వివాదంగా మారిన ఎమ్మెల్యే ప్రేమ వివాహం | Tamil Nadu Priest Claims MLA Prabhu Abducted Married His Daughter | Sakshi
Sakshi News home page

‘ఎమ్మెల్యే మా అమ్మాయిని కిడ్నాప్‌ చేశాడు’

Published Tue, Oct 6 2020 6:30 PM | Last Updated on Tue, Oct 6 2020 8:19 PM

Tamil Nadu Priest Claims MLA Prabhu Abducted Married His Daughter - Sakshi

చెన్నై: అన్నాడీఎంకే కళ్లకురిచ్చి ఎమ్మెల్యే ప్రభు(34) ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అది కాస్త ఇప్పుడు వివాదస్పదంగా మారింది. ప్రభు తమ కుమార్తెని కిడ్నాప్‌ చేశారని ఆరోపిస్తూ.. సౌందర్య తండ్రి కోర్టును ఆశ్రయించారు. తమ కుమార్తెను అప్పగించాలంటూ మద్రాస్‌ హై కోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభు తమ కుమార్తెను కిడ్నాప్‌ చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. ఈ కేసును మద్రాస్‌ హై కోర్టు ధర్మాసనం రేపు విచారించనుంది. ఇక వివాహం అనంతరం ప్రభు ఒక వీడియోను పోస్ట్‌ చేశారు. ‘దానిలో ఇష్టపూర్వకంగానే మా వివాహం జరిగింది. దీనిలో ఎవరి బలవంతం లేదు. మేం నాలుగు నెలలుగా ప్రేమించుకుంటున్నాం. నేను తనను కిడ్నాప్‌ చేశాననే మాట అవాస్తవం. వివాహం అనంతరం మేం సౌందర్య తల్లిదండ్రుల ఆశీస్సుల కోసం వారి ఇంటికి వెళ్లాం. కానీ వారు మమ్మల్ని తిరస్కరించారు. ఈ పెళ్లికి మా తల్లిదండ్రుల అనుమతి ఉంది’ అని తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే ప్రేమ వివాహం )

ఇక సౌందర్య మాట్లాడుతూ.. ‘నేను ప్రభుని ప్రేమించాను. వివాహం చేసుకోవాలని నన్ను ఎవరు బలవంతం చేయలేదు’ అని తెలిపారు. సౌందర్య తండ్రి ఆమె ఊరి గుడిలో అర్చకుడిగా పని చేస్తున్నారు. కులాంతర వివాహం కావడంతో వారు ఈ వివాహాన్ని అంగీకరించడం లేదని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement