
కేజీఎఫ్ (K.G.F Movie)తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు యష్ (Yash). అభిమానులు ఈయనను వెండితెరపై చూసి మూడేళ్లవుతోంది. ప్రస్తుతం యష్.. టాక్సిక్: ఎ ఫేరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. అటు బాలీవుడ్‌లో రామాయణ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఇతడు బెంగళూరులో జరిగిన మనడ కదలు సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. యోగరాజ్ భట్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మార్చి 28న విడుదల కానుంది.
తలపొగరు అనుకున్నారు
ట్రైలర్ రిలీజ్ అనంతరం యష్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అందరూ నాకు పొగరు అనుకునేవారు. ఎందుకంటే దర్శకులను నేను స్క్రిప్ట్ కాపీ అడిగేవాడిని. కథ నచ్చకపోతే, దానిపై నాకు నమ్మకం కుదరకపోతే సినిమా ఎలా చేయగలను? ముందు దాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నాక సినిమా మొదలుపెడదాం అనుకునేవాడిని. అది కొందరికి నచ్చేది కాదు దీనివల్ల చాలా సినిమాలు కోల్పోయాను. అయితే మొగ్గిన మనసు సినిమా నిర్మాత నన్ను బలంగా నమ్మాడు. ఆయన వల్ల చివరి నిమిషంలో ఆ సినిమాలో జాయిన్ అయ్యాను.
ఆ సినిమాయూనిట్‌పై ఇప్పటికీ గౌరవం..
దర్శకుడు శశాంక్ కథ పూర్తిగా చెప్పడంతోపాటు నా పాత్ర గురించి కూడా వివరించాడు. ఇప్పటికీ ఆ ఇద్దరిపై, ఆ సినిమా యూనిట్ మొత్తంపై నాకు ఎనలేని గౌరవం ఉంది అని చెప్పుకొచ్చాడు. టాక్సిక్ గురించి అప్‌డేట్ అడగ్గా.. ఇది సందర్భం కాదని దాటవేశాడు. తమపై నమ్మకం ఉంచి ఓపిక పట్టమని కోరాడు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న టాక్సిక్ 2026 మార్చి 19న విడుదల కానుంది. ఇందులో నయనతార, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీ, తారా సుతారియా, అచ్యుత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
చదవండి: హీరో నితిన్‌పై హర్టయ్యా.. అవమానభారంతో షూటింగ్‌కు రానన్నా: అమృతం నటుడు
Comments
Please login to add a commentAdd a comment