భయపెట్టనున్న హాట్‌ బ్యూటీ | Yashika Anand 'Chaitra' Movie Latest Update | Sakshi
Sakshi News home page

భయపెట్టనున్న హాట్‌ బ్యూటీ

Published Tue, Oct 31 2023 10:38 AM | Last Updated on Tue, Oct 31 2023 10:59 AM

Yashika Anand Chaitra Movie Latest Update - Sakshi

తమిళ సినిమా: యాషిక ఆనంద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చైత్ర. ఆమె దెయ్యం పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని మార్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై కె మనోహరన్‌, టి.కన్నన్‌ దేవరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అవితేష్‌, శక్తి మహేంద్ర, పూజ ,రమణన్‌, లూయిస్‌, మొసకుట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సతీష్‌ కుమార్‌ చాయాగ్రహణం, ప్రభాకర్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు చేసుకుని నవంబర్‌ 17వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు తిరుపతి మాట్లాడుతూ.. ఇది 24 గంటల్లో జరిగే హర్రర్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఆనంద్‌ దేయ్యంగా నటించినట్లు చెప్పారు. పిజ్జా, డీమాంటీ కాలనీ చిత్రాల తరహాలో కొత్తగా ఉంటుందన్నారు. చిత్ర షూటింగ్‌ను తిరునల్వేలి జిల్లాలోని కావల్‌ కెనరు ప్రాంతంలో నిర్వహించినట్లు చెప్పారు. ఆసక్తికరమైన అంశాలతో చిత్రం కథ కథనాలు కొత్తగా ఉంటాయని పేర్కొన్నారు. దీన్ని పీవీఆర్‌ పిక్చర్స్‌ సంస్థ కొనుగోలు చేసి తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయనుందని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement