నటీ నటుల్లో ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ వుంటుంది. కొందరు ఆదివారం షూటింగ్‌లకు సెలవు ప్రకటిస్తుంటారు. మరి కొందరు వారాంతర రోజున కుటుంబసభ్యులకు కేటాయిస్తూ వుంటారు. ఇంకొందరు పార్టీలకు, పబ్‌లకు వెళుతుంటారు. ఇక రష్మిక మందన్న ఏం చేస్తారో తెలుసా? ఇండియా క్రష్ అయిన ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో క్షణం కూడా తీరికలేనంత బిజీ. ఇటీవల ఈమె నటించిన హిందీ చిత్రం యానిమల్ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ఈ చిత్రంతో రష్మిక మందన్న బాలీవుడ్‌లోనూ స్టార్ అంతస్థుకు చేరుకున్నారు. అక్కడ మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయట. ఇటీవల జపాన్ వెళ్లి వచ్చిన రష్మికకు అక్కడ అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించడం విశేషమనే చెప్పాలి. ఇకపోతే తెలుగు, తమిళం భాషల్లోనూ పలు చిత్రాలలో నటిస్తూ రష్మిక మందన్న బిజీగా వున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పుష్ప–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు వీకెండ్‌లో తన మిత్రబృందంతోనే ఎక్కువగా గడుపుతారట. కుటుంబసభ్యులకు కాస్త సమయాన్ని కేటాయించినా, ఎక్కువగా స్నేహితులతోనే జాలీగా గడిపేస్తారట. ఇది తన పాలసీ అని రష్మిక మందన్న వర్గం మాట.
Comments
Please login to add a commentAdd a comment