తమిళనాడు రాష్ట్ర బీజేపీ వర్గాలు తనను దూరం పెట్టాయని మహిళా నేత, సినీ నటి ఖుష్బూ సుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆవేదనను ఓ తమిళ మీడియాతో ఆమె పంచుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. సినీ రంగంలో ఖుష్బూకు ఉన్న అభిమానం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమెకు గుడి కట్టిన అభిమానులు ఉన్నారు. రాజకీయంగా తన ప్రయాణాన్ని డీఎంకేతో ఆమె శ్రీకారం చుట్టారు. అయితే అక్కడ ఇమడ లేక కాంగ్రెస్‌లో చేరారు. చివరకు బీజేపీలో చేరి రాజకీయ ప్రయాణం సాగిస్తున్నా ఆశించిన మేరకు ఆమెకు గుర్తింపు అన్నది దక్కడం లేదని అభిమానులు పేర్కొంటూ వచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఓ నియోజకవర్గం సీటు ఆశించగా, మరో నియోజకవర్గాన్ని బీజేపీ పెద్దలు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికలలో సీటును ఆశించగా నిరాశ తప్పలేదు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి పదవిలో కొంత కాలం పనిచేసినా పూర్తి స్థాయిలో ఆమెకు న్యాయం అన్నది బీజేపీలో దక్కలేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేసేవారు.
ఈ పరిస్థితులలో తన ఆవేదనను ఆమె ఓ తమిళ మీడియాతో పంచుకున్నారు. తనను రాష్ట్ర బీజేపీ నేతలు దూరం పెట్టి ఉన్నారని, తనను పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, సమాచారం కూడా లేదంటూ ఆమె వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ విషయంగా బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను ప్రశ్నించగా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానాలు అన్నది తాను ఎవ్వరికీ ఇవ్వనని, ఈ వ్యవహారాలను పార్టీ నేత కేశవ వినాయగం చూసుకుంటారని, ఖుష్బూ ఆరోపణల గురించి తనకు తెలియదంటూ దాట వేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment