Khushbu sundar
-
ఆ హీరో ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా మందు తాగాడు: ఖుష్బూ
నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) స్నేహితుల్లో రాజీవ్ కపూర్ ఒకరు. ఈయన హీరో మాత్రమే కాదు దర్శకుడు, నిర్మాత కూడా! తండ్రి రాజ్ కపూర్ 1985లో చివరిసారి దర్శకత్వం వహించిన రామ్ తేరీ గంగ మైలి సినిమా (Ram Teri Ganga Maili Movie)లో ఇతడు హీరోగా నటించాడు. ఈ చిత్రంలో హీరోయిన్గా ఖుష్బూ నటించాల్సింది. తనతో ఫోటోషూట్ కూడా చేశారు. కానీ చివరకు ఆమెను ఎంపిక చేయలేదు.భయపడినట్లే జరిగిందిదాని గురించి ఖుష్బూ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజ్‌కపూర్ (Raj Kapoor) మొదట నన్నే గంగ పాత్రలో ఊహించుకున్నారు. అప్పుడు నా వయసు పద్నాలుగేళ్లు. నేనే చిన్నపిల్లలా ఉన్నాను. అలాంటిది ఓ పాపను ఎత్తుకుని యాక్ట్ చేస్తే బాగోదని వద్దన్నారు అని చెప్పుకొచ్చింది. రాజీవ్ కపూర్ (Rajiv Kapoor) గురించి మాట్లాడుతూ.. తనకు హృదయ సమస్య ఉంది. అయినా పట్టించుకోకుండా ఎప్పుడూ మందు తాగుతూ ఉండేవాడు. ఇది ఏదో ఒక రోజు పెద్ద సమస్యకు దారి తీస్తుందని మేము భయపడ్డాం. తనతో ఎలాగైనా మద్యపానం మాన్పించాలని ప్రయత్నించాం, కానీ మా వల్ల కాలేదు. తర్వాత చాలా డల్ అయిపోయాడు.ఎన్ని సర్జరీలు చేసినా..ఆయన మోకాలికి ఏదో సమస్య వచ్చినప్పుడు పలు సర్జరీలు చేశారు. కానీ నయం కాలేదు. చింపు (రాజీవ్) ఆరోగ్యం క్షీణిస్తోందని మాకు తెలుసు. తను చనిపోయినప్పుడు నేను ముంబైలో ఉన్నాను. బోనీ కపూర్ ఫోన్ చేసి విషయం చెప్పగానే షాకయ్యాను. తను చనిపోవడానికి ముందు రోజే మాట్లాడాను. విపరీతమైన జ్వరం ఉంది. అయినా తన అలవాట్లు మార్చుకోలేదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. త్వరలోనే కలుస్తానని మాటిచ్చాడు. అంతలోనే ఈ విషాదం జరిగింది అని ఖుష్బూ చెప్పుకొచ్చింది. కాగా రాజీవ్ కపూర్ 2021 ఫిబ్రవరిలో గుండెపోటుతో మరణించాడు.చదవండి: 15 ఏళ్ల ప్రేమ.. నేను అడగడం వల్లే.. కీర్తి సురేశ్ లవ్ స్టోరీ -
ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు.. పెదవి విప్పండి: ఖుష్బూ
రంగుల వెండితెర వెనక దాగి ఉన్న రాక్షస చర్యలు ఎన్నో అంటూ హేమ కమిటీ మలయాళ ఇండస్ట్రీలో ఆర్టిస్టుల అవస్థలను బయటపెట్టింది. పేరున్న పెద్దలు, పెత్తనం వహించిన తారల చేతిలో ఆర్టిస్టుల బతుకులు చితికిపోతున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం తమకు జరిగిన అన్యాయాలను నిర్భయంగా గొంతు విప్పి చెప్తున్నారు. తప్పు చేసినవారు దర్జాగా తిరుగుతుంటే బాధిత మహిళ మాత్రం ఎందుకు నరకయాతన అనుభవించాలంటోంది నటి ఖుష్బూ సుందర్.ఆడవారికే ఎక్కువ వేధింపులుఈ మేరకు ఎక్స్ (ట్విటర్) వేదికగా ఖుష్బూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. ఆడవారిని దూషించడం, వేధించడం, ఛాన్సులు కావాలంటే కాంప్రమైజ్ అయిపోమని కోరడం.. ఇలాంటివి ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నాయి. పురుషులకన్నా మహిళలకే ఇలాంటి పరిస్థితులు ఎక్కువగా ఎదురవుతున్నాయి. వారే ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. ఈ వేధింపులను అరికట్టాల్సిన బాధ్యత హేమకమిటీపై ఎంతైనా ఉంది. భయపడకండిఅమ్మాయిలూ.. మీరు అనుభవిస్తున్న బాధ గురించి మాట్లాడండి, అప్పుడే దానిపై చర్యలు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. దీనివల్ల పరువు పోతుందనో, నిందలు వేస్తారనో ఆలోచించకండి. నిజంగా వేధింపులకు గురైతే ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉంది? అంటారేమో! అప్పటి తన పరిస్థితి ఎలా ఉందో మనం ఊహించలేం కదా.. నా కన్నతండ్రి నన్ను లైంగికంగా వేధించాడని గతేడాది బయటపెట్టాను. ఆడదానికే పుడతారుఈ విషయం చెప్పడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని చాలామంది అడిగారు. నిజమే! ముందు చెప్పాల్సిందే. కాకపోతే అది నా కెరీర్ కోసం కాంప్రమైజ్ అయిన వ్యవహారం కాదు. నేను కింద పడినప్పుడు నన్ను పట్టుకోవాల్సిన చేతులు... నేను జారిపోతున్నపుడు నిలబెట్టాల్సిన చేతులే నన్ను ఇబ్బంది పెట్టాయి. రక్షించాల్సిన వ్యక్తి చేతుల్లోనే వేదనకు గురయ్యాను. మగవాళ్లందరికీ ఒకటే చెప్తున్నా.. బాధితులవైపు నిలబడండి, వారికి మద్దతివ్వండి. ప్రతి పురుషుడు ఒక ఆడదానికే పుడతాడు. అమ్మ, అక్క, చెల్లి, టీచర్, ఆంటీ, ఫ్రెండ్స్.. ఇలా ఎంతోమంది ఆడవారి వల్లే మీరిప్పుడు ఈ స్థాయిలో ఉన్నారు.ప్రారంభంలోనే ఆశలు ఛిద్రంమాతో నిలబడండి. మమ్మల్ని రక్షించండి. మీకు జన్మనిచ్చినవారిని, ప్రేమను పంచినవారిని గౌరవించండి. మహిళలపై జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తి పోరాడండి. మనం కలిసి పనిచేస్తేనే బలంగా ముందడుగు వేయగలం. కుటుంబం అండ లేని ఆడవాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎన్నో ఆశలతో పల్లెటూరు నుంచి వస్తే ఆదిలోనే వారి కలలు ఛిద్రమైపోయినవారూ ఉన్నారు.తలవంచాల్సిన అవసరం లేదుఇకనైనా ఆడవారిని దోచుకోవడం ఆగిపోవాలి. ఒక్కసారి నో అన్నాక ఎవరికీ తలవంచాల్సిన అవసరమే లేదు. మిమ్మల్ని తాకట్టుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఎంతోమంది స్త్రీలకు.. ఒక తల్లిగా, మహిళగా నేను అండగా నిలబడతాను' అని రాసుకొచ్చింది. కాగా ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఖుష్బూ గతేడాది షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. 💔 This moment of #MeToo prevailing in our industry breaks you. Kudos to the women who have stood their ground and emerged victorious. ✊ The #HemaCommittee was much needed to break the abuse. But will it?Abuse, asking for sexual favors, and expecting women to compromise to…— KhushbuSundar (@khushsundar) August 28, 2024చదవండి: సీరియల్ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. సీసీటీవీ వీడియో -
యానిమల్ మూవీ చూడొద్దని పిల్లలే వార్నింగ్ ఇచ్చారు: ఖుష్బూ
యానిమల్ మూవీ.. ఎన్నో విమర్శలు, వివాదాలు.. అయితేనేం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్.. కళ్లు చెదిరే కలెక్షన్స్.. బ్రహ్మరథం పట్టిన జనాలు.. ఇది సరపోదా చిత్రయూనిట్ సంబరాలు చేసుకోవడానికి! ఈ మధ్యే ఈ సినిమాకు, అందులో నటించినవాళ్లకు అవార్డులు కూడా వచ్చాయి. ఇంత పేరు గడించిన యానిమల్ మూవీని తానింతవరకూ చూడలేదంటోంది సీనియర్ నటి ఖుష్బూ. కబీర్ సింగే సమస్య అనుకుంటే యానిమల్.. ఓ వేదికపై ఖుష్బూ మాట్లాడుతూ.. నాకు యానిమల్ తరహా సినిమాలు నచ్చవు. అందుకే ఇంతవరకు ఈ సినిమా చూడలేదు. అయినా ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాస్తున్నాయంటే జనాల మైండ్‌సెట్ ఎలా ఉందో ఆలోచించాలి. ఇంతకు ముందు వచ్చిన కబీర్ సింగ్ (అర్జున్ రెడ్డి) మూవీ కూడా ఒక సమస్యగానే ఫీలయ్యాం. నేను డైరెక్టర్‌ను తప్పుపట్టడం లేదు. ఎందుకంటే అతడు ఈ సినిమాలతో సక్సెస్ చూశాడు. యువత.. చదువుకున్నవాళ్లు ఇలాంటి సినిమాలను ఎంజాయ్ చేస్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సమాజం ఎటు పోతోందో.. మాకు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పేవాళ్లను చూస్తుంటే అసలు మీ మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి? అని అనుకునేదాన్ని. నా పిల్లలు ఈ సినిమా చూసి వచ్చాక నేను చూడొద్దని హెచ్చరించారు. జనాలు ఎందుకిలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు? సమాజం ఎటు పోతోంది? ఈ సొసైటీలో మార్పు రావాలి? అని అదేపనిగా ఆలోచిస్తూ బాధపడతానని నన్ను యానిమల్ చూడొద్దన్నారు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ 'అరణ్మయి 4' సినిమాలో నటిస్తోంది. చదవండి: 'తనకేవేవో కలలు.. నేనేమో.. కనెక్షన్ మిస్ అవుతోంది.. ' భార్యతో విడిపోయిన నటుడు -
టీడీపీ నేత బండారుపై ఖుష్బూ ఆగ్రహం
సాక్షి, చెన్నై: టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై సినీ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాను ఉద్దేశించి బండారు చేసిన వ్యాఖ్యలు దారుణమని, తన జుగుప్సాకరమైన వ్యాఖ్యలతో ఒక మనిషిగా కూడా ఆయన విఫలమయ్యారని మండిపడ్డారామె. రోజాపై బండారు వ్యాఖ్యలు దారుణం. మహిళలను దూషించడం బండారు తన జన్మ హక్కు అనుకుంటున్నారా?. ఓ మహిళ మంత్రిపై బండారు వ్యాఖ్యలు దిగజారుడు తనానికి నిదర్శనం. మహిళలను గౌరవించేవారు ఎవరూ బండారులా మాట్లాడరు. బండారు ఒక సగటు మనిషిగా కూడా విఫలమయ్యారు అని అన్నారామె. ఈ విషయంలో మంత్రి రోజా నా మద్దతు ప్రకటిస్తున్నా. బండారు తక్షణమే రోజాకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. బండారు క్షమాపణలు చెప్పే దాకా సాగే పోరాటంలో తాను కలుస్తానని చెప్పారామె. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు(నారీ శక్తి వందన్ అధినియం బిల్లు) ప్రధాని మోదీ తెచ్చారని, మహిళ సాధికారత కోసం చర్చ జరుగుతున్న సమయంలో బండారు లాంటి వాళ్లు మహిళా నేతలను ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడతారా..? అని కుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. -
MS Dhoni: ధోనిని ముద్దాడి మురిసిపోయిన ‘అత్తయ్య’.. ఖుష్బూ ట్వీట్ వైరల్
MS Dhoni Met Khushbu Mother in Law: మహేంద్ర సింగ్ ధోని.. అభిమానులను ఖుషీ చేయడంలో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాడు. అందుకే తొమ్మిదేళ్ల వయసు పిల్లల నుంచి తొంభై ఏళ్ల వృద్ధుల వరకు ధోని ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. అలా కేవలం ఆటలోనే కాదు మనసులను గెలవడంలోనూ తాను రారాజే అనిపించుకుంటున్నాడు మిస్టర్ కూల్. తాజాగా ఈ విషయాన్ని తలైవా మరోసారి నిరూపించాడంటున్నారు సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్. టీమిండియా కెప్టెన్‌గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా తమిళ ప్రజల మనసు దోచుకుంటున్నాడు. 88 ఏళ్ల వీరాభిమాని తలా అంటూ ముద్దుగా పిలుచుకునే ధోనికి ఉన్న అభిమానగణంలో ఖుష్బూ వాళ్ల అత్తయ్య కూడా ఒకరు. ఆమె ధోనికి వీరాభిమాని. ఒక్కసారైనా ‘తలా’ను చూడాలని ఆమె తపించిపోయేవారట. మరి అభిమానులంటే ప్రాణమిచ్చే ధోని.. వారి కోరికను నెరవేర్చకుండా ఉంటాడా?! అందుకే తన ‘సీనియర్ మోస్ట్ ఫ్యాన్’ను కలిసేందుకు స్వయంగా తనే చొరవ తీసుకున్నాడు. ఆమెను ఆత్మీయంగా పలకరించి.. కాసేపు సమయాన్ని గడిపాడు. ధోనిని చూసి మురిసిపోయిన ఆ పెద్దావిడ.. తనను ముద్దాడి ఆశీర్వాదాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఖుష్బూ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. నిజమైన హీరోలు.. ‘‘హీరోలను ఎవరూ తయారు చేయరు.. వాళ్లు పుట్టుకతోనే అలా ఉంటారంతే! ఈ విషయాన్ని ధోని నిరూపిస్తూనే ఉన్నాడు. మా సీఎస్కే సారథి.. తలా ఎంఎస్ ధోని పంచిన ఆత్మీయత, ఇచ్చిన ఆతిథ్యాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. మా అత్తమ్మ 88 ఏళ్ల వయసులో తలాను కలవగలిగారు. ధోని అంటే ఆమెకు ప్రాణం. మహీ.. నీ ఆత్మీయ పలకరింపుతో ఆమె మరికొన్నేళ్ల పాటు మరింత ఆరోగ్యంగా.. సంతోషంగా ఉండగలుగుతారు’’ అని ఖుష్బూ భావోద్వేగ నోట్ షేర్ చేశారు. తన అత్తయ్యను కలిసినందుకు ధోనికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎస్కే విజయవంతమైన సారథిగా చెన్నైని నాలుగుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఘనత ధోనిది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా మహీ భాయ్ కొనసాగుతున్నాడు. ఇక ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే రెండింట గెలిచి పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో ఉంది. ఏప్రిల్ 17న బెంగళూరులో ఆర్సీబీతో తమ తదుపరి మ్యాచ్‌లో చెన్నై తలపడనుంది. చదవండి: షారుక్ ఖాన్.. పంజాబ్ కింగ్స్‌కు దొరికిన వరం గంగూలీవైపు కోపంగా.. కనీసం షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు! Heroes are not made, they are born. Dhoni proves that. I am at loss for words for our CSK #Thala @msdhoni at his warmth & hospitality. He met my ma in law, who at 88, hero worships Dhoni & cannot see beyond him. Mahi, you have added many years of good health & happiness to her… pic.twitter.com/darszdzb62 — KhushbuSundar (@khushsundar) April 14, 2023 -
MS Dhoni : ఖుష్బూ ఇంట్లో ధోనీ సందడి.. అత్తయ్య సర్ప్రైజ్! (ఫొటోలు)
-
ప్రాణంగా ప్రేమించుకున్న ప్రభు, ఖుష్బూలు విడిపోవడానికి కారణమిదే: నటి
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది ఖుష్బూ. బాలనటిగా ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించిన ఆమె ఆ తర్వాత టాప్ హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. 1988లో ధార్మతిన్ తలైవా సినిమాలో బాలనటిగా యాక్ట్ చేసిన ఆమె ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేసింది. 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది ఖుష్బూ. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో తనతో జోడీ కట్టిన ప్రభుతో ఆమె ప్రేమలో ఉందంటూ జోరుగా ప్రచారం నడిచింది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ 1993 సెప్టెంబర్ 12న వీరి పెళ్లి జరిగింది. పోయిస్ గార్డెన్లో వీరు కొనుక్కున్న ఇంట్లోనే ఈ వివాహం జరిగింది. కానీ ఇదివరకే ప్రభుకు పెళ్లైంది. దీంతో వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్ సహా అతడి కుటుంబం అంగీకరించలేదు. ఎన్నో గొడవల మధ్య పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ.. ఇద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే పెళ్లికి ముందే తనతో నాలుగున్నరేళ్లు సహజీవనం చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రభుకు దూరమవడం ఖుష్బూను మానసికంగా కుంగదీసింది. ఈ వేదన నుంచి బయటపడ్డ అనంతరం ఖుష్బూ 2000 సంవత్సరంలో దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. భర్త పేరును తన పేరు చివరన జోడించింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. ఇకపోతే ప్రభు, ఖుష్బూల బంధంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి కాకినాడ శ్యామల. 'ఖుష్బూ చాలా మంచి అమ్మాయి. ఖుష్బూ, ప్రభు ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వీరి ప్రేమను ప్రభు భార్య అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారికి గొడవలయ్యాయి. అందుకే ఈ గొడవలన్నీ వద్దని తెగదెంపులు చేసుకున్నారు' అని చెప్పుకొచ్చింది. -
ఆస్పత్రిపాలైన ఖుష్బూ, దుష్ప్రభావం చూపించిందంటూ పోస్ట్
సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్. సినిమాల్లో అగ్రతారగా వెలుగొందిన ఆమె తాజాగా అస్వస్థతకు లోనవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరింది. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, నీరసంతో ఆస్పత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో వెల్లడించింది ఖుష్బూ. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేసింది. 'ఫ్లూ చాలా చెడ్డది. ఇది నాపై దుష్ప్రభావం చూపింది. అధిక జ్వరం, తీవ్రమైన ఒంటినొప్పులు, బలహీనతతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అడెనో వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దు. అనారోగ్యానికి గురైనట్లు ఏమాత్రం లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే అప్రమత్తమై మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి' అని ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై కీర్తి సురేశ్, రాశీఖన్నా, నిక్కీగల్రానీ, శ్రియ, శ్రీదేవి విజయ్‌కుమార్ సహా పలువురు తారలు, నెటిజన్లు స్పందిస్తూ.. త్వరగా కోలుకోండి మేడమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) Like I was saying, the flu is bad. It has taken its toll on me. Admitted for very high fever, killing body ache and weakness. Fortunately, in good hands at @Apollohyderabad Pls do not ignore signs when your body says slow down. On the road to recovery, but long way to go. pic.twitter.com/FtwnS74pko — KhushbuSundar (@khushsundar) April 7, 2023 -
ట్వీట్ దుమారంపై స్పందించిన ఖుష్బు! మరిన్ని తీయండి అంటూ కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహల్‌పై పడిన లోక్‌సభ అనర్హత వేటు విషయమై బీజేపీ నాయకురాలు, నటి ఖుష్బు సుందర్ పాత ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఖుష్బు.. తన పాత ట్వీట్‌ని తొలగించేదే లేదని కరాఖండీగా చెప్పారు. అంతేగాదు ఇలాంటి ట్వీట్లు చాలా ఉన్నాయి. వాటిని కూడా బయటకు తీయండి. ఏ పని లేని కాంగ్రెస్‌కి కనీసం ఇలాగైనా తన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని గట్టి కౌంటర్ ఇచ్చారు. అయినా మీరు గాంధీతో సమానంగా నిలబెట్టినందుకు కాంగ్రెస్‌కి కృతజ్ఞతలు. జాతీయ నాయకుడిగా చెప్పుకునే ఆయనతో సమానంగా ఉండేందుకు తగిన పేరు, గౌరవం సంపాదించడం నాకు చాలా ఇష్టం. అలాగే అవినీతి, దొంగలు అనే పదానికి చాలా తేడా ఉంది. అది కేవలం పార్టీ నాయకత్వాన్ని అనుసరించిన చేసిన ట్వీట్ అని సమర్థించుకున్నారు. ఇదిలా ఉండగా, ఖుష్బు కాంగ్రెస్ పార్టీలో ఉండగా చేసిన ట్వీట్లో..మోదీ అంటే అవినీతి అని మారుద్ధాం, ఇదే సరైన పోలీక అంటూ ట్వీట్ చేశారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు కారణాంగా జైలు శిక్ష పడి, అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఖుష్బు చేసిన పాత ట్వీట్‌ని షేర్ చేసింది. నాడు ఆమె కూడా మోదీని అవినీతి అంటూ రాసుకొచ్చారు కాబట్టి ఆమెపై కూడా కేసు వేస్తారా అని పూర్ణేశ్ మోదీని ప్రశ్నిస్తూ బీజేపీకి కౌంటరిచ్చింది కాంగ్రెస్. I will not delete my tweet. It’s out there. There are many more. Pls use your time, as CONgress is absolutely jobless, to dig out a few more. BTW I like to see how the CONgress is putting me and @RahulGandhi on the same platform. I like the fact that I have earned enough name n… — KhushbuSundar (@khushsundar) March 25, 2023 (చదవండి: రాహుల్ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్!) -
ఖుష్బు కూడా ఇలానే చేసిందా? నాటి ట్వీట్ దుమారం!
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ పేరుపై చేసిన వ్యాఖ్యలకు గాను ప్రధాని మోదీ సొంతం రాష్ట్రంలో రాహుల్‌పై పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో రాహుల్‌ని దోషిగా తేల్చుతూ సూరత్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్ శుక్రవారం పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయి అనర్హత వేటుకు గురయ్యారు కూడా. ఇది దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారడమే గాక విపక్షాలన్నీ మూకుమ్మడిగా దీన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సమయంలో నాడు బీజేపీ సభ్యురాలు, నటి ఖుష్బు మోదీ ఇంటి పేరుపై చేసిన ట్వీట్ తెరపైకి వచ్చింది. ఆ ట్వీట్లో ఖుష్బు సుందర్ మోదీ ఇంటి పేరు గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పైగా మోదీ ప్రతిచోటా ఉన్నాడని, మోదీ ఇంటిపేరుతోనే అవినీతి ముడి పడి ఉందని.. రాహుల్ మాదిరిగానే నాడు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు ఖుష్బు సుందర్ కాంగ్రెస్ సభ్యురాలిగా ఉన్న సమయంలో చేసిన ట్వీట్ ఇది. ఈ క్రమంలో కాంగ్రెస్ మద్దతుదారులు రాహుల్‌పై కేసు పెట్టిన గుజరాత్ మంత్రి పూర్ణేష్ మోదీని ఇప్పుడూ ఖుష్బు సుందర్‌పై కూడా కేసు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పైగా ఆమె చేసిన ట్వీట్ల స్కీన్‌షాట్‌ను జోడించి మరీ ట్విట్టర్ వేదికగా ఆయన్ను నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాగా, ఖుష్బు సుందర్ 2020లో కాంగ్రెస్‌ని వీడి బీజేపీలో చేరారు, ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు. దీనిపై ఖుష్బు స్పందిస్తూ.."కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడూ చేసిన పోస్ట్ ఇది. అందుకు సిగ్గుపడటం లేదు. అప్పుడూ తాను ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి తన నాయకుడి అనుసరించి చేసిన పోస్ట్ అంటూ సమర్థించుకునే యత్నం చేసింది." ఖుష్బు సుందర్. Yahan #Modi wahan #Modi jahan dekho #Modi..lekin yeh kya?? Har #Modi ke aage #bhrashtachaar surname laga hua hai..toh baat ko no samjho..#Modi mutlab #bhrashtachaar..let's change the meaning of #Modi to corruption..suits better..#Nirav #Lalit #Namo = corruption..👌👌😊😊 — KhushbuSundar (@khushsundar) February 15, 2018 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
ఆ విషయం చెప్పినందుకు సిగ్గుపడటం లేదు: ఖుష్భూ
సొంత తండ్రే తనను లైంగికంగా వేధించారని బయటి ప్రపంచానికి చెప్పినందుకు తానేమి సిగ్గు పడటం లేదని నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ అన్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని మాత్రమే చెప్పానంటూ తన మాటలను సమర్థించుకున్నారు. ‘నాకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా అందరికి తెలియజేశాను. అందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఈ విషయాన్ని చెప్పినందుకు సిగ్గుపడటం లేదు. నాకు జరిగిన దారుణాన్ని చెప్పడానికి ఇంత సమయం తీసుకున్నాను. అదేవిధంగా ప్రతి మహిళ తమకు ఎదురైన వేధింపులను వెల్లడించి.. ధైర్యంగా ముందుకు సాగాలి. ఏది ఏమైనా మన ప్రయాణాన్ని కొనసాగించాలి. మిమ్మల్ని కించపరిచే వాటిని ప్రోత్సహించకుండా ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి’అని ఖుష్బూ చెప్పుకొచ్చారు. కాగా, అంతర్జాతీయ మహిళాదినోత్సవ వేడుకల్లో భాగంగా ఇటీవల ఝార్ఖండ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ‘మా నాన్న వల్ల అమ్మ జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంది. అమ్మను, నన్ను కొట్టేవాడు .నాకు 8 ఏళ్లప్పుడే లైంగికంగా వేధించాడు. 15 ఏళ్ల వయస్సులో ఆయన్ను ఎదిరించే ధైర్యం వచ్చింది. ఆపైన ఉన్నవన్నీ తీసేసుకుని మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు’ అని గుర్తు చేసుక్నున్నారు. -
నా కన్నతండ్రే లైంగికంగా వేధించాడు.. ఖుష్బూ షాకింగ్ కామెంట్స్
నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై రియాక్ట్ అయిన ఆమె చిన్నతనంలో తాను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. 'చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురైతే, అది వాళ్లఅది వాళ్లను జీవితాంతం భయానికి గురి చేస్తుంది. నా కన్నతండ్రే నాపై వేధింపులకు పాల్పడ్డాడు. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు. నాపై జరుగుతున్న ఈ ఆకృత్యాలను బయటపెట్టేందుకు ధైర్యం ఉండేది కాదు. ఈ విషయాన్ని బయటపెడదామంటే మా అమ్మ నమ్మదేమో అని బాధపడేదాన్ని. ఎందుకంటే ఆమె భర్తే ప్రత్యేక దైవం అన్నట్లు ఉండేది. కానీ నాకు పదిహేనేళ్లు వచ్చాక ఆ బాధను భరించలేక తండ్రిని ఎదిరించాను. దీంతో ఆయన కుటుంబాన్ని వదిలి పారిపోయాడు. అప్పుడు మేం తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ ధైర్యం కూడగట్టుకొని జీవితంలో పోరాడటం నేర్చుకున్నాను' అంటూ ఖుష్భూ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. -
నటి ఖుష్బూకు చిరంజీవి శుభాకాంక్షలు
ప్రముఖ నటి, బిజెపి నేత ఖుష్బూకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎంపికైన తనపై ఈ సందర్భంగా చిరు ప్రశంసలు కురిపించారు. కాగా నటి ఖుష్బూను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కేంద్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ట్విటర్ వేదికగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: భర్త కోసం నయన్ వ్యూహం.. ఆ డైరెక్టర్‌కి హ్యాండ్ ఇచ్చిన విజయ్ సేతుపతి? ‘మహిళలు, చిన్నారులపై వేధింపుల నివారణతో పాటు వారి ఆత్మగౌవరం కోసం పోరాడుతున్న నాకు అతివల మద్దతుగా గళం విప్పేందుకు అవకాశం ఇచ్చిన ప్రధాని మోదీ, కేంద్రప్రభుత్వానికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌పై చిరంజీవి స్పందిస్తూ ఖచ్చితంగా మీరు ఈ పదవికి అర్హురాలు అని పేర్కొన్నారు. చదవండి: ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చిన రణ్‌బీర్ కపూర్ ‘జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులైన కుష్బూకు నా శుభాకాంక్షలు. మీరు ఖచ్చితంగా ఈ పదవికి అర్హులు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా మహిళలకు సంబంధించిన అన్ని సమస్యలపై మరింత దృష్టి సారిస్తూ, సమర్థవంతమైన పరిష్కారాన్ని అందిస్తారని ఆశిస్తున్నా. మహిళా సమస్యలపై పోరాడుతున్న మీ గొంతుక మరింత శక్తివంతంగా మారుతుంది’ అంటూ ఆమెను చిరు ప్రశంసించారు. Very happy for you @khushsundar ! You most certainly deserve this position. Trust your presence as a member in the @NCWIndia will ensure greater focus on & more efficient redressal of all relevant issues pertaining to women & empower their voice even more.Wishing you the Best! https://t.co/zHT7HILsZz — Chiranjeevi Konidela (@KChiruTweets) February 27, 2023 -
సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం
సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటారు. ఇటీవల తన కాలుకి గాయమైందని.. అయినా తన ప్రయాణం ఆగదంటూ ట్విట్టర్లో పేర్కొన్న విషయం తెలిసిందే. అన్నట్టుగానే మంగళవారం ఉదయం కుష్బూ వేరే రాష్ట్రానికి వెళ్లడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఎయిర్ ఇండియా సంస్థపై ఆమె ఫైర్ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న కుష్బూ గాయమైన కాలితోనే మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. చదవండి: వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దే ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్ తల్లి అయితే అక్కడ ఆమెకు వీల్‌చైర్ అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. అందులో ఎయిర్ ఇండియా సంస్థకు వీల్‌చైర్ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ప్రశ్నించారు. అందు కోసం తాను అరగంట పాటు కాలి నొప్పితో ఎదురుచూశానన్నారు. ఆ తర్వాత వేరే విమాన సంస్థ నుంచి వీల్‌చైర్ తీసుకొచ్చి తనను పంపించారన్నారు. కాగా ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా విమాన సంస్థ నిర్వాహకులు నటి కుష్బూకు క్షమాపణ తెలుపుతూ ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామం, ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తా’’మని పేర్కొన్నారు. Dear @airindiain you do not have basic wheelchair to take a passenger with a knee injury. I had to wait for 30mnts at chennai airport with braces for my ligament tear before they could get a wheelchair borrowed from another airline to take me in. I am sure you can do better. — KhushbuSundar (@khushsundar) January 31, 2023 -
షాక్‌లో తమిళ ప్రేక్షకులు.. ‘వారిసు నుంచి ఆమెను తొలగించారా?’
తమిళ స్టార్ హీరో విజయ్, రష్మిక మందన్నా జంటగా నటించిన లేటెస్ట్ మూవీ వారిసు(తెలుగులో వారసుడు). జనవరి 11న విడుదల కావాల్సిన ఈ మూవీలో తెలుగులో వాయిదా పడిన సంగతి తెలిసిందే. థియేటర్ల ఇష్యూ కారణంగా ఇక్కడ వాయిదా పడగా.. తమిళంలో మాత్రం అదే తేదీకి విడుదలైంది. బుధవారం ఈ చిత్రం తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి షో నుంచి వారిసు మంచి హిట్‌టాక్‌ను సొంతంగా చేసుకుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ విజయ్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: బాలకృష్ణ వీర సింహారెడ్డి ఓటీటీ పార్ట్నర్ ఇదే? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..! అయితే ఈ సినిమాలో ఆడియన్స్‌కు ఓ ఊహించని ఎలిమెంట్ ఒకటి షాకించిందట. దీంతో ఈ విషయంలో ఆడియన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ముందుగా వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రముఖ నటి ఖుష్భు సుందర్ కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాదు షూటింగ్ స్పాట్లో మూవీ టీంతో కలిసి దిగిన ఫొటోలను ఖుష్భు తన సోషల్ మీడియలో షేర్ చేసింది కూడా. సెట్లో విజయ్, రష్మిక, ఖష్బు స్టిల్స్ కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే సినిమాలో మాత్రం ఖుష్బు ఎక్కడ కనిపించలేదట. దీంతో సినిమాలో ఆమె పాత్ర ఎక్కడ కనిపించకపోవడం తమిళ ప్రేక్షకులు సర్ప్రైజ్ అయ్యారని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. చదవండి: రాహుల్‌కు కంగ్రాట్స్ చెప్పిన అషురెడ్డి, మరోసారి తెరపైకి ఎఫైర్ రూమర్స్ సినిమా చూసి బయటకు వచ్చాక ఖుష్బు సినిమాలో ఎక్కడ కనిపించలేదని, ఆమె సన్నివేశాలను ఎందుకు తొలగించారు? అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు మూవీ టీంని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఈ మూవీ నుంచి వైరల్ అయిన ఆమె స్టిల్స్, వారిసు టీంతో కలిసి ఆమె షేర్ చేసిన పలు పోస్ట్‌లను షేర్ చేస్తున్నారు. దీంతో ఖుష్బు సీన్లను ఎందుకు తొలగించారన్నది మాత్రం ప్రస్తుతం సస్పెన్స్ నెలకొంది. వారిసు నుంచి ఆమెను తొలగించారా? ఎందుకు ఆమె సీన్లను తొలగించాల్సి వచ్చింది! అసలేం జరిగిందనేది ఆసక్తిని సంతరించుకుంది. అయితే వీటన్నింటికి సమాధానం రావాలంటే మూవీ టీం నుంచి క్లారిటీ ఇచ్చేవరకు వేచి చూడాలి. Extremely happy to be part of this family. ( Was waiting for the official news from the production before me saying anything about it. ) @actorvijay @directorvamshi #DilRaju #Varisu #Varisudu #Vijay66 pic.twitter.com/BcfuWgFTDq — KhushbuSundar (@khushsundar) October 26, 2022 🤔 khushbu character is not in #Varisu Is they deleted the scene or changed the mother character to Jayasudha @directorvamshi pic.twitter.com/mI0I4GPr6J — 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 (@NameIsShreyash) January 11, 2023 Khushboo didi enga daa kanum???#Varisu#VarisuBlockbuster — Nambi (@NambiThalapathy) January 11, 2023 Hi Friends. Enaku oru doubt.#Varisu movie la Khushboo erukanganu sonnagale. 🤔🤔🤔#BlockBusterVarisu #VarisuPongalWinner@7screenstudio @Harish_NS149 @Karthikravivarm — Joseph Jeeva (@jnajeeva) January 11, 2023 Illa enaku puriyala enaku mattum varisula Khushboo kanuku theriyalai ya illa yella rukkuma ? #Varisu — pathukalam (@lavanku11) January 11, 2023 -
Kushboo: సీనియర్ నటి ఖుష్బూ ఇంట తీవ్ర విషాదం..
సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె సోదరుడు అబ్దుల్లా ఖాన్ కన్నుమూశారు. ఈ విషయంపై ఖుష్బూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్చేసింది. 'మనకు ఇష్టమైన వాళ్లు ఎప్పుడూ మనతోనే ఉండాలని కోరుకున్నప్పటికీ వోడ్కోలు చెప్పే సమయం స్తుంది. ఈరోజుతో మా అన్నయ్య ప్రయాణం ముగిసింది. ఆయన ప్రేమ,గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. అన్నయ్య కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.అన్నయ్య చెప్పినట్లుగా.. జీవిత ప్రయాణాన్ని దేవుడే నిర్ణయిస్తాడు. అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా' అంటూ ఖుష్బూ భావోద్వేగానికి లోనైంది. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఖుష్బూ సోదరుడు అబ్దుల్లా ఖాన్ నేడు(శనివారం)తుదిశ్వాస విడిచారు. ఈయన కూడా కొన్ని సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
కనిమొళిపై కుష్బు ప్రశంసల జల్లు
డీఎంకే ఎంపీ కనిమొళిపై నటి, బీజేపీ నాయకురాలు కుష్బు ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవల డీఎంకే పార్టీ ప్రచారకర్త సాధిక్ ఒక కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాళ్లు కుష్బు, గౌతమి, నమిత, గాయత్రి రఘురాంను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. అవి పెద్ద దుమారానికే దారి తీశా యి. సాధిక్ వ్యాఖ్యలతో కుష్బు తీవ్రంగానే ఖండించారు. కాగా సాధిక్ వ్యవహారంపై తాజాగా డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళి తీవ్రంగా ఖండించారు. (చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత పోటీలో విజయ్, అజిత్ సినిమాలు) ఏ పార్టీకి చెందిన వారైనా, సందర్భం ఏమైనా మహిళలను అవమానించడం సహించరానిదన్నారు. ఒక స్త్రీగా, మనిషిగా తాను క్షమాపణ చెప్పుకుంటున్నానని, ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్టాలిన్, పార్టీ తరఫున కూడా క్షమాపణ చెప్పుకుంటున్నానని ట్వీట్ చేశారు. కనిమొళి క్షమాపణపై స్పందించిన కుష్బు ధన్యవాదాలు, కానీ మీ మనస్త్వత్వం, ఆచరణకు నిజంగా అభినందనీయం. మహిళల మానానికి, ఆత్మాభిమానానికి మీరెప్పుడు అండగా నిలుస్తారని ట్విట్టర్లో ప్రశంసించారు. -
పరువు, గౌరవం కోసం ఎంతకైనా వెళ్తా... నటి ఖుష్బు సీరియస్
చెన్నై: డీఎంకే నేత సాధైయ్ సాధిక్ బీజేపీ నేతలుగా మారిన నటిమణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నటి ఖుష్బు సుందర్ చాలా సీరియస్ అయ్యారు. ఇంతా దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు. స్టాలిన్ తనకు ఈ విషయంలో అండగా నిలబడాలని కోరుకుంటున్నానని అన్నారు. అలాంటి నాయకుడిని పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేయడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీశారు. ఆ నాయకుడుపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తానని, తన పరువు, గౌరవం కోసం ఎంతవరకైనా వెళ్లి పోరాడుతానని గట్టిగా నొక్కి చెప్పారు. ఖుష్బు మహారాష్ట్ర చీఫ్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) ఎంపీ సుప్రీయ సూలేను రాజకీయాలు విడిచిపెట్టి వంటగదిలో పని చేయమంటూ విమర్శించిన సందర్భం గురించి ప్రస్తావిస్తూ...తాను ఆ సమయంలో సుప్రీయకు అండగా ఉన్న విషయాన్ని గుర్తుచేశారు. మా పార్టీ నుంచి ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సీఎం స్టాలిన్ ఇలానే మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. ఆ నాయకుడు వ్యాఖ్యలను చాలా వ్యక్తిగతం తీసుకున్నానిన చెప్పారు. ఈ అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఆ నాయకుడు చాలా దిగజారిపోయాడన్నారు. తాను తన ఇద్దరూ కూతుళ్లకు రోల మోడల్ ఉండాలనుకున్నాను. ఇప్పుడూ నాకూతుళ్లు ఈ విషయమై నన్ను కచ్చితంగా ప్రశ్నిస్తారు అని ఆవేదనగా చెప్పారు. ఐతే ఈ విషయమై ఖుష్బుకి డీఎంకే నేత కనిమొళి క్షమాపణలు చెప్పిన ఒక రోజు తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
అకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటి.. అదే కారణం..!
సినీ నటి, బీజేపీ మహిళా నేత ఖుష్బూ ఆకస్మాత్తుగా ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బెడ్‌పై ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. తమిళంతో పాటు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక సంపాదించుకున్న నటి రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు. నటనతో పాటు సీరియల్స్, టీవీ షోలలో హోస్ట్‌గా, డ్యాన్స్ షోలలో న్యాయనిర్ణేతగా ఉంటూ కొన్ని చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. 'వెన్నెముక విపరీతమైన నొప్పి కారణంగా ఆస్పత్రిలో చేరాను. ఒకటి, రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక మళ్లీ విధుల్లో యథావిధిగా పాల్గొంటాను' అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అందరికీ దసరా శుభాకాంక్షలు కూడా తెలిపారు. దీంతో అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో 'కాఫీ విత్ కాదల్' అనే చిత్రాన్ని ఆమె నిర్మించారు. ఈ వారం విడుదల కావాల్సిన ఆ చిత్రం పొన్నియన్ సెల్వన్ రాకతో వాయిదా వేసుకున్నారు. Had a procedure for my coccyx bone yesterday. Back home now. Rest for 2 days n then back to work. Sorry for the wishes, once again wishing you all #happydussehra2022 #HappyVijayadashami2022. pic.twitter.com/S8n1SjHEnS — KhushbuSundar (@khushsundar) October 5, 2022 -
ఖుష్బూ సుందర్‌కు కీలక బాధ్యతలు
అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నటి, బీజేపీ సభ్యురాలు ఖుష్బూ సందర్ కీలక బాధ్యతలు నిర్వహించానున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో గోవాలో 53వ అంతర్జాతీయ చిత్రోత్సవాలు జరగనున్నాయి. కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అధ్యక్షతన జరగనున్న ఈ చిత్రోత్సవాలకు ఉపాధ్యాక్షుడిగా గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావత్ వ్యవహరించనున్నారు. చదవండి: కృష్ణ వంశీ భారీ ప్లాన్.. రూ.300 కోట్లతో ఓటీటీ ప్రాజెక్ట్! ఇందుకు గానూ ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్గదర్శక కమిటీ సభ్యురాలిగా నటి ఖుష్బూ బాధ్యతలను నిర్వహించానున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఆమెతో పాటు బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్, విపుల్ అమృత్‌వాల్ షాకు కమిటీలో చోటు కల్పించారు. -
‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ రివ్యూ
-
ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్ న్యూస్ చెప్పిన నటి
సినీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖలు, అగ్ర హీరోహీరోయిన్లు వరసగా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన స్టార్ హీరో మహేశ్ బాబు, లక్ష్మి మంచు, మనోజ్ మంచులు కరోనా పాజిటివ్‌గా రాగా రీసెంట్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సైతం ఈ మహమ్మారి బారినా పడ్డాడు. అలాగే ఇటీవల అమెరికా వెళ్లోచ్చిన తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవల కరోనా రాగా.. ఈ రోజు సీనియర్ నటి శోభన కూడా కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్రకటించింది. తాజాగా మరో సీనియర్ నటికి కూడా కరోనా సోకింది. చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్, మహిళా కమిషన్ ఎంట్రీ ప్రముఖ నటి, తమిళ బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ కరోనా పాజిటివ్ పరీక్షించినట్లు సోషల్ మీడియా వేదిక వెల్లడించింది. ‘మొత్తానికి కరోనా వచ్చేసింది. గత రెండు వేవ్‌ల నుంచి తప్పించుకున్నప్పటికీ ఈసారి కోవిడ్ నన్ను చేరుకుంది. నిన్న సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేని నాకు ఆ తర్వాత ముక్కు కారడం ప్రారంభమైంది. అది ఎక్కువ కావడంతో టెస్ట్ చేయించుకున్న నాకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న.. ఒంటరిగా ఉండటం చాలా కష్టం ఉంది. కానీ తప్పదు. కాబట్టి రాబోయే 5 రోజులు నన్ను ఎంటర్టైన్ చేయండి. అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్న పరీక్షించుకోండి’ అంటూ ఖుష్బూ ఫన్నీగా ట్వీట్ చేసింది. చదవండి: మంత్రి పేర్ని నానితో భేటీ సంతృప్తినిచ్చింది: ఆర్జీవీ Ok. finally #Covid catches up with me after dodging last 2 waves. I have just tested positive. Till last eve i was negative. Have a running nose,did a test n Voila! I have isolated myself. Hate being alone. So keep me entertained for the next 5 days. N get tested if any signs 🥰 — KhushbuSundar (@khushsundar) January 10, 2022 -
ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్.. బ్రియాన్‌గా పేరు మార్పు
Khushbu Sundar Twitter Account Hacked: నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ సందర్ ట్విటర్ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. ఈ సారి హ్యాకర్లు ఆమె అకౌంట్ పేరును బ్రియాన్‌గా మార్చారు. అలాగే కవర్ ఫోటోని కూడా మార్చేశారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లన్నీ తొలగించారు. గతేడాది ఏప్రిల్‌లోనూ ఆమె అకౌంట్‌ను ఇలాగే ఎవరో హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన ఫాలోవర్స్‌కి తెలియజేసింది. గతంలో ఇలా జరిగినప్పుడు ఆమె తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు చెప్పింది. 48 గంటల నుంచీ తాను పాస్వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నా కుదరడం లేదని, సాయం చేయాలని ఫ్యాన్స్‌ను కోరింది. View this post on Instagram A post shared by Kushboo Sundar (@khushsundar) -
కుష్బూ సెట్టింగ్.. కంటైనరే కార్యాలయం
సాక్షి, చెన్నై: సినిమా వాళ్లు ఏ పనిచేసినా, అందులో వైవిధ్యం, వినూత్నం, అభిమాన ఆకర్షణ దిశగానే ఉంటాయి. ఆ దిశగా సినీ నటి, బీజేపీ నేత కుష్బూ పయనం ఉంటున్నది. సినీ తరహాలో తన పార్టీ ఎన్నికల కార్యాలయం సెట్టు వేయించుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. డీఎంకే, కాంగ్రెస్‌లో ఎన్నికల్లో పోటీకి అవకాశం రాకున్నా, తాజాగా బీజేపీలో తనకు ఆ అవకాశం దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. చేపాక్కం–ట్రిప్లికేన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయడం ఖాయం అన్న సంకేతాలు కొంత కాలంగా వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో తిష్టవేసి, ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాల్లో ఆమె ఉన్నారు. ఆ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇది తాత్కాలికమే కావడంతో, దానిని సినీ తరహా సెట్టింగ్‌తో రూపొందించుకున్నారు. అన్నాసాలైలోని ఎల్ఐసీ పక్కనే ఉన్న తొమ్మిది గ్రౌండ్ల స్థలంలో ఈ సెట్టింగ్ వేశారు. ఇక్కడ నాలుగు కంటైనర్లు ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇందులో ఒక కంటైనర్ కుష్బూకు కార్యాలయంగా మార్చేశారు. మిగిలిన మూడింటిని నియోజకవర్గ నిర్వాహకులు, ఇతర ముఖ్యులు ఎన్నికల పనులపై దృష్టి పెట్టే రీతిలో ఆఫీసుగా మార్చేశారు. ఇక్కడ ఏసీ, కంప్యూటర్, ప్రింటర్ అంటూ అన్ని రకాలు వసతులు కలి్పంచడమే కాదు, కేడర్ తరలివచ్చినా, ఏదేని సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నా, అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని ఉండడం విశేషం. హేమమాలిని రాక.. నటి హేమమాలిని తమిళనాడుకు చెందిన వారే. బాలీవుడ్లో స్థిర పడ్డా ఆమె ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాజాగా ఆమె సేవల్ని ప్రచారానికి ఉపయోగించుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. నాలుగు రోజులపాటు హేమమాలిని ఎన్నికల ప్రచారానికి కసరత్తులు చేట్టారు. ఈ ప్రచారంలో ఆమె తమిళంలోనే ప్రచారం సాగించబోతున్నారని కమలనాథులు పేర్కొంటున్నారు. -
నటి కుష్బూ డాక్టరయ్యారు!
సాక్షి, పెరంబూరు: నటి కుష్బూ డాక్టరయ్యారు. ఇదేమిటీ ఆమె యాక్టర్ కదా అని ఆశ్యర్యపడుతున్నారా? ఉత్తరాదికి చెందిన కుష్బూ తెలుగు, తమిళం సహా వివిధ భాషల్లో 20 ఏళ్లకు పైగా నటిస్తున్నారు. తెలుగు చిత్రం కలియుగపాండవులు చిత్రం ద్వారా దక్షిణాదిలో కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత తమిళ సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళంలోనే అత్యధిక చిత్రాలను చేశారు. హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక చిత్రాల్లో నటించారు. తమిళంలో రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్‌స్టార్స్‌తో జత కట్టిన నటి కుష్బూ. చదవండి: అదే నిజమైన ఉమెన్స్ డే ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా అన్నాత్తా చిత్రంలో నటిస్తున్నారు. కాగా బుల్లితెరపై కూడా నటిగా తనదైన ముద్రవేసుకున్న ఈ సంచలన నటి నిర్మాతగా మారి పలు చిత్రాలను, టీవీ సీరియళ్లను నిర్మిస్తున్నారు. ఇక రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రచార కర్తగా బాధ్యతలను నిర్వహిస్తున్న కుష్బూ సినీ సేవలకు గానూ అమెరికాలోని ప్రపంచ తమిళ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను అందించి గౌరవించారు. గురువారం నటి కుష్బూ డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు.