Prabhu
-
ప్రముఖ నటుడికి బ్రెయిన్ సర్జరీ
ప్రముఖ నటుడు ప్రభు గణేశన్ (Prabhu Ganesan)కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో అతడి సర్జరీ విజయవంతమవగా, ప్రస్తుతం తనను డిశ్చార్జి చేశారు. ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని అతడి టీమ్ వెల్లడించింది. జ్వరం, తలనొప్పితో ప్రభు ఆస్పత్రిలో చేరాడు. మెదడులో వాపుఆయన్ను పరిశీలించిన వైద్యులు మెదడులోని రక్తనాళంలో వాపు ఉన్నట్లు గర్తించారు. దీంతో చిన్నపాటి సర్జరీ చేశారు. లెజెండరీ నటుడు శివాజీ గణేశన్ తనయుడే ప్రభు. చిన్న తంబి, మనసుక్కుల్ మతప్పు, అగ్ని నక్షత్రం, అరువడై నాళ్, చార్లీ చాప్లిన్ వంటి పలు తమిళ చిత్రాల్లో నటించాడు. తెలుగువారికీ సుపరిచితుడేచంద్రముఖి, డార్లింగ్, ఆరెంజ్, దరువు, ఒంగోలు గిత్త, దేనికైనా రెడీ, పొన్నియన్ సెల్వన్, వారసుడు వంటి చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యాడు. దాదాపు 200 సినిమాలు చేసిన ఈయన ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా (Good Bad Ugly) చేస్తున్నాడు. అజిత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో త్రిష కథానాయికగా యాక్ట్ చేస్తోంది.చదవండి: నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ -
విజయ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' ట్రైలర్ వచ్చేసింది
విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం'. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ తాజాగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ తర్వాత వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చాలా ఆసక్తిగా ఉంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. -
27 ఏళ్లు శ్రమించి.. 195 దేశాలు చుట్టేసి..
ప్రపంచంలోని అన్ని దేశాలను సందర్శించడమే అతడి లక్ష్యం.. ఆ దిశగా ఎంతో కష్టపడ్డారు. సుమారు 27 ఏళ్లు ఎంతో శ్రమకోర్చి అన్ని దేశాలను సందర్శించి అరుదైన ఘనత సాధించారు. ప్రస్తుతం 195 దేశాల సందర్శన పూర్తి చేసుకుని తెలుగుగడ్డపై బుధవారం అడుగుపెట్టారు. ఈ అరుదైన ఘనత సాధించిన వ్యక్తి మన తెలుగువాడు కావడం విశేషం.ప్రపంచాన్నే చుట్టేసిన 43 ఏళ్ల వయస్సు కలిగిన రవిప్రభు స్వస్థలం విశాఖపట్నం. ఆయన హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో చదువుకున్నాడు. పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రుడైన రవిప్రభు విద్యార్థి దశలోనే 1996లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వివాహం చేసుకొని ఉద్యోగం చేసుకుంటూనే విదేశాలను సందర్శించడం ప్రారంభించారు. భూటాన్ దేశాన్ని సందర్శించడంతో ప్రారంభమైన ఆయన యాత్ర వెనుజులతో ముగిసింది. ప్రపంచంలోని దేశాలను సందర్శిస్తూనే 2020లో ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. మొత్తం సందర్శన విశేషాలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చారు.అన్ని దేశాలను చుట్టేసి వచ్చిన ఆయన రెడ్‌హిల్స్‌లోని ఫెడరేషన్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 600 మందికి పైగా అంతరిక్షంలోకి వెళ్లారు. 6,600 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని 850 కోట్ల మందిలో 280 మంది మాత్రమే ప్రతి దేశాన్ని సందర్శించారని అన్నారు. ఈ అరుదైన ఘనత సాధించిన 280 మందిలో తనకు స్థానం లభించడం సంతోషంగా ఉందని తెలిపారు. 27 ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. ఈ ప్రయాణాల కోసం రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు చెప్పారు. -
కొడుకును కాపాడుకోవాలనే తపనతో ఇద్దరూ..
సంగారెడ్డి: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు తండ్రీకుమారుడు మృతిచెందిన సంఘటన హత్నూర మండలం తురకల ఖానాపూర్ శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సాధులనగర్కు చెందిన చెక్కల ప్రభు(46) కుమారుడు నాగరాజు (23) ఇద్దరూ కలిసి మంగళవారం సాయంత్రం తుర్కల్ ఖానాపూర్ శివారులోని ఊర చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. చేపలు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు కొడుకు నాగరాజుకు వల చుట్టుకొని మునిగిపోతుండడంతో గమనించిన తండ్రి కొడుకును కాపాడుకోవాలనే తపనతో నీటిలోకి దిగాడు. ఈక్రమంలో ఇద్దరూ మృత్యుఒడిలోకి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు చెరువు వద్దకు వెళ్లగా మృతదేహాలు నీటిలో తేలాయి. దీంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న హత్నూర ఎస్సై సుభాశ్ పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటా: ఎమ్మెల్యే సునీతారెడ్డి బాధిత కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే సునీత అన్నారు. నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. ఆమె వెంట ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్, సర్పంచ్ భాస్కర్‌గౌడ్, నాయకులు ఉన్నారు. ఇవి చదవండి: మరొకరితో కలిసి తమ్ముడిని అన్న దారుణంగా.. -
ప్రభు కూతురు పెళ్లి.. కట్నంగా ఎంత ఇచ్చారంటే
సౌత్ ఇండియాలో స్టార్ నటుడిగా ప్రభుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాజాగా ఆయన కూతురు ఐశ్వర్య వివాహం జరిగిన విషయం తెలిసిందే. కోలీవుడ్ యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో ఆమె వివాహం జరిగింది. ఆమెకు గతంలోనే పెళ్లి కావడం ఆపై భర్త నుంచి విడాకులు తీసుకుంది. సుమారు కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు అధిక్ రవిచంద్రన్‌ను రెండో పెళ్లి చేసుకుంది. 2015లో త్రిష ఇల్లానా నయనతార సినిమాతో తమిళ సినిమాకి దర్శకుడిగా పరిచయం అయిన అధిక్ రవిచంద్రన్.. రీసెంట్గా మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. విశాల్, ఎస్జే సూర్య నటించిన ఈ సినిమా రూ. 100 కోట్లు రాబట్టింది. వివాహం కోలీవుడ్ టాప్ హీరో అజిత్ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సమయంలో నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నాడు. చెన్నైలో జరిగిన ఈ వివాహానికి నటుడు విశాల్, దర్శకుడు మణిరత్నం, సుహాసిని, దుల్కర్ సల్మాన్, లెజెండ్ శరవణన్, సుందర్.సి, ఖుష్బూ హాజరయ్యారు. వీరి పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. విడాకులు నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్యకు గతంలోనే వివాహం అయింది. ప్రభు సోదరి తేన్మొళి కుమారుడు కునాల్‌తో ఆమెకు వివాహం జరిగింది. కునాల్ లండన్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, కూతురు ఐశ్వర్య కూడా లండన్‌లో స్థిరపడింది. అయితే హఠాత్తుగా ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకుని చాలా ఏళ్ల క్రితమే విడిపోయారు. దర్శకుడితో ప్రేమ విడాకుల తర్వాత చెన్నైకి తిరిగి వచ్చిన ప్రభు కూతురు ఐశ్వర్య కేక్‌లు తయారు చేసి విక్రయించే వ్యాపారం చేస్తోంది. ఆమె మెల్ట్జ్ డెసర్ట్స్ (meltz.dessertz) అనే కంపెనీని నడుపుతుంది. ఈ సమయంలో, ఐశ్వర్య, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌ల స్నేహం ప్రేమగా మారడం. ఆపై ఇరు కుటుంబాల అంగీకారంతో వివాహం జరిగింది. కోట్లాది రూపాయల కట్నం వివాహంతో శివాజీ గణేశన్ (ప్రభు తండ్రి) కుటుంబానికి చెందిన దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్‌కు నగలు, చెన్నైలో విలాసవంతమైన బంగ్లాతో పాటు నగదు రూపంలో కోటి రూపాయలు కట్నం ఇచ్చినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న ఐశ్వర్య వయసు 34 ఏళ్లు కాగా, దర్శకుడు ఆదిక్ రవిచంద్రన్ వయసు ఇప్పుడు 32 ఏళ్లు. -
ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు)
-
ప్రభు కూతురిని పెళ్లాడిన ప్రముఖ డైరెక్టర్, ఫోటో వైరల్
ప్రముఖ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ పెళ్లిపీటలెక్కాడు. సీనియర్ నటుడు ప్రభు కూతురు ఐశ్వర్యను పెళ్లాడాడు. చెన్నైలో శుక్రవారం (డిసెంబర్ 15న) వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు హీరో విశాల్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోను విశాల్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'డార్లింగ్ అధిక్, నా ప్రియమైన సోదరి ఐశ్వర్య పెళ్లి బంధంతో ఒక్కటైనందుకు చాలా సంతోషంగా ఉంది. నా చెల్లిని మహారాణిలా చూసుకోవాలి జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మీకు అందరి ఆశీస్సులు ఉంటాయి. ముఖ్యంగా ప్రభు సర్, పునీత ఆంటీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉంటాయి. నా చెల్లిని పెళ్లి చేసుకున్న అధిక్.. నువ్వు తనను మహారాణిలా చూసుకోవాలి. అర్థమైందా? సరదాగా అన్నానులే.. నువ్వు తనను బాగా చూసుకుంటావని నాకు తెలుసు. అదేంటో కానీ నా సోదరీమణులందరూ ఐశ్వర్య అనే పేరుతోనే కనిపిస్తారు. మీ జంట జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని ఎక్స్ (ట్విటర్)లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఐశ్వర్యకు రెండో పెళ్లి.. కాగా ఐశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో బంధువైన కునాల్‌తో ఆమె పెళ్లి జరిగింది. వివాహం తర్వాత భార్యాభర్తలిద్దరూ అమెరికాలో సెటిలయ్యారు. కానీ కొంతకాలానికి ఇరువురి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భర్తకు విడాకులిచ్చేసి కొంతకాలంగా తల్లిదండ్రులతోనే ఉంటోంది. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ విషయానికి వస్తే ఇతడు 'త్రిష ఇల్లన నయనతార' సినిమాతో దర్శకరచయితగా సినీ కెరీర్ ఆరంభించాడు. 'దబాంగ్ 3' అనే బాలీవుడ్ సినిమాకు రచయితగానూ పని చేశాడు. ఇటీవల 'మార్క్ ఆంటోని' సినిమాతో కోలీవుడ్‌కు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చాడు. ఈ డైరెక్టర్ 'కే-13', 'నేర్కొండ పార్వై', 'కోబ్రా' సినిమాల్లో అతిథి పాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అజిత్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్! So damn happy for u my darling Adhik and my dearest sister Aishwarya on your wedding today and starting a new chapter in your lives and u hav the universe s blessings and especially your parents prabhu sir and punitha aunty's positivity and blessings now. Coming to the point,… pic.twitter.com/Vucqwch3J0 — Vishal (@VishalKOfficial) December 15, 2023 చదవండి: మహారాణిలా బతకాలనుకున్నా.. 18 ఏళ్లు వచ్చేసరికే పెళ్లి, పిల్లలు, విడాకులు.. ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి (ఫొటోలు) -
ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి ఫిక్స్..!
సౌత్ ఇండియాలో ప్రముఖ నటుడిగా ప్రభు కొనసాగుతున్నారు. హీరోగా మొదలైన ఆయన కెరియర్ ప్రస్తుతం తండ్రి పాత్రలలో పలు చిత్రాల్లో నటిస్తూ ఆయన బిజీగా ఉన్నారు. ప్రభుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. విక్రమ్ అనే కుమారుడితో పాటు ఐశ్వర్య అనే కుమార్తె ఉన్నారు. ఆయన కుమారుడు విక్రమ్ కూడా తమిళ చిత్రసీమలో చెప్పుకోదగ్గ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆయన నటించిన 'ఇరుకప్పపుట్టు' అనే చిత్రం ఇటీవల విడుదలైంది. ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో స్నేహితుడిలా ఐశ్వర్యకు పరిచయం అయ్యాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. వారి స్నేహం కాస్త ప్రేమగా మారి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇశ్వర్యకు ఇది రెండో పెళ్లి. 2009లో తన బంధువైన కునాల్‌తో ఆమెకు వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఐశ్వర్య తన భర్త కునాల్‌తో కలిసి అమెరికాలో స్థిరపడింది. భర్తతో కొన్ని విభేదాల కారణంగా విడాకులు ఇచ్చి ప్రస్తుతం తన తల్లిదండ్రులతో ఉంటుంది. ఈ క్రమంలో తన సోదరుడి చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో స్నేహం ఏర్పడటం.. అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. జివి ప్రకాష్ కుమార్ నటించిన 'త్రిష ఇల్లనా నయనతార' సినిమాతో అధిక్ రవిచంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం అక్కడ క్రేజీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఇటీవల అధిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేసిన `మార్క్ ఆంటోని` సినిమా మంచి విజయం సాధించింది. ఇందులో విశాల్, ఎస్.జె.సూర్య నటించారు. బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 63వ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే ఛాన్స్ దక్కింది. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు. ఈ పరిస్థితిలో ఇటీవలే అధిక్ రవిచంద్రన్, ప్రభు కూతురు ఐశ్వర్యల నిశ్చితార్థం జరిగిందని, డిసెంబర్ 15న పెళ్లి జరగనుందని సమాచారం. త్వరలోనే ప్రభు తరఫు నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని కూడా అంటున్నారు. -
జపాన్ సంతృప్తి ఇచ్చింది
‘‘మా డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఒకదానికొకటి భిన్నమైన చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందడం నిర్మాతగా చాలా ఆనందాన్ని ఇస్తోంది. ‘జపాన్’ సినిమా పట్ల యూనిట్ అంతా చాలా సంతృప్తిగా ఉన్నాం. సినిమా తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని నిర్మాత ఎస్ఆర్ ప్రభు అన్నారు. కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 10న విడుదలవుతోంది. తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తోంది. ఎస్ఆర్ ప్రభు మాట్లాడుతూ–‘‘రాజు మురుగన్ ఏదైనా విషయాన్ని నవ్విస్తూనే ఆలోజింపజేసేలా చెబుతారు. ‘జపాన్’ లో మానవత్వం గురించి చెప్పారు. ఇందులో కార్తీగారి జపాన్ పాత్ర ప్రేక్షకుల మనసులో చాలా కాలం నిలిచిపోతుంది. నాగార్జునగారు ‘జపాన్’ టీజర్, ట్రైలర్ చూసి ‘ఇలాంటి వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎలా చేయగలుగుతున్నావ్’ అంటూ కార్తీగారిని అభినందించారు. సినిమా విషయంలో నిర్మాత సుప్రియగారు, మా ఆలోచనలు ఒకేలా ఉంటాయి’’ అన్నారు. -
రజనీ చాయ్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఒక్కోసారి విసుగుపుట్టి హిమాలయాలకు వెళుతుంటారు. ఈసారి కొచ్చిన్‌లో టీ అమ్ముకుంటున్నారా? అవుననే కొంతమంది కంగారు పడ్డారు. తీరా చూస్తే ‘దక్కేది దక్కకుండా పోదు... దక్కనిది ఎప్పటికీ దక్కదు’ అని డైలాగ్ కొడుతూ తనకు దక్కిన టీ స్టాల్‌ను నడుపుకుంటున్న ఓ వ్యక్తి... ఇంకేముంది... నెట్లో హల్చల్. కొచ్చిన్‌లో ఏదో షూటింగ్ కోసం వెళ్లిన సినిమా యూనిట్ వారు అతణ్ణి చూసి ఆగిపోయారు. రజనీకాంత్! టీ అమ్ముతూ. రజనీకాంత్ సాధారణ జీవితాన్ని ఇష్టపడతాడని అందరికీ తెలుసు. కొంపదీసి టీ అమ్ముతున్నాడా? పరిశీలించి చూశారు. కాదు. రజనీకాంత్లానే ఉన్నాడు. పలకరిస్తే అచ్చు రజనీకాంత్లానే నవ్వుతున్నాడు. పేరు సుధాకర్ ప్రభు. ఫోర్ట్ కొచ్చిన్ పట్టాలం రోడ్డులో ‘వెంకటేశ్వర హోటల్’ అనే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ నడుపుతున్నాడు. లెమన్ టీ చేయడంలో దిట్ట. మొన్న మొన్నటి వరకూ ఎవరూ అతణ్ణి రజనీకాంత్‌తో పోల్చలేదు కాని ఈ మధ్య గెడ్డానికి రంగేయడం మాని, కళ్లద్దాలు మార్చేసరికి అచ్చు రజనీ గెటప్‌లోకి వచ్చేశాడు. నాదిర్షా అనే మలయాళం డైరెక్టర్ ఇతణ్ణి ఫేస్బుక్లో పెట్టేసరికి వైరల్ అయ్యాడు. అప్పటినుంచి ఇతని వీడియోలు వైరల్ అవుతున్నాయి. కేరళలో ఇతణ్ణి ఫంక్షన్స్‌కు కూడా ఆహ్వానిస్తున్నారు. ‘మా పిల్లలు పెద్దగా పట్టించుకోరుగాని నేను రజనీ అన్ని సినిమాలు చూస్తుంటా’ అంటాడు. ఈ పాపులారిటీ పెరిగి అతని హోటల్‌కు కస్టమర్లు పెరిగితే అదే పది ప్లేట్లు. -
పారిపోను.. సాయం చేస్తా
శత్రు దేశాలు, ఉగ్రమూకలు, తీవ్రవాదులు విరుచుకుపడినప్పుడు ఎంత శక్తిమంతమైన దేశమైనా అల్లకల్లోలంగా మారిపోతుంది. ఆ మధ్యన అప్ఘానిస్థాన్ పరిస్థితి ఇలానే ఉండేది. అది మర్చిపోయే లోపు ఉక్రేయిన్ రష్యా యుద్ధం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది. అప్ఘానిస్థాన్, ఉక్రెయిన్లలో ఏర్పడిన పరిస్థితులకు భయపడిపోయిన చాలామంది ప్రజలు ప్రాణాలు అరచేత బట్టి దేశం విడిచి పారిపోయారు. ఇక ఆయా దేశాల్లో ఉన్న విదేశీయులు ముందుగానే పెట్టే బేడా సర్దుకుని తమ తమ దేశాలకు పరుగెత్తుకెళ్లారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. అయినా అక్కడ నివసిస్తోన్న 41 ఏళ్ల ప్రమీలా ప్రభు మాత్రం ‘‘నేను ఇండియా రాను. ఇక్కడే ఉండి సేవలందిస్తాను’’ అని ధైర్యంగా చెబుతోంది. కర్ణాటకలోని ఉడిపి జిల్లా.. హెర్గాలో పుట్టి పెరిగింది ప్రమీలా ప్రభు. మైసూర్లో చదువుకుంది. చదువు పూర్తయ్యాక ఉడిపిలోని మణిపాల్ ఆసుపత్రిలో నర్స్‌గా చేరింది. కొన్నాళ్లు ఇక్కడ పనిచేశాక, ఇజ్రాయేల్‌లో మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో.. తన ఇద్దరు పిల్లలతో ఇజ్రాయెల్‌కు వెళ్లింది. గత ఆరేళ్లుగా అక్కడే ఉంటోన్న ప్రమీలా ఆ దేశం మీద అక్కడి ప్రజల మీద మమకారం పెంచుకుంది. అందుకే పరిస్థితులు దారుణంగా ఉన్నప్పటికీ ... ‘‘ఇండియా నాకు జన్మనిస్తే.. ఇజ్రాయెల్ జీవితాన్నిచ్చింది. ఇలాంటి కష్టసమయంలో దేశాన్ని వదిలి రాను. నేను చేయగలిగిన సాయం చేస్తాను’’ అని కరాఖండిగా చెబుతూ అక్కడి పరిస్థితులను ఇలా వివరించింది.... నేను టెల్ అవీవ్ యాఫోలో నివసిస్తున్నాను. అక్టోబర్ 7తేదీన∙రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో భోజనం చేశాము. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ వినిపించింది. వెంటనే మేమంతా బంకర్లోకి వెళ్లిపోయాము. దాదాపు రాత్రంతా సైరన్ వినిపిస్తూనే ఉంది. నేను ఇజ్రాయెల్ వచ్చాక ఇంతపెద్ద హింసను ఎప్పుడూ చూడలేదు. మా ఇంటికి కిలోమీటర్ దూరంలో బాంబులు పడుతున్నాయి. పెద్దపెద్ద శబ్దాలు ఒక్కసారిగా భయపెట్టేశాయి. ఇక్కడ ప్రతి ఇంటికి బంకర్లు ఉన్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బంకర్లు కూడా ఉన్నాయి. ఎమర్జెన్సీ సమయంలో ఎవరైనా వీటిలోకి వెళ్లి తలదాచుకోవచ్చు. సైరన్ మోగిన వెంటనే కనీసం ముప్ఫైసెకన్లపాటు బాంబుల శబ్దాలు వినపడుతున్నాయి. దశాబ్దకాలంగా ఇజ్రాయెల్‌పై తీవ్రవాద సంస్థ హమాస్ దాడులకు తెగబడుతూనే ఉంది. హమాస్ వల్ల గాజా కూడా దాడులతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యిమందికిపైగా చనిపోయారు. ఇక్కడి ప్రజలు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. టెల్ అవీవ్‌లో షాపులు అన్నీ మూసేసారు. వీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు మాత్రమే విక్రయాలు జరుపుతున్నారు. అందరూ కిరాణా సామాన్లు తెచ్చుకుని నిల్వ చేసుకుంటున్నారు. అరగంట లోపలే... మా చెల్లి ప్రవీణ జెరుసలేంలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తోంది. నేను టెల్ అవీవ్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్నాను. ఈ అపార్ట్మెంట్లో ముఫ్పైమంది వరకు ఉన్నారు. మేమంతా అత్యవసరమైన ఆహారం, నీళ్లు, టార్చ్‌లైట్ వంటివాటిని దగ్గర ఉంచుకుని బేస్మెంట్ తలుపులు లె రుచుకుని ...సైరన్ రాగానే బంకర్లోకి పరుగెడుతున్నాం. సైరన్ ఆగినప్పుడు బంకర్ల నుంచి బయటకు వస్తున్నాం. బంకర్లోకి వెళ్లిన ప్రతిసారి అరగంట పాటు లోపలే ఉండాల్సి వస్తోంది. ఊహకందని దాడి ఇజ్రాయెల్‌మీద పాలస్తీనా దాడులు చేయడం ఇది కొత్తేమీ కాదు. కానీ ఇప్పుడు జరిగిన దాడి అస్సలు ఊహించలేదు. ఊహకందని వికృతదాడికి హమాస్ సంస్థ పాల్పడింది. దక్షిణ ఇజ్రాయెల్‌లో శాంతికోసం ఏర్పాటు చేసిన ‘మ్యూజిక్ ఫెస్టివల్’ను ఇలా అశాంతిగా మారుస్తారని అసలు ఊహించలేదు. ఆ ఫెస్టివల్ గురించి అత్యంత బాధాకరమైన వార్తలు వినాల్సి వస్తోంది. ఇజ్రాయెల్ ఎప్పుడూ.. యుద్ధానికి అన్నిరకాలా సన్నద్ధమై ఉండి, రక్షణాత్మక చర్యలను పర్యవేక్షిస్తుంటుంది. లేదంటే మరింతమంది హమాస్ దాడుల్లోప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు రాలేను.. ఇజ్రాయెల్ నాకు జీవితాన్నిచ్చింది. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను నా మాతృదేశం వచ్చి సంతోషంగా ఉండలేను. ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుమతిస్తే నా సేవలు అందించడానికి సిద్ధ్దంగా ఉన్నాను. ఉడిపిలో ఉన్న మా కుటుంబ సభ్యులు పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నానా... లేదా... అని కంగారు పడుతున్నారు. ఇక నా పిల్లలు ఇండియా వెళ్లిపోయారు. వారిని విడిచి ఇక్కడ ఉన్నాను. వాళ్లంతా గుర్తొస్తున్నారు. అయినా ఇంతటి విపత్కర పరిస్థితుల నుంచి పారిపోవాలనుకోవడం లేదు. పరిస్థితులు చక్కబడిన తరువాత ఇండియా తిరిగి రావడం గురించి ఆలోచిస్తాను’’ అని చెబుతూ ఎంతోమంది స్ఫూర్తిగా నిలుస్తోంది ప్రమీలా ప్రభు. -
సీక్వెల్.. మార్పుల్...
కథ పెద్దదైతే సినిమా రెండు భాగాలవుతుంది.. ఒక్కోసారి మూడు కూడా అవుతుంది. ఇప్పుడలాంటి కథలతో రూపొం దుతున్న సీక్వెల్స్ కొన్ని ఉన్నాయి. అయితే ఒకటో భాగంలో నటించిన నటీనటులు, తెరకెక్కించిన దర్శకుడు రెండో భాగంలో కంటిన్యూ కావడంలేదు. ఒకటీ హీరో మారుతున్నారు.. లేదా డైరెక్టర్ మారుతున్నారు... లేదా హీరోయిన్ మారుతున్నారు... ఇక మార్పుల్తో రూపొందుతున్న సీక్వెల్స్ గురించి తెలుసుకుందాం. హిట్: ది థర్డ్ కేస్ తెలుగు చిత్ర పరిశ్రమలో ‘హిట్’ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ చిత్రాలు సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ రెండు చిత్రాలను నిర్మించింది హీరో నాని కావడం విశేషం. కాగా తొలి రెండు భాగాలు నిర్మించిన నాని థర్డ్పార్ట్ ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరోగా నటించనుండటం విశేషం. ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020) చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ చిత్రంలో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్‌ను (హిట్) లీడ్ చేసే పోలీస్ ఆఫీసర్ రుద్రరాజుపాత్రలో నటుడిగా విశ్వక్ సేన్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఈ మూవీ మంచి హిట్‌గా నిలిచింది. కాగా హిట్ ఫ్రాంచైజీలో రెండో భాగం ‘హిట్: ది సెకండ్ కేస్’లో హీరోగా అడివి శేష్‌ని తీసుకున్నారు శైలేష్. ఎస్పీ కృష్ణదేవ్పాత్రలో అడివి శేష్ తనదైన శైలిలో నటించి, మెప్పించారు. ఈ సినిమా కూడా హిట్. ఇక మూడో భాగం ‘హిట్: ది థర్డ్ కేస్’లో హీరో నాని నటించనున్నట్లు ‘హిట్: ది సెకండ్ కేస్’ చివర్లో రివీల్ చేశారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్పాత్రలో నాని నటిస్తారు. కాగా హిట్ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలుంటాయని శైలేష్ కొలను గతంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చంద్రముఖి–2 ‘చంద్రముఖి’ (2005)లో ‘లక లక లక..’ అంటూ హీరో రజనీకాంత్ రాజు గెటప్‌లో విలనిజమ్ పండించి, డాక్టర్ ఈశ్వర్‌గా మంచితనం కనబరిస్తే ప్రేక్షకులు కాసుల వర్షం కురిపించారు. పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్, నయనతార జంటగా జ్యోతిక, ప్రభు కీలకపాత్రలు చేశారు. ‘చంద్రముఖి’ విడుదలైన 18 ఏళ్లకు సీక్వెల్‌కి శ్రీకారం చుట్టారు పి. వాసు. ‘చంద్రముఖి 2’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో రజనీ ప్లేస్‌లోకి లారెన్స్ వచ్చారు. అలాగే కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటించారు. ఇంకా వడివేలు, లక్ష్మీ మీనన్, రాధిక తదితరులు నటించారు. ఇటీవల మైసూర్లో జరిగిన షెడ్యూల్‌తో ఈ మూవీ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో సెప్టెంబర్ 15న రిలీజ్ కానున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరకర్త. యుగానికి ఒక్కడు–2 వైవిధ్యమైన చిత్రాలతో తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (తెలుగులో యుగానికి ఒక్కడు –2010) ఎంత హిట్ అయిందో చెప్పక్కర్లేదు. కార్తీ హీరోగా, ఆండ్రియా, రీమా సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆయిరత్తిల్ ఒరువన్ 2’ (యుగానికి ఒక్కడు 2) తెరకెక్కించనున్నారు సెల్వ రాఘవన్. అయితే ఈ సినిమాలో తన సోదరుడు, హీరో ధనుష్‌ని లీడ్ రోల్‌కి తీసుకున్నారాయన. కార్తీ స్థానంలో ధనుష్ కనిపిస్తారని కొందరు అంటుంటే.. అలాంటిదేం లేదు.. కార్తీ కూడా ఉంటారు.. సీక్వెల్లో ధనుష్పాత్ర యాడ్ అయిందని మరికొందరు అంటున్నారు. మరి ‘యుగానికి ఒక్కడు 2’లో కార్తీపాత్ర ఉంటుందా? లేదా? అనేది చూడాలి. జెంటిల్మన్–2 అర్జున్, మధుబాల జంటగా శంకర్ దర్శకత్వంలో కేటీ కుంజుమోన్ నిర్మించిన ‘జెంటిల్‌మేన్’ (1993) చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచింది. దాదాపు ముప్పైఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ ‘జెంటిల్మన్ 2’ని నిర్మిస్తున్నారు కుంజుమోన్. అయితే రెండో భాగంలో దర్శకుడు, హీరో, సంగీత దర్శకుడు ముగ్గురూ మారడం విశేషం. గోకుల్ కృష్ణ దర్శకత్వం వహించనున్న ఈ సీక్వెల్లో ‘మంత్ర–2, రాజుగారి గది, పెళ్లికి ముందు ప్రేమకథ’ వంటి చిత్రాల్లో నటించిన చేతన్ చీను హీరోగా నటించనున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొం దనున్న ఈ చిత్రం కన్నడ, మలయాళ భాషల్లో డబ్బింగ్ కానుంది. టిల్లు స్క్వేర్ ‘డీజే టిల్లు పేరు వీని స్టయిలే వేరు..’ అంటూ హీరో సిద్ధు జొన్నలగడ్డ స్పెప్పులేస్తే ప్రేక్షకులు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. రొమాంటిక్ క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత ఏడాది విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ తెరకెక్కుతోంది. అయితే సీక్వెల్‌కి అటు డైరెక్టర్, ఇటు హీరోయిన్ ఇద్దరూ మారడం విశేషం. ‘టిల్లు స్క్వేర్’కి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే తొలి భాగంలో నేహా శెట్టి హీరోయిన్గా నటించి గ్లామర్‌తో మెప్పించారు. అయితే సీక్వెల్లో మాత్రం అనుపమా పరమేశ్వరన్‌ని హీరోయిన్గా తీసుకున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేయాలనుకుంటున్నారు. జిగర్తండా–2 సిద్ధార్థ్, బాబీ సింహా, లక్ష్మీ మీనన్ కీలకపాత్రల్లో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జిగర్తండా’ (2014) తమిళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా ‘గద్దలకొండ గణేష్’గా రీమేక్ అయి, ఇక్కడా ఘనవిజయం సాధించింది. కాగా ‘జిగర్తండా’ విడుదలైన దాదాపు తొమ్మిదేళ్లకు ‘జిగర్తండా డబుల్ ఎక్స్’ పేరుతో కార్తీక్ సుబ్బరాజ్ సీక్వెల్ తీశారు. ఇందులో రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య లీడ్ రోల్స్‌లో నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ దీపావళికి విడుదల కానుంది. -
ఆ హీరో సినిమా వస్తుందంటే చాలు టీవీకి ముద్దుపెట్టేవారు: కనిమొళి
దివంగత మహానటుడు శివాజీ గణేషన్ తొలి అభిమాని కలైంజ్ఞర్ కరుణానిధి అని డీఎంకే పార్టీ ఉప కార్యదర్శి, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి పేర్కొన్నారు. కరుణానిధి శత జయంతి సందర్భంగా డీఎంకే పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం శివాజీ గణేషన్ కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రాన్ని స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ చిత్రానికి కరుణానిధి సంభాషణలు అందించడం గమనార్హం. కాగా ఈ చిత్ర ప్రదర్శనకు కనిమొళి, దయానిధి మారన్, పూచి మురుగన్ మొదలగు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఈ సందర్భంగా కనిమొళి మాట్లాడుతూ శివాజీ గణేషన్‌కు తొలి అభిమాని కలైంజ్ఞర్ అని చెప్పవచ్చును. శివాజీ గణేషన్ ఎలా నటిస్తున్నారో చూడు అంటూ ఇంటిలో టీవీ చూస్తూ వెళ్లి అమాంతం టీవీకి ముద్దుపెట్టే వారని చెప్పారు. అలాంటప్పుడు తన తల్లి కూడా పరిహాసం ఆడేవారని అయినా శివాజీ గణేషన్ నటన చూసి కరుణానిధి నిగ్రహించుకునేవారు కాదన్నారు. కథానాయకులకు బహు తెలివిని, మార్గదర్శకాన్ని చూపిన చిత్రం పరాశక్తి అని పేర్కొన్నారు. అదే విధంగా ఇప్పటికీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసే వారిగానే కథానాయికలు ఉన్నారని, అయితే అప్పటి హీరోయిన్ పాత్రలు ఆలోచింపచేసేవిగానూ, సామాజిక సందేశాన్ని ఇచ్చేవి గానూ ఉండేవని అభిప్రాయపడ్డారు. Kalaignar - Sivaji Ganesan’s #Parasakthi Special screening is happening now at Woodlands Theatre, Chennai. pic.twitter.com/pLJj5Vmcrm — Christopher Kanagaraj (@Chrissuccess) June 4, 2023 చదవండి: మహాభారత్ నటుడు కన్నుమూత -
ఐశ్వర్య రాజేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా...! కామెడీతో ఆడుకుంది
-
మీ కోసం నా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది: ఖుష్బూ ఎమోషనల్ ట్వీట్
ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ పరిచయ అక్కర్లేని పేరు. అప్పట్లో ఆమె పేరు ఓ సంచలనం. 1990 ప్రాంతంలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో రజినీకాంత్, కమల్ హాసన్, ప్రభు, కార్తీక్ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో ఖుష్బూ నటించారు. 1988లో ధార్మతిన్ తలైవా సినిమాలో బాలనటిగా యాక్ట్ చేసిన ఆమె ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేసింది. 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది ఖుష్బూ. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. తాజాగా చిన్నతంబి సినిమాను తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారామె. ఖుష్బూ ట్వీట్లో రాస్తూ...'చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా. వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. హృదయాలను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నందిని ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రాణంగా ప్రేమించుకున్న ప్రభు, ఖుష్బూలు విడిపోవడానికి కారణమిదే: నటి) కాగా.. ప్రభు, ఖుష్బూ 1993 సెప్టెంబర్ 12న వీరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ ఇదివరకే ప్రభుకు పెళ్లి కావడంతో.. వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్ సహా అతడి కుటుంబం వ్యతిరేకించారు. దీంతో పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. ప్రస్తుతం ఖుష్బూ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. Just can't believe it's been 32 yrs since #ChinnaThambi took tamil cinema by storm. Will always be indebted for the love showered upon me. My heart will always beat for #PVasu Sir & #Prabhu Sir. Forever grateful to #Illaiyaraja Sir for his soul stirring music n Late #KBalu for… pic.twitter.com/EDxxKwnDaN — KhushbuSundar (@khushsundar) April 12, 2023 -
స్టార్ హీరోతో కుష్బూ పెళ్ళి.. నాలుగు నెలలకే విడాకులు
-
ప్రాణంగా ప్రేమించుకున్న ప్రభు, ఖుష్బూలు విడిపోవడానికి కారణమిదే: నటి
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది ఖుష్బూ. బాలనటిగా ఇండస్ట్రీలో కెరీర్ ఆరంభించిన ఆమె ఆ తర్వాత టాప్ హీరోలందరి సరసన కథానాయికగా నటించింది. 1988లో ధార్మతిన్ తలైవా సినిమాలో బాలనటిగా యాక్ట్ చేసిన ఆమె ఇప్పటివరకు 200కు పైగా సినిమాలు చేసింది. 1991లో వచ్చిన చిన్నతంబి సినిమాలో ప్రభుకు జోడీగా నటించింది ఖుష్బూ. అప్పట్లో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిలింఫేర్ అవార్డు సైతం అందుకుంది. ఇక ఈ సినిమాలో తనతో జోడీ కట్టిన ప్రభుతో ఆమె ప్రేమలో ఉందంటూ జోరుగా ప్రచారం నడిచింది. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ 1993 సెప్టెంబర్ 12న వీరి పెళ్లి జరిగింది. పోయిస్ గార్డెన్లో వీరు కొనుక్కున్న ఇంట్లోనే ఈ వివాహం జరిగింది. కానీ ఇదివరకే ప్రభుకు పెళ్లైంది. దీంతో వీరి ప్రేమ పెళ్లిని ప్రభు తండ్రి శివాజీ గణేశన్ సహా అతడి కుటుంబం అంగీకరించలేదు. ఎన్నో గొడవల మధ్య పెళ్లైన నాలుగు నెలలకే ప్రభు, ఖుష్బూ.. ఇద్దరూ విడాకులు తీసుకోక తప్పలేదు. అయితే పెళ్లికి ముందే తనతో నాలుగున్నరేళ్లు సహజీవనం చేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది నటి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రభుకు దూరమవడం ఖుష్బూను మానసికంగా కుంగదీసింది. ఈ వేదన నుంచి బయటపడ్డ అనంతరం ఖుష్బూ 2000 సంవత్సరంలో దర్శకనిర్మాత సుందర్‌ను పెళ్లాడింది. భర్త పేరును తన పేరు చివరన జోడించింది. వీరికి ఇద్దరు కూతుర్లు సంతానం. ఇకపోతే ప్రభు, ఖుష్బూల బంధంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సీనియర్ నటి కాకినాడ శ్యామల. 'ఖుష్బూ చాలా మంచి అమ్మాయి. ఖుష్బూ, ప్రభు ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కానీ వీరి ప్రేమను ప్రభు భార్య అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారికి గొడవలయ్యాయి. అందుకే ఈ గొడవలన్నీ వద్దని తెగదెంపులు చేసుకున్నారు' అని చెప్పుకొచ్చింది. -
కర్మ ప్రకారం జరుగుతుంది..సమంతపై నిర్మాత షాకింగ్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో క్రేజీ హీరోయిన్గా సత్తా చాటుతుంది. ఈ క్రమంలో ఆమె తొలిసారిగా ఫీమెల్ సెంట్రిక్ మూవీలో నటిసస్తుంది. ఈ చిత్రానికి రెయిన్బో అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్నాడు. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికకు జోడీగా శాకుంతలం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. అయితే నిజానికి ఈ సినిమాకు ముందుగా సమంతను హీరోయిన్గా అనౌన్స్ చేశారు. మరి ఏమైందో ఏమో కానీ ఊహించని విధంగా ఆమె స్థానంలో రష్మిక వచ్చి చేరింది. దీంతో అసలు సామ్ ప్లేస్‌లో రష్మిక రావడం ఏంటని సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇదే విషయాన్ని నిర్మాతను అడగ్గా ఆయన మాట్లాడుతూ.. 'స్క్రిప్ట్‌కు ఎవరు సరిపోతారో వాళ్లనే ఎంపిక చేసుకుంటాం. ఆ ఫ్లోని మేం మార్చాలనుకోవడం లేదు. కంటెంట్, కర్మ అలా జరుగుతూ వెళ్తుంటాయి. వాటిని ఎవరూ మార్చలేరు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సమంతను అనౌన్స్ చేసి ఇప్పుడు మరో హీరోయిన్ను తీసుకోవడమే కాకుండా, కర్మ వల్ల ఇలా జరుగుతుందటూ నిర్మాత ప్రభు కామెంట్స్‌పై సామ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. Today marks the start of a colourful journey. Join us as we bring the world of #Rainbow to life! 🌟 @iamRashmika @ActorDevMohan @bhaskaran_dop @justin_tunes @thamizh_editor #Banglan @sivadigitalart @Shantharuban87 @prabhu_sr#RainbowFilm #RainbowPooja pic.twitter.com/puANA99qWM — DreamWarriorPictures (@DreamWarriorpic) April 3, 2023 Happy to have @Samanthaprabhu2 onboard for our next Bilingual film!! #Production#30 #Tamil #Telugu @DreamWarriorpic written & directed by @Shantharuban87 pic.twitter.com/x4OwEI9HPL — SR Prabhu (@prabhu_sr) October 15, 2021 -
ఆస్పత్రిలో ప్రభు
ప్రముఖ నటుడు ప్రభు అనారోగ్యం బారిన పడ్డారు. రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన చెన్నై కోడంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రాళ్లను తొలగించడానికి యుకిథ్రోస్ కోఫీ అనే లేజర్ శస్త్ర చికిత్సను మంగళవారం నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు పేర్కొన్నారు. -
నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
సినీ నటుడు ప్రభు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం(ఫిబ్రవరి 21న) ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కేలంబాక్కంలోని మెడ్వే ఆస్పత్రికి తరలించారు. ప్రభుని పరీక్షించిన వైద్యులు ఆయనకు వెంటనే చికిత్స ప్రారంభించారు. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రభు ఆర్యోగం ప్రస్తుతం నిలకడగా ఉందని, లేజర్ సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలో రాళ్లను తొలగించామన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లుగా తెలిపారు. మరో రెండు రోజుల్లో ప్రభును డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా తమిళ నటుడైన ప్రభు తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితుడు. తెలుగులో ఆయన చంద్రముఖి, డార్లింగ్, శక్తి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రభాస్‌కు డార్లింగ్ చిత్రంలో ఆయన పోషించిన తండ్రి పాత్ర తెలుగు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఇటీవల ప్రభు దళపతి విజయ్ వారసుడు చిత్రంలో కనింపించారు. ప్రస్తుతం ఆయన తమిళం, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చదవండి: హోంటూర్ చేసి చిక్కుల్లో పడ్డ ప్రముఖ నటుడు, రూ. 2.5 లక్షల జరిమానా.. కస్తూరికి అస్వస్థత, ఆ వ్యాధి ప్రభావం చూపిస్తూ ఫొటోలు షేర్ చేసిన నటి -
Latti Review: ‘లాఠీ’ మూవీ రివ్యూ
టైటిల్: లాఠీ నటీనటులు: విశాల్, సునైన, ప్రభు, మనిష్కాంత్, తలైవాసల్ విజయ్, మిషా ఘోషల్ తదితరులు నిర్మాణ సంస్థ: రానా ప్రొడక్షన్స్ నిర్మాతలు: రమణ, నంద దర్శకత్వం: ఎ. వినోద్ కుమార్ సంగీతం: యువన్ శంకర్ రాజా సినిమాటోగ్రఫీ: బాలసుబ్రహ్మణ్యం విడుదల తేది: డిసెంబర్ 22,2022 ‘లాఠీ’ కథేంటంటే.. మురళీకృష్ణ(విశాల్) ఓ సిన్సియర్ కానిస్టేబుల్. భార్య కవి(సునైన), కొడుకు రాజునే ప్రపంచంగా బతుకుతాడు. ఓ హత్యాచార కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పై అధికారులు అతన్ని సెస్పెండ్ చేస్తారు. తిరిగి ఉద్యోగంలో చేరేందుకు మురళీ అధికారుల చుట్టూ తిరుగుతుంటాడు. చివరకు డీఐజీ కమల్(ప్రభు) సాయంతో ఉద్యోగంలో చెరతాడు. ఇకపై ఎవరిని లాఠీతో శిక్షించొద్దని భావించిన మురళీ...సిన్సియర్‌గా తన పని తాను చేసుకుంటూ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతుంటాడు. ఓ సారి డీఐజీ కమల్..తన కస్టడీలో ఉన్న ఓ నేరస్తుడిని లాఠీతో కొట్టమని మురళీని కోరతాడు. తన ఉద్యోగం తిరిగి ఇప్పించాడనే కృతజ్ఞతతో నేరస్తుడు ఎవరనేది చూడకుండా.. అతన్ని లాఠీతో కొడతాడు మురళీ. అయితే ఆ నేరస్తుడు పేరు మోసిన రౌడీ సూరా కొడుకు వీరా అని తర్వాత తెలుస్తుంది. తనను తీవ్రంగా కొట్టిన మురళీపై వీరా పగ పడతాడు. పట్టుకున్న డీఐజీ కమల్ని కాకుండా.. లాఠీతో కొట్టిన మురళి కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. అప్పుడు మురళీ కృష్ణ ఏం చేస్తాడు? సూరా, వీరాలనుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ సాధారణ కానిస్టేబుల్ కథే ‘లాఠీ’. పై అధికారుల ఒత్తిడితో ఓ ముఠాతో వైరం పెంచుకొని.. ఆ ముఠా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తే.. కానిస్టేబుల్ ఒక్కడే తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది ఈ స్టోరీ లైన్. పాయింట్ కొత్తగా ఉన్నా.. కథనం మాత్రం రొటీన్‌గా సాగుతుంది. ఎలాంటి ట్విస్టులు లేకుండా.. యాక్షన్ సీన్స్, ఫ్యామిలీ సన్నివేశాలతో చాలా సింపుల్‌గా కథ ముందుకు వెళ్తుంది. ఫస్టాఫ్‌లో ఓ సాధారణ కానిస్టేబుల్ జీవితాన్ని చూపించారు. నిజాయతీగా ఉండే ఓ కానిస్టేబుల్ పై అధికారి చెప్పారని ఓ నేరస్తుడిని కొట్టడం..అతను పై అధికారిపై కాకుండా కానిస్టేబుల్‌పై పగపెంచుకోవడం.. సెల్‌ఫోన్ రింగ్‌టోన్‌తో అతన్ని గుర్తించడం లాంటి సన్నివేశాల ఫస్టాఫ్ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మాత్రం చాలా రొటీన్‌గా సాగుతూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పోరాట ఘట్టాలు అయినా కొత్తగా ఉంటాయా అంటే అదీ లేదు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా ఆకట్టుకోలేవు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. పోలీసు పాత్రలు విశాల్‌కు కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో పోలీసు పాత్ర పోషించారు. అందుకే కానిస్టేబుల్ మురళీ కృష్ణ పాత్రలో విశాల్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషన్స్ సీన్స్‌లో కూడా చక్కగా నటించాడు కానీ అది వర్కౌట్ కాలేదు. కవిత పాత్రకు సునైనా న్యాయం చేసింది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ప్రభు, తలైవాసన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక విలన్లు సూరా, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ తెరపై విలనిజం పండించడంలో విఫలం అయ్యారు. అయితే ఈ తప్పు వారిది కాదు. ఆ పాత్రలు డిజైన్ చేసిన విధానంలోనే లోపం ఉంది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. పీటర్ హెయిన్స్ పోరాట ఘట్టాలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాలసుబ్రహ్మణ్యం పనితీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు
ప్రముఖ నటుడు ప్రభు తమని మోసం చేశాడంటూ ఆయన తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండ మోసం చేశారని ఆరోపిస్తూ ప్రభు, ఆయన సోదరుడు రామ్‌కుమార్‌లపై వారిద్దరి సోదరిమణులు శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్‌లు దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కుమారులనే సంగతి తెలిసిందే. వీరితో పాటు ఆయనకు శాంతి, రజ్వీ కూమార్తెలు కూడా ఉన్నారు. అయితే శివాజి గణేశన్ చనిపోయిన 20 ఏళ్లకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది. దీంతో ఇది కాస్తా కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్‌కుమార్‌లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తండ్రి మరణం తర్వాత 271 కోట్ల రూపాయల ఆస్తిని సరిగ పంచలేదని, తమని మోసం చేసి పూర్తి ఆస్తిని తమ సోదరులిద్దరే కాజేశారని వారు పటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు తమకు తెలియకుండ ఆస్తులను కూడా విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని వారు కోర్టును కోరారు. అదే విధంగా వెయ్యి తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు , రామ్ కుమార్ అపహరించడమే కాకుండా శాంతి థీయేటర్లో ఉన్న రూ. 82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారిద్దరి పేరిట మార్చుకున్నట్లు వారు ఆరోపించారు. తమ తండ్రి రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని.. జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీపై సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్కుమార్ల పేర్లను మాత్రమ కాకుండా వారి కుమారులైన విక్రమ్ ప్రభు, దష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్లో వారి పేర్లను పేర్కొన్నారు. చదవండి: తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ -
తగ్గేదే లే అంటూనే తగ్గారు.. ఎందులో తగ్గారో తెలుసా ?
Celebrities Weight Loss Transformation Story: తగ్గేదే లే అంటున్నారు.. కానీ తగ్గారు. మరి.. ఏ విషయంలో తగ్గేదే లే అంటే.. నటనపరంగా తగ్గేదే లే అంటూ విజృంభిస్తున్నారు. ఏ విషయంలో తగ్గారు అంటే.. బరువు తగ్గారు. సినీ సెలబ్రిటీలకు అందంతోపాటు ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం. అందుకే వయసు పెరిగినా ఫిట్నెస్ మాత్రం కచ్చితంగా పాటిస్తారు కొందరు సినీ తారలు. అందంగా ఆరోగ్యంగా ఉండటానికి ‘ఫిట్ అండ్ ఫైన్’ అంటున్నారు. సీనియర్ తారలు జయసుధ, ఖుష్బూ, ప్రభు బాగా బరువు తగ్గి కొత్త లుక్‌లోకి మారిపోయారు. ఆ లుక్‌ని ఓ లుక్కేద్దాం. ‘‘నవ్వండి.. ఉచితంగా లభించే మంచి థెరపీ అది’’ అంటున్నారు జయసుధ. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి ఫామ్‌లో ఉన్న ఆమె బరువు తగ్గాక సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి, ఈ విధంగా పేర్కొన్నారు. కొన్ని నెలలుగా అమెరికాలో ఉంటున్న ఈ సహజ నటి అక్కడే బరువు తగ్గే పనిలో పడ్డట్లున్నారు. మామూలుగా సినిమా తారలు బరువు తగ్గితే ఏదైనా పాత్ర కోసం అనుకుంటారు. కానీ ఫిట్‌నెస్‌లో భాగంగానే ఆమె తగ్గారు. పైగా బరువు తగ్గే క్రమంలో ఆమె శాకాహారానికి కూడా మారారని తెలుస్తోంది. ఎందుకంటే ‘వీగన్ ఫుడ్ ట్రై చేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇక ఫిట్‌నెస్‌లో భాగంగానే తగ్గిన మరో తార ఖుష్బూ విషయానికొస్తే.. ఆ మధ్య 15 కిలోలు బరువు తగ్గానంటూ ఓ ఫొటో షేర్ చేశారామె. తాజాగా వెయిట్ మిషన్‌పై నిలబడి చూసుకుని, మరో ఐదు కిలోలు తగ్గానోచ్ అన్నారు. అంటే.. మొత్తం 20 కిలోలు తగ్గించేశారు. ఇలా తగ్గడంవల్ల ఆమె ఆరోగ్యం బాగాలేదని కొందరు అనుకున్నారట. ‘‘నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఎక్కడ అనారోగ్యానికి గురయ్యానో అని కొందరు ఆందోళన పడ్డారు. నా పట్ల వారికున్న అభిమానానికి ధన్యవాదాలు. అసలు నేనింత ఫిట్‌గా ఎప్పుడూ లేను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకునే తగ్గాను. ఈ విషయంలో నేను పది మందికి ఆదర్శంగా నిలిస్తే విజయం సాధించినట్లే’’ అన్నారు ఖుష్బూ. ఈ బ్యూటీ కథానాయికగా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ప్రభు సరసన కొన్ని సినిమాల్లో నటించారు. 1990లలో ఈ ఇద్దరిదీ ‘హిట్ పెయిర్’. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ప్రభు కూడా తగ్గారు. ఖుష్బూలానే ఆయన కూడా 20 కిలోలు వెయిట్ లాస్ అయ్యారు. అయితే ఫిట్‌నెస్‌లో భాగంగా తగ్గలేదు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ ‘పొన్నియిన్ సెల్వన్’ కోసం తగ్గారని కోలీవుడ్ టాక్. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభు కీలక పాత్ర చేస్తున్నారట. ఈ పాత్రలో స్లిమ్ లుక్‌లో కనిపించాల్సి రావడంతో వెయిట్ తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ కోసమో, ఫిట్నెస్ గురించో సీనియర్లు ఇలా తగ్గడం చూసి ‘భేష్.. నటన విషయంలోనే కాదు... తగ్గే విషయంలో కూడా మీరు ఆదర్శమే’ అని కొందరు యువతారలు అంటున్నారు. అభిమానులైతే ఖుషీ అయిపోతున్నారు. -
అగ్ర దర్శకుడికి బేతాళప్రశ్న!
చిత్రం: ‘రాంగ్ గోపాల్ వర్మ’; తారాగణం: షకలక శంకర్, ప్రభు, కత్తి మహేశ్; కెమెరా: బాబు; కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాత, దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు; రిలీజ్: డిసెంబర్ 4; ఓ.టి.టి: శ్రేయాస్. నిజజీవిత వ్యక్తుల జీవితాన్నీ, ప్రవర్తననూ ఆధారంగా చేసుకొని, వారి మీద వ్యంగ్య బాణాలు, విమర్శలు సంధిస్తూ సినిమాలు తీయడం ఓ ప్రత్యేకమైన జానర్. మిగిలిన ప్రాంతీయ భాషా సినీ సీమల్లో కన్నా తెలుగులో ఈ కోవ చిత్రాలు కాస్తంత ఎక్కువే! 1980లలోనే పెద్ద ఎన్టీఆర్ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ‘మండలాధీశుడు’, ‘గండిపేట రహస్యం’ లాంటి వ్యంగ్యాత్మక సినీ ప్రయత్నాలు జరిగాయి. ఈ ఫిక్షనల్ రియాలిటీ చిత్రాలకు పరాకాష్ఠ – ఇటీవల కరోనా కాలంలో హీరో పవన్ కల్యాణ్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘పవర్ స్టార్’. దానికి పోటీగా వర్మపై షకలక శంకర్ హీరోగా వచ్చిన ‘పరాన్నజీవి’. ఈ పర్సనల్ ట్రోలింగ్ సినిమాల మధ్య రచయిత జొన్నవిత్తుల తీస్తానని ప్రకటించిన ‘ఆర్జీవీ’ (రోజూ గిల్లే వాడు) చిత్రం ఇంకా తయారీలో ఉంది. ఇంతలో తాజాగా సీనియర్ సినీ జర్నలిస్టు ప్రభు రూపొందించిన చిత్రం ‘రాంగ్ గోపాల్ వర్మ’. కథేమిటంటే..: పబ్లిసిటీ కోసం, నాలుగు డబ్బుల కోసం రాజ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) అనే ఓ అగ్ర దర్శకుడు విపరీత ధోరణులకు పాల్పడుతుంటారు. ఆ ధోరణిని అతని అసిస్టెంట్లు (కత్తి మహేశ్ వగైరా) ప్రశ్నిస్తారు. దానికి ఆర్జీవీ తనదైన జవాబిస్తారు. కానీ, చివరకు ఆర్జీవీని అంతరాత్మే నిలదీస్తుంది. దానికి ఆయన రియాక్షన్ తెరపై చూడాలి. సినిమా టైటిల్‌ను బట్టి, టైటిల్ రోల్ నటుడి హావభావాలను బట్టి, అంశాలను బట్టి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసిన ఫిక్షనల్ రియాలిటీయో ఇట్టే అర్థమైపోతుంది. ‘ఎ రైట్ డైరెక్టర్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్’ అంటూ టైటిల్‌కు పెట్టిన ట్యాగ్ లైన్‌తోనే సినిమాలో తాను ఏం చెప్పదలుచుకున్నదీ, ఏం చూపించదలుచుకున్నదీ ఈ చిత్రదర్శకుడు తేల్చేశారు. ఎలా తీశారంటే..: ఆర్జీవీని అనుకరించడంలో దిట్ట అయిన షకలక శంకర్ ఆ హావభావాలనూ, డైలాగ్ డెలివరీనీ యథోచితంగా మెప్పించారు. దర్శకుడు ప్రభు సినిమాలో తన నిజజీవిత జర్నలిస్టు పాత్రలో కనిపిస్తారు. మిగిలిన పాత్రధారులు, పరిమిత సాంకేతిక విభాగాల పనితనం అంతే పరిమితం. దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ప్రభుది. ఆయన తన గురువును ఆదర్శంగా తీసుకొని, ఈ 42 నిమిషాల సినిమాకు తానే కాన్సెప్ట్, మాటలు, పాటలు, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. 32 ఏళ్ళుగా సినీ జర్నలిజమ్‌లో అబ్బిన ప్రశ్నించే లక్షణాన్ని ఈసారి కలంతో కాక కెమేరాతో ఆయన వ్యక్తం చేశారనుకోవాలి. ఆర్జీవీకి వ్యతిరేకంగా ఈ సినిమా తీయడానికి వివిధ మెగా సినీ వర్గాల నుంచి ప్యాకేజీలు అందాయని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నంపై పరిశ్రమలో ఓ చిన్న ఆసక్తి నెలకొంది. ఆ గాలివార్తలను కొట్టిపారేసిన దర్శకుడు సినీ పరిశ్రమలోని అవాంఛనీయ ధోరణిని ప్రశ్నించడమే ఈ సినిమా లక్ష్యమని తేల్చారు. అదే సమయంలో ఎవరినో కించపరచాలనే ఉద్దేశంతో కాక, ఆవేదనతో ఈ ప్రయత్నం చేసినట్టు సినిమా చివర చెప్పుకొచ్చారు. మొత్తం మీద కొత్త తరహా సినిమా టేకింగ్, ఆలోచనలతో ఒకప్పుడు దేశాన్ని ఊపేసిన ఓ అగ్ర దర్శకుడు ఇప్పుడు బూతు సినిమాలు, ఫిక్షనల్ రియాలిటీ పేరుతో ట్రోలింగ్ సినిమాలు తీసే స్థాయికి దిగజారిపోవడాన్ని ఈ సినిమా చర్చకు పెడుతుంది. ఆత్మవిమర్శతో పంథా మార్చుకుంటే, ఇప్పటికీ ఆస్కార్ అందుకొనే ప్రతిభ ఆ దర్శకుడికి ఉందని అంటుంది. ‘నా జీవితం, నా సినిమా, నా పోర్న్ కాలక్షేపం, నా ఓడ్కా, నా ట్వీట్లు... నా ఇష్టం’ అనే ఆర్జీవీకి ఇలాంటి సద్విమర్శలూ, సలహాలూ కొత్త కావు. కానీ, సెన్సార్ అవసరం లేని ఓటీటీల పుణ్యమా అని ఆర్జీవీతో సహా పలువురు తీస్తున్న కంటెంట్‌ను చూసినప్పుడు చాలామందిలో కలిగిన ఆవేదనకు తెర రూపం – ఈ లేటెస్ట్ సినిమా. అంతమాత్రాన ఈ తాజా సినిమాతో ఆర్జీవీ సహా అసలు ఎవరైనా మారిపోతారనుకోవడమూ అత్యాశే. అయినా సరే, సినీ రంగంలో ఉంటూ కూర్చున్న చెట్టుకే చేటు తెస్తున్నారన్న వాదనతో ప్రభు ఈ చిరుప్రయత్నం చేశారు. దీనిలో సగటు సినిమా లక్షణాలు వెతుక్కోవడం వేస్ట్. పరిమితమైన బడ్జెట్లో, అతి పరిమితమైన వనరులు, సాంకేతిక సౌలభ్యాలతో తీసిన ఈ కొత్త గిల్లుడు సినిమా పే పర్ వ్యూ పద్ధతిలో ఓటీటీ వేదికలో ఎంత మందికి చేరుతుందో చెప్పలేం. ఎంతమందిని ఆకట్టుకుంటుందో కూడా చెప్పలేం. కాకపోతే, గొప్ప సినీ ప్రయత్నం కాకున్నా... ధర్మాగ్రహంతో వేసిన ఓ ఆవేదనాభరిత ప్రశ్నగా ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ మిగిలిపోవచ్చు. కొసమెరుపు: అగ్రదర్శకుడిపై కలం చూపిన కెమేరా ఆగ్రహం. బలాలు: సినీసీమలో అవాంఛనీయ ధోరణిపై ఆగ్రహం వర్మ చుట్టూ ఉన్న వివాదాలు గడచిన ‘గిల్లుడు సినిమా’ల్లోని అంశాల ప్రస్తావన బలహీనతలు: విడిగా కథంటూ ఏమీ లేకపోవడం విమర్శలు, విశ్లేషణలతోనే మొత్తం సినిమా సాగడం పరిమిత బడ్జెట్, పరిమిత టెక్నికల్ సహకారం – రెంటాల జయదేవ -
ఎమ్మెల్యే ప్రేమ పెళ్లి: హైకోర్టులో ఊరట
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభుకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యే ప్రభు వివాహం చెల్లుతుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఇద్దరూ మేజర్లే కాబట్లి వివాహానికి అభ్యంతరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, ఈ నెల 5న అన్నా డీఎంకే ఎమ్మెల్యే ప్రభు ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారి పెళ్లి చెల్లదంటూ యువతి తండ్రి కోర్టుకెక్కారు. ఎమ్మెల్యే ప్రభు తమ కుమార్తెని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ.. సౌందర్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను అప్పగించాలంటూ మద్రాస్ హై కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అతని పిల్‌ను మద్రాస్ హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఇదిలాఉండగా.. ప్రస్తుతం సౌందర్య బీఏ ఇంగ్లిష్ రెండో ఏడాది చదువుతున్నారు. ఆమె తండ్రి అదే ఊరిలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. (చదవండి: ‘ఎమ్మెల్యే మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు’)