Viral Pics: Actress Chaitra Rai Announces Her Pregnancy With Emotional Post - Sakshi
Sakshi News home page

Chaithra Rai: తల్లి కాబోతున్న బుల్లితెర నటి, ఎమోషనల్‌ పోస్ట్‌

Published Wed, Jul 7 2021 7:55 AM | Last Updated on Wed, Jul 7 2021 9:33 AM

Actress Chaitra Rai Announces Her Pregnancy - Sakshi

సీరియల్‌ నటి చైత్ర రాయ్‌ అభిమానులతో ఓ శుభవార్తను పంచుకుంది. తను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. "ఎప్పుడైనా సందిగ్ధంలో ఉంటే పిల్లలను ఎంచుకోండి. కెరీర్‌, పని.. వంటివాటిని ఎంపిక చేసుకునేందుకు మున్ముందు బోలెడంత సమయం ఉంది. కుటుంబం అంటే ముఖ్యమైనదే కాదు సర్వస్వం కూడా! త్వరలో చిన్నారి చైత్ర ప్రసన్న మా ఇంట అడుగు పెట్టబోతోంది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు నేను, నా భర్త ప్రసన్నశెట్టి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితంలో ఈ నూతన ఘట్టం మొదలు పెట్టడానికి మీ ప్రేమాభిమానాలు, ఆశీస్సులు కావాలి. నేను నా లైఫ్‌లోనే అత్యంత అందమైన గొప్ప దశను ఆస్వాదిస్తున్నా" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

ఈ మేరకు బేబీ బంప్‌ ఫొటోలను కూడా షేర్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు చైత్ర అర్ధాంతరంగా సీరియల్స్‌కు గుడ్‌బై చెప్పడానికి కారణం ఇదన్నమాట అనుకుంటున్నారు. ఇక అష్టాచెమ్మా సీరియల్‌తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన చైత్ర పలు సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవలే అక్కాచెల్లెళ్లు సీరియల్‌ నుంచి మధ్యలోనే తప్పుకున్న నటి ఇది గుడ్‌బై చెప్పడం కాదని, కేవలం గ్యాప్‌ తీసుకోవడమేనని చెప్పింది. ఎట్టకేలకు అసలు విషయాన్ని తాజాగా ఫొటోలతో సహా బయట పెట్టింది. త్వరలో తల్లి కాబోతున్న చైత్రకు బుల్లితెర సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చదవండి: ఓటీటీలో ఈ వారం అలరించనున్న కొత్త చిత్రాలు ఇవే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement