horror movie
-
మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ హారర్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంది. హారర్ థ్రిల్లర్ సినిమాలపై ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన టాలీవుడ్ హారర్ మూవీ కళింగ. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 2 నుంచే ఆహాలో అందుబాటులోకి వచ్చేసింది.తాజాగా ఈ సినిమా మరో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. టాలీవుడ్లో 'కిరోసిన్' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అయితే కళింగ చిత్రానికి దర్శకుడిగా కూడా ధృవ వాయు పనిచేశారు. ప్రగ్యా నయన్ హీరోయిన్గా నటించింది. ఇంజులో మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హారర్ ఎలిమెంట్స్‌కు కాస్త ఫాంటసీ అంశాలను చేర్చి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. సెప్టెంబర్ 13న విడుదలైన కళింగ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు సుమారు రూ. 5 కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ కూడా ప్రకటించింది.కళింగ కథేంటంటే..కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ. -
మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ సినిమా.. ఆ లిస్ట్‌లో ఏకంగా రెండో స్థానం!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన హారర్ థ్రిల్లర్ 'భ్రమయుగం'. ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా మొత్తం బ్లాక్ అండ్వైట్లోనే రూపొందించడం మరో విశేషం. తాజాగా ఈ మూవీ అరుదైన ఘనతను దక్కించుకుంది.ఈ ఏడాది విడుదలైన బెస్ట్ హారర్ ఫిల్మ్స్‌లో ఈ మూవీకి చోటు దక్కింది. ప్రముఖ మూవీ రివ్యూ రేటింగ్స్ ఇచ్చే లెటర్ బాక్స్ డీ సంస్థ తాజాగా జాబితాను రిలీజ్ చేసింది. 2024లో వచ్చిన బెస్ట్ 25 హారర్ ఫిల్మ్స్ లిస్ట్‌ను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో ది సబ్‌స్టాన్స్ నిలవగా.. జపనీస్ మూవీ చిమే మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా డెడ్ టాలెంట్స్ సొసైటీ, యువర్ మాన్స్టర్, ఏలియన్ రొమ్యూలస్, ది గర్ల్ విత్ ది నీడిల్, స్ట్రేంజ్ డార్లింగ్, ఎక్స్హ్యుమా, ఐ సా ది టీవీ గ్లో చిత్రాలు టాప్-10లో నిలిచాయి. ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన శ్రద్ధాకపూర్ హారర్ కామెడీ చిత్రం స్త్రీ-2 23వ స్థానం దక్కించుకుంది. (ఇది చదవండి: Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ)‘భ్రమయుగం’ కథేంటంటే..తక్కువ కులానికి చెందిన దేవన్(అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్ భరతన్), మరొకరు యజవానమి కుడుమన్ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే భ్రమయుగం చూడాల్సిందే. ప్రస్తుతం భ్రమయుగం సోనిలీవ్‌లో అందుబాటులో ఉంది.Letterboxd’s Top 10 Horror Films of 2024 (so far) 👻See the full list of The Official Top 25 Horror Films of 2024 here: https://t.co/x95L2cdqNZ pic.twitter.com/uL0wziJIMB— Letterboxd (@letterboxd) October 1, 2024 -
ఓటీటీకి నయనతార హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన మలయాళ హారర్ థ్రిల్లర్ మాయనిజాల్. ఈ చిత్రంలో కుంచకోబోబన్ హీరోగా నటించాడు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ దాదాపు మూడేళ్ల తర్వాత ఓటీటీకి వస్తోంది. ఈ నెల 30 నుంచి ఆహా తమిళంలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు అప్పు భట్టాత్రి దర్శకత్వం వహించారు.మర్డర్ నేపథ్యంలో..!అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం జరిగిన ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోణంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఓ చిన్నపిల్లాడు ఈ మర్డర్ కేసును ఎలా కనిపెట్టాడనేదే అసలు కథ. ఇందులో నయనతార ఆ పిల్లాడికి తల్లిపాత్రలో నటించింది. కుంచకోబోబన్ న్యాయమూర్తి పాత్రలో మెప్పించారు. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ జానర్ చిత్రాలు ఇష్టపడేవారుంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ మూవీని ట్రై చేయొచ్చు. Ella unmayum innum rendu naal-la therinjidum😐😌#MayaNizhal premieres from August 30 #ahatamil #Nayanthara @Teamaventures @appubhattathiri @DivyaPrabhaa @Amudhavananoffl @prothiyagu @nizhalmovie @ThiPRCom pic.twitter.com/WfYfSAjKdO— aha Tamil (@ahatamil) August 28, 2024 -
టారోట్ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘టారో’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.బ్లాక్ అండ్ వైట్ నుంచి డిజిటల్ కలర్ కాలం వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అదే ‘దెయ్యం’. ఓ మనిషి భయానికి కారణం తన కన్నా బలవంతుడు ఎదురు పడినపుడు లేదా ప్రాణం లేని ఆత్మ కనపడినపుడు... నాటి నుంచి నేటి సినిమా దర్శకుల వరకు తమ సినిమాల్లో దెయ్యాన్ని వాడుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆ కోవలే రిలీజైన హాలీవుడ్ మూవీనే ‘టారో’. కథఈ సినిమాకి ఇద్దరు దర్శకులు స్పెన్సర్ కొహెన్–అన్నాహెల్ బర్గ్. కథాంశానికొస్తే... కాలేజ్ స్నేహితులైన ఓ గ్రూప్ హాలిడే ట్రిప్కని ఓ మారుమూల ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు అనుకోకుండా ఓ బాక్స్... అందులో కొన్ని టారో కార్డ్స్ కనబడతాయి. ఇక్కడ టారో కార్డ్స్ అంటే చూడటానికి పేకముక్కల్లా ఉండి, ఇంకా చెప్పాలంటే మన చిలక జోస్యంలో చిలక తీసేలాంటివన్నమాట. ఆ టారో కార్డ్స్‌తో ఓ అమ్మాయి... గ్రూప్‌లో మిగతా అందరికీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు చెప్తుంది.ఎలా ఉందంటే?ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు చెప్తూ వాళ్ళ మరణం ఎలా ఉంటుందో చెప్తుంది. ఇంకా చెప్పాలంటే అలా ఆ కార్డ్స్‌లో ఉన్న దెయ్యం ఆ అమ్మాయి చేత అలా చెప్పిస్తుంది. ఆ తరువాత వాళ్లు ఆ కార్డ్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు? చివరకు ఆ దెయ్యాన్ని ఏం చేశారన్నదే ‘టారో’ సినిమా. గొప్ప విషయం ఏమిటంటే ఈ హారర్ హాలీవుడ్ సినిమాలో తెలుగమ్మాయి అవంతిక నటించడం. హారర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ‘టారో’ మంచి ఛాయిస్... ఒక్క భయపడేవాళ్ళకు తప్ప. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. గో వాచ్ ఇట్. – ఇంటూరు హరికృష్ణ -
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: డీమాంటీ కాలనీ-2నటీనటులు: ప్రియాభవానీ శంకర్, అరుల్ నిధి, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులుదర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తునిర్మాతలు: విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమార్నిర్మాణసంస్థలు: బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్సంగీతం - సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ - హరీశ్ కన్నన్ఎడిటర్ - కుమరేశ్ డివిడుదల తేదీ: ఆగస్టు 23(తెలుగు)హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ఈ జానర్లో వచ్చే చిత్రాలకు కొదవే లేదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అందుకే ఇలాంటి కథలపై డైరెక్టర్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా 2015లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా డీమాంటీ కాలనీ-2 తీసుకొచ్చారు. ప్రియా భవానీ శంకర్, అరుల్ నిధి జంటగా నటించారు. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈనెల 23న రిలీజవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డీమాంటీ కాలనీ 2 అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకలా మరణించాడో తెలుసుకోవాలని ఆరాతీయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆరేళ్లకు ఒకసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి వెళ్లిన వ్యక్తులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలు ఆపేందుకు డెబీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి కూడా తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములను డెబీ, తన మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కాపాడిందా? వీరికి టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలా సాయపడ్డారు? తన భర్త కోరికను డెబీ నెరవేర్చిందా? శ్రీనివాస్‌ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే డీమాంటీ కాలనీ-2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా వచ్చిన డీమాంటీ కాలనీ 2. ప్రీక్వెల్‌ను బేస్ చేసుకుని ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అందుకే డీమాంటీ కాలనీ చూసిన వారికైతే సీక్వెల్ కాస్తా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డీమాంటీ అనే ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక హారర్ సినిమాలంటే సస్పెన్స్‌లు కామన్ పాయింట్. ఫస్ట్ పార్ట్‌లో సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, అతని ఆత్మతో మాట్లాడేందుకు భార్య చేసే ప్రయత్నాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.సెకండాఫ్ వచ్చేసరికి ఇందులోకి డీమాంటీ కాలనీ పాత్రలను తీసుకొచ్చిన తీరు ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డీమాంటీ కాలనీకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ చూపించారు. కథ మధ్యలో సర్ప్రైజ్లు కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. కథలో ప్రధానంగా ఆత్మతో పోరాడే సీన్స్ మరింత ఆసక్తిగా మలిచారు జ్ఞానముత్తు. ఈ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ హైలెట్. టిబెటియన్ యాక్టర్‌తో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హారర్‌తో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు లాంటి పాత్రలతో ఎమోషన్స్ పండించాడు. క్లైమాక్స్ విషయానికొస్తే ఆడియన్స్‌ను అద్భుతమైన థ్రిల్లింగ్‌కు గురిచేశాడు. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చివర్లో పార్ట్-3 పై ఇచ్చిన హింట్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేశాడు జ్ఞానముత్తు.ఎవరెలా చేశారంటే..ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో హావభావాలు అద్భుతంగా పండించింది. అరుని నిధి ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. గ్రాఫిక్స్, సౌండ్ ఫర్వాలేదనిపించాయి. సామ్ సీఎస్ బీజీఎం ఈ చిత్రానికి హైలెట్. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో కాస్తా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా హారర్ జానర్ ఇష్టపడేవారికి ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. -- పిన్నాపురం మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలు చూస్తే గజగజ వణకడమే! ఏది ఏ ఓటీటీలో ఉందంటే?
చాలామందికి చీకటంటే భయం. కానీ హారర్ సినిమాలు చూడటానికి రెడీ. మరికొందరు అర్థరాత్రి ఒంటరిగా ఇలాంటి మూవీస్ చూడాలని కోరిక. అలాంటి వాళ్ల కోసమే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న 12 బెస్ట్ హారర్ మూవీస్ లిస్టుతో వచ్చేశాం. వీటిని చూస్తుంటే ఓవైపు థ్రిల్లింగ్ మరోవైపు భయం గ్యారంటీ. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయ్?(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)ఓటీటీల్లో బెస్ట్ హారర్ మూవీస్మణిచిత్ర తాళు (1993) - మనకు బాగా తెలిసిన 'చంద్రముఖి' చిత్రానికి ఇది ఒరిజినల్. మలయాళంలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.13బీ (2009) - ఇదో డబ్బింగ్ సినిమా. ఓ ఇంట్లో జరిగిన వింత సంఘటనల ఆధారంగా తీశారు. హాట్‌స్టార్‌లో అది కూడా తెలుగులోనే ఉంది.అరుంధతి (2009) - స్వీటీ అనుష్క శెట్టి నటించిన తెలుగు హారర్ మూవీ ఇది. బొమ్మాళీ అని అప్పట్లో అందరినీ భయపెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.భ్రమయుగం (2024) - తెలుగులో డబ్బింగ్ అయిన మలయాళ హారర్ మూవీ ఇది. కేవలం మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంటిలో జరిగిన స్టోరీతో తీశారు. సోనీ లివ్ ఓటీటీలో ఉంది.పిజ్జా (2012) - విజయ్ సేతుపతికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఇది. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవాలే కథ. హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.భూతకాలం (2022) - దెయ్యాన్ని ఏ మాత్రం చూపించకుండా భయపెట్టిన సినిమా ఇది. మలయాళ సినిమానే కానీ తెలుగు డబ్బింగ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.మసూద (2022) - అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా. ఆహా ఓటీటీలో ఉంది. చూస్తే ప్యాంట్ తడిసిపోవడం గ్యారంటీ.హౌస్ ఆఫ్ సీక్రెట్స్ (2021) - ఇది మూడు ఎపిసోడ్స్ ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ఇది. నిజ జీవిత సంఘటనలతో తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే ఉంది.తుంబాడ్ (2018) - అత్యాశ మనిషిని ఎలా నాశనం చేస్తుందో అనే కాన్సెప్ట్‌కి హారర్ జోడించి తీసిన సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.కౌన్ (1999) - రాంగోపాల్ వర్మ తీసిన హిందీ సినిమా ఇది. డిఫరెంట్ సౌండ్స్‌తో తీసిన ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లోనే ఉంది.గృహం (2017) - సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా.. వెన్నులో వణుకు పుట్టేలా భయపెడుతుంది. జియో సినిమా ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ తెలుగులోనే అందుబాటులో ఉంది.డీమోంటే కాలనీ (2015) - బంగ్లాలో జరిగే కథతో తీసిన క్రేజీ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనే ఉందండోయ్!(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) -
నిజమైన మాంత్రికులతో సినిమా.. కథ కూడా అలాంటిదే
దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు తదితర అంశాలతో ఈ మధ్య కాలంలో పలు సినిమాల వస్తూనే ఉన్నాయి. 'పొలిమేర 2', 'విరూపాక్ష' లాంటివి ఈ జానర్లోకే వస్తాయి. సరిగా తీయాలే గానీ వీటికి ప్రేక్షకుల్లో మంచి డిమాండ్ ఉంది. అయితే నిజమైన మాంత్రికులతోనే సినిమా తీసి, విడుదలకు సిద్ధం చేయడం హాట్ టాపిక్‌గా మారిపోయింది. (ఇదీ చదవండి: పార్టీ పేరు మార్చిన స్టార్ హీరో విజయ్.. ఎందుకంటే?) దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు గురించి పరిశోధించి తీసిన సినిమా 'డెవిల్ హంటర్స్'. రుద్రేశ్వర్ పతాకంపై ప్రజిత్ రవీంద్రన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. మరణించిన వారి మూఢ నమ్మకాలని చర్చించే కథతో దీన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు హారర్ చిత్రాల్లో రానటువంటి ఎలిమెంట్స్‌తో దీన్ని తీశారట. 25 ఏళ్లుగా తంత్ర శాస్త్రాలను నిర్వహిస్తున్న దర్శకనిర్మాత.. పలు యదార్థ సంఘటనలను ఇందులో పొందుపరిచినట్లు చెప్పారు. ఇందులో నటించిన వారందరూ మాంత్రికం చేయగలిగిన వారేనని చెప్పడం అందర్ని అవాక్కయ్యేలా చేస్తోంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పుకొచ్చారు. ఏదేమైనా నిజమైన మాంత్రికులతో సినిమా తీయడం ఏంట్రా బాబు అనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
సూపర్ స్టార్ పాన్ ఇండియా చిత్రం.. ఆసక్తి పెంచుతోన్న పోస్టర్!
ఈ ఏడాది మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొత్త ఏడాది సరికొత్త చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. గతేడాదిలో నన్పకల్ నేరత్ మయక్కమ్, కన్నూర్ స్క్వాడ్, కాథల్-ది కోర్ లాంటి హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. కొత్త ఏడాదిలో యువ దర్శకుడు రాహుల్ సదాశివన్తో జతకట్టారు. న్యూ ఇయర్ సందర్భంగా తన కొత్త సినిమా భ్రమయుగం పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో మమ్ముట్టి తలపై కిరీటంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. పోస్టర్ చూస్తే చేతబడి చేసే వ్యక్తి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళలోని మూఢ నమ్మకాల ఆధారంగానే సినిమాలో చూపించనున్నట్లు సమాచారం. పాన్-ఇండియా చిత్రంగా రూపొందిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. అయితే గతంలోనే దర్శకుడు రాహుల్ హారర్ జానర్లో తనదైన ప్రతిభను నిరూపించుకున్నారు. 2022లో అతను తెరకెక్కించిన భూతకాలం మలయాళంలో అత్యుత్తమ హారర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. కాగా.. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో అర్జున్ అశోకన్, సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతమందిస్తున్నారు. #HappyNewYear 2024 ! ✨#Bramayugam Written & Directed by #RahulSadasivan Produced by @chakdyn @sash041075 Banner @allnightshifts @studiosynot pic.twitter.com/HseyAbCSIS — Mammootty (@mammukka) January 1, 2024 -
Pindam Movie Success Meet Pics: పిండం మూవీ హారర్ హిట్ మీట్ (ఫోటోలు)
-
అక్టోబర్ 6న విడుదలకానున్న ది ఎక్సార్సిస్ట్: బిలీవర్
డేవిడ్ గోర్డాన్ గ్రీన్ దర్శకత్వం వహించిన అమెరికన్ చిత్రం 'ది ఎక్సార్సిస్ట్: బిలీవర్' అక్టోబర్ 6న విడుదల కానుందని సినిమా మేకర్స్ ప్రకటించారు. ది ఎక్సార్సిస్ట్ ఫ్రాంచైజీలో హాలీవుడ్లో ఇప్పటికే ఐదు చిత్రాలు వచ్చాయి. విలియం పీటర్ రాసిన ది సమె నేమ్-నవల ఆధారంగా బ్లాటీ, ది ఎక్సార్సిస్ట్ (1973) చిత్రం వచ్చిందని పేర్కొన్నారు. తాజాగా ది ఎక్సార్సిస్ట్ : బిలీవర్ - అక్టోబర్ 6న ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కాబోతుందని వివరించారు. ప్రసిద్ధ హాలోవీన్ చిత్రాల ఫ్రాంచైజీకి చెందిన డేవిడ్ గోర్డాన్ గ్రీన్ (హాలోవీన్,2018), (హాలోవీన్ కిల్స్, 2021) చిత్రాలు వరుసగా విజయం సాధించాయని వివరించారు. 10 అకాడమీ నామినేషన్లు అత్యుత్తమంగా నామినేట్ చేయబడిన మొదటి భయానక (హార్రర్ చిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు. 1973లో ది ఎక్సార్సిస్ట్కు 50 సంవత్సరాల తర్వాత సీక్వెల్‌గా ది ఎక్సార్సిస్ట్: బిలీవర్ విడుదల కానుందని వివరించారు. ఈ సినిమాకు దర్శకత్వం డేవిడ్ గోర్డాన్ గ్రీన్, సినిమాటోగ్రఫీ-మైఖేల్ సిమండ్స్, సంగీతం డేవిడ్ వింగో వ్యవహరించారని చెప్పారు.ఈ సినిమాకు దర్శకత్వం- డేవిడ్ గోర్డాన్ గ్రీన్, సినిమాటోగ్రఫీ-మైఖేల్ సిమండ్స్ సంగీతం- డేవిడ్ వింగో -
దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే?
హాలీవుడ్ హర్రర్ చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టాలన్నా.. థ్రిల్లింగ్‌కు గురిచేయాలన్నా హాలీవుడ్ చిత్రాలకే సాధ్యం. ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను కొల్లగొట్టేవి ఇలాంటి చిత్రాలే. ది కంజూరింగ్ అనే చిత్రాన్నే తీసుకుంటే ప్రపంచంలోనే అత్యధికంగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అదే విధంగా హాలీవుడ్లో ది నన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! ) తాజాగా దానికి సీక్వెల్‌గా వస్తోన్న చిత్రం నన్ -2. ఇది ది కంజూరింగ్ ఫ్రాంచైజీలో రూపొందిన 9వ చిత్రం కావడం మరో విశేషం. మైఖేల్ ఛావ్స్ దర్శకత్వం వహించిన ఈ అమెరికన్ చిత్రంలో బోలి ఆరోన్న్స్, తెలుసా ఫార్మికా, స్టీమ్ రెయిడ్, ప్రధాన పాత్రలు పోషించారు. న్యూలైన్ సినిమా ఆటోమిక్ మాన్స్టర్, ది సఫ్రాన్ కంపెనీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించారు. ఒక దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది? అన్న ఇతివృత్తంతో నన్–2 తెరకెక్కించారు. ఈ చిత్రం కథ, కథనం, స్పెషల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయని వార్నర్ బ్రదర్స్ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. ఈ చిత్రం భారతదేశంలో తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా ఈనెల 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: గోపీచంద్‌ని తిట్టడం తప్పే.. ఫ్యాన్స్ దెబ్బకు దిగొచ్చిన డైరెక్టర్) On September 8th, the greatest evil in the conjuring universe returns #TheNun2. pic.twitter.com/zYdo2dzwVR — Warner Bros. Pictures (@wbpictures) July 6, 2023 -
హారర్ థ్రిల్లర్
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకత్వంలో సీవీ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 28న తమిళంలో విడుదలై, హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పీపై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ వేమిశెట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘హారర్ అండ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పిజ్జా 3 ’’ అన్నారు నిర్మాతలు. -
సూపర్ హిట్ హారర్ మూవీ.. సీక్వెల్ వచ్చేస్తోంది!
దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఇంతకుముందు తెరకెక్కించిన చిత్రం 'డిమాంటీ కాలనీ'. అరుళ్ నిధి కథానాయకుడిగా నటించిన ఈ హార్రర్ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. తాజాగా అదే దర్శకుడు దానికి సీక్వెల్‌గా డిమాంటీ కాలనీ– 2 చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్నారు. ఇందులోనూ అరుళ్ నిధి కథానాయకుడిగా నటిస్తున్నారు. నటి ప్రియా భవానీ శంకర్ నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతాన్ని, హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న యంగ్ హీరో, పెళ్లికి ముహూర్తం ఫిక్స్!) కాగా ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణంలో సాఫ్ట్ వేర్ సంస్థ అధినేత బాబీ బాలచందర్ భాగస్వామిగా చేరారు. ఈయన తాజాగా చిత్రం నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ప్రపంచస్థాయిలో చిత్రాలను నిర్మించడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా డిమాంటీ కాలనీ –2 చిత్ర నిర్మాతలు నైట్ నైట్ ఎంటర్టైన్మెంట్ అధినేత విజయ్ సుబ్రహ్మణిన్, జ్ఞానముత్తు పట్టరై సంస్థ అధినేత ఆర్సీ రాజ్ కుమార్‌తో భాగస్వామి అయ్యారు. దీనిపై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు మాట్లాడుతూ.. బాబి బాలచంద్రన్ తమ చిత్రానికి భాగస్వామి కావడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో టైకూన్ బిజినెస్ మెన్ అయినా ఆయన చిత్ర నిర్మాణ రంగంపై గౌరవంతో దీన్ని అదనపు వ్యాపారంగా భావించడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఎందుకు స్ఫూర్తిదాయకమైన ఆయన తమ చిత్రానికి భాగస్వామి కావడం సంతోషంగా ఉందని, దీంతో డిమాంటీ కాలనీ– 2 చిత్రం గ్లోబస్ స్థాయికి చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఇకపై నరేశ్ ఇంట్లోకి రమ్య రఘుపతికి నో ఎంట్రీ.. కోర్టు తీర్పు) -
ప్రతీకారమే లక్ష్యం.. భయపెట్టేందుకు వస్తోన్న 'కల్లరై'!
హార్రర్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన కథా చిత్రాలకు మినిమం గ్యారెంటీ ఉంటుంది. అందుకే ఈ తరహా చిత్రాలకు ప్రత్యేకంగా సీజన్ అంటూ ఉండదు. అలాంటి విభిన్న కథాంశంతో రూపొందిన చిత్రం కల్లరై. గుడ్‌న్యూస్ ఫిలిమ్స్ పతాకంపై పొన్నేరి రతి జవగర్ నిర్మించిన ఈ చిత్రంలో సకో రమేష్, దీప్తి దివాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ఏపీఆర్ దర్శకత్వం వహిస్తున్నారు. (ఇది చదవండి: విడాకుల రూమర్స్.. బుర్ఖాలో కనిపించిన కలర్స్ స్వాతి!) ఏపీఆర్ తెలుపుతూ కొడైక్కెనాల్లో మద్యం మత్తులో కొందరు వ్యక్తులు ఒక యువతపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేస్తారన్నారు. ఆ జ్యోతి దెయ్యంగా మారి ఎవరైతే తనను మానభంగం చేసి చంపేశారో వారిపై ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో రూపొందిన చిత్రమే కల్లరై అని చెప్పారు. పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించి ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయని చెప్పారు. హార్రర్ థ్రిల్లర్ కథా చిత్రాలను తమిళ ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే తాము ఈ చిత్రా న్ని నిర్మించినట్లు నిర్మాత రతి జవహార్ పేర్కొన్నారు. చిత్రం కచ్చితంగా వారి ఆదరణను పొందుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ కార్యక్రమాలు పూ ర్తయ్యాయని.. ఈ చిత్రాన్ని ఆగస్టు 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో రతి జవహార్, టి.జవహార్ జ్ఞానరాజ్, వి.యశోద, ప్రేమ ప్రియా, రోషిలా భారతీ మోహన్, సురేందర్ హరిహరన్, సురేష్, రామ్ రంజిత్, నందకుమార్, అజయ్ సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. (ఇది చదవండి: పవన్‌కు అహం ఎక్కువ.. పూనమ్ కౌర్ టాపిక్‌పై రాజు రవితేజ కామెంట్) -
దెయ్యం సినిమాలు నా వల్ల కాదు
-
టాప్ 10 హర్రర్ సినిమాలు ఇవే..
-
డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతోన్న యంగ్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
యంగ్ హీరో విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం హారర్ మూవీ 'బూ'. డైరెక్టర్ విజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయడం లేదని మేకర్స్ ప్రకటించారు. (ఇది చదవండి: చంపేస్తామని బెదిరించారు.. అడల్ట్ ఇండస్ట్రీలో ఇబ్బందులపై హీరోయిన్!) ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈనెల 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపారు. (ఇది చదవండి: మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!) The next time you get a hiccup don’t look for water, look around, it could be a ghost! Exclusive World Premiere | May 27th @officialjiocinema#StreamingFree #BooOnJioCinema #JioCinema #BOOhttps://t.co/3oIFMqmZhR@Rakulpreet @VishwakSenActor @Nivetha_tweets @akash_megha… — Manjima Mohan (@mohan_manjima) May 23, 2023 -
హారర్ జానర్ కు మల్లి మంచి రోజులు?
-
భయపెట్టేందుకు సిద్ధమైన గ్లామర్ బ్యూటీ!
గ్లామరస్ నటిగా ముద్ర వేసుకున్న సంచలన నటి యాషికా ఆనంద్. ఈమె ప్రధాన పాత్రలో దెయ్యంగా నటించిన హార్రర్ చిత్రం 'చైత్ర'. మార్ప్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.మనోహరన్, టి.కన్నన్ సంయుక్తంగా నిర్మించారు. అవితేజ్, శక్తి మహేంద్ర, పూజ, రమణన్, కన్నన్, లూయిస్, మొసకుట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా ఎం.జెనిత్కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన బొట్టు తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 24 గంటల్లో జరిగే హార్రర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రంలో పలు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. ఇందులో నటి యాషిక ఆనంద్ దెయ్యం పాత్రలో భయపెడుతుందన్నారు. అందుకు కారణాలు ఏమిటి అన్నదే చిత్ర కథ అని అన్నారు. ఈ చిత్రానికి ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించారని చెప్పారు. ఇప్పటికే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా చిత్ర టైలర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు జెనిత్కుమార్ అన్నారు. -
హా అంటారా... హడలిపోతారా!
అందాల తారలు భయపెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆ అందం వెనక ఎంత ట్రాజెడీ ఉండి ఉంటే.. భయపెట్టాలనుకుని ఉంటారో ఊహించవచ్చు. అలా భయపెట్టే కథలతో కొందరు కథానాయికలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ప్రేక్షకులు ‘హా’ అంటూ హడలిపోతారా చూడాలి. ఇక ఈ హారర్ స్టోరీలపై ఓ లుక్ వేయండి. ‘మాయ’, ‘ఐరా’, ‘డోరా’... ఇలా వీలై నప్పుడల్లా వెండితెరపై ఆడియన్స్‌ని భయ పెట్టారు హీరోయిన్ నయనతార. తాజాగా నయనతార గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన మరో హారర్ మూవీ ‘కనెక్ట్’. నయనతారతో 2015లో ‘మాయ’ సినిమా తీసిన అశ్విన్ శరవణన్యే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. మరోవైపు హారర్ జానర్‌పై హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కాజల్ డైరీలో మూడు హారర్ సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కాజల్ ప్రధాన పాత్రధారిగా యోగిబాబు, దర్శక–నటుడు కేఎస్ రవి కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఘోస్టీ’. హారర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించగా, కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదలైంది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయాలను కుంటున్నారు. అలాగే తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ‘కరుంగాప్పియమ్’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన సినిమాలో ఓ లీడ్ రోల్ చేశారు కాజల్ అగర్వాల్. కాజల్‌తో పాటు ఈ సినిమాలో రెజీనా, జనని, నోయిరికా, రజియా విల్సన్ నటించారు. ఈ చిత్రంలో కొన్ని అతీంద్రియ శక్తులు ఉన్న యువతి పాత్రలో కాజల్ కనిపిస్తారు. ఇక హారర్ జానర్లో వచ్చిన చిత్రాల్లో ‘చంద్రముఖి’ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ రెడీ అవుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసుయే మలి భాగానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఫస్ట్ పార్ట్‌లో రజనీకాంత్ నటించగా, ‘చంద్రముఖి 2’లో రాఘవా లారెన్స్ మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ హీరోయిన్ పాత్రకు కాజల్ అగర్వాల్‌ను సంప్రదించిందట చిత్ర యూనిట్. మరోవైపు వెండి తెరపై ఇప్పటివరకు గ్లామరస్‌గా కనిపించిన హన్సిక కూడా హారర్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ మధ్య ‘గార్డియన్’ అనే హారర్ ఫిల్మ్‌కు హన్సిక సైన్ చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది. శబరి–గురుశరవణన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే ఆర్. కన్నన్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న హారర్ సినిమాలో కూడా హన్సిక నటిస్తున్నారు. మరో హీరోయిన్ రాయ్‌లక్ష్మీ ‘సిండ్రెల్లా’గా ప్రేక్షకులను భయపెట్టేందుకు రెడీ అయ్యారు. వినో వెంకటేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సాక్షీ అగర్వాల్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రాయ్‌లక్ష్మీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కాగా.. ‘రాజుగారి గది 2’ తర్వాత సమంత మరోసారి ప్రేతాత్మగా కనిపించనున్నారని, ఈ సినిమాకు ‘స్త్రీ’ ఫేమ్ అమర్ కౌశిక్ దర్శకత్వం వహించనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా హారర్ బ్యాక్‌డ్రాప్‌లోనే మరికొందరు కథానాయికలు సినిమాలు చేస్తున్నారు. -
లవ్.. హారర్.. కామెడీ
ఇటీవల హిట్ చిత్రం కన్నడ ‘కాంతార’ని తెలుగులో విడుదల చేసిన అల్లు అరవింద్ గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ త్వరలో హిందీ చిత్రం ‘భేదియా’ని విడుదల చేయనుంది. ఈ లవ్–హారర్–కామెడీ మూవీ తెలుగు విడుదల హక్కులను దక్కించుకున్న విషయాన్ని బుధవారం ప్రకటించింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగులో ఈ నెల 25న విడుదల కానుంది. వరుణ్ ధావన్, కృతీ సనన్ జంటగా నటించారు. కాగా ఈ చిత్రంలో తోడేలు కాటుకు గురైన యువకుడు భాస్కర్ పాత్రలో వరుణ్, డాక్టర్ అనిక పాత్రలో కృతి కనిపిస్తారు. ‘‘మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను విడుదల చేయాలనే ఆలోచనతో తెలుగు రాష్ట్రాల్లో ‘కాంతార’ తెలుగు వెర్ష¯Œ ను విడుదల చేశాం. ‘భేదియా’ కంటెంట్ కూడా బాగుంటుంది’’ అని నిర్మాత బన్నీ వాసు పేర్కొన్నారు. -
బాలీవుడ్‌ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్‌ను లీడ్ రోల్‌కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్‌లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లా ల్లోరోనా.. రాత్రి వేళ చూస్తే పగబడుతుంది..!
ప్రేమ.. నమ్మకం.. మోసం.. వేదన.. క్షణికావేశం.. పశ్చాత్తాపం.. ఇంచుమించుగా ఇవే ప్రతి కథకు అంశాలు. అయితే అసంపూర్ణంగా, తీరని ఆవేదనతో ముగిసిన కొన్ని జీవితాలు.. చరిత్రనే వణికించిన కథలుగా మారతాయి. అంతులేని మిస్టరీలుగా మిగిలిపోతాయి. ‘లా ల్లోరోనా’ ఈ పేరు వింటే మెక్సికోలో పిల్లలే కాదు పెద్దలు కూడా భయంతో పరుగుతీస్తారు. ‘లా ల్లోరోనా’ అంటే స్పానిష్‌లో ‘ఏడ్చే మహిళ’ అని అర్థం. ఏళ్ల కిందటి ఓ కన్న తల్లి ఆక్రందనలే ఈ కథకు మూలం. శాంటాఫె నది తీరంలో రాత్రి పూట నేటికీ ఆమె ఏడుపు వినిపిస్తుందనేది స్థానికుల నమ్మకం. అసలు ఆమె ఎవరు? ఎందుకు అలా ఏడుస్తుంది? మెక్సికన్లు.. ఆమె పేరు విన్నా, ఆమె ఏడుపు విన్నా ఎందుకు భయపడుతుంటారు? ఈ వారం మిస్టరీలో చూద్దాం. కొన్ని శతాబ్దాల క్రితం.. మెక్సికోలో ఓ పేద కుటుంబంలో మారియా అనే ఓ అందగత్తె ఉండేది. పొడవాటి జుట్టు, చక్కటి మోము, ఆకట్టుకునే చిరునవ్వుతో అందరిలో చాలా ప్రత్యేకంగా కనిపించేది. ఆమె వీధిలో అలా నడిచి వెళ్తుంటే దేవకన్య వెళ్తుందని అంతా పొగిడేవారు. ‘కనీసం రోజుకు ఒక్కసారైనా ఆమెను చూస్తే చాలు’ అన్నట్లు కుర్రాళ్లు ఆమె రాక కోసం వేయికళ్లతో ఎదురుచూసేవారు. దాంతో మారియా.. పని లేకున్నా ఆ పొగడ్తల కోసమే ఎక్కువ సార్లు వీధుల్లో తిరిగేదట. ఆమె తెల్లటి గౌన్లే ఎక్కువగా ధరించేదట. ఓ రోజు మారియా అందాన్ని చూసి ప్రేమలో పడిపోయాడు గుర్రం మీద వచ్చిన ఓ యువకుడు. పొగడ్తలతో మాటలు కలిపి.. ఆమెను తన ప్రేమలో పడేసుకున్నాడు. అబ్బాయి అందగాడూ ఆస్తిపరుడూ కావడంతో పేదవాళ్లైన మారియా తల్లిదండ్రులు.. ‘తమ బిడ్డకు మంచి సంబంధం దొరికింది’ అని ఎంతగానో సంతోషించారు. అతడితోనే అంగరంగవైభవంగా మారియా పెళ్లి జరిపించారు. ఆమెకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అప్పుడే మారియా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. రోజూ ఇంటికి రావాల్సిన భర్త.. మూడు నాలుగు రోజులకోసారి రావడం మొదలుపెట్టాడు. ‘ఎందుకు ఈ మార్పు?’ అంటూ ఓ రోజు మారియా భర్తను నిలదీసింది. ‘నువ్వు గతంలో మాదిరిగా లేవు.. వీలైతే పెళ్లికి ముందులా మారు’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు భర్త. మారియా గుండె ముక్కలైపోయింది. ‘అందం శాశ్వతం కాదుగా’ అని వాదించింది. ఎన్నో విధాలుగా భర్తని మార్చుకోవాలని ప్రయత్నించింది. కానీ ఫలితం లేదు. పైగా తన భర్తకు అందంగా ఉండే స్త్రీలంటే మోజనీ, కోరుకున్న అమ్మాయిలకు డబ్బును ఎరగా వేసి.. మోజు తీరాక వదిలించుకుంటాడనీ తెలుసుకుంది. దాంతో మరింత కుమిలిపోయింది. రోజులు గడుస్తున్నాయి. భర్త రాకపోకలు పూర్తిగా తగ్గిపోయాయి. భార్యపై ప్రేమ తగ్గినంత సులభంగా.. పిల్లలపై మమకారాన్ని చంపుకోలేకపోయాడు మారియా భర్త. కేవలం పిల్లల కోసమే ఇంటికి వస్తూపోతూ ఉండేవారు. దాంతో మారియా మరింత రగిలిపోయింది. భర్తపై కోపం పిల్లలకు శాపంగా మారింది. క్రమంగా పిల్లలపై పగ పెంచుకుంది మారియా. వాళ్లను చంపి.. భర్తకు బుద్ధి చెప్పాలనుకుంది. వెంటనే పిల్లల్ని లాక్కెళ్లి సమీపంలోని శాంటాఫె నదిలో ముంచేసింది. అయితే నదిలో కొట్టుకుపోతున్న పిల్లల అరుపులు.. మారియాలోని తల్లిప్రేమను గుర్తు చేశాయి. ‘అమ్మా కాపాడు..’ అనే పసివాళ్ల ఏడుపులు మాతృ హృదయం తల్లడిల్లేలా చేశాయి. వెంటనే పిల్లల్ని కాపాడాలని ప్రయత్నించింది. కానీ అప్పటికే నీటి ఉధృతి ఎక్కువ కావడటంతో పిల్లలు నదిలో కొట్టుపోయారు. ఎంత వెతికినా కనిపించలేదు. అప్పటి నుంచి ఆ నది ఒడ్డునే పిల్లల్ని వెతుక్కుంటూ.. ఏడుస్తూ.. అరుస్తూ.. ఉండిపోయింది మారియా. అదే బెంగతో కొన్ని రోజులకు ఆ నది ఒడ్డునే ఆమె చనిపోయింది. ఆ తర్వాత ఆమె ఆత్మగా మారి... ఇప్పటికీ పిల్లల కోసం వెతుకుతూ కనిపిస్తుందనేది మెక్సికో అంతటా వినిపించే కథ. ఇక్కడి దాకా సెంటిమెంట్ యాంగిల్లోనే నడిచిన ‘లా ల్లోరోనా’కు.. హారర్ ట్విస్ట్‌లను జోడించి కథలు కథలుగా చెబుతుంటారు మెక్సికన్స్. తన పిల్లలు తనకు దూరమయ్యారు కాబట్టి మారియా ప్రేతాత్మలా మారిందని, ఎక్కడ చిన్నపిల్లలు కనిపించినా మాయం చేస్తుందని, ఆమెను రాత్రివేళ చూస్తే పగబడుతుందని, ఆమె ఏడుపు విన్నా దురదృష్టం తప్పదనీ ఏళ్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ చాలా మంది మెక్సికన్లు.. ‘మేము ఆమె ఏడుపుని విన్నాం’ అని చెబుతుంటారు. అక్కడి ప్రజలు రాత్రి వేళ నదులు, సరస్సుల దగ్గరకు వెళ్లాలంటే నేటికీ భయపడతారు. 2019లో, ఆమె ఆచూకీ కోసం కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో.. పారానార్మల్ ఫైల్స్ బృందం ప్రయోగాత్మకంగా కొన్ని వీడియోలు చేసింది. అందులో ఘోస్ట్ ఫైండర్ సాయంతో.. ఆమె స్వరాన్ని గుర్తించామంటూ కొన్ని భీకరమైన అరుపుల్ని వినిపించారు. ఇదే కోణంలో చాలా హారర్ మూవీస్ వచ్చినప్పటికీ.. 2019లో వచ్చిన ‘ది కర్స్ ఆఫ్ లా ల్లోరోనా’ అనే సినిమా ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో వణికించింది. ఇప్పటికీ మెక్సికోలో కొందరు చిన్నపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి.. నది సమీపంలో నివాసం ఉండే సాహసం చేయరు. మొత్తానికి ‘లా ల్లోరోనా’ కథ మెక్సికో చరిత్రలో మిస్టరీగా మిగిలిపోయింది. -సంహిత నిమ్మన -
మరోసారి భయపెట్టడానికి సిద్ధమైన హరర్ చిత్రం
సాక్షి,చెన్నై(తమిళనాడు): మరోసారి భయపెట్టడానికి సీవీ–2 చిత్రం సిద్ధమైంది. కొన్నేళ్ల క్రితం విడుదలైన సీవీ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. దెయ్యం ఒక వ్యక్తి మెడపై కూర్చొని ప్రతీకారం తీర్చుకునే ఇతివృత్తంతో రూపొందిన ఆ చిత్రం సంచలన విజయం సాధించింది. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా సీవీ–2ను తులసి సినీ ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. కేఆర్ సెంథిల్నాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బీఎల్ సంజయ్ చాయాగ్రహణను, ఎస్పీ అహ్మద్ సంగీతాన్ని అందించారు. ఇందులో దివంగత నటుడు తేంగాయ్ శ్రీనివాసన్ మనవడు యోగి, చరణ్‌రాజ్ కొడుకు తేజ చరణ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించారు. నటి స్వాతిషా, సంతోష్, క్రిస్టియన్, దాడి బాలాజీ, శ్యామ్స్, కోదండం, గాయత్రి కుమరన్ ముఖ్య పాత్రలు పోషించారు. జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
Maranam Telugu Movie: ఆత్మలను బంధిస్తే...
వీర్‌సాగర్, శ్రీ రాపాక, మాధురి ప్రధాన పాత్రల్లో వీర్ సాగర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మరణం’. ‘కర్మ పేస్’ అనేది ఉపశీర్షిక. బి. రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలయింది. వీర్ సాగర్ మాట్లాడుతూ– ‘‘తెలుగులో హారర్ చిత్రాలకి మంచి క్రేజ్ ఉంది. సరికొత్త కథ, కథనంతో, అద్భుతమైన విజువల్స్‌తో, గొప్ప సౌండ్ ఎఫెక్ట్స్‌తో ఒక హారర్ చిత్రం వస్తే ఎలా ఉంటుందంటే మా ‘మరణం’లా ఉంటుంది’’ అన్నారు. ‘‘వీర్ సాగర్ ఈ చిత్రంలో డెమనాలజిస్ట్ (ఆత్మలను బంధించే శాస్త్రవేత్త)గా నటించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కేవీ వరం, సంగీతం: మనోజ్ కుమార్. ఓ అమ్మాయి నేర కథ జూనియర్ ఎన్టీఆర్ ‘ఆది’ ఫేమ్ కీర్తీ చావ్లా ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఓ అమ్మాయి క్రైమ్‌స్టోరీ’. జి. సురేందర్ రెడ్డి దర్శకుడు. సాధిక, ఆదీ ప్రేమ్, కవిత, శ్రీమాన్, గౌతమ్ రాజు, నిళల్గళ్ రవి ముఖ్య పాత్రల్లో నటించారు. ఏబీ శ్రీనివాస్, ఆర్. సుందర్, శ్రీధర్ పోతూరి, శాకముద్ర శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. నిర్మాతల్లో ఒకరైన ఏబీ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ చిత్రమిది. ఓ అమ్మాయి నేర కథాంశంతో నిర్మించాం. హారర్ ఎలిమెంట్స్, గ్రాఫిక్స్, రొమాంటిక్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. గతంలో విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.