
గ్లామరస్ నటిగా ముద్ర వేసుకున్న సంచలన నటి యాషికా ఆనంద్. ఈమె ప్రధాన పాత్రలో దెయ్యంగా నటించిన హార్రర్ చిత్రం 'చైత్ర'. మార్ప్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.మనోహరన్, టి.కన్నన్ సంయుక్తంగా నిర్మించారు. అవితేజ్, శక్తి మహేంద్ర, పూజ, రమణన్, కన్నన్, లూయిస్, మొసకుట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా ఎం.జెనిత్‌కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన బొట్టు తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు.
తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 24 గంటల్లో జరిగే హార్రర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రంలో పలు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. ఇందులో నటి యాషిక ఆనంద్ దెయ్యం పాత్రలో భయపెడుతుందన్నారు. అందుకు కారణాలు ఏమిటి అన్నదే చిత్ర కథ అని అన్నారు. ఈ చిత్రానికి ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించారని చెప్పారు. ఇప్పటికే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా చిత్ర టైలర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు జెనిత్‌కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment