
కన్నడ హీరో దర్శన్ (Darshan Thoogudeepa) చేసిన పని చర్చనీయాంశంగా మారింది. అతడు సోషల్ మీడియా ఖాతాలో కొన్నేళ్లుగా ఫాలో అవుతున్న ఆరుగురిని అన్‌ఫాలో కొట్టాడు. అందులో నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్, ఆమె తనయుడు అభిషేక్ ఉన్నారు. ఉన్నట్లుండి వీరిని అన్‌ఫాలో కొట్టడంతో దర్శన్ ఎందుకిలా చేశాడన్న చర్చ మొదలైంది. దర్శన్ కొడుకులాంటివాడని చెప్పిన సుమలత.. తాను జైల్లో ఉండగా ఒక్కసారి కూడా చూడటానికి రాలేదన్న కోపంతోనే అతడు ఇలా చేసి ఉండొచ్చన్న ప్రచారం మొదలైంది.
అలాంటి వారు హీరోలా..!
ఈ నేపథ్యంలో సుమలత అంబరీష్ (Sumalatha Ambareesh) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. తిమ్మిని బమ్మి చేసి, కాస్తైనా పశ్చాత్తాపపడకపోగా ప్రజలను బాధిస్తూ, అవతలివారిపైకి నిందను తోసేవారు ఇప్పటికీ వారిని వారు హీరోలుగా పరిగణించుకుంటున్నారు. ఇలాంటివారికి కదా ఉత్తమ నటుడిగా ఆస్కార్ ఇవ్వాలి అని ఓ పోస్ట్‌లో రాసుకొచ్చింది.
అవే అసలైన పునాది
మరో పోస్ట్‌లో.. ఎటువంటి విచారం, నొప్పి లేకుండా ప్రశాంతంగా నిద్రలేవడం, మనల్ని మనం అర్థం చేసుకోవడం, ఆందోళనగా పరుగులు తీయకుండా శాంతియుతంగా గడపడం.. అనేవి ఒక నిధిలాంటివి. ఇవన్నీ సోషల్ మీడియాలో పనికొస్తాయో లేవో కానీ మన జీవితానికి బలమైన పునాది వేస్తాయి. ఈ అంశాలే మనల్ని మానసికంగా ధనవంతుల్ని చేస్తాయి అని మరో పోస్ట్ షేర్ చేసింది.

(చదవండి: రికార్డు సృష్టించిన డాకు బ్యూటీ.. ఆ కారు కొన్న మొట్టమొదటి నటిగా)
దర్శన్‌ను ఉద్దేశించి అనలేదు
దీంతో సుమలత ఈ రెండు పోస్టులు దర్శన్‌ను ఉద్దేశించే చేసిందన్న చర్చ జరుగుతోంది. దర్శన్, సుమలత మధ్య సత్సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్లున్నాయని ఎవరికి వారు కథలు అల్లేసుకుంటుకున్నారు. ఈ క్రమంలో సుమలత సోషల్ మీడియా వేదికగా అది అబద్ధమని కొట్టిపారేసింది. నేను ఇంతకుముందు చేసిన పోస్టుల గురించి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. సాధారణంగా నేను పరిశీలించిన అంశాలపై ఆ పోస్టు పెట్టానే తప్ప ఎవరినీ ఉద్దేశించి కాదు. అలాగే ఎంతమంది ఫాలో అవుతున్నారు? ఎంతమంది అన్‌ఫాలో చేస్తున్నారు? అని చెక్ చేసే అలవాటు నాకు లేదు.
ఎందుకిలా రాద్ధాంతం చేస్తున్నారు
దర్శన్.. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విటర్)లో ఎవరినీ ఫాలో అవకూడదని నిర్ణయించుకున్న విషయం నాకు మీడియా వల్లే తెలిసింది. దీన్నెందుకు భూతద్దంలో చూస్తున్నారో నాకు తెలియడం లేదు. దర్శన్ అన్‌ఫాలో అవడం, తర్వాత నేను పోస్టులు పెట్టడం అనేది అనుకోకుండా జరిగింది. అంతేతప్ప ఇందులో ఏమీ లేదు. అసలే గొడవా లేనిచోట ఏదో జరుగుతోందంటూ వివాదం సృష్టించడం ఆపేయండి. నేను పెట్టిన పోస్టులు ప్రత్యేకంగా ఏ ఒక్కరినీ ఉద్దేశించిదని కాదని మళ్లీ చెప్తున్నాను.. నా కుటుంబ సభ్యులు, నా ఆప్తులు అనుకున్నవారితో సోషల్ మీడియాకు బదులుగా నేరుగానే మాట్లాడతాను అని సుమలత పేర్కొంది. కాగా అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో హీరో దర్శన్, అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ అరెస్టయిన విషయం తెలిసిందే! వీరిద్దరూ ప్రస్తుతం బెయిల్ మీదున్నారు.
చదవండి: ఒకప్పటి మావోయిస్టుల కంచుకోటలో మహేశ్ బాబు సినిమా షూటింగ్!
ఓటీటీలోకి 'ముఫాసా'.. అధికారికంగా ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment