‘బంజారా’లో తారల తళుకులు | 'Banjaralo stars talukulu | Sakshi
Sakshi News home page

‘బంజారా’లో తారల తళుకులు

Published Sun, Sep 14 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

‘బంజారా’లో తారల తళుకులు

‘బంజారా’లో తారల తళుకులు

  • ‘డివైన్ ఫెస్టివల్’ను ప్రారంభించిన అంబరీష్, రవిచంద్రన్, యష్
  • సాక్షి, బెంగళూరు : నగరంలోని ప్రముఖ బంజారా మెల్టింగ్ పాట్ రెస్టారెంట్‌లో శాండల్‌వుడ్ ప్రముఖ తారలు తళుక్కుమన్నారు. బంజారా మెల్టింట్ పాట్‌లో ‘డివైన్ ఫెస్టివల్’ పేరిట ఏర్పాటైన ఫుడ్ ఫెస్టివల్ ను నటులు అంబరీష్, రవిచంద్రన్, యష్‌లు శుక్రవారం రాత్రి నిర్వహించిన ఓ కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్‌లో ఏర్పాటైన విభిన్న ఆహారపదార్థాలను వీరు రుచి చూశారు.

    ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ప్రకాష్ శెట్టి మాట్లాడుతూ....నగర వాసులకు కోస్టల్, ఇండియన్, పాన్ ఏషియన్ రుచులను అందజేసేందుకు ఈ ఫుడ్ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఫిష్ రవా ఫ్రై, పనీర్ కే సికంజీ, చిల్లీ బేసిల్ మష్రూమ్, ముర్గ్ లాల్‌వారీ కబాబ్ తదితర ప్రత్యేక వంటకాలను ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ఆహర ప్రియుల కోసం అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈనెల 15 నుంచి 30 వరకు తమ రెస్టారెంట్‌లో ఈ ఫుడ్ ఫెస్టివల్ కొనసాగుతుందని ప్రకాష్ శెట్టి వెల్లడించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement