తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ... ఇలా అన్ని భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా నటి, ఎంపీ సుమలత జీవితం తెరపైకి రానుందని టాక్. భర్త అంబరీష్ మృతి తర్వాత కర్నాటక రాష్ట్రంలోని మాండ్య నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా విజయం సాధించారామె. తాజాగా సుమలత బయోపిక్ తెరకెక్కించేందుకు కన్నడలో సన్నాహాలు జరుగుతున్నాయట.
దర్శక–నిర్మాత గురుదేశ్ పాండే ఇటీవల సుమలతని కలిసి బయోపిక్ గురించి చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నట జీవితంతో పాటు రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఈ ప్రాజెక్టులో చూపించనున్నారట. 2019లో జరిగిన మాండ్య ఎన్నికల్లో సుమలత ఎంపీగా గెలిచిన దాన్ని హైలైట్‌గా చూపించాలనుకుంటున్నారట. 10 నుంచి 15 ఎపిసోడ్స్‌తో గరుదేశ్ పాండే ఓ వెబ్ సిరీస్‌గా సుమలత బయోపిక్‌ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే సినిమాగా లేదా ఓ డాక్యుమెంటరీగానూ చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment