Senior Actress Kakinada Shyamala Revealed Shocking Things About Prabhu And Kushboo - Sakshi
Sakshi News home page

Khushbu Sundar: ఆల్‌రెడీ పెళ్లైన ప్రభుతో ఖుష్బూ లవ్‌.. వీరు విడిపోవడానికి ఆవిడే కారణమన్న నటి!

Apr 9 2023 1:20 PM | Updated on Apr 9 2023 4:11 PM

Actress Kakinada Shyamala About Prabhu And Kushboo - Sakshi

ఎన్నో గొడవల మధ్య పెళ్లైన నాలుగు నెలలకే ఇద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. ఈ విషయంపై గతంలో జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖుష్బూ స్పందిస్తూ.. పెళ్లి

దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది ఖుష్బూ. బాలనటిగా ఇండస్ట్రీలో కెరీర్‌ ఆరంభించిన ఆమె ఆ తర్వాత టాప్‌ హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. 1988లో ధార్మతిన్‌ తలైవా సినిమాలో బాలనటిగా యాక్ట్‌ చేసిన ఆమె ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేసింది. 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది ఖుష్బూ. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్‌ ఫిలింఫేర్‌ అవార్డు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో తనతో జోడీ కట్టిన ప్రభుతో ఆమె ప్రేమలో ఉందంటూ జోరుగా ప్రచారం నడిచింది.

ఆ ఊహాగానాలను నిజం చేస్తూ 1993 సెప్టెంబర్‌ 12న వీరి పెళ్లి జరిగింది. పోయిస్‌ గార్డెన్‌లో వీరు కొనుక్కున్న ఇంట్లోనే ఈ వివాహం జరిగింది. కానీ ఇదివరకే ప్రభుకు పెళ్లైంది. దీంతో వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్‌ సహా అతడి కుటుంబం అంగీకరించలేదు. ఎన్నో గొడవల మధ్య పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ.. ఇద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే పెళ్లికి ముందే తనతో నాలుగున్నరేళ్లు సహజీవనం చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రభుకు దూరమవడం ఖుష్బూను మానసికంగా కుంగదీసింది. ఈ వేదన నుంచి బయటపడ్డ అనంతరం ఖుష్బూ 2000 సంవత్సరంలో దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. భర్త పేరును తన పేరు చివరన జోడించింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం.

ఇకపోతే ప్రభు, ఖుష్బూల బంధంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సీనియర్‌ నటి కాకినాడ శ్యామల. 'ఖుష్బూ చాలా మంచి అమ్మాయి. ఖుష్బూ, ప్రభు ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వీరి ప్రేమను ప్రభు భార్య అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారికి గొడవలయ్యాయి. అందుకే ఈ గొడవలన్నీ వద్దని తెగదెంపులు చేసుకున్నారు' అని చెప్పుకొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement