కొత్త లుక్‌లో ఖుష్బూ.. ఇంజక్షన్స్‌ తీసుకుందని ట్రోలింగ్‌.. కౌంటరిచ్చిన నటి | Khushbu Sundar Slams Over His Troll On Her Bold Transformation, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Khushbu Sundar: నువ్వెంత చెండాలంగా ఉంటావో.. అందుకే ఇలా.. ఖుష్బూ కౌంటర్‌

Published Wed, Apr 16 2025 10:46 AM | Last Updated on Wed, Apr 16 2025 11:46 AM

Khushbu Sundar Hit Back Troll on Her Bold Transformation

పెరిగిన వయసును పైకి కనిపించకుండా దాచేయాలని చూస్తుంటారు సెలబ్రిటీలు. ఎప్పటికప్పుడు మరింత అందంగా, నిత్య యవ్వనంగా కనిపించాలనుకుంటారు. సీనియర్‌ హీరోయిన్‌ ఖుష్బూ (Khushbu Sundar) కూడా తానింకా పడుచుదాన్నే అంటోంది. కాస్త సన్నబడిపోయి, షిమ్మరీ డ్రెస్‌తో హెయిర్‌ లీవ్‌ చేసుకున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దీనికి బ్యాక్‌ టు ద ఫ్యూచర్‌ అని రాసుకొచ్చింది.

అంతా ఇంజక్షన్‌ మహిమ!
ఇది చూసిన అభిమానులు ఖుష్బూ కొత్త లుక్‌ అదిరిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంత సన్నగా ఎలా అయింది? అయినా ఎంత సన్నబడ్డా నీ ముఖంలో ముసలితనం ఛాయలు కనిపిస్తున్నాయంటూ సెటైర్లు వేస్తున్నారు. ఓ వ్యక్తి అయితే ఇంకా హద్దులు మీరుతూ.. ఇంజక్షన్‌ మహిమ వల్లే ఇలా సన్నగా అయిపోయారు. నువ్వేం ఇంజక్షన్‌ తీసుకున్నావో ఫాలోవర్లకు చెప్పొచ్చుగా! అప్పుడు వాళ్లు కూడా అదే వాడతారు అని విమర్శించాడు.

నువ్వో చెండాలం..
ఇది చూసిన ఖుష్బూకు ఒళ్లు మండిపోయింది. మీలాంటివాళ్ల బాధేంటో నాకర్థం కాదు. మీరు సోషల్‌ మీడియాలో కనీసం ముఖాలు కూడా చూపించరు. ఎందుకంటే మీరు ఎంత చెండాలంగా ఉంటారో మీకు తెలుసు కాబట్టి! పాపం, మీ తల్లిదండ్రుల గురించి తలుచుకుంటేనే జాలేస్తోంది అని ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఘాటుగా రియాక్ట్‌ అయింది. తమిళ, తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసిన ఖుష్బూ.. చివరగా వనవాస్‌ మూవీలో కనిపించింది. ప్రస్తుతం తమిళంలో ఓ సీరియల్‌ చేస్తోంది. అలాగే ఓ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

 

 

 

 

చదవండి: ఫేట్ మార్చిన సినిమా.. ఇన్నాళ్లకు మళ్లీ గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement