AIADMK
-
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
సోషల్‌మీడియాలో వివాదస్పద పోస్టు.. నటుడికి జైలు శిక్ష
సినీ నటుడు, రాజకీయ ప్రముఖుడు ఎస్వీ శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్షను ఖరారు చేస్తూ మద్రాసు హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. 2018లో ఎస్వీ శేఖర్ సామాజిక మాధ్యమాలలో పెట్టిన ఓ పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు విచారణలో తేలింది. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో వెలుగు చూసింది. అదే సమయంలో పశ్చాత్తాపం వ్యక్తంచేస్తూ ఎస్వీ శేఖర్ క్షమాపణ చెప్పుకున్నా, కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును సైతం శేఖర్ ఆశ్రయించారు. విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయ వేల్ విచారించారు. విచారణను ముగించిన ప్రత్యేక కోర్టు గత ఏడాది ప్రారంభంలో తీర్పు వెలువరించింది. ఎస్వీశేఖర్‌కు నెల రోజులు జైలు శిక్ష, రూ. 15 వేలు జరిమాన విధించారు. అదే సమయంలో అప్పీల్‌కు అవకాశం కల్పించాలని ఎస్వీశేఖర్ తరపున న్యాయమూర్తికి న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో సమయం కేటాయించారు. అప్పీలు పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించడంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు. ఈ పిటిషన్ విచారణ ప్రస్తుతం ముగిసింది. తీర్పును న్యాయమూర్తి వేల్ మురుగన్ వెలువరించారు. ప్రత్యేక కోర్టు విధించిన నెల రోజుల జైలు శిక్షను ఖరారు చేశారు. అప్పీల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. ఎస్వీ శేఖర్ తెలుగు వారికి కూడా పరిచయమే.. ఆకలి రాజ్యం,అందమైన అనుభవం,వల్లభ,ఒకే ఒక్కడు వంటి చిత్రాలలో ఆయన నటించారు. 100కు పైగా తమిళ సినిమాలలో మెప్పించారు. 2006లో ఏఐఏడీఎంకే పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు.మహిళా జర్నలిస్ట్‌పై నీచమైన కామెంట్తమిళనాడులో చదువుకోని, ఇంగితజ్ఞానం లేని అమ్మాయిలే ఎక్కువగా మీడియాలో పనిచేస్తున్నారని ఒక మహిళా జర్నలిస్ట్‌ను ఉద్దేశిస్తూ.. 2018లో ఆయన ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. 'విశ్వవిద్యాలయాల కంటే, మీడియాలో లైంగిక వేధింపులు ఎక్కువగా ఉన్నాయి. వారు తమ బాస్‌లతో సన్నిహితంగా ఉంటూ అందుకు ఫలితంగా రిపోర్టర్లు, న్యూస్ యాంకర్లుగా ఉద్యోగాలు పొందుతున్నారు. సాధారణంగా, తమిళనాడులోని మీడియా మొత్తం నేరస్థులు, కిరాతకులు, దోపిడీదారుల చేతుల్లో చిక్కుకుంది.' అని పేర్కొన్నాడు. -
తమిళగ వెట్రి కళగం పార్టీపై వార్తలు.. నిజమేనా?
చెన్నై : 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తమిళగ వెట్రి కగళం (టీవీకే) పార్టీని స్థాపించారు. అయితే ఆ పార్టీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకి నెటింట్లో ట్రెండ్ అవుతున్న ఆ వార్త నిజమేనా? దీనిపై దళపతి విజయ్ ఏమన్నారు2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం పొత్తు పెట్టుకోనున్నాయని తమిళ ప్రధాన మీడియా సంస్థలు పలు కథనాల్ని ప్రచురించాయి. అందుకు గత అక్టోబర్ నెలలో టీవీకే పార్టీ తొలి బహిరంగ సభలో విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని కొన్ని ఆధారాల్ని జత చేశాయి.అక్టోబర్‌లో విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి బహిరంగ సభ జరిగింది. ఆ సభలో విజయ్ డీఎంకే, బీజేపీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. అయితే ఎక్కడా ఏఐఏడీఎంకే గురించి ఎక్కడా మాట్లాడలేదని హైలెట్ చేశాయి.అయితే, ఈ కథనాలపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఏఐఏడీఎంకేతో టీవీకే పొత్తు అనేది పూర్తిగా అబద్ధమని ఖండించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు లేకుండా టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుంది. ప్రజల మద్దతుతో మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల ముసుగులో మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతుందని, ఇలాంటి అవాస్తవ, తప్పుడు వార్తలను పట్టించుకోవద్దని తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను’అని టీవీకే ఎక్స్ వేదికగా వివరణిచ్చింది. தலைமை நிலையச் செயலக அறிவிப்புதமிழக வெற்றிக் கழகத்தின் முதல் மாநில மாநாட்டில் கழகத்தின் கொள்கைகள், கொள்கை எதிரி, அரசியல் எதிரி, தேர்தல் நிலைப்பாடு குறித்தும் தமது உரையில் கழகத் தலைவர் அவர்கள் தெளிவாக, விளக்கமாக எடுத்துரைத்துள்ளார். கழகத் தலைவர் அவர்களின் வழிகாட்டுதலின்படி…— TVK Party Updates (@TVKHQUpdates) November 18, 2024 -
‘విజయ్ పార్టీది.. కాపీ, కాక్టెయిల్ భావజాలం’
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన సభలో.. టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరైన విషయం తెలిసిందే.అయితే.. తాజాగా రాజకీయాల్లో విజయ్ చెప్పిన భావజాలాన్ని డీఎంకే పార్టీ కొట్టిపారేసింది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అధికార డీఎంకే పార్టీ నేత విమర్శలు గుప్పించారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ఇతర పార్టీల నుంచి కాపీ కొట్టారని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం.. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే, ఇతర పార్టీల ప్రస్తుత రాజకీయ దృక్కోణాల ‘కాక్టెయిల్’ అని ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ మా విధానాలు, కానీ విజయ వాటిని కాపీ చేశాడు. ఆయన ఏది చెప్పినా.. అది మేం ఇప్పటికే చెప్పాం, ఇప్పటికీ మేం వాటిని అనుసరిస్తున్నాం’’అని అన్నారు.ఇక.. నిన్న( ఆదివారం) విజయ్ తన తొలి బహిరంగ సభ ప్రసంగంలో అధికార డీఎంకే పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తమ పార్టీ అనుసరిస్తామని తెలిపారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
జ్యోతిష్యం ఫలిస్తుంది!
సాక్షి, చెన్నై: జ్యోతిష్యం ఫలిస్తుందని, 2026లో రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆపార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం సేలంలో జరిగిన పార్టీ నేతల సమావేశానంతరం పళణిస్వామి మీడియాతో మాట్లాడారు. డీఎంకే కూటమిలో పొగచిచ్చుగా మారడం ఖాయం అన్నారు. 41 నెలల డీఎంకే పాలనలో నోరెత్తని కూటమి పారీ్టల నేతలు ఇప్పడు విమర్శలు గుప్పించడాన్ని ప్రతిఒక్కరూ పరిగణించాలన్నారు. ఈ పరిణామం చీలిక కాదా అని ప్రశ్నించారు. పళని స్వామి జ్యోతిష్కుడు అయ్యాడని సీఎం వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. వాస్తవమే జ్యోతిష్యం ఫలిస్తుందని 2026లో రాష్ట్రంలో అధికారం అన్నాడీఎంకే గుప్పెట్లోకే అని ధీమా వ్యక్తంచేశారు. దేశంలోనే తమిళనాడు అవినీతిలో ముందంజలో ఉందని ధ్వజమెత్తారు. అన్నాడీఎంకేలో యువత రావాలని, యువతను ఆకర్షించే కార్యక్రమాలు విస్తృతంచేయనున్నట్టు పేర్కొన్నారు. పళణికి నోటీసులు.. పళణిస్వామికి మద్రాసు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో గతంలో సినీ నిర్మాత జాఫర్ సాధిక్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని డీఎంకేపై పళణిస్వామి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ పేరుకు కళంగం తెచ్చే విధంగా వ్యవహరించారని ఆయనపై డీఎంకే సీనియర్ నేత ఆర్ఎస్ భారతీ రూ.కోటి పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి టికారాం విచారించారు. వాదనల అనంతరం వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పళణిస్వామికి నోటీసులు జారీ చేశారు. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
అన్నాడీఎంకేలో నా పార్టీ విలీనం చేయను: టీటీవీ దినకరన్
చెన్నై: తమిళనాడు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై అన్నాడీఎంకే ఘోర ఓటమికి ఆ పార్టీ నేత ఎడప్పాడి కె పళనిస్వామి క్షమాపణలు చెప్పాలని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) జనరల్ సెక్రటరీ టీటీవీ దినకరన్ అన్నారు. తంజావురులో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే పార్టీ ప్రస్తుతం డబ్బులు ఉన్నవారి చేతిలో చిక్కుకుందన్నారు.కేవలం కార్యర్తలు మాత్రమే దివంగత జయలలిత అభిమానులని తెలిపారు. ప్రస్తుతం అన్నాడీఎంకే పార్టీకి నాయకత్వం దారితప్పిందని విమర్శలు చేశారు. అటువంటి పార్టీలో తన పార్టీని ఎట్టిపరిస్థితుల్లోను విలీనం చేయబోనని నకరన్ అన్నారు. అన్నాడీఎంకే తన పార్టీని విలీనం అస్సలు సాధ్యంకాదని తేల్చిచెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో సుమారు 20 స్థానాల్లో అన్నాడీఎంకే ఓటు షేర్ తగ్గిందని తెలిపారు. మరోవైపు ఎన్డీయే కూటమి అనూహ్యంగా 18.5 శాతం ఓటు షేర్‌ను సాధించిందని అన్నారు. అన్నాడీఎంకే తగ్గిన ఓటు షేర్‌ను గమనిస్తే.. ఆ పార్టీకి మైనార్టీ కులాల నుంచి మద్దతు పడిపోయిందన్నారు. విక్రవంది అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎన్డీయే కూటమి పక్షాలు అన్నీ చర్చించుకోని నిర్ణయిస్తామని అన్నారు. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి ఎలాంటి నిబంధనలు లేకుండా టీటీవీ దినకరన్ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. -
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్‌గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్ ఫైట్
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది... కోయంబత్తూర్ బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటలూ మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్ నెగ్గారు. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్‌కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం! చెన్నై సౌత్ ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్‌గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం. 2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్‌పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. నీలగిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్.మురుగన్‌ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఎ.చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిటింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. రామనాథపురం ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్‌సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్‌కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె.నవాన్ ఖని (ఐయూఎంఎల్) ఓపీఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. తేని జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి.రవీంద్రనాథ్ పన్నీర్‌సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
త్రిముఖ పోరు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై గెలిచేనా?
చెన్నై : దక్షిణ చెన్నై పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానం అధికార పార్టీ డీఎంకేకి కంచుకోటే అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజయం సాధిస్తారా? తమిళనాడులో దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం హాట్‌సీట్ మారింది. డీఎంకే కంచుకోటలో త్రిముఖపోరు జరగబోతుంది. ప్రస్తుత డీఎంకే సిట్టింగ్ అభ్యర్ధి తమిళచి తంగపాండియన్‌పై తమిళనాడు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఏఐఏడీఎంకే తరుపున జే. జయవర్ధన్ తలపడనున్నారు. గవర్నర్ పదవినే వదులుకున్నా ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళసై సౌందరరాజన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమిళసై మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. గెలిచిన వెంటనే దక్షిణ చెన్నైలో మంచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంతో నాకు ఎనలేని అనుంబంధం ఉంది. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్ పదవిని సైతం వదులుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రోగ నిరోధక శక్తి పెరగాలి తమిళసై స్వతహాగా వైద్యురాలు కావడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దక్షిణ చెన్నైకి ఎలాంటి మందులు ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గం మొత్తం చెత్త, డంపింగ్ యార్డులతో నిండిపోయింది. ముందు నియోజకవర్గానికి రోగనిరోధక శక్తి పెరగాలి. ఆపై రవాణా, పరిశుభ్రత, దోమల బెడదపై దృష్టి సారిస్తామని సూచించారు. వారిదే కీలకం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేస్తుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పీఎంకే ప్రాభవం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీలు) చెందిన వన్నియార్లు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు, ఓటుముల్ని నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. -
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్‌కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్‌సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్‌హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
డీఎంకే ప్రజా వ్యతిరేకం.. మండిపడ్డ అన్నాడీఎంకే నేత
తమిళనాడు: సార్వత్రిక ఎన్నికలకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీల దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్నీ కూడా తమదైన రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కూడా పోటాపోటీగా బరిలో నిలిచాయి. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐఏడీఎంకే అభ్యర్థి జే జయవర్ధన్ ఆరోపించారు. ఈయన సౌత్ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. డీఎంకే ప్రజావ్యతిరేక పార్టీ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అని జయవర్ధన్ పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వంలో ఏ నియోజక వర్గంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని, హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తప్పకుండా గెలుస్తుంది. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను గురువారం అన్నాడీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే కూటమిలో ఏఐఏడీఎంకే 32 స్థానాల్లో, డీఎండీఎంకే 5 స్థానాల్లో, ఎస్డీపీఐ 1 స్థానంలో, పుతియా తమిళగం 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. మొత్తమ్ ఈ 39 స్థానాలకు ఏప్రిల్ 19న సార్వత్రిక ఎన్నికల తొలి దశలో ఓటింగ్ జరగనుంది. ఆ తరువాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | Tamil Nadu: Dr J Jayavardhan, AIADMK candidate from South Chennai says, "This is a consultation meeting with regards to how to work for the coming Lok Sabha election in South Chennai constituency...It is very well seen that the party cadres are with much enthusiasm… pic.twitter.com/Ff6u5pa6CA — ANI (@ANI) March 26, 2024 -
లోక్‌సభ ఎన్నికల బరిలో ‘కెప్టెన్’ విజయ్ కాంత్ కుమారుడు
చెన్నై, తమిళనాడు : డీఎండీకే అధినేత, దివంగత నటుడు విజయ్‌కాంత్ తనయుడు వి.విజయ్ ప్రభాకర్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడియన్ లీగ్ (డీఎండీకే) పార్టీ, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేల మధ్య పొత్తు కుదిరింది. అలయన్స్‌లో భాగంగా విజయ్ ప్రభాకర్ విరుధ్ నగర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఇదే స్థానం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ బీజేపీ తరుపున టికెట్ దక్కించుకున్నారు. డీఎంకే - ఇండియా అలయన్స్ మాత్రం అభ్యర్ధిని ప్రకటించలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి కెప్టెన్ కుమారుడు తమిళనాడు ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకే విడుదల చేసిన 16 మంది లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో కెప్టెన్ విజయ్ కాంత్ కొడుకు విజయ్ ప్రభాకర్ పేరును ప్రకటించింది. ఈ సందర్భంగా డీఎండీకే జనరల్ సెక్రటరీ, విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత మాట్లాడుతూ.. తన కుమారు విజయ్‌కి రాజకీయాల పట్ల నిబద్ధత, ఇష్టం ఉన్నాయని, రానున్న లోక్‌సభ ఎన్నికలతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు తెలిపారు. ఏఐఏడీఎంకే మేనిఫెస్టో విడుదల ఏఐఏడీఎంకే పలు పార్టీలతో పొత్తు కుదుర్చుకుంది. వాటిల్లో డీఎండీకే, సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పుతియా తమిజగం నేతృత్వంలో మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు గాను 32 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోని సైతం విడుదల చేసింది. -
‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా’
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణించి ఏడేళ్లు అవుతోంది. నేడు(శనివారం) ఆమె 76వ జయంతి సందర్భంగా ఏఐఏడీఎంకే జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్), పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు జయలలిత(అమ్మ)కు నివాళులు అర్పించారు. అయితే ఈసారి వినూత్నంగా ‘అమ్మ’ జయంతిని పురస్కరించుకొని.. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపడానికి ఏఐఏడీఎంకే సరికొత్తగా ఆలోచించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో తయారుచేసిన ‘అమ్మ’వాయిస్ క్లిప్‌ను పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ‘అమ్మ’తో ఉన్న అనుబంధాన్ని నేతలు గుర్తు చేసుకున్నారు. ఏఐ వాయిస్ క్లిప్‌లో అచ్చం ‘అమ్మ’నే పార్టీ నేతలు, కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడినట్టు ఉండటం విశేషం. ఆ ఏఐ క్లిప్‌లో దివంగత నేత జయలలిత ప్రసంగం ఇలా ఉంది... ‘హలో.. నేను మీ జయలలితను మాట్లాడుతున్నా. ఈ సాంకేతికతకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకుంటే నేను మీతో మాట్లాడే అవకాశం ఇచ్చింది. మన పార్టీ చాలా ఎత్తుపల్లాలను చూసింది. మనం అధికారంలో ఉన్నో సమయంలో మహిళలు, విద్యార్థులకు అనేక సంక్షేమ పథకలు ప్రవేశపెట్టి అమలు చేశాం. மாண்புமிகு இதயதெய்வம் புரட்சித்தலைவி அம்மா அவர்களின் 76வது பிறந்தநாள் விழாவினை முன்னிட்டு, மாண்புமிகு கழக பொதுச்செயலாளர் புரட்சித்தமிழர் @EPSTamilNadu அவர்களின் வழிகாட்டுதலின்படி இன்றைக்கு தகவல் தொழில்நுட்பத்தின் உச்சமாகக் கருதப்படும் செயற்கை நுண்ணறிவு (Artificial Intelligence)… pic.twitter.com/APuSq7u6AW — AIADMK (@AIADMKOfficial) February 24, 2024 ...ప్రస్తుతం ఒకవైపు మనకు ద్రోహం చేసే కేంద్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు అవినీతితో నిండిపోయిన పనికిరాని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఒకటి చెబుతున్నా.. మన పార్టీ నేతృత్వంలో ప్రజల ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలి. మన కార్యకర్తలంతా నా మార్గంలో పార్టీ కోసం నడవాలని కోరుతున్నా. పార్టీకి, సోదురుడు ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మద్దతుగా నిలవాలి. ఈపీఎస్ నాయకత్వాని బలోపేతం చేయాలి. ఎందుకంటే మనం ప్రజల కోసమే ఉన్నాం’ అని జయలలిత స్వయంగా మాట్లాడినట్లు వాయిస్ వచ్చింది. దీంతో జయలలిత ఏఐ వాయిస్ క్లిప్ విన్న కార్యకర్తలంతా తమ అధినేత్రి జీవించి ఉన్నట్లుగానే అనిపించిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) 2022లో ఏఐఏడీఎంకేకు నాయకత్వం వహిస్తున్నారు. పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడిన అనంతరం ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) పార్టీ చీఫ్‌గా కొనసాగుతున్నారు. -
రాజకీయ నాయకుడు అసభ్యకర కామెంట్స్.. త్రిష కీలక నిర్ణయం!
అన్నాడీఎంకే బహిష్కృత నేత ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన కామెంట్స్‌పై పలువురు సినీతారలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంలో త్రిష చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఇప్పటికే వెల్లడించింది. తన లీగల్ టీం దీనిపై న్యాయపరంగా ముందుకెళ్తుందని తెలిపింది. తాజాగా ఏవీ రాజు కామెంట్స్‌పై త్రిష టీం చర్యలకు దిగింది. ఆయనపై త్రిష పరువునష్టం దావా కేసు వేశారు. దీనికి సంబంధించిన నోటీసులను తన ట్విటర్లో పంచుకున్నారు. తన లీగల్ టీం ద్వారా ఏవీ రాజుకు నోటీసులు పంపించారు. కాగా.. గతంలో త్రిషపై లియో నటుడు మన్సూర్ అలీ ఖాన్ అసభ్యకర కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరారు. తాజాగా మరోసారి అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు త్రిషను ఉద్దేశించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన చేసిన కామెంట్లను కోలీవుడ్ సినీ తారలంతా మూకుమ్మడిగా ఖండించారు. త్రిషకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. గతంలో ఓ ఎమ్మెల్యే త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కు తీసుకొచ్చారంటూ ఏవీ రాజు చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. pic.twitter.com/DmRXHibIYx — Trish (@trishtrashers) February 22, 2024 -
'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ వైరల్!
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్‌పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్‌గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names… — Vishal (@VishalKOfficial) February 20, 2024 -
త్రిషపై మరోసారి అలాంటి కామెంట్స్.. ఇంతటి నీచానికి దిగుజారుతారా?
గతేడాది లియోతో సూపర్ హిట్ కొట్టిన భామ త్రిష. విజయ్ సరసన హీరోయిన్గా నటించి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించిన నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్ పెద్దఎత్తున వివాదస్పదమయ్యాయి. ఏకంగా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై పలువురు సినీతారలు మండిపడ్డారు. అయితే తాజాగా అన్నాడీఎంకే మాజీ లీడర్ ఏవీ రాజు చేసిన అసభ్యకర కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. త్రిషపై ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అతనిపై మండిపడుతున్నారు. తక్షణమే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో త్రిషకు పలువురు అండగా నిలుస్తున్నారు. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలవుతోంది. (ఇది చదవండి: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా వివరణ ఇచ్చిన మన్సూర్!) తాజాగా ఈ విషయంపై హీరోయిన్ త్రిష స్పందించింది. ఫేమస్ కావడం కోసం ఏంతటి నీచానికైనా దిగజారిపోయే జీవితాలు అవీ.. పదే పదే ఇలాంటి నీచమైన మనుషులను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. దీనిపై త్వరలోనే న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ తదుపరి చర్యలు తీసుకుంటుందని ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా.. త్రిష ప్రస్తుతం మెగాస్టార్ సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. గతంలో ఓ ఎమ్మెల్యే డబ్బులిచ్చి త్రిషను రిసార్ట్‌కు తీసుకొచ్చారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఏవీ రాజు కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా త్రిషపై అసభ్యంగా మాట్లాడిన ఏవీ రాజును అరెస్ట్ చేయాలని నటుడు, దర్శకుడు చేరన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై నటీనటుల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా బహిరంగంగా సినీ పరిశ్రమలోని సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. WTF this Trisha should file legal action against him,nowdays these guys are behaving very cheaply #Trisha | #TrishaKrishnan pic.twitter.com/Ip1ZClB8xS — Sekar 𝕏 (@itzSekar) February 20, 2024 It's disgusting to repeatedly see low lives and despicable human beings who will stoop down to any level to gain https://t.co/dcxBo5K7vL assured,necessary and severe action will be taken.Anything that needs to be said and done henceforth will be from my legal department. — Trish (@trishtrashers) February 20, 2024 வன்மையாக கண்டிக்கிறேன்.. எந்த ஆதரமுமின்றி பொது வெளியில் திரைத்துறையினர் பற்றி பெயர் சொல்லி அவதூறு கிளப்பிய இவரை சட்டமும் காவல்துறையும் உரிய நடவடிக்கை எடுக்க வேண்டும்... @VishalKOfficial @Karthi_Offl நடிகர் சங்கம் இதற்கு தகுந்த பதிலும் நடவடிக்கையும் எடுக்கும் என நம்புகிறேன் https://t.co/fRNYxH5DAV — Cheran (@directorcheran) February 20, 2024 Shocked & disgusted by the behaviour of Ex AIADMK functionary A. V. Raju for making unwarranted , baseless, loose and completely false allegations about Trisha. It is 2024; we talk about women empowerment & equality - why drag an unrelated person into personal mud slinging. There… — Aditi Ravindranath (@aditi1231) February 20, 2024 -
అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ నటి గౌతమి
-
ట్రాన్స్ జెండర్‌పై అనుచిత వ్యాఖ్యలు..
చెన్నై: ట్రాన్స్‌జెండర్ వ్యాపారవేత్త, ఏఐఏడీఎంకే అధికారి ప్రతినిధి అప్సరా రెడ్డిని అప్రతిష్టపాలు చేసిన ఓ యూట్యూబర్‌కు మద్రాస్ హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది! ఆమె ప్రొవోగ్ మేగజీన్‌లో పని చేసిన రోజుల్లో మైకేల్ ప్రవీణ్ అనే సహోద్యోగితో విభేదాలొచ్చాయి. దాంతో అతను అప్సరను కించపరుస్తూ 10 వీడియోలను యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. ప్రవీణ్ నుంచి రూ.1.25 కోట్లు పరిహారం కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఆమెకు రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ‘‘సోషల్ మీడియాలో పోస్టులతో ఇతరుల గోప్యతకు భంగం కలిగించొద్దు. ఏ హక్కయినా పరిమితులకు లోబడి ఉంటుంది’’ అని పేర్కొంది. -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు. ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు -
అన్నాడీఎంకేలో చీలికకు బీజేపీ యత్నం
అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టే దిశగా బీజేపీ వ్యూహాలు పన్నుతోందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీలో సీనియర్‌గా ఉన్న ఎస్పీ వేలుమణిని అస్త్రంగా చేసుకుని పళణి స్వామికి వ్యతిరేకంగా కేంద్రపెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఫలితంగా అన్నాడీఎంకే నుంచి త్వరలో ఓ ఏక్నాథ్ షిండే వస్తారని, మహారాష్ట్ర తరహా రాజకీయం తమిళనాడులో చూడబోతున్నామనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. సాక్షి, చైన్నె: ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. రాయబారానికి, సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేస్తూ, ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను బీజేపీ అధిష్టానం పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యూహాలకు సైతం పదును పెట్టినట్లు తెలుస్తోంది. చిచ్చు ప్రయత్నాలు అన్నాడీఎంకే సీనియర్లలో ఎస్పీ వేలుమణి కీలక నేత. ఆయనపై అనేక కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులను అస్త్రంగా చేసుకుని ఆయన్ని తమ దారికి తెచ్చుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఎస్పీ వేలుమణి ద్వారా అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జోరందుకుంది. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి ఓ ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర సీఎం) అన్న ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేను ఏవిధంగా ఏక్నాథ్ షిండే కూల దోశాడో..అదే తరహాలో పళణిస్వామికి ఎస్పీ వేలుమణి చుక్కలు చూపించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్త అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీశాయి. దీంతో ఎస్పీ వేలుమణి స్పందించారు. తాను అప్పుడు.. ఇప్పుడు..ఎల్లప్పుడూ అన్నాడీఎంకేకు విశ్వాస పాత్రుడినే అని స్పష్టం చేశారు. తాను సైకిల్ యాత్ర చేసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ తన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా అన్నామలైను ప్రకటించాలని బీజేపీ ఒత్తిడి తీసుకు రావడంతోనే కూటమి నుంచి తాము బయటకు వచ్చామని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కరుప్పన్నన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి వారి బలం ఏమిటో లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేస్తాయని మరో సీనియర్ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. నేడు అమిత్ షాతో అన్నామలై అన్నాడీఎంకే కటీఫ్ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్నామలై అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. దూకుడు మీదున్న అన్నామలై అమిత్ షా ముందు కొత్త ప్రతిపాదనను ఉంచేందుకు సిద్ధమైనట్లు చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అమిత్‌షాను ఆయన కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడే తమిళనాడులో బీజేపీ బలం ఏమిటో తెలుస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్తుకు కార్యాచరణ సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ నివేదికను సిద్ధం చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పళణి కొత్త ప్రయత్నాలు బీజేపీతో ఇక దోస్తీ లేదని తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొత్త కూటమి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. బలమైన కూటమి దిశగా తమతో కలిసి రావాలని పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలకు ఆహ్వానం పలికేవిధంగా రాయబార ప్రయత్నాలు మొదలెట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మూడు పార్టీలతోపాటు కొన్ని చిన్న పార్టీలను తన వైపునకు తిప్పుకునే దిశగా ప్రయత్నాలను జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకేలో అసంతృప్తిగా ఉన్న కొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునే ప్రయత్నంలో పళణిస్వామి ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు. -
తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్’.. మరో కొత్త ఎత్తుగడ?
చెన్నై: తమిళనాడులో పొలిటికల్ హీట్ కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఆసక్తికర కామెంట్స్ చేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతోందని వ్యాఖ్యలు చేశారు. దీంతో, తమిళనాడు రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీ కొత్త ప్లాన్.. అయితే, తమిళనాడులో అన్నాడీఎంకే.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ ప్రతినిధి మునుస్వామి స్పష్టం చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమితోనే బరిలోకి దిగుతామన్నారు. మరోవైపు.. అన్నాడీఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వం బాంబు పేల్చారు. పళనిస్వామి.. బీజేపీతో తెగదెంపులు చేసుకున్న వెంటనే ఆ పార్టీ తనను సంప్రదించినట్టు తెలిపారు. బీజేపీ జాతీయ నాయకత్వం తనతో సంప్రదింపులు జరుపుతున్నదని, కూటమిపై బీజేపీ ప్రకటన చేసిన తర్వాతనే తన వైఖరి వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు. Chennai | Former Tamil Nadu CM O Panneerselvam said, "The BJP leadership has been in regular touch with me (in recent times)... Will the AIADMK accept if the BJP asks for replacing (AIADMK general secretary) Palaniswami? Will they replace him? Then how can they ask to change BJP… pic.twitter.com/7xCrBCzHbZ — ANI (@ANI) September 29, 2023 పళణిస్వామిపై సెటైర్లు.. ఇదే సమయంలో అన్నాడీఎంకేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలైని మార్చాలని అన్నాడీఎంకే.. కమలం పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చిందనే ప్రచారంపై ఆయన స్పందించారు. అన్నాడీఎంకేకు పళనిస్వామిని మార్చాలని బీజేపీ కోరితే ఆ పార్టీ అంగీకరిస్తుందా అని ఎదరు ప్రశ్నించారు. బీజేపీ ఒత్తిడికి తలొగ్గి పళనిస్వామిని మార్చేస్తుందా అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాలని ఎలా అడుగుతారని విమర్శలు చేశారు. అలా అడిగే హక్కు పళనిస్వామి పార్టీకి లేదని సీరియస్ అయ్యారు. అయితే, పన్నీరు సెల్వం.. బీజేపీతో కలిస్తే ఇప్పటి వరకు అన్నాడీఎంకేతో ఉన్న కేడర్ కమలం పార్టీ సపోర్టు చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో, పళనిస్వామి వర్గానికి ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ ఉందంటున్నారు. ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్ -
తమిళనాట రసవత్తర రాజకీయం.. అన్నాడీఎంకే కీలక ప్రకటన
చెన్నై: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇటీవలే ఎన్డీయేకు గుడ్ బై చెప్పిన అన్నాడీఎంకే తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. వచ్చే పార్లమెంటు ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామని అన్నాడీఎంకే వెల్లడించింది. ఈ క్రమంలో తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, బీజేపీ పార్టీపై అన్నాడీఎంకే నేతలు ఘాటు విమర్శలు చేశారు. 2024 ఎన్నికల నాటికి కొత్త కూటమి.. అయితే, తమిళనాడులోకి క్రిష్ణగిరిలో అన్నాడీఎంకే నేత మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ చెబుతున్నట్టు తాము బీజేపీతో తాము కూటమిలో లేమని స్పష్టం చేశారు. మేం బీజేపీతో పొత్తు తెంచుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే భయంతో వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీతో నాలుగేళ్ల బంధాన్ని తెంచుకున్నట్టు తెలిపారు. పళానిస్వామి సారథ్యంలో కొత్త కూటమిని ఏర్పాటు చేసి నాయకత్వం వహిస్తామన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం కొత్త కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. అన్నామలైపై కీలక ప్రకటన.. ఇదే సమయంలో తాము తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నమలైని పదవి నుంచి తొలగించాలని కోరలేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే వంటి పెద్ద పార్టీ ఒక పార్టీని వారి రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాలని కోరుతుందని అనుకోవడం చిన్నపిల్లల మనస్తత్వం. మేం అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయం. వేరే పార్టీ ఎలా పని చేయాలో చెప్పే అనాగరిక నేతలం మేం కాము. అన్నాడీఎంకే అలాంటి పార్టీ కాదని వివరణ ఇచ్చారు. మరోవైపు.. అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఇకపై కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. కొత్త కూటమి విషయంగా ఎన్నికల సమయంలో నిర్ణయం ఉంటుందని, తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అన్ని విషయాలను త్వరలో ప్రకటిస్తారన్నారు. స్పీడ్ పెంచిన పళణిస్వామి.. ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన అనంతరం పళణి స్వామి పార్టీలో మార్పులు చేర్పులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఖాళీగా ఉన్న ఆరు జిల్లాలకు కొత్త కార్యదర్శులను బుధవారం నియమించారు. మరికొన్ని జిల్లాల కార్యదర్శులలో స్వల్ప మార్పులు చేశా రు. అనుబంధ విభాగాలకు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు కన్యాకుమారి జిల్లా కార్యదర్శిగా మాజీ మంత్రి దళవాయి సుందరం, తిరుచ్చి మహానగర కార్యదర్శిగా మాజీ డిప్యూటీ మేయర్ శ్రీనివాసన్, పెరంబలూరు జిల్లా కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే తమిళ్ సెల్వం, తంజావూరు తూర్పు కుంబకోణం కార్యదర్శి రామనాథన్, తంజావూరు సెంట్రల్ జిల్లా కార్యదర్శిగా శరవణన్, తేని జిల్లా (తూర్పు) కార్యదర్శిగా రామర్, (పశ్చిమం) జక్కయ్యన్ను నియమించారు. అలాగే, రాణి పేట, తిరువణ్ణామలై, తిరునల్వేలి, తదితర మరికొన్ని జిల్లాలలో కార్యదర్శులు మార్పు జరిగింది. అయితే, ఒక జిల్లా నుంచి మరోజిల్లాకు కార్యదర్శుల పోస్టులను బదిలీ చేసే రీతిలో నియామకాలు జరిగాయి. అన్నామలైకి ఢిల్లీ నుంచి పిలుపు.. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తమను పక్కన పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకు ఢిల్లీ నుంచి పిలుపురావడం గమనార్హం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నామలై భేటీలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయో వేచి చూడాల్సిందే. అదే సమయంలో ఈ భేటీ తర్వాత తమను టార్గెట్ చేసి ఐటీ, ఈడీ దాడులకు బీజేపీ సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నట్లు కొందరు అన్నాడీఎంకే సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. రంగంలోకి సీనియర్ ఐపీఎస్.. ఎవరీ రాకేష్ బల్వాల్! -
బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్.. ఎన్డీఏ కూటమికి బై..బై!
అనుకున్నదే అయ్యింది.. విమర్శలు ప్రతివిమర్శలు, అపనమ్మకాలు..ఆరోపణలు, ఎత్తులు.. పైఎత్తులతో ఇన్నాళ్లూ పడుతూ లేస్తూ సాగిన అన్నాడీఎంకే– బీజేపీ బంధానికి సోమవారం తెరపడింది. ఎన్డీయే కూటమని నుంచి ప్రధాన భాగస్వామి అయిన అన్నాడీఎంకే బయటకు వచ్చినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరే ఈ నిర్ణయానికి కారణమని వెల్లడించారు. సాక్షి, చైన్నె: బీజేపీ – అన్నాడీఎంకే బంధానికి బ్రేక్ పడింది. ఎన్డీఏ కూటమికి బై..బై చెబుతూ సోమవారం అన్నాడీఎంకే కీలక ప్రకటన చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వంలోనే కూటమి ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు చైన్నెలో జరిగిన పార్టీ జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రకటనతో అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. వివరాలు.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తదుపరి చోటు చేసుకున్న పరిణామాలతో ఈ పార్టీ ప్రభుత్వంలో బీజేపీ జోక్యం పెరిగిన విషయం తెలిసిందే. సీఎంగా పగ్గాలు చేపట్టినానంతరం పళణి స్వామి 2017 నుంచి బీజేపీతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ బంధం పదిలం అన్నట్లుగానే ముందుకు సాగారు. అయితే, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలై పగ్గాలు చేపట్టినానంతరం రెండు పార్టీల మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా మిత్రపక్షం అన్నాడీఎంకేను సైతం అన్నామలై టార్గెట్ చేయడం వివాదానికి ఆజ్యం పోసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటు దివంగత నేతలు అన్నాదురై, జయలలితకు వ్యతిరేకంగా అన్నామలై తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఢిల్లీ పర్యటన తర్వాత మారిన సీను.. వారం క్రితం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఢిల్లీ పర్యటన అనంతరం పరిణామాలు వేగంగా మారాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను పళణి తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. తమ శత్రువులు పన్నీరు, దినకరన్‌ను బీజేపీ అక్కున చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుండ డం, పుదుచ్చేరితోపాటు తమిళనాడులో 20 సీట్లను ఆశించడం వంటి సమాచారంతో బీజేపీతో ఇక కటీఫ్ అన్న నినాదాన్ని అన్నాడీఎంకే నేతలు అందుకున్నారు. సుదీర్ఘచర్చ తర్వాత కఠిన నిర్ణయం.. అన్నాడీఎంకే జిల్లాల కార్యదర్శుల సమావేశం సోమవారం సాయంత్రం రాయపేటలోని ఎంజీఆర్ మాళిగైలో జరిగింది. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో జిల్లాల కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ నేతలు ముక్తకంఠంతో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని నినాదించారు. ఢిల్లీలో అమిత్‌షా చర్చల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలు, అన్నామలైపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పార్టీ నేతలకు ఎదురైన నిరాశపూరిత పరిణామాల గురించి సైతం ఈ సమావేశంలో చర్చించడం గమనార్హం. కూటమి నుంచి బయటకు వచ్చిన పక్షంలో ఎదురయ్యే పరిణామాలు, ఈడీ, ఐటీ, సీబీఐ దాడులు, వాటిని తిప్పికొట్టే విధంగా నేతలు సిద్ధమయ్యే విధంగా చర్చించారు. సుదీర్ఘర సమాలోచన అనంతరం పార్టీ నేతలు మునుస్వామి, జయకుమార్, ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాథన్, దిండుగల్ శ్రీనివాసన్ మీడియా ముందుకు వచ్చారు. పళణి నేతృత్వంలోనే కూటమి మీడియాతో నేతలు మాట్లాడుతూ, తమ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో జరిగిన సమావేశంలో నేతలందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశామని వివరించారు. గత ఏడాది కాలంగా పథకం ప్రకారం రాష్ట్ర బీజేపీ నేతలు అన్నాడీఎంకే దివంగత నేతలను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని గురిపెట్టి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారని గుర్తు చేశారు. పురట్చి తమిళర్ పళణి స్వామి నేతృత్వంలో మదురై వేదికగా జరిగిన భారీ మహానాడును సైతం విమర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ మనోభావాలకు వ్యతిరేకంగా బీజేపీ చర్యలు ఉంటున్నాయని ధ్వజమెత్తారు. అందుకే ఆ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించామన్నారు. ఎన్డీఏ కూటమి నుంచి తాము బయటకు వచ్చేశామని ప్రకటించారు. కేవలం రాష్ట్రంలోని బీజేపీ నేతల తీరు కారణంగానే కూటమి నుంచి బయటకు వచ్చేశామని, ఇక, బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో అన్నాడీఎంకే నేతృత్వంలో కూటమి అని, దీనికి తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. స్వీట్లు పంచి.. ఎన్డీఏకు బై..బై....చెప్పేశామని మునుస్వామి ప్రకటన చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నాడీఎంకే వర్గాలు సంబరాల్లో మునిగిపోయాయి. ఇక బీజేపీతో ఆరేళ్ల బంధం వీడడంతో అన్నాడీఎంకే వర్గాలు బాణా సంచా పేల్చుతూ సందడి చేశారు.ి అన్నాడీఎంకే కార్యాలయం ఎంజీఆర్‌మాళిగై పరిసరాలు సంబరాల కోలాహలంలో మునిగింది. ఆనంద తాండవం చేస్తూ నేతలు పళణికి మద్దతుగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా, జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే కీలంగా ఉన్న నేపథ్యంలో తాజా నిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఉత్కంఠం ప్రస్తుతం నెలకొంది. రాష్ట్రనేతలెవరూ మాట్లాడొద్దు– బీజేపీ అధిష్టానం అన్నాడీఎంకే నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం సరైన సమయంలో స్పందిస్తుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. కోయబత్తూరులో నా మట్టి... నా ప్రజలు యాత్రలో పాల్గొంటున్న ఆయన్ని మీడియా ప్రతినిధులు సాయంత్రం అన్నాడీఎంకే నిర్ణయంపై ఆయన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అధిష్టానం అన్ని అంశాలను గమనిస్తోందని, తగిన సమయంలో స్పందిస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన యాత్ర విజయవంతంగా కొనసాగుతోందని, తమ పార్టీకి ఏ నిర్ణయమైనా అధిష్టానం తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తాను కూడా త్వరలో మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలను తెలియజేస్తానని ముగించారు. బీజేపీ ఎమ్మెల్యే, జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్ కూడా అన్నామలై తరహాలోనే స్పందించారు. ఇక అన్నాడీఎంకే ప్రకటనపై బీజేపీ అధిష్టానం సోమవారం రాత్రి స్పందించింది. పొత్తు అంశంపై రాష్ట్రనేతలెవరూ మాట్లాడకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ముందే చెప్పిన ‘సాక్షి’ అన్నాడీఎంకే, బీజేపీ మధ్య అంతరాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బెడిసికొట్టే అవకాశం ఉందనే విషయంపై గతంలోనే ‘సాక్షి’ పలుమార్లు విశ్వసనీయ కథనాలు ప్రచురించింది. అన్నాడీఎంకే కార్యదర్శుల సమావేశంలో పళణి స్వామి ఈమేరకు ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. సోమవారం అదే నిజమైంది. -
NDA నుంచి బయటకు వచ్చిన అన్నాడీఎంకే