ambareesh
-
నువ్వు లేని జీవితం చాలా మార్పు తెచ్చింది.. సుమలత ఎమోషనల్!
ప్రముఖ సీనియర్ నటి సుమలత పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన సుమలత టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో నటించారు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఆమె.. తన భర్త, దివంగత నటుడు అంబరీశ్‌ను తలుచుకుని ఎమోషనలైంది. ఆయన మరణించి ఇప్పటికీ ఐదేళ్లు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో తన భర్త ఫోటోను పంచుకుంది. సుమలత ఇన్‌స్టాలో రాస్తూ..' నువ్వు లేని ఈ ఒంటరి జీవితం నాలో చాలా మార్పు తెచ్చిపెట్టింది! మన ఆనందం , దుఃఖం , నవ్వు , కన్నీళ్లు ప్రతి ఒక్క క్షణం ఎప్పటికీ గుర్తుంటాయి . మీరు లేని లోటు నా జీవితాంత తీర్చలేనిది. కానీ నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నిన్ను ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా జీవితంలో నువ్వే నాకున్న ఓకే ప్రపంచం. ఈరోజు నువ్వు గర్వంగా నవ్వుతూ పైనుంచి మన అభిషేక్ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు మిస్ యూ సార్, కన్నడ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఇవాళ సుమలత తనయుడు అభిషేక్ నటించిన చిత్రం బ్యాడ్ మ్యానర్స్ కర్ణాటక వ్యాప్తంగా రిలీజైంది. ఇటీవలే సుమలత తనయుడు అభిషేక్.. అవివా బిడపాను పెళ్లాడారు. జూన్‌లో వీరి విహహం బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలు హాజరయ్యారు. అంబరీశ్- సుమలత లవ్ స్టోరీ 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
ఘనంగా సీనియర్ నటి సుమలత తనయుడి పెళ్లి
-
గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్
-
గ్రాండ్‌గా సుమలత తనయుడి వివాహం, పెళ్లి ఫోటోలు వైరల్
దివంగత నటుడు అంబరీష్, ప్రముఖ నటి సుమలతల తనయుడు అభిషేక్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఎంటర్ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. సోమవారం (జూన్ 5) బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలతో పాటు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖ రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు. నెట్టింట కొత్త జంట ఫోటోలు వైరల్ అభిషేక్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫోటోల్లో రజనీకాంత్, యశ్‌లతో పాటు కిచ్చా సుదీప్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే జూన్ 7న అభిషేక్-అవివాల రిసెప్షన్ వేడుక జరగనుంది. కాగా అభిషేక్-అవివా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్.. 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. Snaps of Rocking Star @TheNameIsYash Boss Happy Married Life #AbhishekAmbareesh & Aviva Bidapa ❤️#YashBOSS #Yash19 pic.twitter.com/hgDohWoQNQ — Yash Trends ™ (@YashTrends) June 5, 2023 The #Rocking couple, @TheNameIsYash and @RadhikaPandit7, at the wedding ceremony of #AbishekAmbareesh and #AvivaBidappa as they elegantly wish the family and embrace the newlyweds. Dressed exquisitely in their ethnically-inspired attire, add a touch of enchantment to the joyous… pic.twitter.com/BRiPlgChRH — A Sharadhaa (@sharadasrinidhi) June 5, 2023 #Drpuneethrajkumar Ashwini mam at Abhishek ambareesh marriage. pic.twitter.com/ivGf1BHGJl — ಅಪ್ಪು ಡೈನಾಸ್ಟಿ (@appudynasty1) June 5, 2023 Abhi-Aviva Marriage | ಅಭಿ-ಅವಿವಾ ವಿವಾಹ ಸಂದರ್ಭ ಹರ್ಷದ ಕ್ಷಣಗಳು...#RajNews #Rajnewskannada #Rajnewslive #BreakingNews #LatestNews #trending #report #sports #Government #Karnataka #AbhishekAmbareesh #SumalathaAmbareesh #Aviva #marriage #wedding pic.twitter.com/BQuBrT9ubC — Raj News Kannada (@officialrajnews) June 5, 2023 చదవండి: ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు.. టీవీకి ముద్దుపెట్టేవారు -
సీనియర్ నటి కుమారుడి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల తనయుడు అభిషేక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేయనున్నాడు. బెంగళూరులో జూన్ 5న వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులకే గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇటు అభిషేక్ తల్లి సుమలత అటు వధువు పేరెంట్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ప్రసాద్ బిడప్ప, జుడిత్ ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహానికి సినీ,రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అభిషేక్, అవివా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు. గతేడాది డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసిన సంగతి తెలిసిందే! అభిషేక్, అవివాతో సుమలత అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్.. 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు అంబరీష్, సుమలత. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగానే ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. సుమలత, అంబరీష్ తండ్రీకొడుకులకు ఎదురైన బాధా సంఘటన 1978లో పదువరల్లి పాండవురు అనే కన్నడ చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో అంబరీష్ తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు అంబరీష్. తండ్రికి ఎదురైన పరిస్థితే తర్వాత కొడుక్కి కూడా ఎదురైంది. అమర్ సినిమా షూటింగ్ సమయంలో అంబరీష్ చనిపోయారు. ఆయన అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అతడు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ప్రస్తుతం అభిషేక్ బ్యాడ్ మేనర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: మంచి జోడీ కోసం వెతుకున్న సమంత ఇదంత సులువేమీ కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్ -
సుమలత బయోపిక్
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ... ఇలా అన్ని భాషల్లోనూ ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా నటి, ఎంపీ సుమలత జీవితం తెరపైకి రానుందని టాక్. భర్త అంబరీష్ మృతి తర్వాత కర్నాటక రాష్ట్రంలోని మాండ్య నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి లోక్‌సభ సభ్యురాలిగా విజయం సాధించారామె. తాజాగా సుమలత బయోపిక్ తెరకెక్కించేందుకు కన్నడలో సన్నాహాలు జరుగుతున్నాయట. దర్శక–నిర్మాత గురుదేశ్ పాండే ఇటీవల సుమలతని కలిసి బయోపిక్ గురించి చర్చించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె నట జీవితంతో పాటు రాజకీయ జీవిత ప్రయాణాన్ని ఈ ప్రాజెక్టులో చూపించనున్నారట. 2019లో జరిగిన మాండ్య ఎన్నికల్లో సుమలత ఎంపీగా గెలిచిన దాన్ని హైలైట్‌గా చూపించాలనుకుంటున్నారట. 10 నుంచి 15 ఎపిసోడ్స్‌తో గరుదేశ్ పాండే ఓ వెబ్ సిరీస్‌గా సుమలత బయోపిక్‌ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే సినిమాగా లేదా ఓ డాక్యుమెంటరీగానూ చిత్రీకరించే అవకాశం ఉందని సమాచారం. -
ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు
‘‘నా కళ్లను నేను మూసి ఉంచుతున్నాను. మళ్లీ మిమ్మల్ని చూడాలనే ఆరాటంతో.. నా చెవులను మూసి ఉంచుతున్నాను. మీ మాటలను వినగలనని’’ అని ఎంతో భావోద్వేగంతో ప్రముఖ నటి సుమలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేశారు. తెలుగింటి ఆడపడుచు సుమలత ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్‌ని వివాహం చేసుకుని కన్నడ ఇంటి కోడలైన విషయం తెలిసిందే. 1991లో వీరి పెళ్లయింది. ఒక కుమారుడు ఉన్నాడు. అంబరీష్–సుమలత హ్యాపీ కపుల్. భర్త మరణం తర్వాత సుమలత పైకి ధైర్యంగా కనబడుతున్నప్పటికీ లోలోపల ఆయన్ను ఎంతగా మిస్సవుతున్నారో ఆమె మాటలు చెబుతున్నాయి. అంబరీష్ చనిపోయి ఈ నవంబర్ 24తో రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా సుమలత తన మనసులోని భావాలను ఈ విధంగా పంచుకున్నారు. ‘‘కళ్లు మూసి ఉంచగలను.. చెవులను కూడా మూయగలను కానీ నా హృదయాన్ని మాత్రం మూయలేను. ఎందుకంటే ఒక అనంతమైన ప్రేమ, ఒక అపూర్వమైన శక్తి, ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్న హృదయం అది. మీరు లేకుండా రెండేళ్లు గడిచాయి. మీతో గడిపిన ప్రతి క్షణం ఎంత విలువైనదో తలుచుకుంటున్నాను. మనం పంచుకున్న ఆ తీయని క్షణాలు, జ్ఞాపకాలు, నవ్వులు, ప్రేమ.. అన్నీ అపూర్వమైనవి. సవాళ్లు ఎదురైనప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించిన క్షణాలు, కలిగించిన ఆత్మవిశ్వాసం, నింపిన ధైర్యం, చీకటి క్షణాల్లో నింపిన నమ్మకం, ప్రేమ, వదిలి వెళ్లిన వారసత్వం (కుమారుడిని ఉద్దేశించి).. ఇవన్నీ నా జీవితం మొత్తం నన్ను నడిపిస్తాయి. మీ మంచితనం తాలూకు వెలుగు జీవితంలో నాకెదురయ్యే కష్టాల నుంచి నన్ను కాపాడుతుంది. నా చివరి శ్వాస వరకూ మీరు ఉంటారు. నా నవ్వు, నా ఏడుపు అన్నింట్లోనూ ఉంటారు. నేను పడిపోయినా, తడబడినా మీ అనంతమైన బలం నన్ను నిలబడేలా చేస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు.. నా ద్వారా బతికి ఉన్నది మీరే.. మళ్లీ మనం ఒక్కటయ్యేవరకూ నా హృదయాన్ని పదిలంగా పట్టుకునే ఉండండి.. నన్ను బలంగా ఉంచండి’’ అంటూ భర్త మీద తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తపరిచారు సుమలత. -
ముఖ్యమంత్రి తనయుడి ఓటమి
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుమలత ఈ ఎలక్షన్లలో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి ఘన విజయం సాధించారు. అంబరీష్ మరణంతో రాజకీయ తెర మీదకు వచ్చిన సుమలత, తన భర్త పోటి చేసిన మాండ్య నియోజిక వర్గం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల పోత్తు కారణంగా మాండ్య సీటును కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు వదిలేసింది. అక్కడి నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి తనయుడు, యువ హీరో నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున బరిలో నిలిచాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. కన్నడ చిత్రసీమలోని స్టార్ హీరోలంతా సుమలతకు మద్ధతుగా నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. అంబరీష్ పై ఉన్న అభిమానంతో పాటు సింపతీ కూడా కలిసి రావటంతో సుమలత ఘన విజయం సాధించారు. అధికార పార్టీ నిఖిల్ ను గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిని తిప్పి కొట్టి సుమలత విజయం సాధించారు. -
స్కూల్ కోసం ఇంటిని ఇచ్చిన రిటైర్డ్ ఐఏఎస్ అంబరీశ్
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.అంబరీశ్ తన పాత ఇంటిని పాఠశాల కోసం బహుమతిగా ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల హసకొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోసం తన ఇల్లును (ఇంటి నంబరు 6.3) పాఠశాల కోసం ఇచ్చారు. ఈ మేరకు గురువారం పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్‌ను కలసి విషయాన్ని తెలియజేశారు. దానికి సంబంధించిన పత్రాలను అందజేశారు. దీంతో విజయ్‌కుమార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అంబరీశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లా డీఈవోకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఇంటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. -
ఎంట్రీకు రెడీ
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ చనిపోయి వచ్చే నెల 29కి ఏడాది కావస్తోంది. ఫ్యాన్స్ ఇప్పటికీ ఆయన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. అంబరీష్ జీవితం ముగిసిన రోజున తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నారు ఆయన తనయుడు అభిషేక్. దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించిన యూత్‌ఫుల్ మూవీ ‘అమర్’ ద్వారా అభిషేక్ హీరోగా పరిచయం అవుతున్నారు. తనయుడి తొలి సినిమా కోసం అంబరీష్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. అభిషేక్ నటన, ఫైట్స్‌కు సంబంధించిన శిక్షణ, సెట్స్‌కు టైమ్‌కు వెళ్లాలి అనే పాఠాలు కూడా తనయుడికి చెప్పారట. అనుకోకుండా తనయుడి తొలి సినిమాను చూడకుండానే అంబరీష్ మరణించారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే సినిమాలో అంబరీష్ డైలాగ్స్, పాటల ప్రస్తావన చాలా ఉండబోతున్నాయి అని స్పష్టం చేసింది. వచ్చే నెల 29న ఈ చిత్రం విడుదల కానుంది. -
లోక్‌సభ ఎన్నికల్లో సుమలత పోటీ?
సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి, కన్నడ రెబెల్‌స్టార్, దివంగత అంబరీశ్ భార్య సుమలత రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీచేస్తారని సమాచారం. ఆమె భర్త అంబరీశ్ కాంగ్రెస్‌లో కొనసాగడం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సుమలత పోటీ చేయాలనుకున్నా మాండ్య స్థానాన్ని సంకీర్ణంలోని జేడీఎస్ ఆశిస్తోంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు సుమలతకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు ఆమె సిద్ధమని సమాచారం. కాంగ్రెస్– జేడీఎస్ కూటమిలో భాగంగా మాండ్య స్థానం నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. సుమలత పోటీ చేస్తే నిఖిల్ గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకుల అంచనా. సుమలతకు జేడీఎస్ వర్గాల నుంచి భారీ స్థాయిలో మద్దతు ఉన్నట్లు సమాచారం. దీంతో సుమలత, నిఖిల్ మధ్య ఓట్లు చీలి చివరకు బీజేపీ గెలిచే చాన్సుందని భావిస్తున్నారు. -
తండ్రి నడిచిన బాటలోనే
కొన్ని విషయాలు పనిగట్టుకొని నేర్పించనవసరం లేదు. వారసత్వంగానూ సంక్రమిస్తాయి అంటున్నారు శాండిల్‌వుడ్ వాసులు. కన్నడ రెబల్‌స్టార్ అంబరీష్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అంబరీష్ కుమారుడు అభిషేక్ తన ఫస్ట్ చిత్రం ‘అమర్’ కోసం బిజీబిజీగా షూటింగ్ చేస్తున్నారు. తండ్రి అంత్యక్రియలన్నీ దగ్గరుండి జరిపించి, బాధనంతా తనలోనే ఉంచుకుని మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు. కాగా ఒకప్పుడు రెబల్ స్టార్ అంబరీష్‌కు కూడా ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎదురైంది. 1978లో ‘పదువరల్లి పాండవురు’ అనే కన్నడ చిత్రం షూటింగ్ చేస్తూ ఉండగా అంబరీష్ తండ్రి మర ణించారు. అవుట్డోర్ లొకేషన్లో షూటింగ్ చేస్తున్న అంబరీష్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో షూటింగ్లో జాయిన్ అయ్యారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదని అంబరీష్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఊహించవచ్చు. ఇలా తండ్రి నడిచిన బాటలోనే అభిషేక్ నడుస్తున్నాడు అంటున్నారు అంబరీష్ ఫ్యాన్స్. అభిషేక్ తొలి సినిమా ‘అమర్’ విషయానికి వస్తే.. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
సుమలత భావోద్వేగం
కన్నడ సీనియర్ నటుడు అంబరీష్ మరణం నుంచి ఆయన కుటుంబం, సాండల్‌వుడ్ ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేకపోతున్నారు. శనివారం తమ పెళ్లి రోజు కావటంతో అంబరీష్‌తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకొని సుమలత భావోద్వేగానికి లోనయ్యారు. తన భావలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ‘మా మనసు నిండా నీవే... 27 ఏళ్ల పాటు మీతో గడిపిన క్షణాలు మరిచిపోలేనివి, అనుక్షణం నీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాము’ అంటూ తమ 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్బుక్లో ఆవేదనతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘డిసెంబరు 8 మన పెళ్లి రోజు. 27 ఏళ్ల తర్వాత తొలిసారి నువ్వు నా పక్కన లేవు.. నా ప్రపంచంలో నువ్వు ఓ కేంద్రం మాత్రమే కాదు.. నా పూర్తి ప్రపంచమే నువ్వు. నా చేయి పట్టుకుని నడిపించిన చేయి నీది.. నాకు అమితమైన ప్రేమను పంచిన హృదయం నీది. నువ్వు నన్ను ప్రేమించిన తర్వాతే నా జీవితం ప్రారంభమైంది. నీ ప్రేమ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. నువ్వు ఎక్కడున్నప్పటికీ ఇంకా నన్ను చూస్తున్నావని నాకు తెలుసు’’ అంటూ ట్వీట్ చేశారు. ‘అంబి మా చేయి పట్టి నడిపించావు... నీ నగుమోము మాకు ఎంతో ఇష్టం, ఎన్ని యుగాలైనా మరచిపోము. నీవెక్కడ ఉన్నా మా కోసమే వెతుకుతుంటావు, నీ కుమారుడికి ఇకపై నీవే రక్షణగా నిలబడాలి, అభిమానుల్లో మిమ్ములను చూసుకుంటున్నాను’ అంటూ అంబరీశ్‌పై ఉన్న ప్రేమను సుమలత తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. 27 ఏళ్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సుమలత రాసిన లేఖను చూసిన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. -
వెల కట్టలేని ప్రేమ
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సహాయగుణం, ప్రేమ గుణం గురించి గొప్పగా చెబుతారు ఆయన సన్నిహితులు. ఆయన ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ చనిపోయినా కూడా తన ప్రేమను పంచుతూనే ఉన్నారు. కన్నడ యంగ్ హీరో యష్ భార్య రాధికా పండిట్ ఓ పాపకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు ఓ ఊయల గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారట అంబరీష్. సుమారు లక్షన్నర విలువ చేసే ఈ ఊయలను ఆన్లైన్లో బుక్ చేశారాయన. యష్‌కు పాప జన్మించేలోపే అంబరీష్ చనిపోయారు. బుక్ చేసిన ఈ ఊయలకు సంబంధించిన మెసేజ్ రావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు అంబరీష్ భార్య సుమలత. ఈ గిఫ్ట్‌ను యష్ కూతురికి అందిం చారామె. ఈ ఊయల తమకు అపురూపం అని యష్ దంపతులు పేర్కొన్నారు. -
అరుదైన వ్యాధితో బాధపడుతున్న హీరోయిన్
కర్ణాటక, శివాజీనగర : కన్నడ ప్రముఖ సినీ నటుడు అంబరీశ్ అంతిమ దర్శనానికి రాని మాజీ ఎంపీ రమ్యాపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తమైన నేపథ్యంలో ఆమె గైర్హాజర్‌కు సంబంధించి అనేక ఊహాగానాలు వచ్చాయి. అయితే తన కాలుకు అరుదైన వ్యాధి సోకడంతోనే తాను అంబరీశ్ అంకుల్ అంత్యక్రియలకు రాలేదని, ఇందుకు ఎంతో బాధపడుతున్నానని ఆమె ఒక ఫోటో పోస్టు చేసి అందులో సందేశాన్ని పంపారు. అరుదైన వ్యాధి : రమ్యా ఆస్టియోకాల్‌యటోమా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పోస్టు పెట్టింది. కాలులోని మూలగకు సంబంధించిన వ్యాధి ఇది. నిర్లక్ష్యం చేస్తే క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. దీంతో ఆమె అక్టోబర్ నుంచి విశ్రాంతిలో ఉంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కాలుకు శస్త్ర చికిత్స ఫొటోను కూడా పోస్టు చేసి ఒక సందేశం కూడా రాశారు. 10 లక్షల మందిలో ఒక్కరికి మాత్రమే : ఆస్టియోకాల్‌యటోమా అనేది అరుదైన వ్యాధికి మాజీ ఎంపీ రమ్య గురయ్యారు. పది లక్షల మందిలో ఒక్కరికి ఈ వ్యాధి వస్తుంది. ఎముక ములగుల్లో బాధ విపరీతంగా ఉంటుంది. ఈ వ్యాధితో నడిచేందుకు సాధ్యం కాదు. ఈ వ్యాధికి చికిత్స లేదు, ఆపరేషన్ తప్పదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దివ్య స్పందన అనే అమ్మాయి శాండల్‌వుడ్‌లో రమ్యాగా ఎదగి అంబరీశ్ ఆశీర్వాదంతో ఎంపీ అయ్యారు. అటువంటి అంబరీశ్ అంతిమ దర్శనానికి రాకపోవడంతో అంబీ అభిమానుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది, సోషల్ మీడియాల్లో వస్తున్న పోస్టులను చూసిన రమ్య తన గైర్హాజరుకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. -
రమ్య ట్వీట్.. అంబరీశ్ అభిమానుల ఫైర్
సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి అంబరీశ్ పరమపదించి రెండు రోజులు కావొస్తున్నా మాజీ ఎంపీ రమ్య మాత్రం అంతిమ దర్శనానికి రాకపోవడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు. అంబరీశ్ పేరును ఉపయోగించుకుని, ఆయన అండదండలతో చిత్రరంగం, రాజకీయ రంగాల్లో మండ్య జిల్లాలో వెలుగొందిన రమ్య అంబరీశ్ అంతిమ చూపునకు రాకపోవడం దురదృష్టకరమని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబరీశ్ దయతో ఎంపీ అయిన రమ్య ఢిల్లీ విడిచి ఇటువైపునకు కనీసం చూడకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమ దర్శనానికి రానీ రమ్య మండ్య ప్రజల్లో ఎప్పుడో మాజీ అయ్యారని కొందరు ఫేస్బుక్లో పోస్టు చేశారు. రమ్య మొదటిసారి మండ్య లోక్‌సభ స్థానానికి పోటీ చేసినప్పుడు ఆమె గెలుపునకు అంబరీశ్ ఎంతగానో కృషి చేశారు. అయితే అంబరీశ్ పార్థీవ దేహం మండ్యకు వచ్చిన సందర్భంగా ఆమె కూడా వచ్చి ఆయననకు చివరి చూపు చూస్తారని అంతా భావించారు. కానీ రమ్య రాకపోవడంతో మండ్య ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. రమ్య ట్వీట్.. ఈ క్రమంలో అంబరీశ్ మృతిపై మాజీ ఎంపీ రమ్య ట్వీట్ ద్వారా సంతాపాన్ని తెలిపారు. ‘అంబరీశ్ అంకుల్ మీ మరణ వార్త విని నేను తీవ్ర దుఃఖంలో మునిగిపోయాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అంబరీశ్ మృతికి నా సంతాపం. ఆయన ప్రేమను నేను ఎల్ల ప్పుడూ గుర్తుంచుకుంటాను’ అంటూ రమ్య ట్వీట్ చేశారు. -
కలియుగ కర్ణ
ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ (66) శనివారం రాత్రి గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. మాండ్య జిల్లాలో దొడ్డరాసినకెరెలో హుచ్చేగౌడ, పద్మమ్మ దంపతులకు 1952 మే 29న జన్మించారు అంబరీష్. ఏడుగురిలో ఆరో సంతానం ఆయన. అసలు పేరు మలవల్లి హుచ్చేగౌడ అమర్నాథ్. అంబరీష్ పేరుతో 1972లో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కన్నడనాట అభిమానులు అంబరీష్‌ను ‘రెబల్ స్టార్, మాండ్యాడ గండు (మ్యాన్ ఆఫ్ మాండ్య)’ అని అభిమానంగా పిలుచుకుంటుంటారు. కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సుమారు 230 సినిమాలకుపైగా నటించారు అంబరీష్. అంబరీష్‌పై ‘దేనికీ పనికి రాడు’ అనే ప్రగాఢమైన నమ్మకం ఉండేదట వాళ్ల ఇంట్లో. ఆయన టీనేజ్‌కి వచ్చే సమయానికి అన్నయ్యలు, అక్కలందరూ ఇంజినీరింగ్, డాక్టర్లుగా స్థిరపడ్డారు. అప్పటికి అంబరీష్ ఖాళీగా ఉండేవారు. ‘నాగరాహువు’ సినిమా కోసం దర్శకుడు పుట్టన్న కనగళ్ కొత్త వాళ్ల కోసం వెతుకుతున్నారు. ఆల్రెడీ హీరోగా విష్ణువర్థన్‌ను ఎంపిక చేసుకున్నారు. విలన్ కావాలి. అంబరీష్ ఇష్టానికి వ్యతిరేకంగా స్క్రీన్ టెస్ట్ కోసం దర్శక–నిర్మాతలకు తన పేరుని సూచించారు ఆయన మిత్రులు. చూడటానికి బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హాలా ఉండటం, స్క్రీన్ టెస్ట్‌లో ఒకటే టేక్‌లో చేతిలో సిగరెట్‌ను నోట్లో వేసుకోవడంతో పుట్టన్న కనగళ్ ఇంప్రెస్ అయిపోయారు. అమర్నాథ్ని అంబరీష్‌గా కన్నడ సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేశారు. సినిమా బ్లాక్బాస్టర్. అలా అనుకోకుండా ఇండస్ట్రీకు పరిచయం అయ్యారాయన. కన్నడ పరిశ్రమకు విష్ణువర్థన్, అంబరీష్ అనే ఇద్దరు స్టార్స్‌ను అందించిన సినిమా అది. ఆ సినిమాలాగే వీళ్ల ఫ్రెండ్షిప్ సూపర్ హిట్. ‘నాగరాహువు’ తర్వాత వచ్చిన సినిమాలను వచ్చినట్టు వరుసగా ఒప్పేసుకున్నారు అంబరీష్. సహాయ నటుడిగా, విలన్‌గా సినిమాలు చేస్తూ పోతున్నారు. ‘అంత’లో పోషించిన పవర్ఫుల్ పోలీస్ పాత్ర ఆయన కెరీర్‌కు బ్రేక్ అనుకోవచ్చు. ‘రెబల్’ అనే లేబుల్ అంబరీష్ పేరు ముందు ఫిక్స్ అవ్వడానికి పునాదిగా మారిన సినిమా అది అని అంటుంటారు. ఆ తర్వాత ఎక్కువశాతం సినిమాల్లో రెబల్ పాత్రలే ఆయనకు రావడం, దర్శక–రచయితలు కూడా అవే రాయడంతో ‘రెబల్‌స్టార్ అంబరీష్’గా మారిపోయారు. ‘చక్రవ్యూహ, నాగరాహువు, రంగనాయకీ, మసండ హూవు, గండు బేరుండ’ వంటి పలు ఫేమస్ సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. చిరంజీవి ‘శ్రీమంజునాథ’ సినిమాలో మహరాజు పాత్రలో అంబరీష్ కనిపించారు. ఆ చిత్రం తెలుగు– కన్నడ భాషల్లో తెరకెక్కింది. స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ విష్ణువర్థన్, అంబరీష్‌ల స్నేహానికి పోటీ, అహం అనే సమస్య ఎప్పుడూ అడ్డురాలేదట. అంబరీష్, విష్ణువర్థన్ ఇద్దరూ కలసి ‘స్నేహితర సవాల్, స్నేహ సేదు, మహా ప్రచండరు, అవల హెజ్జే, దిగ్గరాజు’ వంటి సినిమాల్లో కనిపించారు. అంబరీష్, సుమలత హీరో హీరోయిన్లుగా ‘ఆహుతి, అవతార పురుషా, శ్రీమంజునాథ, కళ్లరాలై హూవగీ’ తదితర సినిమాల్లో నటించారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరూ 1991లో వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ అనే కుమారుడు ఉన్నారు. అంబరీష్ బోల్డ్, రెబల్ యాటిట్యూడ్‌నే ఇష్టపడ్డానని సుమలత పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అంబరీష్ ఎంత పెద్ద నటుడైనా బయట నటించడం తెలియదంటారు ఆయన సన్నిహితులు. సాధారణంగా స్టార్ సెలబ్రిటీలంతా బయట క్లీన్ ఇమేజ్‌తో ఉండాలనుకుంటారు. కానీ, అంబరీష్ తన ప్రవర్తనని, స్వభావాన్ని, అలవాట్లని బయట చెప్పడానికి సంకోచించలేదు. షుగర్ కోటింగ్ ఇవ్వాలనుకోలేదు. తన అలవాట్లను బహిరంగంగానే ఒప్పుకునేవారు. అంబరీష్ చాలా సెంటిమెంటల్ మనిషి. సొంత ఊరిని, వారసత్వంగా లభించినవి వదులుకోవడానికి ఇష్టపడేవారు కాదట. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఇంటిని తన చెల్లికి ఇచ్చేశారు. కొన్ని కారణాలతో ఆమె ఆ ఇంటిని అమ్మేయడంతో బాధపడ్డానని ఆయన గతంలో పేర్కొన్నారు. అంబరీష్ మంచి భోజన ప్రియుడు. ‘ఒకసారి ఏకంగా 45 దోశెల వరకూ లాగించేశా’ అని నవ్వుతూ చెప్పుకొచ్చారు కూడా. తన సినిమాల్లో స్టంట్స్, డ్యాన్స్‌లు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవారు కాదు అంబరీష్. డ్యాన్స్ ఉందంటే క్రేన్ తెచ్చుకొని లాంగ్ షాట్లో కెమెరా పెట్టుకోండి అని దర్శక–నిర్మాతలకు సూచించేవారట. ‘దేనికీ పనికి రాడనుకున్న అమర్నాథ్ను కన్నడ ప్రజలంతా ప్రేమించే అంబరీష్‌గా మలిచారు’ అంటూ తన మొదటి చిత్ర దర్శకుడు పుట్టన్న కనగళ్ పేరును ఎప్పుడూ గౌరవంగా ప్రస్తావిస్తూనే ఉంటారు అంబరీష్. కన్నడ ఇండస్ట్రీలో అత్యధిక చిత్రాల్లో›నటించిన రికార్డ్ కూడా ఆయనకే సొంతం. రాజ్‌కుమార్ 206 సినిమాల్లో యాక్ట్ చేయగా, విష్ణువర్థన్ 230 సినిమాల్లో కనిపించారు. రజనీకాంత్, చిరంజీవి, మోహన్‌బాబు, మమ్ముట్టి.. అంబరీష్‌కు ఆప్త మిత్రులు. ఆయన లేరని తెలుసుకున్న వీరు కన్నీటి పర్యంతమయ్యారు. రాజకీయాల్లోనూ... 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు అంబరీష్. ఆ పార్టీ టికెట్ రాకపోవడంతో జనతా దళ్ పార్టీలో జాయిన్ అయ్యారు. మాండ్య నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా సేవలందించారు అంబరీష్. కన్నడ ఇండస్ట్రీ మిగతా వాటితో పోటీగా నిలవాలని కలలు కంటుంటారు అంబరీష్. ‘‘మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే కన్నడ ఇండస్ట్రీ చిన్నదే. భారీ బడ్జెట్ సినిమాల్లో పాటలకు ఖర్చు పెట్టేంత మొత్తంతో మా కన్నడ సినిమా మొత్తం పూర్తి చేయొచ్చు. కానీ, మిగతా ఇండస్ట్రీలతో ఎప్పుడూ పోటీపడుతూనే ఉంటాం’’ అంటూ ఇటీవల జరిగిన కన్నడ చిత్రం ‘కేజీయఫ్’ ఫంక్షన్లో చివరిగా మాట్లాడారు అంబరీష్. ఆసరా కోసం వచ్చే ఏ చేతినీ కూడా అంబరీష్ వట్టి చేతులతో పంపేవారు కాదనీ, ధైర్యంతో నింపేవారని అంటుంటారు. అవును.. దాదాపు ఐదు దశాబ్దాల కెరీర్లో అంబరీష్ సంపాదించుకుంది ఆస్తుల్ని కాదు.. ఆప్తుల్ని. ఇప్పుడు ఆ అభిమానులను, ఆప్తులను భౌతికంగా విడిచి వెళ్లిపోయి, జ్ఞాపకంగా మిగిలిపోయారు. ట్రబుల్షూటర్ అంబరీష్ కన్నడ ఇండస్ట్రీ ‘ట్రబుల్ షూటర్’ అనే పేరుని గడించారు. ఇండస్ట్రీలో ఎటువంటి మనస్పర్థలు ఏర్పడినా, చిన్న చిన్న గొడవలైనా కూడా వాళ్ల మధ్య సఖ్యత కుదురుస్తారట అంబరీష్. ఇండస్ట్రీలో చాలా మంది గౌరవంగా అంబరీష్‌ను ‘అప్పాజీ’ (నాన్న) అని పిలుస్తారట. కన్నడలో రాజ్‌కుమార్, విష్ణువర్థన్ తర్వాత అంతగా పాపులర్ అయిన నటుడు అంబరీషే కావడం విశేషం. 1994లో ‘మాండ్య గండు’ అనే చిత్రంలో యాక్ట్ చేశారు అంబరీష్. ఆ సినిమా తర్వాత నుంచి అదే పేరుతో ఫేమస్ అయ్యారు ఆయన. రెబల్ స్టార్‌తో పాటుగా కళియుగ కర్ణ అని కూడా అంబరీష్‌ని పిలుస్తుంది కన్నడ పరిశ్రమ. -
నన్ను నేను కోల్పోయినట్లుగా ఉంది
‘‘స్క్రీన్ నేమ్ ‘రెబల్ స్టార్’. కానీ రియల్‌గా ‘సింపుల్ స్టార్.. హంబుల్ స్టార్’’... ప్రముఖ కన్నడ స్టార్ అంబరీష్ గురించి పలువురు చిత్రరంగ ప్రముఖులు వ్యక్తపరిచిన అభిప్రాయం ఇది. ‘‘నలుగురూ బాగుండాలని కోరుకునే వ్యక్తి’’ అని కూడా పేర్కొన్నారు. ఇంత మంచి పేరు ఉంది కాబట్టే... తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీవాళ్లు ‘ఇక అంబరీష్ లేరు’ అనే మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ని భాషల్లోనూ స్నేహితులను సంపాదించుకున్న అజాతశత్రువు అని అంబరీష్ గురించి వినిపించే మాట. బెంగళూరులో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించడానికి వెళ్లిన మోహన్‌బాబు, ఖుష్బూ, సీనియర్ నరేశ్‌లు ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ► అంబరీష్‌గారితో మీ స్నేహం ఎప్పుడు మొదలైంది? ఎవరు పరిచయం చేశారు అన్నది గుర్తు లేదు కానీ 36 సంవత్సరాల క్రితం మదరాసులో మా ఇంట్లో కలిశాం. ఆ స్నేహం ‘అరేయ్.. ఒరేయ్’ అని పిలుచుకునేంత గాఢమైంది. అప్పట్లో మదరాసులో వాడు హోటల్లో ఉండేవాడు. ఆ సమయంలో మా ఇంటికి వచ్చేవాడు. అప్పటికి అంబరీష్‌కి పెళ్లి కాలేదు. సుమలత, నేను 10–12 సినిమాలు యాక్ట్ చేశాం. చాలా మంచి అమ్మాయి. అంబరీష్, తనూ పెళ్లి చేసుకోవడం.. ఇలా ఆ కుటుంబానికి చెందినవన్నీ మాకు, మా కుటుంబానికి చెందినవన్నీ వాళ్లకూ తెలుసు. నేను బెంగళూర్ వెళితే వాడికి ఫోన్ చేయాల్సిందే. లేకపోతే ఊరుకోడు. గొప్ప స్నేహితుడు, శ్రేయోభిలాషి. ► అంబరీష్‌గారు నటుడి నుంచి రాజకీయ నాయకు డిగా ఎదగడం చూశారు.. ఆయన ఎదుగుదల గురించి? నిజానికి మా ఇద్దరి స్నేహం మొదలైనప్పుడు నేను విలన్‌గా చేస్తున్నాను. అంబరీష్ అప్పటికే మంచి స్టార్. కానీ మా మధ్య ఆ తేడాలేవీ ఉండేవి కాదు. మంచి నటుడు అనిపించుకున్నాడు. యంఎల్‌ఏ అయ్యాడు. అన్నీ కష్టపడి సాధించుకున్నాడు. ఆ ఎదుగుదలలో భాగంగా వాడు ఏ ఫంక్షన్‌కి పిలిచినా వెళ్లేవాడిని. ఒకవేళ ఒకటీ అరా వెళ్లకపోతే ఇంట్లో వాళ్లకు ఫోన్ చేసి ‘ఎక్కడ వాడు.. ఆ రాస్కెల్ ఎక్కడ?’ అని అడిగేవాడు. నన్ను తిట్టేవాళ్లలో మొదటి వ్యక్తి వాడే. ‘అరేయ్ ఒరేయ్’ అనే మాటలకన్నా నన్ను ఎక్కువగానే తిట్టేవాడు. అంత చనువుంది. మా స్నేహాన్ని మాటల్లో చెప్పలేం. ► అంబరీష్‌గారు భోజనప్రియుడు అని విన్నాం. ఏది ఇష్టంగా తినేవారు? మదరాసులో హోటల్లో ఉండేవాడని చెప్పాను కదా. హోటల్లో ఉండే అన్ని రకాల వంటకాలు ఇంట్లో లేకపోయినా ఇంట్లో ఉండే ఒకటీ రెండు కూరలు మనకు బ్రహ్మాండంగా అనిపిస్తాయి. అందుకే మా ఇంటి నుంచి క్యారేజీ పంపించేవాళ్లం. చికెన్, మటన్ బాగా ఇష్టపడి తినేవాడు. ఎందుకో కానీ చేపలంటే తనకి ఇష్టం ఉండేది కాదు. నన్ను కూడా తినొద్దనేవాడు. నేను బెంగళూరు వెళితే అప్పుడు కూడా ఫిష్ తప్ప చికెన్, మటన్ వండించేవాడు. ► చివరిసారిగా అంబరీష్‌గారిని మీరెప్పుడు కలిశారు? మా అమ్మగారు చనిపోయిన రోజున (ఈ ఏడాది సెప్టెంబర్ 20) ఫోన్ చేశాడు. ‘కొంచెం ఆరోగ్యం బాగాలేదు.. రాలేకపోతున్నాను. బాధగా ఉంది. కొన్ని రోజుల తర్వాత వచ్చి కలుస్తాను’ అన్నాడు. పది రోజుల ముందు ఫోన్ చేశాడు. నేను అప్పుడు తిరుపతిలో ఉన్నాను. వైకుంఠ ఏకాదశికి కుటుంబంతో తిరుపతి రావాలనుకుంటున్నాను అన్నాడు. అంతకు ముందు సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఫ్యామిలీతో సహా తిరుపతి వచ్చాడు. నేనే దగ్గరుండి తీసుకెళ్లాను. రెండు గంటల పాటు దైవ సన్నిధిలోనే ఉన్నాం. ► స్నేహం ఏమీ ఆశించదంటారు.. మీ ఇద్దరి స్నేహం అలానే సాగిందా? ఈ రోజు వరకూ కూడా వాడు ఫలానాది కావాలి అని అడిగింది లేదు. ఎప్పుడైనా నేనేమైనా అడిగానేమో గుర్తు లేదు. మాది స్వచ్ఛమైన స్నేహం. నా లైఫ్‌లో గొప్ప స్నేహితుడు వాడు. శ్రేయోభిలాషి. అంబరీష్ లేడనే మాట విని బాధపడిపోయాను. మా కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నాం. అంబరీష్ అంతిమక్రియలు జరిగే వరకూ బెంగళూరులోనే ఉంటాను. నా మిత్రుడికి చివరి వీడ్కోలు ఇచ్చినప్పటికీ నా మనసులో నుంచి ఎప్పటికీ చెరిగిపోడు. నా ఆప్తమిత్రుల్లో ఒకరిని కోల్పోయాను. నన్ను నేను కోల్పోయినట్లుగా అనిపిస్తోంది. ‘అడుగు ఆపకూడదు అనేవారు’ — సీనియర్ నరేశ్ ► చివరిసారిగా అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? గతేడాది బెంగళూరులో ఆయన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా అందర్నీ పిలిచారు. అప్పుడు కలిశాను. ఆ తర్వాత కన్నడ నటీనటుల సంఘం (కళారధి) భవనం ప్రారంభోత్సవానికి వెళ్లాను. నటీనటుల కోసం బెంగళూరులో అంత పెద్ద బిల్డింగ్ రావడం ఆయన కృషి వల్లే సాధ్యమయింది. నేను చివరిసారిగా అంబీ అన్నను కలిసింది ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడే. దాదాపు 9 నెలలు అవుతుంది అనుకుంటున్నాను. ► అసలు మీరు అంబరీష్‌గారిని ఫస్ట్ ఎక్కడ కలిశారు? 1983–84–85 టైమ్‌లో ఆయన చెన్నైలో ఉండేవారు. ఆ టైమ్‌లో ఫస్ట్ కలిశాను. ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. నా కెరీర్ తొలినాళ్లలో ఆయన వందో చిత్రం షూటింగ్ టైమ్‌లో కలిశాను. ఆయన్ను బ్రదర్‌లా అనుకునేవాడిని. ► అంబరీష్గారిలోని నటుడ్ని చూసి మీకేనిపించేది? కన్నడంలో రాజ్‌కుమార్‌గారి తర్వాత మాస్ హీరో అంటే అంబరీష్గారే. ఆయన్ను తొలిసారి బ్లాక్ అండ్ వైట్ మూవీ ‘అంత’ (తెలుగులో ‘అంతం కాదిది ఆరంభం’)లో వెండితెరపై చూశాను. స్క్రీన్‌పై అంబీ అన్న నటన చూసి, ఆశ్చర్యపోయాను. సౌత్ నుంచి ఓ సినీ దిగ్గజం వెళ్లిపోయింది. ► అంబరీష్‌గారు ఎలాంటి వారు? ఆయనకు వయసు భేదం లేదు. అందరినీ కలుపుకునే పెద్ద మనసు ఉన్న వ్యక్తి. ఇండస్ట్రీలో కూడా చాలా మంది ఇదే చెబుతారు. చాలా ధారాళమైన హృదయం ఉన్న వ్యక్తి. చాలా సరదా మనిషి. అంబరీష్‌గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారా? కలిసి నటించలేదు. కృష్ణగారితో సుమలతగారు సినిమాలు చేశారు. అలా ఆ కుటుంబానికీ, మా కుటుంబానికీ మంచి అనుబంధం ఉంది. ► మీకు ఏమైనా సలహాలు ఇచ్చేవారా? లైఫ్‌లో ఎప్పుడూ ఒక అడుగు ముందుకు వేస్తూనే ఉండాలి. ఆగకూడదు అనేవారు. చాలా మొండివాడు. ధైర్యవంతుడు. సినిమాల్లో, రాజకీయాల్లోనూ, దానధర్మాల్లోనూ ముందు ఉండేవారు. ► అంబరీష్గారి నుంచి స్ఫూర్తి పొందే విషయాలు చెబుతారా? చాలా ఉన్నాయి. మేజర్‌గా ధైర్యం, కలుపుగోలుతనం, దానగుణం. 'స్థాయిని బట్టి మాట్లాడే వ్యక్తి కాదు' – ఖుష్బూ ► మీ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అంబరీష్‌గారు స్టార్. ఆయనతో సినిమా చేసినప్పుడు ఎలా ఉండేది? అంబరీష్‌గారు చాలా కంఫర్ట్బుల్. చాలా ఫ్రెండ్లీ నేచర్. ఆయనతో పని చేయడాన్ని ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా సరే రిపీటెడ్‌గా వర్క్ చేయాలనుకునే స్టార్ అంబరీష్. అంత కంఫర్ట్బుల్. ► ఫస్ట్ టైమ్ అంబరీష్‌గారిని ఎప్పుడు కలిశారు? ‘ఒంటి సలగా’ అనే కన్నడ సినిమా సెట్లో మెదటిసారి కలిశాను. నేను సూపర్‌స్టార్‌ని. నన్ను అందరూ గౌరవించాలి, నన్ను చూసి భయపడాలి అనుకునే మనిషి కాదు అంబరీష్‌గారు. అలాంటివి కోరుకోరు కూడా. చాలా హంబుల్‌గా ఉండేవారు. అందుకని నాకు భయం అనిపించలేదు. ► పవర్ఫుల్ మాస్ రోల్స్ చేయడంవల్ల అంబరీష్గారికి ‘రెబల్‌స్టార్’ ట్యాగ్ ఉంది. లొకేషన్లో అసిస్టెంట్స్‌తో ఎలా ఉండేవారు? స్క్రీన్ మీదే ఆయన రెబల్ స్టార్. బయట అందరినీ సమానంగా చూసేవారు. కెరీర్ చివరి వరకూ కూడా ఆయన అలానే ఉన్నారు. స్థాయిని బట్టి మాట్లాడే గుణం లేదాయనకు. ► 1980లలో నటించిన తారలందరూ ‘రీయూనియన్’ అంటూ ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. అప్పుడు అంబరీష్‌గారు సందడి చేసేవారా? ఈ ఏడాది ఆరోగ్య కారణలతో హాజరు కాలేకపోయారు. కానీ ప్రతీ ఏడాది ఫుల్ హుషారుగా, సరదాగా ఉండేవారు. చాలా సింపుల్‌గా, నార్మల్‌గా ఉంటారు. కానీ 2015లో మోహన్‌లాల్ ఏర్పాటు చేసిన మీట్లో చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. శనివారం వెళుతూ వెళుతూ ఓ చేదు వార్త వినేలా చేస్తుందని ఊహించలేదు. మా అందరికీ పెద్ద షాక్. అత్యంత ఆప్తుడిని కోల్పోయాం. -
ఆయన కోసం పూజలు చేశారు
డిసెంబరు 8న సుమలత–అంబరీష్‌ల పెళ్లి రోజు. ఈలోపే... ఊహించని విషాదం! జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు ఎవరినైనా పుట్టెడు దుఃఖం ఆవహిస్తుంది. సుమలత ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. ఆమె దుఃఖాన్ని ఎవరూ పట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. సుమలత పుట్టినరోజు (ఆగస్ట్, 27) సందర్భంగా గతంలో సాక్షి ‘ఫ్యామిలీ’ చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను తిరిగి ప్రచురిస్తున్నాం. ► మీ ఇద్దరిదీ ప్రేమ వివాహం కదా! అంబరీష్లో మీ మనసును దోచుకున్నదేమిటి? సుమలత: ఆయన మనస్తత్వమే. చాలా మంచి వ్యక్తి. దాన వీర శూర కర్ణ, కలియుగ కర్ణ, మానవతామూర్తి... ఇలా కన్నడ రంగంలో ఆయన మంచితనానికి బోల్డన్ని బిరుదులున్నాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆయన వెనకడుగు వేయలేదు. అవన్నీ స్వయంగా చూశాను. అందుకే... ఆయనే నా భర్త అయితే బాగుండనుకున్నాను. నాది సున్నితమైన మనస్తత్వం కాబట్టి ఆయన నన్ను ఇష్టపడ్డారు. ► తెలుగింటి ఆడపడుచైన మీరు కన్నడ ఇంటి కోడలిగా సెటిలైపోయారు... జీవితం ఎలా ఉంది? చాలా బాగుందండి. కన్నడవాళ్లు నన్ను తమ అమ్మాయిగా అంగీకరించారు. నన్నెంతగా అభిమానిస్తున్నారంటే.. నా నేపథ్యం తెలియనివాళ్లు నేను కన్నడ అమ్మాయినే అనుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో పుట్టి, పెరిగి మరో రాష్ట్రంలో ఇంతటి అభిమానం సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన గోంగూర ఎంత రుచిగా ఉంటుందో కన్నడ బిసిబేళా బాత్ కూడా అంతే రుచిగా ఉంటుంది. ► అంబరీష్‌గారు, మీ మధ్య ఎప్పుడు ప్రేమ మొదలైంది? మాది తొలి చూపులో ఏర్పడ్డ ప్రేమ కాదు. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ముందు మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ మార్పు ఫలానా సమయంలో వచ్చిందని చెప్పలేను. మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అంబరీష్‌కి బోల్డంత మంది మంచి స్నేహితులున్నారు. రజనీకాంత్ గారైతే.. ‘నాకు తెలిసి ఇండియాలో మీ ఆయనకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ ఉండరేమో’ అంటుంటారు. స్నేహితుల కోసం ఆయన ఏమైనా చేస్తుంటారు. ► ఆ స్నేహం వల్ల మీరెప్పుడూ ఇబ్బంది పడలేదా? పెళ్లయిన కొత్తలో ప్రైవసీ కోరుకుంటాం కాబట్టి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఆ గొడవలు ముదురి పాకాన పడి, విడిపోయేంత వరకూ రాలేదు. ఆయన పగలంతా స్నేహితులు, పనులతో బిజీగా ఉన్నా, సాయంత్రం మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితమైపోతారు. ► స్నేహితులకు సహాయం చేసే విషయంలో అంబరీష్‌గారిని మీరు వెనక్కి లాగడానికి ప్రయత్నించేవారా? లేదు. ఎందుకంటే, నేను ఆయనను ఎక్కువ ఇష్టపడానికి కారణం అదే. పెళ్లికి ముందు ఇష్టపడిన విషయం తీరా పెళ్లి అయిపోయాక ఎందుకు కష్టంగా ఉంటుంది. కాకపోతే, అర్హత లేనివాళ్లకు సహాయం చేసినప్పుడు మాత్రం వారిస్తుంటాను. అప్పుడాయన ‘నాకు సహాయం చేయాలనిపించింది.. చేశాను. ఒకవేళ వెన్నుపోటు పొడిచారనుకో.. అది వాళ్ల కర్మ’ అంటుంటారు. ఎవరికైనా సహాయం చేస్తే, వాళ్లు తిరిగి తనకేదో చేయాలనీ, జీవితాంతం ఋణపడి ఉండాలనీ కోరుకోరు. ఇన్నేళ్ల వైవాహిక జీవితం బోల్డన్ని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి బహుమతి ‘అంబరీష్’. ► తెలుగు పరిశ్రమలో కూడా మీవారికి మంచి స్నేహితులున్నారనుకుంటా? అవును. మోహన్‌బాబు గారు, చిరంజీవి గారు, హిందీ రంగంలో శతృఘ్న సిన్హా గారు, తమిళంలో రజనీకాంత్ గారు.. ఇలా చాలామంది స్నేహితులున్నారు. ఆ మధ్య అంబరీష్‌కి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరూ పరామర్శించారు. మోహన్‌బాబు గారైతే బెంగళూరు వచ్చి, మా ఆయనను చూడగానే ఒక్కసారిగా కంట తడిపెట్టుకున్నారు. ఆ అభిమానం చూసి, చాలా సంతోషం అనిపించింది. ► మీ జీవితంలో బాగా టెన్షన్ పడిన సందర్భం అంబరీష్గారికి ఆరోగ్యం బాగా లేనప్పుడేనేమో? వంద శాతం కరెక్ట్. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే... అభిమానులు పూజలు చేశారు. హోమాలు నిర్వహించారు. పొర్లుదండాలు పెట్టారు. అలాంటివన్నీ విని కదిలిపోయాను. అసలు అభిమానులు మమ్మల్ని కలుస్తారో లేదో తెలియదు. పోనీ మా ద్వారా ఏమైనా లాభం కలుగుతుందా? అంటే అదీ లేదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్లు సైతం ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అసలే సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా అభిమానం. ఈ సంఘటనతో ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. ‘సినిమా పరిశ్రమ మీకు ఇంతమంది అభిమానులను ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తోంది’ అని ఆ దేవుడు ఇలాంటి సంఘటనల ద్వారా మా సినిమా పరిశ్రమవారికి చూపిస్తాడేమో అనిపించింది. ► అంబరీష్గారికి రీల్ జీవితంలోనే కాదు.. రియల్ జీవితంలోనూ ‘రెబల్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఎలా నెట్టుకొస్తున్నారు? (నవ్వుతూ...) జీవిత భాగస్వాముల్లో ఒకరు రెబల్‌గా ఉంటే ఒకరు సాఫ్ట్‌గా ఉండాలి. అంబరీష్ మొదటి రకం అయితే నేను రెండో రకం. అందుకని, మా జీవితం సాఫీగా సాగుతోంది. అంబరీష్ స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి విలువలున్న వ్యక్తి. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంబరీష్‌తో ఉన్న సాన్నిహిత్యం గురించి మోహన్‌బాబు, ఖుష్బూ, నరేశ్‌ల ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు’; మంచి మనిషి, ఆప్త మిత్రుడు అంబరీష్. నిన్ను కోల్పోయాను. ఎప్పటికీ మిస్ అవుతుంటాను. – రజనీకాంత్ చిరకాల మిత్రుడు అంబరీష్ ఆకస్మిక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. తన మరణం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. నటుడిగా, గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. – కృష్ణంరాజు నా కెరీర్ తొలినాళ్లలో సంపాదించుకున్న స్నేహితుడివి నువ్వు. సంవత్సరాలు పెరిగే కొద్ది అది పెరిగి పెద్దదయింది. ఎంత రాసినా నువ్వు లేని లోటును వర్ణించలేనని తెలుసు. ‘బాస్’ అని నువ్వు పిలిచే పిలుపు మిస్ అవుతాను. – మమ్ముట్టి అంబరీష్‌గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన లేరంటే గుండె పగిలిపోతోంది. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలతతో పాటు కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలి. – రాధికా శరత్‌కుమార్ మోహన్‌బాబు కుమారుడు అభిషేక్, భర్త అంబరిష్లతో సుమలత – డి.జి. భవాని -
మిగతా ఇండస్ట్రీలకు పోటీగా పోరాడుతున్నాం
‘‘ఈ చిత్రం ట్రైలర్ గ్రాండ్‌గా ఉంది. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి పెంచేలా ఉంది. డైరెక్టర్ ప్రశాంత్, ప్రొడ్యూసర్ విజయ్‌కు అభినందనలు’’ అన్నారు కన్నడ నటుడు అంబరీష్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మాతగా రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘కేజీఎఫ్’ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). తెలుగులో వారాహి చలన చిత్ర బ్యానర్‌పై నిర్మాత సాయి కొర్రపాటి విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ట్రైలర్‌ని బెంగళూరులో విడుదల చేశారు. కన్నడ ట్రైలర్ విడుదల చేసిన సీనియర్ నటుడు అంబరీష్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా. తమిళంలో 5 కోట్ల బడ్జెట్‌తో ఒక్కపాట తీస్తుంటారు. మేం (కన్నడ) 5 సినిమాలు తీస్తాం. మిగతా ఇండస్ట్రీలకు పోటీగా కన్నడ ఇండస్ట్రీ ప్రాముఖ్యత కోసం పోరాడుతున్నాం. ఆ పోరాట పటిమ నాకు ఇష్టం. చరిత్రను రాసిన రాజ్‌కుమార్‌గారి పోస్టర్ ఒక్కటి కూడా కర్ణాటక సెంటర్లో చూడలేం. అది మా దురదృష్టం. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమా అవుతుందనుకుంటున్నాను ’’ అన్నారు. ‘‘ రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమాలో ప్రశాంత్ పేరు గుర్తుండి పోతుంది. నిర్మాత ఈ సినిమాకి అసలు హీరో. ఆయన లేకుంటే ఇంత భారీగా తెరకెక్కేది కాదు. కొన్ని క్లిప్పింగ్స్ చూసి ఈ సినిమాను ఆయా భాషల్లో విడుదల చేయడానికి ముందుకు వచ్చిన విశాల్, సాయికొర్రపాటి, అనిల్ తాండన్‌కు థ్యాంక్స్. అలాగే బాలీవుడ్ స్టార్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లకు కూడా థ్యాంక్స్. కన్నడ సినిమా స్థాయిని ఇండియన్ సినిమా స్థాయికి తీసుకెళ్లే చిత్రమిది’’ అన్నారు యష్. ‘‘నేను బళ్లారి నుంచి హైదరాబాద్ వెళ్లి నిర్మాతగా మారాను. ఈ సినిమాతో కన్నడ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాను. తెలుగులో మా వారాహి చలన చిత్రం బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు సాయి కొర్రపాటి. విశాల్ మాట్లాడుతూ.. ‘యష్ నాకు సోదరుడితో సమానం. ‘కేజీఎఫ్’తో కన్నడ సినిమా.. ప్యాన్ ఇండియా మూవీగా నిలుస్తుంది. భాషా పరమైన సరిహద్దులను ఈ సినిమా చెరిపేస్తుంది. ‘బాహుబలి’తో ఇది వరకే ఈ విషయం నిరూపితమైంది. ఇప్పుడు ‘కేజీఎఫ్’తో మారోసారి రుజువుకాబోతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి’’ అన్నారు. అనిల్ తాండన్ మాట్లాడుతూ– ‘‘బాహుబలి, రోబో’ లాంటి భారీ సినిమాల తర్వాత విడుదల చేస్తున్న సౌతిండియన్ మూవీ ఇది. ఇది కూడా భారీ విజయం సాధిస్తుందని అనుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నా తొలి సినిమా ‘ఉగ్రం’. ఆ సినిమా విడుదలకు ఒక్కరోజు ముందు హిట్ అవుతుందో లేదో అనుకున్నాను. చాలా పెద్ద హిట్ అయింది. దాంతో నాకు నమ్మకం కుదిరింది. అదే నమ్మకంతో నిర్మాత విజయ్ గారు ‘కేజీఎఫ్’ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నా 4ఏళ్ల కల సాకారమైంది’’ అన్నారు డైరెక్టర్ ప్రశాంత్. ‘‘అందరూ ఈ సినిమా బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు.. నాకు డబ్బు ముఖ్యం కాదు.. బంధాలే ముఖ్యం. కొత్త టాలెంట్ బయటకు రావాలనే ఆలోచనతో చేసిన చిత్రమిది. ప్రశాంత్ అద్భుతమైన డైరెక్టర్. యష్ నా తమ్ముడి లాంటి వాడు. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. నిర్మాతగా ఇది నాకో గొప్ప చిత్రం అవుతుంది’’ అన్నారు నిర్మాత విజయ్ కిరగందూర్. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు కన్నడ సూపర్‌స్టార్ పునిత్ రాజ్ కుమార్, బాలీవుడ్ స్టార్స్ రితేష్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్‌లు వీడియో సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. -
వయసుతో సంబంధం లేదు!
వయసు దేహానికి పెరుగుతుంది. మనసుకు కాదు. అందుకే ప్రేమకు వయసుతో సంబంధం లేదు. దాదాపు ఇదే కాన్సెప్ట్‌తో తమిళంలో ‘పవర్ పాండీ’ అనే సినిమా రూపొందింది. నిర్మాత–నటుడు ధనుష్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమా కన్నడంలో ‘అంబి నింగే వయస్సాయ్తో’ అనే పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో కన్నడ స్టార్ హీరో అంబరీష్ నటించారు. అంబరీష్ యంగ్ ఏజ్ నాటి సీన్స్‌లో సుదీప్ కనిపిస్తారు.అన్నట్లు.. ఈ సినిమాకు సుదీప్ కూడా ఓ నిర్మాత. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్రబృందం. ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాతో గురుదత్తా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సుహాసిని ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాకు అర్జున్ జన్యా సంగీతం అందించారు. -
అరవైలో ఇరవైలా..
అరవై ఏళ్ల వయసులో ఓ యాక్షన్ స్టంట్‌ను సింగిల్ టేక్‌లో కంప్లీట్ చేయడం అంటే మాములు విషయం కాదు. కానీ ఈజీగా చేశారట కన్నడ నటుడు అంబరీష్. గురు దత్తా దర్శకునిగా పరిచయం అవుతున్న కన్నడ చిత్రం ‘అంబి నింగ్ వయసాయతో’. తమిళ నటుడు ధనుష్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘పవర్ పాండి’ సినిమాకు రీమేక్ ఇది. ‘అంబి నింగ్ వయసాయతో’ చిత్రంలో అంబరీష్‌కు జోడీగా సుహాసిని నటించారు. ఓ కీలక పాత్రను సుదీప్ చేశారు. ‘‘ఇందులో రిటైర్డ్ స్టంట్ డైరెక్టర్‌గా అంబరీష్ సార్ నటించారు. సినిమాలో ఓ యాక్షన్ స్టంట్‌ను డూప్ లేకుండా చేశారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఎనర్జీ లెవల్స్ చూసి షాక్ అయ్యాను’’ అన్నారు డైరెక్టర్ గురు దత్తా. 60లో 20 ఏళ్ల కుర్రాడిలా అంబరీష్ ఫైట్ చేయడం యూనిట్లో ఇతర సభ్యులను కూడా ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కొత్త లుక్‌ను అంబరీష్ సతీమణి, నటి సుమలత రిలీజ్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. -
భేటీ వెనుక ఆంతర్యమేమిటో?
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు నాటకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కన్నడ రెబల్‌స్టార్, మాజీ మంత్రి అంబరీష్ తాజాగా శనివారం రాత్రి జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామితో భేటీ అయ్యారు. కర్ణాటకలోని మండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ కేటాయించినప్పటికీ అంబరీష్ నిరాకరించిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాల రీత్యా ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్టు అంబరీష్ ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీ తరఫున ప్రచారం కూడా చేయనని స్పష్టం చేశారు. రాజకీయాలకు రాం రాం.. అన్నారు. అయితే హెచ్డీ కుమారస్వామి నివాసానికి వెళ్లి కలవడం వెనుక ఆంతర్యమేంటని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌పై అలకవీడని అంబి కర్ణాటక శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మండ్య టికెట్ ఇచ్చి ప్రోత్సహించినా ఆసక్తి చూపలేదు. అంబరీష్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రిగా పని చేశారు. అయితే 2016లో ఉన్నఫలంగా కేబినెట్ నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో మండ్య నుంచి పోటీ చేయాలని బీఫారం ఇచ్చినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. అయితే నామినేషన్లకు గడువు సమీపించడంతో ఏదో నిర్ణయం చెప్పాలని కాంగ్రెస్ పెద్దలు కోరగా ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్‌బై అన్నారు. అయితే కుమారస్వామి భేటీతో అంబరీష్ జేడీఎస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంబి కూడా జేడీఎస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
'నేనేం విసిరిపారేసే చెప్పును కాదు'
బెంగళూరు: తానేం తగిలించుకొని విసిరిపారేసే చెప్పులాంటివాడిని కాదని ప్రముఖ కన్నడ నటుడు, కాంగ్రెస్ పార్టీ నేత అంబరీష్ అన్నారు. తన పాపులారిటీ తనకు ఉందని అన్నారు. అంబరీష్ తో సహా 14మంది మంత్రులను తొలగించి కొత్తగా 13మందిని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కేబినెట్లోకి తీసుకున్న విషయం తెలిసిందే. మూడేళ్లుగా గృహనిర్మాణ శాఖ నిర్వహిస్తున్నా అందులో ఎలాంటి అభివృద్ధి చూపించలేకపోయారనే కారణంతో ఆయనను తొలగిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే, తనను మంత్రి పదవి నుంచి తప్పించడానికి నిరసనగా అంబరీష్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ లేఖ సరైన ఫార్మాట్లో లేదని తిరిగి పంపించాలని స్పీకర్ ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను తొలగిస్తున్న విషయం కూడా ముందుగా ముఖ్యమంత్రి చెప్పలేదని అన్నారు. తానేం తగిలించుకుని విసిరిపారేసే చెప్పును కాదని, తన పాపులారిటీ తనకు ఉందని అన్నారు. కాగా, ఇప్పటికే ఆయనకు మద్దతుగా మరోసారి కన్నడ చిత్ర పరిశ్రమ తమ గొంతు వినిపిస్తున్న విషయం తెలిసిందే. -
అంబరీష్ రాజీనామా చెల్లదు
బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, సినీ నటుడు అంబరీష్ ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి తిరస్కరించారు. మండ్యా అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానంటూ అంబరీష్ ఒకే లైన్‌తో పంపిన రాజీనామా లేఖ చెల్లదని స్పష్టం చేశారు. సరైన ఫార్మాట్‌తో రాజీనామా లేఖ పంపాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ ఆయనకు సూచించారు. కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో డిప్యూటీ స్పీకర్ శివశంకర్ రెడ్డి స్పీకర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనను కేబినెట్ నుంచి తొలగించినందుకు నిరసనగా అంబరీష్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సిద్ధరామయ్య.. అంబరీష్ సహా 14 మంది మంత్రులను తొలగించి, కొత్తగా 13 మందిని కేబినెట్లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక కాంగ్రెస్‌లో అసంతృప్తి భగ్గుమంది. అంబరీష్ బాటలో మరికొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముందని భావిస్తున్నారు. మంత్రివర్గం నుంచి అంబరీష్‌ను తొలగించినందుకు ఆయన మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. కొందరు సినీ ప్రముఖులు కూడా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ముక్కుసూటి మనస్తత్వంగలవారు, నిజాయితీవ్యక్తులు ఈ రోజుల్లో రాణించలేరంటూ అంబరీష్ భార్య, నటి సుమలత ట్వీట్ చేశారు. కాగా మంత్రి పదవి నుంచి అంబరీష్‌ను తొలగించడం సబబేనంటూ కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు.