Sumalatha Ambareesh
-
నేను ఉన్నంత కాలం వాడు నా కుమారుడే: సుమలత
కన్నడ హీరో దర్శన్ గురించి సినీ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన రాజకీయ మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో దర్శన్ గురించి పలు కీలవ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని, జనవరి తర్వాత సంపూర్ణంగా రాజకీయాల్లో పాల్గొంటానని మండ్య మాజీ ఎంపీ సుమలత అంబరీష్ పేర్కొన్నారు.గత ఎన్నికల్లో ప్రధాని మోదీ మాటకు విలువనిచ్చి మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం కాలి నొప్పి సమస్యకు చికిత్స పొంది కొంత విరామం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొన్నారు. మండ్యలో బీజేపీని బలోపేతం చేస్తానని పార్టీ హైకమాండ్‌కు తాను చెప్పినట్లు తెలిపారు. నటుడు దర్శన్ గురించి సుమలత ఇలా మాట్లాడారు. 'గతంలో దర్శన్‌తో తన సంబంధం ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. దర్శన్ సతీమణి నాతో రోజూ టచ్‌లో ఉన్నారు. దర్శన్ ఆరోగ్యం ప్రస్తుతం అంత మెరుగ్గాలేదు. ముందు అతని ఆరోగ్యం మెరుగు పడాలి. ఇప్పటికే వాడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తనపై వచ్చిన అన్ని ఆరోపణల నుంచి బయట పడతాడనే నమ్మకం ఉంది. నేను జీవించి ఉన్నంత వరకు దర్శన్ నా కుమారుడి లాంటివాడే, అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. రేణుకస్వామి హత్య కేసులో నిజం బయటపడి దర్శన్ నిరపరాధిగా నిలవాలని దేవుడిని ఆశిస్తున్నా' అని ఆమె చెప్పారు. వైద్యచికిత్సల కోసం ఆరు వారాల పాటు దర్శన్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. -
దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్ అరెస్ట్ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె రియాక్షన్ ఇచ్చారు. దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.'నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌లో ప్రేమ, ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను.' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్ స్థంభించిపోయింది.' అని ఆమె రాశారు.18 వరకు దర్శన్‌కు కస్టడీరేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. -
దర్శన్ భార్యను నేనే.. పవిత్రగౌడ కాదు
దొడ్డబళ్లాపురం: పవిత్రగౌడ కేవలం దర్శన్ స్నేహితురాలు మాత్రమే. ఆయనకు చట్ట ప్రకారం భార్యను నేనే, పోలీసులు ఫైల్స్‌లో నా పేరు మాత్రమే భార్యగా నమోదు చేయాలంటూ దర్శన్ భార్య విజయలక్ష్మి బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్‌కు లేఖ రాశారు. దర్శన్ తాను 2003లో హిందూ సంప్రదాయం ప్రకారం ధర్మస్థలంలో వివాహం చేసుకున్నామని, చట్ట ప్రకారం తాను మాత్రమే భార్యనని, పోలీసులు మాట్లాడేటప్పుడు, ప్రకటన ఇచ్చేటప్పుడు పవిత్రను భార్యగా పేర్కొనడం వల్ల ఈ లేఖ ద్వారా స్పష్టత ఇస్తున్నానన్నారు. దర్శన్‌కు తనకు ఒక కుమారుడు ఉన్నాడని, అదేవిధంగా పవిత్రకు కూడా సంజయ్ సింగ్ అనే మరో వ్యక్తితో వివాహం జరిగిందని, వారికీ ఒక కుమార్తె ఉందని అందువల్ల పోలీసులు ఇకపై తనను మాత్రమే దర్శన్ భార్యగా గుర్తించాలన్నారు.18 వరకు దర్శన్‌కు కస్టడీ..రేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. గురువారంతో దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు.దర్శన్ కేసుపై సుమలత స్పందన..యశవంతపుర: నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. అని సుమలత అంబరీష్ పేర్కొన్నారు. ప్రముఖ నటుడు దర్శన్ హత్య కేసులో జైలు పాలు కావడంపై ఈ మేరకు సోషల్ మీడియాలో స్పందించారు.కొడుకు, భర్తను పోగొట్టుకున్న రేణుకాస్వామి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు. దుఃఖం నుంచి ఆ కుటుంబం బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. దర్శన్ కేసులో ఇంతవరకు తను మౌనంగా ఉన్నందుకు అనేక మంది కామెంట్లు చేశారు. దర్శన్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, 25 ఏళ్ల నుంచి దర్శన్‌ను చూస్తున్నాను అని పేర్కొన్నారు. -
ఈసారికి త్యాగమే.. బీజేపీలోకి సుమలత అంబరీష్
తన తదుపరి రాజకీయ ఎత్తుగడపై ఊహాగానాలకు తెరదించుతూ కర్ణాటకలోని మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ తాను భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి తాను మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదన్నారు. మండ్యాలో తన మద్దతుదారులను ఉద్దేశించి సుమలత ప్రసంగిస్తూ.. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ మండ్యా పట్ల నా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. టికెట్ దక్కనప్పుడు కొంతమంది తమ పార్టీని వీడుతారు. కానీ నేను నా సీటును వదులుకుని బీజేపీతోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాను’ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈసారి ఎన్నికల్లో మండ్యా సీటును మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామికి కేటాయించారు. 2019 ఎన్నికల్లో నిఖిల్‌పై సుమలత విజయం సాధించి జేడీఎస్ కంచుకోటగా భావించే మండ్యాలో రాజకీయ మార్పును తీసుకొచ్చారు. 2018లో తన భర్త అంబరీష్ మరణానంతరం, సుమలత ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి మండ్య నుంచి పోటీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి సుమారు రూ. 4,000 కోట్ల గ్రాంట్లు అందించినట్లు సుమలత గుర్తు చేశారు. మండ్యాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు తనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందుకు బీజేపీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “బీజేపీకి నా అవసరం ఉందని, పార్టీని వీడవద్దని ప్రధాని (మోదీ) అభ్యర్థించినప్పుడు నేను ఆయనను గౌరవించాలి” అన్నారు. ఇదే సందర్భంగా సుమలత మండ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తనను తాను జిల్లా 'కోడలు'గా పేర్కొంటూ తనకు ఇతర చోట్ల నుండి పోటీ చేసేందుకు బీజేపీ నుండి ప్రతిపాదనలు వచ్చినా తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని కొంతమంది కోరినప్పటికీ ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పార్టీలో చేరరని ఆమె చెప్పుకొచ్చారు. -
సోదరీ సహకరించు.. సుమలత ఇంటికి కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జేడీఎస్ రాష్ట్ర చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్‌ను కలిశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తనకు సహకరించాలని కోరారు. 'సోదరి' సహకారం వచ్చా.. బెంగళూరులోని సుమలత అంబరీష్ నివాసంలో ఆమెతో సమావేశం అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని వెల్లడించారు. “అంబరీష్ ఇల్లు నాకు కొత్త కాదు. మేము చాలా సంవత్సరాలు కలిసి నడిచాం. నేను మాండ్య లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 3న నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇందులో భాగంగా సోదరి (సుమలత) సహకారం కోసం ఇక్కడికి వచ్చాను" అన్నారు. తమ అనుచరులు మద్దతుదారులతో సమావేశమైన తర్వాత ఏప్రిల్ 3న మండ్యలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుమలత తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. సమావేశం అనంతరం సుమలత అంబరీష్ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. పాత విభేదాలను మనసులో పెట్టుకోవద్దని ఆయన (కుమారస్వామి) కోరారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించాం" అని ఆమె వివరించారు. మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీకి మద్దతుగా నిలుస్తారా లేక మళ్లీ స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమలతకు కేంద్రంలో మంచి పదవి, హోదా కల్పిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలలో మండ్య నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత, సుమలత అంబరీష్ బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఇంకా అధికారికంగా కాషాయ పార్టీలో చేరలేదు. -
సీటు దక్కని సుమలత.. ఏం చేయబోతున్నారు?
బెంగళూరు: బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నటి, ప్రస్తుత మండ్య ఎంపీ సుమలత అంబరీష్.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మండ్య సీటును బీజేపీ తనకే ఇస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు ఇచ్చింది. ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రతో సుమారు గంటసేపు చర్చించిన అనంతరం సుమలత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘విజయేంద్ర తన అభిప్రాయాన్ని, అంచనాలను తెలిపారు. నేనూ నా పరిస్థితుల గురించి చెప్పాను. నేను బీజేపీతోనే ఉండాలని కోరుకుంటున్న ఆయన పార్టీలో చేరాలని కోరారు’ అని ఆమె పేర్కొన్నారు. “రేపు నా మద్దతుదారులు వస్తున్నారు. వారితో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయనకు (విజయేంద్ర) చెప్పాను. నేను వారి అంచనాలను, అభిప్రాయాలను వినాలి. మండ్యలో నా వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పాను' అని సుమలత అన్నారు. మరో వైపు ఆమె తమతోనే నిలబడుతుందన్న నమ్మకం ఉందని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుమలత.. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. కాగా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ మండ్య సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఈసారి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ಮಂಡ್ಯ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಸಂಸದರಾದ ಶ್ರೀಮತಿ ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ ಅವರನ್ನು ಇಂದು ಭೇಟಿಯಾಗಿ ಪ್ರಸ್ತುತ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ದೇಶದ ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಿಯನ್ನಾಗಿಸುವುದು ನಮ್ಮೆಲ್ಲರ ಗುರಿಯಾಗಿದ್ದು ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಮ್ಮ ಸ್ವಾಭಿಮಾನದ ಬೆಂಬಲವನ್ನು ಮಾನ್ಯ ಮೋದಿ ಅವರಿಗಾಗಿ… pic.twitter.com/kMEQauL0RH — Vijayendra Yediyurappa (Modi Ka Parivar) (@BYVijayendra) March 29, 2024 -
ఎన్నికల ప్రచారానికి దూరంగా పాన్ ఇండియా హీరోలు.. కారణం ఇదేనా..?
కర్ణాటక మాండ్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలత అంబరీశ్ మరోసారి కూడా అక్కడి నుంచే పోటీకి దిగనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు కంచుకోట లాంటి మాండ్యలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ను ఆమె ఓడించారు. సుమారు లక్షా ముపై వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత కోసం పాన్ ఇండియా స్టార్లు అయిన యశ్,దర్శన్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె కోసం పెద్ద ఎత్తున వారు పలు ర్యాలీలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కూటమి నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తానని సుమలత చెప్పారు. మాండ్య లోసకభ నియోజకవర్గం నుంచి వంద శాతం నాకే సీటు దక్కుతుందని ఆమె తెలిపారు. గత సారి జరిగిన ఎన్నికల్లో స్టార్ నటులు యశ్, దర్శన్ తనకు మద్దతుగా ప్రచారం చేశారని.. ఈసారి ఎన్నికల ప్రచారానికి వారిద్దరూ రాకపోవచ్చని ఆమె అన్నారు. అప్పుడు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను.. ఇప్పుడు బీజేపీ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతున్నాను. ఇప్పుడు వారిద్దరినీ ఇబ్బంది పెట్టవద్దనుకున్నాను. అయినా తాను తప్పకుండా గెలిచి తీరుతానని ఆమె చెప్పుకొచ్చారు. '2019 ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి ఇద్దరు స్టార్ నటులు యశ్, దర్శన్ నాతో కలిసి ప్రచారం చేశారు. ఇప్పుడు నేను బీజీపీ- జేడీఎస్ కూటమి తరుపున బరిలో ఉన్నాను కాబట్టి వారి అవసరం ఉండకపోవచ్చు. సుమారు 25 రోజుల పాటు గత ఎన్నికల్లో వారిద్దరూ నా వెంటే ప్రచారం చేశారు. వారు నా కోసం త్యాగం చేశారు. మద్దతు మాత్రమే కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా నాకు అండగా నిలిచారు. నా కోసం వారి విలువైన సమయాన్ని మళ్లీ మళ్లీ వదిలేయడం సరికాదు. నేను అంగీకరించను కూడా. యశ్, దర్శన్‌లు సినిమా షూటింగ్స్‌లలో బిజీగా ఉన్నారు. అవి వదిలేసి రావడం సరికాదు. వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల వారిపై పలు విమర్శలు వస్తున్నాయి. ఒక పార్టీ వైపు సినిమా నటులు ఉంటే.. వారి కెరియర్ మీద కూడా ప్రభావం పడవచ్చు. వారిద్దరూ ఎప్పటికీ నా ఇంటి బిడ్డలే.. ఒకవేళ నాకు వారి అవసరం ఉంది అంటే వారు తప్పకుండా వస్తారు. వారు వస్తే, నేను వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. ఎన్నికల ప్రచారం కోసం యశ్ వస్తే నాకు గొప్ప శక్తి అవుతారని భావిస్తున్నాను.' అని సుమలత అన్నారు. -
Leelavathi: ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: సుమలత పోస్ట్ వైరల్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ నటి సుమలత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ రోజు ఆమె ఫామ్‌హౌస్‌లో ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు నెలమంగళలోని నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'లీలావతి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన లీలావతి సౌత్‌లో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలో నాకు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు లీలావతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్‌కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక ప్రశంసలను అందుకుంది. బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్నతనంలోనే నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. 1949లో సినీ రంగ ప్రవేశం చేసిన లీలావతి ఆ తర్వాత కన్నడ సినిమాలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన వినోద్ రాజ్‌తో కలిసి జీవించారు. 1949లో శంకర్ సింగ్ దర్శకత్వం వహించిన నాగకన్నికే సినిమాతో అరంగేట్రం చేశారామె. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్
-
పెళ్లి పార్టీలో డ్యాన్స్‌తో దుమ్ములేపిన సుమలత, యశ్
ఫిల్మ్ ఇండస్ట్రీ సీనియర్ నటి, కర్ణాటక ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ వివాహం బెంగళూరులో ఘనంగా జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిదపా కుమార్తె అవివాను అభిషేక్ వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా సుమలత ఓ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి రాజకీయ పార్టీ నేతలతో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ నటీనటులంతా హాజరై సందడి చేశారు. మ్యారేజ్ పార్టీలో కొత్త జంటతో కలిసి స్టార్ హీరోలు యశ్, దర్శన్‌తో పాటు సుమలత డ్యాన్స్ ఇరగదీశారు. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) ఇప్పుడు ఇదే వీడియో షోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. విజయ్ ప్రకాశ్ హిట్ సాంగ్ అయిన 'జలీల' సాంగ్‌కు వేసిన స్టెప్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే పార్టీలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ సీఎం యడియూరప్ప, చిరంజీవి దంపతులు, ఖుష్బూ, జాకీష్రాఫ్ పాల్గొని కొత్త జంటను ఆశ్వీరదించారు. #YashBOSS Dance with New Couple, Sumakka and #Darshan Sir ♥️#Yash #Yash19 @TheNameIsYash pic.twitter.com/gQQu6L3JoG — Only Yash™ (@TeamOnlyYash) June 11, 2023 (ఇదీ చదవండి: హీరోయిన్ మెటిరియల్ కాదన్న నెటిజన్.. అదే రేంజ్లో రిప్లై ఇచ్చిన అనుపమ) -
గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్
-
గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్
దివంగత నటుడు అంబరీష్, ప్రముఖ నటి సుమలతల తనయుడు అభిషేక్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఎంటర్ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. సోమవారం (జూన్ 5) బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలతో పాటు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖ రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు. నెట్టింట కొత్త జంట ఫోటోలు వైరల్ అభిషేక్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో రజనీకాంత్, యశ్‌లతో పాటు కిచ్చా సుదీప్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే జూన్ 7న అభిషేక్-అవివాల రిసెప్షన్ వేడుక జరగనుంది. కాగా అభిషేక్-అవివా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్.. 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. Snaps of Rocking Star @TheNameIsYash Boss Happy Married Life #AbhishekAmbareesh & Aviva Bidapa ❤️#YashBOSS #Yash19 pic.twitter.com/hgDohWoQNQ — Yash Trends ™ (@YashTrends) June 5, 2023 The #Rocking couple, @TheNameIsYash and @RadhikaPandit7, at the wedding ceremony of #AbishekAmbareesh and #AvivaBidappa as they elegantly wish the family and embrace the newlyweds. Dressed exquisitely in their ethnically-inspired attire, add a touch of enchantment to the joyous… pic.twitter.com/BRiPlgChRH — A Sharadhaa (@sharadasrinidhi) June 5, 2023 #Drpuneethrajkumar Ashwini mam at Abhishek ambareesh marriage. pic.twitter.com/ivGf1BHGJl — ಅಪ್ಪು ಡೈನಾಸ್ಟಿ (@appudynasty1) June 5, 2023 Abhi-Aviva Marriage | ಅಭಿ-ಅವಿವಾ ವಿವಾಹ ಸಂದರ್ಭ ಹರ್ಷದ ಕ್ಷಣಗಳು...#RajNews #Rajnewskannada #Rajnewslive #BreakingNews #LatestNews #trending #report #sports #Government #Karnataka #AbhishekAmbareesh #SumalathaAmbareesh #Aviva #marriage #wedding pic.twitter.com/BQuBrT9ubC — Raj News Kannada (@officialrajnews) June 5, 2023 చదవండి: ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టీవీకి ముద్దుపెట్టేవారు -
సీనియర్ నటి కుమారుడి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల తనయుడు అభిషేక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేయనున్నాడు. బెంగళూరులో జూన్ 5న వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులకే గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇటు అభిషేక్ తల్లి సుమలత అటు వధువు పేరెంట్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ప్రసాద్ బిడప్ప, జుడిత్ ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహానికి సినీ,రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అభిషేక్, అవివా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు. గతేడాది డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసిన సంగతి తెలిసిందే! అభిషేక్, అవివాతో సుమలత అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్.. 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు అంబరీష్, సుమలత. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగానే ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. సుమలత, అంబరీష్ తండ్రీకొడుకులకు ఎదురైన బాధా సంఘటన 1978లో పదువరల్లి పాండవురు అనే కన్నడ చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో అంబరీష్ తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు అంబరీష్. తండ్రికి ఎదురైన పరిస్థితే తర్వాత కొడుక్కి కూడా ఎదురైంది. అమర్ సినిమా షూటింగ్ సమయంలో అంబరీష్ చనిపోయారు. ఆయన అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అతడు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ప్రస్తుతం అభిషేక్ బ్యాడ్ మేనర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: మంచి జోడీ కోసం వెతుకున్న సమంత ఇదంత సులువేమీ కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్ -
బీజేపీకి మద్దతు పలికిన స్వతంత్ర ఎంపీ సుమలత
మాండ్య: మాజీ నటి, కర్ణాటక ఎంపీ సుమలత అంబరీష్(59).. ఊహించని స్టేట్మెంట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. నాలుగేళ్లుగా మాండ్య లోక్‌సభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఉన్న ఆమె హఠాత్తుగా తన మద్దతును కమలానికి ప్రకటించడం గమనార్హం. మోదీ నాయకత్వంలో భారత్‌కు లభించిన సుస్థిరత, దేశం ప్రపంచవ్యాప్తంగా సంపాదించిన ఖ్యాతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ‘నాలుగేళ్లపాటు స్వతంత్రంగా వ్యవహరించాను. ఈ సమయంలో బహిరంగ సమావేశాల్లో పాల్గొనడం వంటి విషయాల్లో పలు సవాళ్లను ఎదుర్కొన్నాను. వీటిని దృష్టిలో ఉంచుకునే మద్దతు అవసరమని భావించాను. అందుకే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నాను’అని ఆమె మీడియాతో అన్నారు. కన్నడ అగ్ర నటుడు దివంగత అంబరీష్ భార్య అయిన సుమలత బహు భాషా నటి. సుమారు 220కిపైగా సినిమాల్లో నటించారామె. 2019 మాండ్యా ఎన్నికలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఆమె గెలుపొందారు. కిందటి నెలలో ఆమె బీజేపీలో చేరతారంటూ వచ్చిన వార్తలను ఖండించిన ఆమె.. ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో తన మద్దతు ఉండబోదంటూ ప్రకటించడం గమనార్హం. -
నటి సుమలత కొడుకు నిశ్చితార్థం ఫోటోలు
-
నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు.. నాలోనే ఉన్నావు.. సుమలత ఎమోషనల్ నోట్
కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్లో అభిమానుల మనసులు గెలుచుకున్న సీనియర్ నటి సుమలత. తెలుగులో అగ్రహీరోలతో పలు సినిమాల్లో ఆమె నటించింది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణతోనూ పలుచిత్రాల్లో ఆమె జంటగా కనిపించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్‌ను తలుచుకుంటూ ఓ నోట్‌ను విడుదల చేసింది. (ఇది చదవండి: ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి) నోట్లో సుమలత రాస్తూ.. 'ఈ రోజు గాలిలో మీ గొంతు విని నేను మీ ముఖం వైపు తిరిగా. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నప్పుడు గాలి వెచ్చదనం నన్ను తాకింది. నీ ఆలింగనం కోసం నేను కళ్లు మూసుకున్నా. నేను కురుస్తున్న వానను చూస్తూ కిటికీలో నుంచి చూశా. ప్రతి వాన చినుకులో మీ పేరు వినిపించింది.ఈరోజు నేను నిన్ను నా హృదయంలో దాచుకున్నా. అది నాకు సంపూర్ణమైన అనుభూతిని కలిగించింది. నువ్వు చనిపోయి ఉండొచ్చు.. కానీ నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు. ఎప్పుడూ నాలో భాగమై ఉంటావు. సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం గాలి వీస్తుంది. వర్షం కురుస్తుంది. అలాగే నువ్వు నాలో ఎప్పటికీ నివసిస్తావు. అది నా హృదయానికి తెలుసు.' అంటూ ఎమోషనల్ అయ్యారు. సుమలత, అంబరీష్ ప్రేమకథ: సుమలత డిసెంబర్ 8న 1991న కన్నడ నటుడు,రాజకీయ నాయకుడు అంబరీష్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు అభిషేక్ గౌడ జన్మించారు. అంబరీష్ 1984లో కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారిగా కలిసిన తర్వాత నటి సుమలతతో స్నేహాన్ని పెంచుకుని మరింత దగ్గరయ్యారు. కాగా.. 24 నవంబర్ 2018న అంబరీష్ గుండెపోటుతో మరణించారు. కన్నడ సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు నివాళులర్పించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించారు. (ఇది చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట) అనే నా జీవితానికి గొప్ప బహుమతి: సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఆ రోజు నీతో నడిచిన క్షణం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్ పార్టనర్‌గా నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాలో ఏదో కొత్త ఉత్సాహం. ఆ రోజుని పదే పదే గుర్తు చేస్తూ పెళ్లినాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ రోజుని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటా. మన 31 ఏళ్ల వివాహబంధంలో జీవితకాల జ్ఞాపకాలను నాటారు. మీరు అందించిన ప్రేమ, ఆప్యాయతలు నా జీవితానికి బహుమతులు' అంటూ ఎమోషనల్ అయ్యారు సీనియర్ నటి సుమలత. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
Mandya MP Sumalatha: ఎంపీ సోదరికి వంచన
సాక్షి, బెంగళూరు: మండ్య ఎంపీ సుమలతా సోదరి రేణుక.. తనను హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ విశాలాక్షీ భట్ డబ్బు మోసగించారని కోణణకుంటె పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. ఎక్కువ లాభాలు వస్తాయని రూ.60 లక్షలు పెట్టుబడి పెట్టించిన విశాలక్ష్మీ భట్ మోసం చేసిందని ఫిర్యాదులో ఆరోపించారు. పైగా తన ఇంటికే వచ్చి ఖాళీ పేపర్లపై సంతకం చేయాలని బెదిరించిందని తెలిపారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) -
విమర్శలు చేసేందుకు చనిపోయిన నా భర్త పేరెందుకు?
సాక్షి, బెంగళూరు: నటి, ఎంపీ సుమలత అంబరీష్, జేడీఎస్ నేత కుమారస్వామి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మాండ్య జిల్లాలో అక్రమ మైనింగ్ ద్వారా కుమార స్వామి, ఇతర జేడీఎస్ నేతలు లబ్ధి పొందారని ఆమె ఆరోపించారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలోకి తనను వెళ్లనివ్వలేదన్నారు. దీనిపై త్వరలో సీఎం యెడియూరప్ప, గనుల మంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానన్నారు. తనపై విమర్శలు చేసేందుకు చనిపోయిన తన భర్త అంబరీష్ పేరును తరచూ ప్రస్తావించడంపై ఆమె మండిపడ్డారు. ఆయనకు వ్యక్తిత్వమే లేదు దొడ్డబళ్లాపురం: కుమారస్వామి ఏనాడో తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారని, కొత్తగా సుమలతపై చేసిన వ్యాఖ్యల వల్ల పోగొట్టుకుంది కాదని ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ అన్నారు. శుక్రవారం రామనగర శివారులో మీడియాతో మాట్లాడిన ఆయన కేఆర్ఎస్ డ్యామ్ పరిసరాల్లో ఎన్నో ఏళ్లుగా అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఇదే విషయాన్ని సుమలత చెప్పి ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయన్నారు. -
‘ఎంపీని అడ్డుగా పడుకోబెడితే లీకేజీ బంద్’
శివాజీనగర: కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి.. ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్‌పై చేసిన విమర్శలు కలకలం రేపాయి. మండ్య జిల్లాలోని ప్రఖ్యాత కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందని కుమారస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేఆర్ఎస్ డ్యామ్ లీకేజ్ అవుతోందని, మండ్య జిల్లాకు ఇలాంటి ఎంపీ మునుపెన్నడూ ఎన్నిక కాలేదని పరోక్షంగా సుమలతపై విమర్శలు చేశారు. లీకేజీని అడ్డుకోవడానికి గేట్లకు అడ్డంగా ఎంపీని పడుకోబెట్టాలని ఎద్దేవా చేశారు. కుమారస్వామి వ్యాఖ్యలపై ఎంపీ సుమలత ఘాటుగా స్పందించారు. మాజీ ముఖ్యమంత్రికి ఒక మహిళ గురించి ఎలా మాట్లాడాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదని, ఆ స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని అన్నారు. -
సుమలత బయోపిక్
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ... ఇలా అన్ని భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా నటి, ఎంపీ సుమలత జీవితం తెరపైకి రానుందని టాక్. భర్త అంబరీష్ మృతి తర్వాత కర్నాటక రాష్ట్రంలోని మాండ్య నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా విజయం సాధించారామె. తాజాగా సుమలత బయోపిక్ తెరకెక్కించేందుకు కన్నడలో సన్నాహాలు జరుగుతున్నాయట. దర్శక–నిర్మాత గురుదేశ్ పాండే ఇటీవల సుమలతని కలిసి బయోపిక్ గురించి చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నట జీవితంతో పాటు రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఈ ప్రాజెక్టులో చూపించనున్నారట. 2019లో జరిగిన మాండ్య ఎన్నికల్లో సుమలత ఎంపీగా గెలిచిన దాన్ని హైలైట్‌గా చూపించాలనుకుంటున్నారట. 10 నుంచి 15 ఎపిసోడ్స్‌తో గరుదేశ్ పాండే ఓ వెబ్ సిరీస్‌గా సుమలత బయోపిక్‌ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే సినిమాగా లేదా ఓ డాక్యుమెంటరీగానూ చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. -
కరోనా: ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నిర్మాత
బెంగళూరు: ప్రముఖ కన్నడ నటుడు-నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు హిట్ చిత్రాలను నిర్మించిన ఆయన శ్యాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. వృత్తిరీత్యా డాక్టరైన వెంకటేష్ కుమారుడు డాక్టర్ అభిలాష్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తన తండ్రి ఆరోగ్యాన్ని అభిలాష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. శ్వాస సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకి ఉంటుందని శాండల్‌వుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇటీవల రాజకీయ ప్రవేశం చేసిన రాక్‌లైన్ దివంగత నటుడు అంబరీశ్ స్మారకం నిర్మాణంపై చర్చించేందుకు ఆయన భార్య, ఎంపీ సుమలతో కలిసి సీఎం యెడియూరప్పను కలిశారు. (చదవండి: సీనియర్ నటికి కరోనా పాజిటివ్!) సమలతకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మధ్యకాలంలో సుమలతను కలిసినందున ఆయనకు కూడా కరోనా వచ్చి ఉండొచ్చని అందరూ అభిప్రాయ పడుతున్నారు. కానీ వెంకటేష్‌కు కరోనా పరీక్షలు నిర్వహించారా లేదా అనే విషయంపై ఇప్పటి వరకు డాక్టర్లు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం రాక్‌లైన్ కన్నడ సూపర్ స్టార్ దర్శన్ రాజవీర మడకారి నాయక అనే పిరియాడికల్ డ్రామా చిత్రాన్ని నిర్మించడమే కాకుండా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ తెలుగు చిత్రాలను ఆయన కన్నడలో రీమేక్ చేశారు. తెలుగులో రవితేజతో ‘పవర్’ సినిమా నిర్మించారు. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘బజరంగీ భాయీజాన్’కు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రజనీకాంత్ ‘లింగా’ సినిమాను ఆయనే నిర్మించారు. రామ్ గోపాల్ వర్మ ‘కిల్లింగ్ వీరప్పన్’లో ఆయన మైసూర్ ఎస్పీగా కనిపించిన విషయం తెలిసిందే. (చదవండి: కరోనాతో హీరో తండ్రి మృతి) -
పెళ్లి వాయిదా వేసుకున్న మహిళా డీఎస్పీ
మండ్య : కరోనా లాక్డౌన్ లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. పెళ్లిళ్లు, పేరంటాలు అనేక శుభకార్యాలు అటకెక్కాయి. ఓ మహిళా డీఎస్పీ.. లాక్డౌన్ విధుల దృష్ట్యా తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు. మండ్య జిల్లాలోని మళవళ్ళి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.జే. పృధ్వీ పెళ్లి ఈ నెల 4న జరగవలసి ఉంది. ద్యామప్ప అనే యువకునితో ఈ నెల 4, 5 వ తేదిల్లో ధార్వాడలో ఏడడుగులు నడవాల్సి ఉండేది. తరువాత ఏప్రిల్ 10వ తేదీన మైసూరులో ఘనంగా రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది. కానీ విధి మరోలా తలచింది. మండ్య, మైసూరు జిల్లాల్లో కరోనా కేసులు ఉవ్వెత్తున పెరగడం, విధుల ఒత్తిడి నేపథ్యంలో ఆమె జీవితంలో ఎంతో ప్రధానమైన శుభఘడియల్ని వాయిదా వేసుకోవడానికే మొగ్గుచూపారు. కానీ పెళ్లి వాయిదా విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పకుండా విధుల్లో ఉన్నారు. అయినప్పటికీ సంగతి తెలిసి సహచర అధికారులు ఆమె నిబద్ధతను అభినందించారు. ఎంపీ సుమలత అంబరీష్ సైతం కొనియాడారు. -
తెలుగు మహిళల కోసం ‘వేటా ’ ఏర్పాటు
-
తెలుగు మహిళల కోసం ‘వేటా ’ ఏర్పాటు
కాలిఫోర్నియా : ‘తెలుగు మహిళల కోట.. స్త్రీ ప్రగతి పథమే బాట’ అనే నినాదంతో కేవలం తెలుగు మహిళల కోసమే ఉత్తర అమెరికాలో తొలిసారిగా ఓ సంఘం ఏర్పాటైంది. మహిళ సాధికారతే లక్ష్యంగా తెలుగు నేలకు చెందిన ఝాన్సీ రెడ్డి హనుమాండ్ల ‘ఉమెన్ ఎంపవర్ మెంట్ తెలుగు అసోసియేషన్ (వేటా)’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ నగరంలో ఇండియన్ కమ్యూనిటీ సెంటర్లో నిర్వహించారు. ప్రముఖ కన్నడ సినీ హీరో అంబరీష్ సతీమణి, కర్ణాటక ఎంపీ సుమలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేటా ప్రెసిండెంట్, అడ్వయిజరీ కౌన్సిల్ చైర్ చైర్ ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు అవకాశాలు కల్పించి వారిలో సృజనాత్మకతను పెంచి , వారి కలను సాకారం చేసుకోవాడాని ఈ సంస్థ తోడ్పతుందని పేర్కొన్నారు. ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రంపచానికి చాటుదామని పిలుపునిచ్చారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలతో మహిళలకు న్యాయం జరగడం లేదని, అందుకే కొత్తగా కేవలం మహిళల కోసమే వేటాను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సినిమాల్లోను, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న సుమలతకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని పలు కళాత్మక ప్రదర్శనలు చేశారు. సాయంత్రం జరిగిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
అభిషేక్ సినిమాలకే పరిమితం
తన కుమారుడు అభిషేక్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు వస్తున్న వందతులను ఎవరూ నమ్మవద్దని ఎంపీ సుమలత అన్నారు. శనివారం అంబరీశ్ పుణ్యతిథిని పురస్కరించుకుని యశవంతపురలోని కంఠీరవ స్టూడియోలో అంబరీశ్ సమాధికి ఆమె నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మద్దూరు నుంచి అభిషేక్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. అనవసరంగా అభిషేక్‌ను రాజకీయాల్లోకి లాగ వద్దని, తను కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమన్నారు. రాజకీయాల్లోకి రావడానికి ఇంకా సమయం ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంపై ప్రస్తుతం దర్యాప్తు చేయాలని కోరటం లేదన్న సుమలత, ఎన్నికల సమయంలో తన ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందన్నారు. సుమలత వెంట అభిషేక్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.