Khushbu Sundar Hospitalised Due to High Fever, Weakness - Sakshi
Sakshi News home page

Khushbu Sundar: ఆస్పత్రిపాలైన ఖుష్బూ, అడెనో వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దంటూ పోస్ట్‌

Published Fri, Apr 7 2023 4:17 PM | Last Updated on Fri, Apr 7 2023 4:36 PM

Khushbu Sundar Hospitalised Due to High Fever, Weakness - Sakshi

అడెనో వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దు. అనారోగ్యానికి గురైనట్లు ఏమాత్రం లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి' అని ఇన్‌స్టాగ్రామ్‌, ట్విట

సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది నటి, జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలు ఖుష్బూ సుందర్‌. సినిమాల్లో అగ్రతారగా వెలుగొందిన ఆమె తాజాగా అస్వస్థతకు లోనవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరింది. తీవ్ర జ్వరం, ఒంటి నొప్పులు, నీరసంతో ఆస్పత్రిలో చేరినట్లు సోషల్‌ మీడియాలో వెల్లడించింది ఖుష్బూ. ఈ మేరకు ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్‌ చేసింది.

'ఫ్లూ చాలా చెడ్డది. ఇది నాపై దుష్ప్రభావం చూపింది. అధిక జ్వరం, తీవ్రమైన ఒంటినొప్పులు, బలహీనతతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. అడెనో వైరస్‌ను తక్కువ అంచనా వేయొద్దు. అనారోగ్యానికి గురైనట్లు ఏమాత్రం లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. వెంటనే అప్రమత్తమై మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి' అని ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌పై కీర్తి సురేశ్‌, రాశీఖన్నా, నిక్కీగల్రానీ, శ్రియ, శ్రీదేవి విజయ్‌కుమార్‌ సహా పలువురు తారలు, నెటిజన్లు స్పందిస్తూ.. త్వరగా కోలుకోండి మేడమ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement