సాక్షి, చెన్నై : తమిళనాడు ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయాచితంగా తన అనుచర వర్గానికి, బంధువులకు రోడ్డు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనే ఆరోపణలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రతిపక్ష డీఎంకే చేసిన ఆరోపణలపై విచారణ చేస్తున్న విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి ఏడీ జగదీష్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిపై వెల్లువెత్తిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరగాలనే ఉద్దేశంతోనే కేసును సీబీఐకి అప్పగించినట్టు ఆయన వ్యాఖ్యానించారు.
విజలెన్స్ దర్యాప్తులో క్లీన్ చిట్
కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టు పనులు పళనిస్వామి తన బంధువర్గానికి కట్టబెట్టారనే డీఎంకే ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రాష్ట్ర విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ పళనిస్వామికి క్లీన్ చిట్ ఇచ్చింది. డీఎంకే ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. డీఎంకే హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కీలక తీర్పు వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment