Tamil Nadu Deputy Chief Minister
-
మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!
చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగోతంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేవలం మరికొన్నిగంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 24 గంటల్లో స్పష్టత రానుంది.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలుకాగా ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.మరోవైపు డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు. ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు -
పంతం నెగ్గించుకున్న పన్నీర్ సెల్వం
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఓ పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళ భాష, సాంస్కృతిక శాఖ మంత్రిగా కె. పాండ్యరాజన్ ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, అన్నాడీఎంకే సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పన్నీర్ సెల్వంకు ఆర్థిక శాఖ కేటాయించారు. ప్రమాణస్వీకారం ముగిసిన తర్వాత గవర్నర్ సమక్షంలో పళనిస్వామి, పన్నీర్ సెల్వం చేతులు కలిపారు. అయితే పన్నీర్ వర్గానికి మూడు మంత్రి పదవులు ఇస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. త్వరలోనే మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. కాగా, ప్రభుత్వం, పార్టీలో పదవులు అందుకోవడం ద్వారా పన్నీర్ సెల్వం పంతం నెగ్గినట్టైంది. శశికళను పార్టీ నుంచి బహిష్కరించాలన్న డిమాండ్ ఇంకా నెరవేరలేదు. పార్టీ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని పన్నీర్ సెల్వం చెప్పారు. చిన్నమ్మ భవితవ్యంపై పార్టీ ఎటువంటి వైఖరి అవలంభిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.