యానిమల్‌ మూవీ చూడొద్దని పిల్లలే వార్నింగ్‌ ఇచ్చారు: ఖుష్బూ | Khushbu Sundar Says She Not Watched Animal, Here's Why- Sakshi
Sakshi News home page

Khushbu Sundar: అలాంటివి నచ్చవు.. అందుకే యానిమల్‌ చూడలేదు.. అయినా జనాలెందుకు ఆదరిస్తున్నారు?

Published Wed, Feb 28 2024 1:36 PM | Last Updated on Wed, Feb 28 2024 3:10 PM

Khushbu Sundar Says She Not Watched Animal, Know The Reason - Sakshi

మాకు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పేవాళ్లను చూస్తుంటే అసలు మీ మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి? అనుకునేదాన్ని. జనాలు ఎందుకిలాంటి సినిమాలు చూడటానికి వెళ్తున్నారు? సమాజం ఎటు పోతోంది?

యానిమల్‌ మూవీ.. ఎన్నో విమర్శలు, వివాదాలు.. అయితేనేం బాక్సాఫీస్‌ వద్ద బంపర్‌ హిట్‌.. కళ్లు చెదిరే కలెక్షన్స్‌.. బ్రహ్మరథం పట్టిన జనాలు.. ఇది సరపోదా చిత్రయూనిట్‌ సంబరాలు చేసుకోవడానికి! ఈ మధ్యే ఈ సినిమాకు, అందులో నటించినవాళ్లకు అవార్డులు కూడా వచ్చాయి. ఇంత పేరు గడించిన యానిమల్‌ మూవీని తానింతవరకూ చూడలేదంటోంది సీనియర్‌ నటి ఖుష్బూ.

కబీర్‌ సింగే సమస్య అనుకుంటే యానిమల్‌..
ఓ వేదికపై ఖుష్బూ మాట్లాడుతూ.. నాకు యానిమల్‌ తరహా సినిమాలు నచ్చవు. అందుకే ఇంతవరకు ఈ సినిమా చూడలేదు. అయినా ఈ తరహా చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు తిరగరాస్తున్నాయంటే జనాల మైండ్‌సెట్‌ ఎలా ఉందో ఆలోచించాలి. ఇంతకు ముందు వచ్చిన కబీర్‌ సింగ్‌ (అర్జున్‌ రెడ్డి) మూవీ కూడా ఒక సమస్యగానే ఫీలయ్యాం. నేను డైరెక్టర్‌ను తప్పుపట్టడం లేదు. ఎందుకంటే అతడు ఈ సినిమాలతో సక్సెస్‌ చూశాడు. యువత.. చదువుకున్నవాళ్లు ఇలాంటి సినిమాలను ఎంజాయ్‌ చేస్తుండటం ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

సమాజం ఎటు పోతోందో..
మాకు ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చిందని చెప్పేవాళ్లను చూస్తుంటే అసలు మీ మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయి? అని అనుకునేదాన్ని. నా పిల్లలు ఈ సినిమా చూసి వచ్చాక నేను చూడొద్దని హెచ్చరించారు. జనాలు ఎందుకిలాంటి సినిమాలను ఆదరిస్తున్నారు? సమాజం ఎటు పోతోంది? ఈ సొసైటీలో మార్పు రావాలి? అని అదేపనిగా ఆలోచిస్తూ బాధపడతానని నన్ను యానిమల్‌ చూడొద్దన్నారు' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ 'అరణ్మయి 4' సినిమాలో నటిస్తోంది.

చదవండి: 'తనకేవేవో కలలు.. నేనేమో.. కనెక్షన్‌ మిస్‌ అవుతోంది.. ' భార్యతో విడిపోయిన నటుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement