చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు.
ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు.
ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు
Comments
Please login to add a commentAdd a comment