
ఘనంగా సీనియర్ నటి సుమలత తనయుడి పెళ్లి

దివంగత నటుడు అంబరీష్, ప్రముఖ నటి సుమలతల తనయుడు అభిషేక్ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేశాడు. వేదమంత్రాల సాక్షిగా ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు. సోమవారం (జూన్ 5) బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది.

అభిషేక్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


అభిషేక్-అవివా కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమను అర్థం చేసుకున్న పెద్దలు పెళ్లికి పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలో గతేడాది డిసెంబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.


ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలతో పాటు వెంకయ్యనాయుడు వంటి ప్రముఖ రాజకీయ నేతలు సైతం హాజరయ్యారు.

ఈ ఫోటోల్లో రజనీకాంత్, యశ్‌లతో పాటు కిచ్చా సుదీప్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని నూతన వధూవరులను ఆశీర్వదించారు.


