edappadi k palaniswami
-
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిపైగా సమయం ఉంది. 2026 ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. అధికార డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. అటు బీజేపీ కూడా తమ ఓటు బ్యాంకు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కాంగ్రెస్- డీఎంకే కూటమిని ఓడించాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు.ఏదైనా జరగొచ్చు..అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో జట్టు కట్టే అవకాశముందని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సూచనప్రాయంగా వెల్లడించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పార్టీని తమిళనాడులో లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ఇందుకోసం ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలపడం లేదా ప్రస్తుతం కొనసాగుతున్న కూటమిని బలోపేతం చేస్తామని ఆయన అన్నారు. ‘వచ్చే ఎన్నికల సమయానికి ఏదైనా జరగొచ్చు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడమే మా ధ్యేయమ’ని అన్నామలై పేర్కొన్నారు. 2026లో ద్రవిడేతర పార్టీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.‘2026 అసెంబ్లీ ఎన్నికలు భిన్నంగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. ద్రవిడ పార్టీలు సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండకపోవచ్చు. నాన్-ద్రవిడన్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నాం. మాది కూడా బలమైన కూటమే. తమిళనాడు ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. 2025లో జరిగే రాజకీయ పరిణామాలతో ఈ విషయం మరింత స్పష్టంగా తెలుస్తుంద’ని అన్నామలై వ్యాఖ్యానించారు.బలమైన కూటమి ఏర్పాటు చేస్తాంఅన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి కూడా ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వీరిద్దరిని మాటలను బట్టి చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వాన్ని ఓడించి తాము మళ్లీ అధికారంలోకి వస్తామన్న దీమాను పళనిస్వామి వ్యక్తం చేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటతామని ప్రకటించారు. ‘అందరూ ఊహించినట్లుగానే ఏఐఏడీఎంకే బలమైన కూటమిని ఏర్పాటు చేస్తుంది. పార్లమెంటు ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు. రెండిటికీ చాలా తేడా ఉంది. 2026 మన ఎన్నికలు! ఇవి అన్నాడీఎంకే ఎన్నికల’ని అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నారు.ఈసారి అటువంటి పొరపాటు చేయంలోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోకపోవడం వల్లే నష్టపోయామన్న అభిప్రాయాన్ని పరోక్షంగా అంగీకరించారు పళనిస్వామి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో అటువంటి పొరపాటు చేయబోమని చెప్పారు. ‘2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐఏడీఎంకేపై అనేక విమర్శలు వచ్చాయి. సరైన పొత్తు లేకపోవడంపై పలువురు ప్రశ్నలు సంధించారు. పొత్తులు వస్తాయి, పోతుంటాయి.. కానీ ఏఐఏడీఎంకే భావజాలం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు, బలమైన కూటమి లేదు.. ప్రభుత్వంలో లేనప్పటికీ మేము 20 శాతానికి పైగా ఓట్లను సాధించాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే కూటమికి 26 శాతం ఓట్లు సాధించింది. 2019తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ’ని ఈపీఎస్ వివరించారు. ఈ ట్రెండ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: అమిత్ షా మాట.. ఒమర్ అబ్దుల్లా నోట.. ఏం జరిగింది?డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడమనేది పగటి కలగా మిగిలిపోతుందని పళనిస్వామి జోస్యం చెప్పారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో 200 సీట్లు గెలుస్తామని చెబుతూ డీఎంకే పగటి కలలు కంటోంది. అది ఎప్పటికీ నిజం కాదు. డీఎంకేపై ప్రజల్లో కొత్త చైతన్యం వస్తోంది. అదే మా విజయమ’ని ఆయన అన్నారు. కాగా తమిళనాడు శాసనసభలో 234 మంది సభ్యులు ఉన్నారు. -
తమిళనాట పొలిటికల్ ట్విస్ట్.. పన్నీర్ సెల్వానికి షాక్
చెన్నై: తమిళనాట రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఏఐడీఎంకే పన్నీర్ సెల్వానికి ఊహించని షాక్ తగిలింది. పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో, రెండాకుల గుర్తను పళనిస్వామి దక్కించుకున్నారు. ఇక, ఈసీ నిర్ణయంతో పన్నీరు సెల్వం వర్గానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. కాగా ఈ విషయాన్నిఆ పార్టీ ధ్రువీకరించింది. ఈ క్రమంలో ఎలక్షన్ కమిషన్ పంపిన నోట్‌ను అన్నాడీఎంకే అధికార ప్రతినిధి ఆర్ఎం బాబీ మురగవేల్ గురువారం ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఇక, అన్నాడీఎంకే చేసిన పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మార్పులు, ప్రధాన కార్యదర్శి ఎన్నిక, కొత్త ఆఫీస్ బేరర్ల నియామకానికి ఈసీ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా.. పార్టీ అధ్యక్షురాలు, దివంగత మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత ఇద్దరు నేతలు పార్టీపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతున్నది. ఇంతకు ముందు ఈ-రోడ్ స్థానానికి ఉప ఎన్నికలు జరగ్గా.. ఇద్దరు నేతలు వేర్వేరుగా అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, పళనిస్వామి ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిర్ణయంతో పన్నీరు సెల్వానికి బిగ్ షాక్ తగిలింది. మరోవైపు, పన్నీర్ సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు విచారిస్తున్నది. Election Commission approves Edappadi K Palaniswami as the general secretary of AIADMK.#EdappadiPalaniswami #AIADMK pic.twitter.com/Nuobq4IVzj — Shankar (@Shankar38630530) April 20, 2023 -
బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి!
సాక్షి, చెన్నై : తమిళ రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన బన్రూటి రామచంద్రన్‌తో అన్నాడీఎంకే ముఖ్య నేతలు మంగళవారం బంతాట ఆడుకున్నారు. ఓ వర్గం నేతగా ఉన్న పళణిస్వామి బన్రూటిని పదవీ నుంచి తప్పిస్తే.. మరో వర్గం నేత పన్నీరు సెల్వం ఆయనకు కొత్త పదవిని కట్టబెట్టారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను విస్మయానికి గురి చేశాయి. బన్రూటి రామచంద్రన్ తొలుత డీఎంకేలో, అనంతరం ఎంజీయార్ నేతృత్వంలోని అన్నాడీఎంకేలో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించారు. ఎంజీయార్‌కు అత్యంత విధేయుడిగా ఉన్న ఆయన జయలలిత రాకతో ఆ పార్టీకి దూరమయ్యారు. 2005లో సినీ నటుడు విజయకాంత్ నేతృత్వంలో డీఎండీకే ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. విజయకాంత్‌కు వెన్నుదన్నుగా ఉంటూ వచ్చారు. విజయకాంత్‌ను ప్రధాన ప్రతిపక్ష నేత స్థాయికి తీసుకెళ్లడంలో బన్రూటి కీలక పాత్ర పోషించారనంలో అతిశయోక్తి లేదు. చివరకు ఆ పార్టీలో సాగిన కుట్ర పూరిత రాజకీయాలను చూసి బయటకు వచ్చేశారు. అదే సమయంలో బన్రూటి సేవలను పార్టీకి ఉపయోగించుకునేందుకు గతంలో సీఎం జయలలిత నిర్ణయించారు. ఆయన్ని అన్నాడీఎంకేలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైన పదవి అప్పగించారు. ఊడిన నిర్వాహక కార్యదర్శి పదవి జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో ఉన్నా, రాజకీయంగా పూర్తిస్థాయిలో బన్రూటి ముందుకు సాగలేదు. ఇటీవల కాలంలో అన్నాడీఎంకేలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయన్ని తీవ్రంగా కలిచి వేశాయి. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి చర్యలను ఓ సమావేశంలో బన్రూటి వ్యతిరేకించారు. అదే సమయంలో అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వంకు మద్దతుగా స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనతో ఈ ఇద్దరు నేతలు బంతాట ఆడే పరిస్థితి నెలకొంది. పన్నీరుకు మద్దతుగా వ్యవహరిస్తున్న బన్రూటి రామచంద్రన్‌ను పార్టీ నిర్వాహక కార్యదర్శి పదవి నుంచి మంగళవారం తప్పించారు. అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ పళణి స్వామి ప్రకటన చేశారు. వెంటనే స్పందించిన పన్నీరు సెల్వం తన శిబిరం తరపున అన్నాడీఎంకేకు రాజకీయ సలహదారుడిగా బన్రూటిని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ పరిణామాలు అన్నాడీఎంకే కేడర్‌ను అయోమయానికి గురి చేశాయి. అయితే, ఓ సీనియర్ నేతతో ఇలాగేనా వ్యవహరించడం అనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా పళణిస్వామి నేతృత్వంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టు తలుపు తట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ఈ నెల 30వ తేదీన విచారణకు రానుంది. -
పరీక్షలు రద్దు చేసిన తమిళ సర్కార్
చెన్నై : పది, పదకొండో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు మంగళవారం తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి పరీక్షలు లేకుండానే వారిని పై తరగతులకు పంపిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి తెలిపారు. అయితే జూన్ 15న పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని ప్రభుత్వం కోరగా హైకోర్టు మొట్టికాయలు వేసింది. కరోనా కారణంగానే విద్యాసంస్థలు మూసివేస్తే పరీక్షలు ఎలా నిర్వహించగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బోర్డు ఎగ్జామ్స్ పేరిట లక్షల మంది విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేయలేమని స్పష్టం చేసింది. వారి ప్రాణాలకు ప్రభుత్వం బాధ్యత వహించగలదా అంటూ సూటిగా ప్రశ్నించింది. అంతేకాకుండా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పరీక్షలు నిర్వహించడానికి వీల్లేదని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఆ నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు తమిళనాడు సర్కార్ ప్రకటించింది. (గతేడాది ఆగస్టులోనే కరోనా ఆనవాళ్లు) తమిళనాడులో ప్రతిరోజూ కేసుల సంఖ్య పెరుగుతున్నందున 10, 11వ తరగతి పరీక్షలను రద్దు చేయాల్సిందిగా తమిళనాడు హై అండ్ హయ్యర్ సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అసోసియేషన్ బోర్డుకు విన్నవించుకుంది. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం జూన్ 15 నుంచే పరీక్షలు ఉంటాయని ప్రకటించడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేస్తుందని ఎంఎస్‌ఎంకే చీఫ్ వైకో అన్నారు. (ఉద్యోగాలు కల్పించండి : సుప్రీం ఆదేశం ) -
మోదీని ఉద్దేశించి సీఎం ట్వీట్.. ఆపై డిలీట్!
చెన్నై: హిందీయేతర రాష్ట్రాల్లో హిందీని తప్పనిసరి బోధించాలన్న ప్రతిపాదనపై తీవ్ర దుమారం రేగిన నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో తమిళ భాషను ఐచ్ఛీక భాషగా ఎంచుకునే అవకాశం ఇవ్వాలని ప్రధాని మోదీని ఆయన తన ట్వీట్లో అభ్యర్థించారు. ఈ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, అనంతరం పళనిస్వామి తన ట్వీట్‌ను తొలగించారు. ‘ఇతర రాష్ట్రాల్లో అభ్యసించేందుకు వీలుగా ఆప్షనల్ లాంగ్వేజ్‌గా తమిళాన్ని కూడా చేర్చాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరుతున్నాను. ఇలా చేయడం ద్వారా ప్రపంచంలో అతి పురాతన భాషల్లో ఒకటైన తమిళానికి గొప్ప మేలు చేసినట్టు అవుతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. హిందేయేతర రాష్ట్రాల్లో హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలంటూ గతవారం విడుదల చేసిన జాతీయ విద్యావిధానం ముసాయిదాలో ప్రతిపాదించడంపై తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. త్రిభాష విద్యావిధానంలో భాగంగా చేసిన ఈ ప్రతిపాదనపై తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని డీఎంకే వంటి పార్టీలు హెచ్చరించాయి. దాంతో కేంద్రం ముసాయిదాలోంచి ఈ నిబంధనను తొలగించింది. సవరించిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదాను విడుదల చేసింది. ‘ తాము నేర్చుకుంటున్న మూడు భాషల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలను మార్చుకోవాలనుకునే విద్యార్ధులు 6, 7 గ్రేడుల్లో (తరగతులు) ఆ పని చేయవచ్చు. మాధ్యమిక పాఠశాల బోర్డు పరీక్షల్లో మూడు భాషల్లోనూ ప్రావీణ్యాన్ని ప్రదర్శించగలిగిన విద్యార్ధులు ఆరు లేదా ఏడు తరగతుల్లో భాషను మార్చుకోవచ్చు.’అని సవరించిన ముసాయిదాలో పేర్కొన్నారు. భాషా నైపుణ్యంపై బోర్డు నిర్వహించే పరీక్షల్లో కేవలం ప్రాథమిక స్థాయిలోనే పరీక్ష ఉంటుందని తెలిపింది. పళనిస్వామి చేసిన ట్వీట్ ఇదే.. -
తమిళనాడు సీఎంకు మద్రాసు హైకోర్టు షాక్
-
ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు
సాక్షి, చెన్నై : తమిళనాడు ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయాచితంగా తన అనుచర వర్గానికి, బంధువులకు రోడ్డు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనే ఆరోపణలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రతిపక్ష డీఎంకే చేసిన ఆరోపణలపై విచారణ చేస్తున్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి ఏడీ జగదీష్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిపై వెల్లువెత్తిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరగాలనే ఉద్దేశంతోనే కేసును సీబీఐకి అప్పగించినట్టు ఆయన వ్యాఖ్యానించారు. విజలెన్స్ దర్యాప్తులో క్లీన్ చిట్ కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టు పనులు పళనిస్వామి తన బంధువర్గానికి కట్టబెట్టారనే డీఎంకే ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రాష్ట్ర విజిలెన్స్ డిపార్ట్మెంట్ పళనిస్వామికి క్లీన్ చిట్ ఇచ్చింది. డీఎంకే ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. డీఎంకే హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కీలక తీర్పు వెలువడింది. -
అసెంబ్లీ సాక్షిగా క్లారిటీ ఇచ్చిన సీఎం
సాక్షి, చెన్నై: బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా తమ వైఖరి ఏంటన్నది సీఎం పళనిస్వామి వివరించారు. కావేరి నదీ జలాల వినియోగం విషయంలో కేంద్రంపై అన్నాడీఎంకే ప్రభుత్వం మెతక వైఖరి ప్రదర్శిస్తుందంటూ ప్రతిపక్ష డీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. కావేరీ జలాల పంపకాలపై గత ఫిబ్రవరి 16న కావేరీ నిర్వహణ బోర్డు (సీఎంబీ) ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు వెల్లడించింది. ఆరు వారాల్లోగా కమిటీ నియమించి వివరాలు వెల్లడించాలని కోర్టు సూచించింది. కావేరీ నీటి నిర్వహణ కమిటీ ఏర్పాటు చేయాలంటూ మార్చి 15న తమిళనాడు ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్‌ను కోరిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు చెప్పిన ఆ బోర్డు ఏర్పాటు చేస్తే కావేరీ జలాల్లో తమిళనాడు వాటా తగ్గుతుంది. దీంతో కేంద్రంతో కుమ్మక్కయి అన్నాడీఎంకే నేతలు కావేరీ బోర్డు ఏర్పాటు కోరుకుంటున్నారని ప్రతిపక్ష డీఎంకే విమర్శించింది. డీఎంకే ఆరోపణలపై సభలో బుధవారం పళనిస్వామి స్పందిస్తూ.. బీజేపీకి తాము మద్దతు తెలపడం గానీ, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం గానీ అన్నాడీఎంకేకు లేదని వెల్లడించారు. కావేరీ జలాల్లో తమిళనాడు వాటాను తగ్గించకూడదని అన్నాడీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో తమ నిరసన తెలుపుతున్నారని పళనిస్వామి శాసనసభలో వివరించారు. -
24మంది ఎమ్మెల్యేలు జంప్!
చెన్నై: తమిళనాడు రాజకీయాలు మళ్లీ హైడ్రామాను తలపిస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన శశికళ అక్క కొడుకు టీవీవీ దినకరన్ మళ్లీ చక్రం తిప్పుతున్నారు. అధికారిక అన్నాడీఎంకే నుంచి తనను, చిన్నమ్మను దూరం చేసి.. ఏకాకిని చేసేందుకు సీఎం ఎడపాడి పళనిస్వామి వర్గం ప్రయత్నిస్తుండగా.. అందుకు విరుద్ధంగా దినకరన్ బలం నానాటికీ పెరుగుతుండటం గమనార్హం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వరుసగా దినకరన్‌కు మద్దతు పలుకుతుండటం గమనార్హం. మంగళవారం రాత్రి వరకు దినకరన్‌కు మొత్తం 24మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. దీంతో ఎడపాడి వర్గంలో ఉన్న 123 మంది ఎమ్మెల్యేల్లో 24మంది జారుకున్నట్టు అయింది. ఈ పరిణామాలతో లోలోపల ఖుషీ అవుతున్న ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ అసెంబ్లీ సమావేశాలకు ముందే ఎడపాటి ప్రభుత్వం కూలిపోతుందని అంచనాలు వేస్తున్నారు. అన్నాడీఎంకే అధికారిక గుర్తు ‘రెండాకుల’ కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించిన కేసులో అరెస్టైన దినకరన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం సోమవారం ఆయన బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న చిన్నమ్మ శశికళను కలిశారు. అప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. సోమవారాం రాత్రి అతను చెన్నైలోని తన నివాసానికి చేరుకొనే సమయంలో ఆయనకు అండగా నిలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 10కి చేరింది. మంగళవారం రాత్రి నాటికి ఏకంగా 24మంది ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరి.. మన్నార్గుడి మాఫియాకు మద్దతు పలికారు. దీంతో స్వరం పెంచిన దినకరన్ ఇప్పటికే పార్టీ అధినేత్రి శశికళేనని, ఆమె గైర్హాజరీలో పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా తానే పార్టీని నడుపుతానని తేల్చిచెప్పారు. పార్టీలోని ఫ్యాక్షన్ గొడవలకు రెండు నెలల్లో చరమగీతం పాడాలని సూచించారు. మరోవైపు బొటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం ఎడపాటి వర్గంలో తాజా పరిణామాలతో కలవరం మొదలైంది. మరింత ఎమ్మెల్యేలు జారుకుంటే అన్నాడీఎంకే పూర్తిగా దినకరన్ చేతుల్లోకి వెళ్లే అవకాశముందని ఎడపాటి వర్గం భావిస్తున్నది. ఎమ్మెల్యేలు దినకరన్ వైపు వెళ్లకుండా ఎడపాటి చర్యలు తీసుకుంటున్నట్టు పెద్దగా సఫలం కావడం లేదని తెలుస్తోంది.