చెన్నై: తమిళనాట రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏఐడీఎంకే పన్నీర్ సెల్వానికి ఊహించని షాక్ తగిలింది. పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో, రెండాకుల గుర్తను పళనిస్వామి దక్కించుకున్నారు. ఇక, ఈసీ నిర్ణయంతో పన్నీరు సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వివరాల ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. కాగా ఈ విషయాన్నిఆ పార్టీ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ పంపిన నోట్‌ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్‌ఎం బాబీ మురగవేల్ గురువారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక, అన్నాడీఎంకే చేసిన పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షురాలు, దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఇద్దరు నేతలు పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఇంతకు ముందు ఈ-రోడ్ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు నేతలు వేర్వేరుగా అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పన్నీరు సెల్వానికి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు, పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారిస్తున్నది.
Election Commission approves Edappadi K Palaniswami as the general secretary of AIADMK.#EdappadiPalaniswami #AIADMK pic.twitter.com/Nuobq4IVzj
— Shankar (@Shankar38630530) April 20, 2023
Comments
Please login to add a commentAdd a comment