నిద్ర కరువైంది.. మళ్లీ నటిస్తానని అనుకోలేదు: యంగ్ హీరోయిన్ | Yashika Anand Reveals About Her Life Experience After Car Accident, Deets Inside - Sakshi
Sakshi News home page

Yashika Anand On Her Accident: ఆ ప్రమాదం తర్వాత నా జీవితమే మారిపోయింది

Published Fri, Apr 12 2024 6:48 AM | Last Updated on Fri, Apr 12 2024 9:51 AM

Yashika Anand Comments Her Life Experience After Car Accident - Sakshi

గ్లామరస్‌ పాత్రలకు యాషికా ఆనంద్‌ పెట్టింది పేరు. కవలై వేండామ్‌ చిత్రం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఇరుట్టు అరైయిల్‌ మురట్టు కుత్తు, దృవంగళ్‌ 16, నోటా, జాంబీ తదితర సినిమాల్లో నటించింది. బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొని, తమిళ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

అయితే కొన్నాళ్ల ముందు ఫ్రెండ్స్ తో  కలిసి కారులో వెళ్తుండగా యాషికా ఆనంద్ భయంకరమైన కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ప్రాణాలతో పోరాడింది. మూడు నెలల తర్వాత తిరిగి మామూలు మనిషైంది. ఆ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమైంది. ఇటీవల 'సిల నేరంగళిల్‌' సినిమాలో నటించిన ఈ భామ ప్రస్తుతం ఇవన్‌ దాన్‌ ఉత్తమన్‌, రాజభీమ, పాంబాట్టం తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

(ఇదీ చదవండి: రూ.50 లక్షలు నష్టపోయా.. ఆస్తులమ్మేశా: బుల్లితెర నటి)

కాగా తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాషికా ఆనంద్‌ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. తాను 17 ఏళ్ల వయసులోనే ఓ తమిళ సినిమా చేసినట్లు చెప్పింది. అలాంటి గ్లామర్‌ పాత్రల్లో నటిస్తే, నిజ జీవితంలోనూ అలానే ఉంటారని కొందరు అనుకుంటారని, చాలా అవమానకరమెన కామెంట్స్‌ చేస్తుంటారని  చెప్పింది. చాలా నెగిటివ్‌గానూ మాట్లాడుతుంటారని ఆవేదన వ్యక్తం చేసింది.

అలాంటివి తనకు బాధ కలిగించినా తనని అసహించుకునే వాళ్లని దూరంగా ఉండి, తనను చూసి ఎంజాయ్‌ చేయమనే చెబుతానని యాషికా చెప్పుకొచ్చింది. నిజం చెప్పాలంటే కారు ప్రమాదం తరువాత తన జీవితమే మారిపోయింది తెలిపింది. ఆ సమయంలో కంటికి నిద్రే కరువైందని, కన్ను మూస్తే ప్రమాద సంఘటనే గుర్తొచ్చేదని అప్పటిరోజుల్ని జ్ఞాపకం తెచ్చుకుంది. అలాంటి పరిస్థితి నుంచి మళ్లీ నటిస్తానని అనుకోలేదని పేర్కొంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'మంజుమ్మల్ బాయ్స్'.. స్ట్రీమింగ్ ఆ రోజేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement