సిద్దార్ధ్‌ భరతన్‌ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని థియేటర్‌ ఆఫ్ డ్రీమ్స్‌ అండ్‌ సరిగమ బ్యానర్లపై డోల్విన్‌ కురియాకోస్ జిన్‌ వీ అబ్రహాం, విక్రం మెహ్రా, సిద్దార్థ్‌ ఆనంద్ కుమార్‌ నిర్మిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement