Chaitra
-
Nishka: వెన్నదొంగగా మారిన బుల్లితెర నటి చైత్ర గారాలపట్టి.. (ఫోటోలు)
-
స్కూలుకు వెళ్లకుండానే.. 'ఇండియా బుక్ ఆఫ్ అవార్డ్స్' లో చైత్ర!
నిజామాబాద్: మూడేళ్ల ఆ చిచ్చర పిడుగు స్కూలుకు వెళ్లకుండానే ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అరుదైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అచీవర్ అవార్డును సాధించింది. నగరంలోని గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర 17 జాతీయపండుగలు, 12 జాతీయ గుర్తులు, 13 అంతరిక్ష వస్తువులు, 26 శరీర భాగాలు, 26 రకాల జంతువులు, 22 రకాల కూరగాయలు, 21 పండ్లు, 13 రంగులు, 8 రకాల ఆకారాలు (ట్రైయాంగిల్, స్క్వేర్, సర్కిల్ లాంటివి) గుర్తుపట్టడంతో పాటు 26 అల్ఫాబెట్స్కి సంబంధించిన వస్తువుల పేర్లను, 11 ఇంగ్లిష్ రైమ్స్‌ని ధారాళంగా తడబడకుండా చెప్పేస్తుంది. ఈ పాప ప్రతిభను గుర్తించిన ఐబీఆర్ సంస్థ ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో చైత్ర ధారాళంగా చెప్పిన వాటిని ఆమె ప్రతిభా పాటవాలను ప్రత్యక్షంగా చూసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ వారు అచీవర్ అవార్డును ప్రదానం చేశారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సంస్థ అనేది ఇండియాలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న అత్యుత్తమ వ్యక్తుల ప్రతిభని, ఒక సంస్థ సాధించిన ప్రగతిని భద్రపరచి భావితరాలకు స్ఫూర్తిని అందించే సంస్థ. దీనిలో భాగంగా రాష్ట్రంలోని నగరానికి చెందిన గాయత్రీనగర్‌కు చెందిన బాస చైత్ర ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం సంపాదించడంపై పలువురు మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అచీవర్ అవార్డును అందుకోవడం అభినందనీయమంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చైత్రకు ఐబీఆర్లో స్థానం దక్కడంతో ఆమె తల్లిదండ్రులైన బ్యాంక్ ఉద్యోగిని అన్నపూర్ణ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సుశీల్ కుమార్‌లు హర్షం వ్యక్తం చేశారు. తమ పాప ఇప్పటి వరకు స్కూల్‌కు కూడా వెళ్లలేదని, ఇంట్లోనే ఉంటూ విషయ పరిజ్ఞానంపై పట్టు సాధించి అచీవర్ అవార్డును కైవసం చేసుకుందన్నారు. ఇవి చదవండి: ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుందాం! -
భయపెట్టనున్న హాట్ బ్యూటీ
తమిళ సినిమా: యాషిక ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చైత్ర. ఆమె దెయ్యం పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మార్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కె మనోహరన్, టి.కన్నన్ దేవరాజ్ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అవితేష్, శక్తి మహేంద్ర, పూజ ,రమణన్, లూయిస్, మొసకుట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సతీష్ కుమార్ చాయాగ్రహణం, ప్రభాకర్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకుని నవంబర్ 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు తిరుపతి మాట్లాడుతూ.. ఇది 24 గంటల్లో జరిగే హర్రర్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఆనంద్ దేయ్యంగా నటించినట్లు చెప్పారు. పిజ్జా, డీమాంటీ కాలనీ చిత్రాల తరహాలో కొత్తగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను తిరునల్వేలి జిల్లాలోని కావల్ కెనరు ప్రాంతంలో నిర్వహించినట్లు చెప్పారు. ఆసక్తికరమైన అంశాలతో చిత్రం కథ కథనాలు కొత్తగా ఉంటాయని పేర్కొన్నారు. దీన్ని పీవీఆర్ పిక్చర్స్ సంస్థ కొనుగోలు చేసి తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనుందని చెప్పారు. -
మేమిద్దరం విడిపోయాం.. ఎవరూ ద్వేషించకండి: నటి విజ్ఞప్తి
కన్నడ యాంకర్, నటి, బిగ్‌బాస్ బ్యూటీ చైత్ర వాసుదేవన్ కఠిన నిర్ణయం తీసుకుంది. తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ప్రియమైన అందరికీ.. ఎన్నో నెలలు ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పేందుకు సిద్ధమయ్యాను. సత్య, నేను ఇద్దరం విడిపోయాం. మా విడాకుల గురించి ఎవరూ అసభ్యంగా మాట్లాడొద్దు. ఎవరిపైనా ద్వేషం చూపించకండి. మమ్మల్ని జడ్జ్ చేయకండి. దీని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పడుతోంది. జీవితంలో ముందుకు కొనసాగాలంటే ముందు నేను నా వృత్తిలో తలమునకలయ్యేంత బిజీగా మారాలి. నేను బుల్లితెర ఇండస్ట్రీలో చాలాకాలం పని చేశాను. ఇప్పుడు కూడా అదే పరిశ్రమలో కొనసాగాలనుకుంంటున్నాను. మీ ప్రేమాభిమానాలతో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి ప్రేమ కోసం చూస్తున్నా (#lookingforlove during), కష్ట సమయం (#hardtimes), అనునిత్యం నాలో నేనే సతమతమవుతున్నాను (#strugglinginsideeveryday) అంటూ క్యాప్షన్లు జోడించింది. కాగా చైత్ర వ్యాపారవేత్త 2017లో సత్య నాయుడును పెళ్లాడింది. వీరిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగానే కనిపించేవారు. సడన్‌గా వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇకపోతే చైత్ర సినీ ఇండస్ట్రీలో యాంకర్‌గా రాణిస్తుండగా తనకు సొంతంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా ఉంది. అలాగే ఒక నిర్మాణ సంస్థ సైతం ఉంది. View this post on Instagram A post shared by Chaitra Vasudevan (@chaitra_vasudevan_official_) చదవండి: ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ బ్యూటీ... ప్రేమ, పెళ్లికో దండమంటూ -
భయపెట్టేందుకు సిద్ధమైన గ్లామర్ బ్యూటీ!
గ్లామరస్ నటిగా ముద్ర వేసుకున్న సంచలన నటి యాషికా ఆనంద్. ఈమె ప్రధాన పాత్రలో దెయ్యంగా నటించిన హార్రర్ చిత్రం 'చైత్ర'. మార్ప్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.మనోహరన్, టి.కన్నన్ సంయుక్తంగా నిర్మించారు. అవితేజ్, శక్తి మహేంద్ర, పూజ, రమణన్, కన్నన్, లూయిస్, మొసకుట్టి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం ద్వారా ఎం.జెనిత్కుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈయన బొట్టు తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. తాజాగా ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది 24 గంటల్లో జరిగే హార్రర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. చిత్రంలో పలు ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకుంటాయన్నారు. ఇందులో నటి యాషిక ఆనంద్ దెయ్యం పాత్రలో భయపెడుతుందన్నారు. అందుకు కారణాలు ఏమిటి అన్నదే చిత్ర కథ అని అన్నారు. ఈ చిత్రానికి ప్రభాకరన్ మెయ్యప్పన్ సంగీతాన్ని అందించారని చెప్పారు. ఇప్పటికే చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా చిత్ర టైలర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని దర్శకుడు జెనిత్కుమార్ అన్నారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన నటి
టీవీ నటి చైత్ర రాయ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల తల్లి కాబోతున్నానంటూ అభిమానులకు తీపి కబురు చెప్పిన చైత్ర సోమవారం ఉదయం తనకు ఆడబిడ్డ పుట్టిందంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కానీ బేబీ ఫొటోను మాత్రం ఆమె షేర్ చేయలేదు. ‘ఇట్స్ ఏ బేబీ గర్ల్.. ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి అనుభూతిని పొందలేదు. మా కుటుంబ సభ్యులంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. చైత్ర పోస్టుకు యాంకర్ విష్ణు ప్రియ, సుష్మ, మంజు ఇతర నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా తెలుగు, కన్నడ సీరియల్స్‌లో నటించిన చైత్ర ‘ఒకరికి ఒకరు’, ‘మనసున మనసై’, ‘దట్ ఈజ్ మహాలక్ష్మీ’ వంటి సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ అనే సీరియల్లో నటిస్తుండగానే ఆమె సడెన్‌గా ఆ సీరియల్ నుంచి తప్పుకున్నారు. దీనికి కారణం మాత్రం ఆమె వెల్లడించలేదు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకు బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన బేబీ బంబ్ ఫొటోషూట్, సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను చైత్ర అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) -
తల్లి కాబోతున్న సీరియల్ నటి, ఎమోషనల్ పోస్ట్
సీరియల్ నటి చైత్ర రాయ్ అభిమానులతో ఓ శుభవార్తను పంచుకుంది. తను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. "ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే పిల్లలను ఎంచుకోండి. కెరీర్, పని.. వంటివాటిని ఎంపిక చేసుకునేందుకు మున్ముందు బోలెడంత సమయం ఉంది. కుటుంబం అంటే ముఖ్యమైనదే కాదు సర్వస్వం కూడా! త్వరలో చిన్నారి చైత్ర ప్రసన్న మా ఇంట అడుగు పెట్టబోతోంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నేను, నా భర్త ప్రసన్నశెట్టి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితంలో ఈ నూతన ఘట్టం మొదలు పెట్టడానికి మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలి. నేను నా లైఫ్‌లోనే అత్యంత అందమైన గొప్ప దశను ఆస్వాదిస్తున్నా" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చైత్ర అర్ధాంతరంగా సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పడానికి కారణం ఇదన్నమాట అనుకుంటున్నారు. ఇక అష్టాచెమ్మా సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన చైత్ర పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే అక్కాచెల్లెళ్లు సీరియల్ నుంచి మధ్యలోనే తప్పుకున్న నటి ఇది గుడ్‌బై చెప్పడం కాదని, కేవలం గ్యాప్ తీసుకోవడమేనని చెప్పింది. ఎట్టకేలకు అసలు విషయాన్ని తాజాగా ఫొటోలతో సహా బయట పెట్టింది. త్వరలో తల్లి కాబోతున్న చైత్రకు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Chaithra Rai (@chaithrarai17) చదవండి: ఓటీటీలో ఈ వారం అలరించనున్న కొత్త చిత్రాలు ఇవే.. -
సస్పెన్స్ థ్రిల్లర్
ఎస్ఎన్ చిన్న, హేమంత్, శ్రద్ధ, చైత్ర, నందిని ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చిన్నాతో ప్రేమగా’. పీవీఆర్ దర్శకత్వంలో ఎస్.యన్. ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బి. చండ్రాయుడు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సందర్భంగా బి. చండ్రాయుడు మాట్లాడుతూ– ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. సీనియర్ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఒక ముఖ్యమైన పాత్ర చేయడంతో పాటు మూడు పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ ఈ వారంలో పూర్తవుతుంది. మరో మూడు షెడ్యూల్స్‌లో సినిమా పూర్తి చేస్తాం’’ అన్నారు. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. చిట్టిబాబు కామెడీ, ప్రియాంక క్లాసికల్ డ్యాన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ’’అన్నారు పీవీఆర్. ఈ చిత్రానికి కెమెరా: రెబాల సుధాకర్ రెడ్డి, సంగీతం: రాజ్ కిరణ్. -
నలుగురి కథ
‘‘4 ఇడియట్స్’ సినిమాలో అందరూ కొత్తవాళ్లు నటించారు. ఇప్పటి పరిస్థితుల్లో చిన్న సినిమాల విడుదల చాలా కష్టం. వారానికి 6 సినిమాలు విడుదలవుతున్నా ప్రేక్షకులు థియేటర్‌కి రావటం లేదు. అది చాలా బాధగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. కార్తీ, సందీప్, చలం, సన్నీ, చైత్ర, ప్రియా, శశి, రుచి ప్రధాన పాత్రల్లో నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై సతీష్ కుమార్ శ్రీరంగం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘4 ఇడియట్స్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటలను సి. కల్యాణ్ విడుదల చేశారు. సతీష్ కుమార్ శ్రీరంగం మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నేను ఇప్పటివరకు చేసిన 14 చిన్న సినిమాలు మంచి విజయం సాధించాయి. ‘4 ఇడియట్స్’ కూడా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. గతంలో ఇండస్ట్రీలో ఎవరికైనా సమస్య ఉంటే దాసరి నారాయణరావుగారు ఉండేవారు. ఇప్పుడు సి.కల్యాణ్‌గారు ఉన్నారు. సెప్టెంబర్‌లో మా సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. నిర్మాతలు తుమ్ములపల్లి రామ సత్యనారాయణ, సాయి వెంకట్, మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య, కార్పొరేటర్ సంజయ్ గౌడ్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: నగేష్. -
భర్తపై నటి చైత్ర ఫిర్యాదు
జయనగర: భర్త వేధింపులు తాళలేకపోతున్నానని శాండిల్‌వుడ్ నటి చైత్రా మంగళవారం బసవనగుడి మహిళాపోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అందులోని వివరాలు..‘తనకు 2006లో లిక్కర్, రియల్టర్ బాలాజీ పోతరాజ్తో వివాహమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. నెల రోజులుగా వేధింపులు తీవ్రతరమయ్యాయి. ఎక్కడికి వెళ్లినా వెంట గన్‌మన్‌ను పంపుతున్నాడు. ఈనెల 14న చిన్న విషయానికి గొడవపడి ముఖంపై దాడి చేశాడు. జుట్టుపట్టుకుని తలను గోడకేసి బాదాడు. ముక్కు, నోటి నుంచి రక్తస్రావమైనా పట్టించుకోలేదు. తనను హత్యచేయాలనే ఉద్దేశంతో గొంతుపట్టుకుని పొట్ట ఇతరభాగాలపై డాడికి పాల్పడ్డాడు. తాను స్పృహ కోల్పోగా ఇంట్లో వదిలిపెట్టి వెళ్లాడు. అమూల్య అనే యువతితో తన భర్త వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తనను ఇంటి నుంచి గెంటేసేందుకే వేధింపులకు దిగుతున్నాడు. ప్రస్తుతం పుట్టింట్లో ఆశ్రయం పొందుతున్నా. బాలాజీపోతరాజ్పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’. అని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
చిట్టితల్లి లేదిక..
అనంతపురం క్రైం : మొన్నటి వరకు తల్లి ఒడిలో హాయిగా నిద్రించింది.. తండ్రి భుజాలపై కూర్చుని సంతోషంగా గడిపింది. చుట్టుపక్కల చిట్టిపొట్టి చిన్నారులతో కలిసి అల్లరి చేసింది. అలాంటి చైత్ర ఆడుకుంటూ వెళ్లి కన్పించకుండాపోయింది. చిట్టితల్లి కోసం రెండ్రోజుల పాటు ఆ తల్లిదండ్రులు వెతకని ప్రాంతమంటూ లేదు. కన్పించిన వారినంతా ‘మా లవ్లీ కన్పించిందా’ అంటూ అడిగారు. ఎవరూ జాడచెప్పలేకపోయారు. మంగళవారం ఉదయాన్నే గుండెలు పిండేసే విషాదం.. కన్పించకుండా పోయిన చైత్ర మురుగు కాలువలో మృతదేహంగా కన్పించడం చూసి తట్టుకోలేకపోయారు. గుండెలవిసేలా రోదించారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురంలోని ఖాజానగర్‌కు చెందిన సీహెచ్ శ్యాంసుందర్, సరళ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. శ్యాంసుందర్ ‘హీరో’ షోరూంలో పని చేస్తున్నారు. చిన్న కుమార్తె చైత్ర అలియాస్ లవ్ లీ (2) ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి ముందు ఆడుకుంటూ కన్పించకుండాపోయింది. పాప కోసం తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో.. కాలనీలో వెతికినా ఫలితం లేకపోయింది. రెండ్రోజులైనా పాప జాడలేకపోయింది. ఈ క్రమంలో అనుమానం వచ్చిన స్థానికులు మంగళవారం ఉదయం ఇంటి వెనుక ఉన్న మురుగు కాలువలో వెతికారు. కొద్ది సేపటి తర్వాత చైత్ర వేసుకున్న డ్రస్సు కన్పించడంతో దగ్గరికెళ్లి చూశారు. చిన్నారి వృతదేహం కన్పించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. నిన్నటి వరకు వచ్చీరాని మాటలతో ఇంటిల్లిపాదినీ అలరించిన చిట్టితల్లి కానరాని లోకాలకు వెళ్లిందని తెలుసుకున్న కుటుంబీకులు బోరున విలపించారు. వృతి చెంది రెండ్రోజులు కావస్తుండడంతో పాప శరీరమంతా ఉబ్బిపోయింది. సమాచారం అందుకున్న మేయర్ మదమంచి స్వరూప, కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్, టీడీపీ నేత కోగటం విజయభాస్కర్‌రెడ్డి, గోవిందరెడ్డి తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిన్నారి తల్లిని ఓదార్చారు. వృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాలువను శుభ్రం చేసే నాథులే లేరు.. నగరమంతా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని ప్రజాప్రతినిధులు అవకాశం వచ్చినప్పుడల్లా ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. చైత్రను మింగేసిన మురుగు కాలువను చూస్తే ఏ మేరకు నగర అభివృద్ధి జరుగుతోందో అర్థమవుతుంది. స్వయంగా ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నివాసం, విద్యా సంస్థల మధ్యనే ఈ కాలువ ఉంది. అయినా దీన్ని శుభ్రం చేయించే నాథుడే కరువయ్యారు. ఇదే విషయంపై మేయర్, కమిషనరును మంగళవారం స్థానికులు నిలదీశారు. ‘మీఇళ్ల వద్ద ఇలాగే ఉంటే భరిస్తారా?’ అంటూ ప్రశ్నించారు. అరగంట పాటు అక్కడ నిలబడాలంటే ఇబ్బంది పడతారని, అలాంటిది తాము 24 గంటలూ ఎలా కాపురం చేస్తున్నామో ఆలోచించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మురుగు కాలువను శుభ్రం చేయించాలని డిమాండ్ చేశారు.