
కన్నడ యాంకర్, నటి, బిగ్‌బాస్ బ్యూటీ చైత్ర వాసుదేవన్ కఠిన నిర్ణయం తీసుకుంది. తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ప్రియమైన అందరికీ.. ఎన్నో నెలలు ఎంతగానో ఆలోచించిన తర్వాత ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పేందుకు సిద్ధమయ్యాను. సత్య, నేను ఇద్దరం విడిపోయాం. మా విడాకుల గురించి ఎవరూ అసభ్యంగా మాట్లాడొద్దు. ఎవరిపైనా ద్వేషం చూపించకండి. మమ్మల్ని జడ్జ్ చేయకండి.
దీని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పడుతోంది. జీవితంలో ముందుకు కొనసాగాలంటే ముందు నేను నా వృత్తిలో తలమునకలయ్యేంత బిజీగా మారాలి. నేను బుల్లితెర ఇండస్ట్రీలో చాలాకాలం పని చేశాను. ఇప్పుడు కూడా అదే పరిశ్రమలో కొనసాగాలనుకుంంటున్నాను. మీ ప్రేమాభిమానాలతో మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. దీనికి ప్రేమ కోసం చూస్తున్నా (#lookingforlove during), కష్ట సమయం (#hardtimes), అనునిత్యం నాలో నేనే సతమతమవుతున్నాను (#strugglinginsideeveryday) అంటూ క్యాప్షన్‌లు జోడించింది.
కాగా చైత్ర వ్యాపారవేత్త 2017లో సత్య నాయుడును పెళ్లాడింది. వీరిద్దరూ ఎప్పుడూ అన్యోన్యంగానే కనిపించేవారు. సడన్‌గా వీరు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు. ఇకపోతే చైత్ర సినీ ఇండస్ట్రీలో యాంకర్‌గా రాణిస్తుండగా తనకు సొంతంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా ఉంది. అలాగే ఒక నిర్మాణ సంస్థ సైతం ఉంది.
చదవండి: ప్రియుడికి బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ బ్యూటీ... ప్రేమ, పెళ్లికో దండమంటూ
Comments
Please login to add a commentAdd a comment