CBI Probe
-
NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. నీట్లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని, పేపర్ లీక్ అయ్యిందని, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. -
‘సందేశ్‌ఖాలీ’ కేసు.. ఎన్నికల వేళ ‘తృణమూల్’కు షాక్
కలకత్తా: లోక్‌సభ ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. ఇటీవలి కాలంలో రాజకీయ దుమారం రేపిన సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులు, భూ కబ్జాల కేసు దర్యాప్తును కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు దర్యాప్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది. సందేశ్‌ఖాలీలో తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నేతలు అక్కడి మహిళలపై లైంగిక దాడులకు పాల్పడడమే కాకుండా వారి భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై అక్కడి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. తాజాగా సందేశ్‌ఖాలీ అకృత్యాలపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘సందేశ్‌ఖాలీ అకృత్యాల కేసు చాలా సంక్లిష్టమైనది. ఇందులో నిష్పాక్షిక విచారణ జరగాలి. ఈ కేసును ఎవరు విచారించినా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని మా అభిప్రాయం. కేసు దర్యాప్తులో భాగంగా సామాన్యుల, ప్రభుత్వ అధికారులు, ఎన్జీవోలు ఎవరినైనా విచారించే అధికారం సీబీఐకి ఉంది. కేసు విచారించి సమగ్ర దర్యాప్తు నివేదిక మాకు అందించాలి’అని హై కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసింది. సందేశ్‌ఖాలీలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నతృణమూల్ నేత షేక్షాజహాన్ను సీబీఐ ఇప్పటికే అరెస్టు చేసింది. ఇదే కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అధికారులపై దాడి కేసులో సీబీఐ ఆయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది. ఈడీ అధికారులపై దాడి కేసును సీబీఐ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. కాగా, సందేశ్‌ఖాలీ ఆందోళనలకు నేతృత్వం వహించిన రేఖాపత్రా అనే మహిళకు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది. సందేశ్‌ఖాలీ అంశం ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ ఓట్ల శాతానికి భారీగా గండి కొట్టి బీజేపీకి మేలు చేసే అవకాశం ఉందని అంచనాలున్నాయి. ఇదీ చదవండి.. ప్రచారంలో యువతికి ముద్దు -
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు సీఎంకున్న అభ్యంతరాలేమిటి?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. అందుకు సీఎంకి ఉన్న అభ్యంతరాలేమిటి? సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని నిలదీశారు. కాళేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ కాదు... మేడిగడ్డ అందులో చిన్న భాగం మాత్రమేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును మేడిగడ్డ వరకే పరిమితం చేయా లని కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటే కేసును పక్కదారి పట్టించడమే అవుతుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని గతంలో టీపీసీ సీ అధ్యక్షుడిగా రేవంత్ కేంద్రానికి పలు దఫాలుగా విజ్ఞప్తులు చేశారని గుర్తుచేశారు. తన వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి రేవంత్ లేఖ కూడా రాశారని చెప్పారు. ఇప్పుడు సీఎం హోదా లో తన దగ్గర ఉన్న ఆధారాలను సీబీఐకు, కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కథ కంచికి చేర్చాలనే కుట్ర కాంగ్రెస్.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ కథ కంచికి చేర్చాలని చూస్తోందని రఘునందన్ ఆరోపించారు. ఈ ప్రాజె క్టు అవినీతి విషయంలో గత ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ పలు దఫాలుగా ఉత్తరాలు రాసిందని తెలిపారు. ఈ ఏడాది మార్చి 20న రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్‌కు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని లేఖ వచ్చిందన్నారు. ఈ లేఖకు ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వకుండా.. తమ బండారం బయటపడుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను తొక్కిపెట్టిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మేడిగడ్డ వరకే విషయా న్ని పరిమితం చేస్తున్నారని, ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థపైకి మాత్రమే నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. -
సీబీఐ క్లీన్చిట్ ఇస్తే రాజీనామా చేస్తారా? కేజ్రీవాల్ సవాల్!
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక బంగ్లా రెన్నోవేషన్ పనుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో సీబీఐ గురువారం దర్యాప్తు ప్రారంభించింది. ఈ పనులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేయాల్సిందిగా పీడబ్ల్యూడీ శాఖను ఆదేశించింది సీబీఐ. ఇదిలా ఉండగా సీబీఐ విచారణపై ఢిల్లీ ముఖ్యమంత్రి స్పందిస్తూ ఎంక్వైరీలో ఆరోపణలు అబద్దమని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. భయపడేది లేదు.. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను ముఖ్యమంత్రి అయ్యిన దగ్గర నుంచి ఇప్పటివరకు నాపై మొత్తం 50 కేసుల్లో విచారణ జరిగింది. ప్రధాని ఎందుకో నన్ను చూసి భయపడుతున్నారు. ఒకసారి లిక్కర్ కేసు అంటారు, మరోసారి బస్సు స్కామ్ అంటారు.. అన్ని కేసులు పెట్టినా వారు సాధించింది ఏమీలేదు. కావాలంటే ఇప్పుడు కూడా నా ఇల్లు మొత్తం తనిఖీలు చేసుకోండి. మీకు ఏమీ దొరకదన్నారు. రాజీనామా చేస్తారా? కేంద్రానికి ఒకే మాట చెప్పదలచుకున్నా.. మీరు భయపెట్టాలని చూస్తున్నా నేను భయపడే రకం కాదు. గుర్తుపెట్టుకోండి కేజ్రీవాల్ తలదించుకునే ప్రసక్తే లేదని అన్నారు. నా ఇంటి నిర్మాణ విషయంలో సీబీఐ విచారణ పూర్తయ్యాక అవినీతి ఏమీ జరగలేదని తేలితే ప్రధాని తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. బీజేపీ తన వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించడానికి సిద్ధమైంది. కేజ్రేవాల్ ఎవ్వరికీ భయపడడని అన్నారు. గవర్నర్ నివేదిక.. ఎన్నికలకు ముందు సాధారణ జీవనం అన్న నినాదాన్ని కేజ్రీవాల్ తుంగలో తొక్కారని ఆయన బంగ్లాలోని ఒక్క కర్టైన్ విలువ రూ.8 లక్షలు ఉంటుందని ఆరోపించింది బీజేపీ. ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసం పునర్నిర్మాణానికి రూ.45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని దీనిలో అవకతవకలు జరిగాయని లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ సక్సేనా ఒక నివేదికను సమర్పిస్తూ వీటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను భద్రపరచాల్సిందిగా ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు లెఫ్టినెంట్ గవర్నర్. సక్సేనా తాను ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపట్టాలని ఒక లేఖ ద్వారా సీబీఐని కోరారు. अब इन्होंने CM आवास की CBI जाँच शुरू करवा दी। प्रधानमंत्री जी घबराए हुए हैं। ये उनकी घबराहट दिखाता है। मेरे ख़िलाफ़ enquiry कोई नई बात नहीं है। अभी तक मेरे ख़िलाफ़ पिछले 8 साल में 50 से ज़्यादा मामलों में enquiry करवा चुके हैं। बोले केजरीवाल ने स्कूल बनवाने में घोटाला कर… pic.twitter.com/rPtIpUcU4Y — Arvind Kejriwal (@ArvindKejriwal) September 28, 2023 ఇది కూడా చదవండి: బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో టైమ్‌కి పిజ్జా డెలివరీ.. -
ఒడిశా రైళ్ల ప్రమాదంపై... సీబీఐ విచారణ
బాలాసోర్/న్యూఢిల్లీ: దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైళ్ల ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రమాదానికి మూలకారణాన్ని, ఈ ‘నేరపూరిత’ చర్యకు ప్రధాన కారకులను ఇప్పటికే గుర్తించినట్టు ఆదివారం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించిన కాసేపటికే ఈ మేరకు ప్రకటన వెలువడింది. అంతేగాక, ‘‘ప్రమాదం వెనక విద్రోహ కోణాన్నీ తోసిపుచ్చలేం. రైళ్ల ఉనికిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటి గమనాన్ని నిర్దేశించే అతి కీలకమైన ఇంటర్ లాకింగ్ వ్యవస్థను ట్యాంపర్ చేసి ఉండే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేం’’ అని రైల్వే వర్గాలు చెప్పుకొచ్చాయి. రైలును ట్రాక్‌ను మళ్లించే ఎలక్ట్రిక్ పాయింట్, ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సంబంధిత సమస్యే ప్రమాదానికి కారణమని ప్రమాద స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న వైష్ణవ్ భువనేశ్వర్‌లో మీడియాకు చెప్పారు. ‘‘పూర్తి వివరాల్లోకి నేనిప్పుడే వెళ్లదలచుకోలేదు. అయితే పాయింట్ యంత్రం సెట్టింగ్‌ను మార్చారు. ఇదెందుకు, ఎలా జరిగిందన్నది విచారణ నివేదికలో వెల్లడవుతుంది’’ అని వివరించారు. మూడు రైళ్ల ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐకి సిఫార్సు చేసినట్టు వెల్లడించారు. విపక్షాలు మాత్రం ఈ విషయంలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి తక్షణం రాజీనామా చేయాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ సహా పలు ఇతర విపక్షాలు రైల్వే మంత్రి రాజీనామాకు డిమాండ్ చేశాయి. మంత్రుల స్థాయి నుంచి కింది దాకా బాధ్యులందరినీ గుర్తించి కఠినాతి కఠినంగా శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. మోదీ సర్కారు మీడియా పిచ్చి, పీఆర్ గిమ్మిక్కులు ప్రభుత్వ వ్యవస్థను చేతగానిదిగా మార్చేశాయమంటూ ఖర్గే తూర్పారబట్టారు. యూపీఏ హయాంలో రైల్వే మంత్రుల పనితీరు ఎంత ఘోరంగా ఉండేదో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలంటూ బీజేపీ ఎదురుదాడికి దిగింది. మహా విపత్తును కూడా రాజకీయం చేయడం దారుణమని మండిపడింది. ప్రమాదంలో మరణించిన వారి తుది సంఖ్యను 288 నుంచి 275గా రైల్వే శాఖ ఆదివారం సవరించింది. విద్రోహ కోణంపై రైల్వే ఏం చెప్పిందంటే... పాయింట్ మెషీన్, ఇంటర్ లాకింగ్ వ్యవస్థ పూర్తిగా సురక్షితమని రైల్వే వర్గాలు వివరించాయి. ‘‘అదెంత సురక్షితమంటే ఒకవేళ అది పూర్తిగా విఫలమైనా సిగ్నళ్లన్నీ వెంటనే రెడ్‌కు మారి రైళ్ల రాకపోకలన్నీ తక్షణం నిలిచిపోతాయి. అయినా సిగ్నలింగ్ సమస్యే ప్రమాదానికి కారణమైంది గనుక బయటి శక్తుల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. కేబుళ్లను చూసుకోకుండా ఎవరైనా తవ్వేయడంతో తెగిపోయి ఉండొచ్చు’’ అని రైల్వే బోర్డు సభ్యురాలు జయా వర్మ సిన్హా వివరించారు. ప్రమాదానికి మితిమీరిన వేగం, డ్రైవర్ల తప్పిదం కారణం కావని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి. లోపలి, లేదా బయటివ్యక్తులు విద్రోహానికి పాల్పడే అవకాశాన్నీ తోసిపుచ్చలేమని రైల్వే అధికారి ఒకరన్నారు. టికెట్ లేని వారికీ పరిహారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ శుక్రవారం రాత్రి ఒడిశాలోని బహనగా బజార్ స్టేషన్ సమీపంలో లూప్లైన్లోకి దూసుకెళ్లి ఆగున్న గూడ్సును ఢీకొని పట్టాలు తప్పడం, పక్క ట్రాక్‌పై పడ్డ బోగీలను ఢీకొని బెంగళూరు–హౌరా ఎక్స్‌ప్రెస్ కూడా పట్టాలు తప్పడం తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో గాయపడ్డ 1,175 మందిలో వందలాది మంది ఇంకా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రెండు రైళ్లలో చాలావరకు వలస కార్మికులే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్డు గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ లేని ప్రయాణికులకు కూడా పరిహారం అందించనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. మరోవైపు సహాయ చర్యలతో పాటు ట్రాక్‌ల పునరుద్ధరణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తూర్పు, దక్షిణ భారతాలను కలిపే ఈ కీలక రైల్వే లైన్లో పూర్తిగా దెబ్బ తిన్న ట్రాకుల్లో ఇప్పటిదాకా రెండింటిని పునరుద్ధరించారు. ప్రమాదంపై సుప్రీంలో పిల్ సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశాలో రైలు ప్రమాదంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సారథ్యంలో విచారణకు కేంద్రాన్ని ఆదేశించాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలైంది. రైల్వే వ్యవస్థలో ప్రమాద, భద్రత పరామితులను కమిటీ విశ్లేషించి, వాటి బలోపేతానికి సలహాలు, సూచనలిచ్చేలా చర్యలు తీసుకోవాలని పిటిషనర్ విశాల్ తివారీ కోరారు. కవచ్ వ్యవస్థను వెంటనే అమలు చేసేలా మార్గదర్శకాలివ్వాలన్నారు. -
IRCTC scam: తేజస్వీ యాదవ్ బెయిల్ రద్దు చేయండి: సీబీఐ
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) కుంభకోణం కేసులో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. ‘తేజస్వీ యాదవ్ సాదాసీదా వ్యక్తి కాదు. బాగా పలుకుబడి కలిగిన వాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులను దూషిస్తూ, బెదిరిస్తూ బహిరంగ హెచ్చరికలు చేశారు. సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు’ అని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. కోర్టులను కూడా తక్కువ చేస్తూ ఆయన మీడియా సమావేశాల్లో మాట్లాడారని తెలిపింది. దీనిపై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ శనివారం తేజస్వీ యాదవ్‌కు నోటీసు జారీ చేశారు. ఈ నెల 28వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని అందులో ఆదేశించారు. రెండు ఐఆర్సీటీసీ హోటళ్ల కాంట్రాక్టును ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించడంలో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలపై నమోదైన కేసులో యాదవ్‌కు 2018 అక్టోబర్‌లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఎట్టకేలకు.. సోనాలి ఫోగట్ కేసులో కీలక పరిణామం
పనాజి: సంచలనం సృష్టించిన హర్యానా నటి, బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తీవ్ర ఒత్తిళ్ల నడుమ ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని నిర్ణయించినట్లు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సోమవారం ప్రకటించారు. ‘‘మా పోలీసుల(గోవా పోలీసులు) మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. కానీ, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యుల డిమాండ్ మేరకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయించాం’’ అని గోవా సీఎం సావంత్ ప్రకటించారు. ఈ మేరకు సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి లేఖ రాసినట్లు సావంత్ వెల్లడించారు. అంతకు ముందు.. హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ కూడా గోవా పోలీసుల దర్యాప్తుపై సోనాలీ కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేయకుంటే సీబీఐ విచారణకే అప్పగిస్తామంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ మరుసటిరోజే గోవా ప్రభుత్వం సీబీఐకు కేసును అప్పగించడం గమనార్హం. గోవా టూర్‌కు వెళ్లిన ఆమె.. గత నెలలో ఆమె హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తొలుత గుండెపోటుగా భావించినప్పటికీ.. కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అది హత్యనే విషయం నిర్ధారణ అయ్యింది. వ్యక్తిగత సిబ్బంది సుధీర్ సాంగ్వాన్, సుధీర్ అనుచరుడు సుఖ్విందర్‌లు ఈ వ్యవహారంలో ప్రధాన నిందితులుగా పోలీస్ కస్టడీలో ఉన్నారు. సోనాలి ఫోగట్ హత్య జరిగిన మరుసటి రోజు నుంచే ఆమె కుటుంబం సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తూ వస్తోంది. ఆమెపై అత్యాచారం జరిగిందని, మత్తు పదార్థాలు ఇచ్చి మరీ అఘాయిత్యానికి పాల్పడి బ్లాక్ మెయిల్ చేశారంటూ కుటుంబ సభ్యులు.. ఆమె వ్యక్తిగత సిబ్బందిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదీ చదవండి: తల నరికేసే ఊరిలో.. సరిహద్దు! -
బెంగాల్లో రగడ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో మరో రాజకీయ రగడ రాజుకుంది. కోల్‌కతాలోని కాశిపూర్‌లో గురువారం జరిగిన బీజేవైఎం కార్యకర్త అర్జున్ చౌరాసియా హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా డిమాండ్ చేశారు. బెంగాల్లో హింసాత్మక సంస్కృతిపెరిగిపోతోందని, ప్రజలు భయభ్రాంతులవుతున్నారని ఆరోపించారు. రెండురోజుల బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం అర్జున్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ మరణంపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరుతుందని చెప్పారు. మృతదేహాన్ని అధికారులు బలవంతంగా తీసుకుపోయారని కుటుంబీకులు ఆరోపించారు. మరోవైపు అర్జున్ తమ పార్టీ కార్యకర్తేనని అధికార టీఎంసీ బదులిచ్చింది. అర్జున్ మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను వీడియో తీయాలని, అతని కుటుంబానికి భద్రత కల్పించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తీసుకువెళ్లేందుకు వచ్చిన పోలీసులను బీజేపీ కార్యకర్తలు అడ్డగించడంతో అదనపు బలగాలను దింపి పరిస్థితిని అదుపు చేశారు. పాతికేళ్లలో నంబర్‌వన్‌గా భారత్ పాతికేళ్లలో ఇండియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరుతుందని అమిత్ షా అన్నారు. బెంగాల్ దుర్గాపూజను అంతర్జాతీయ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించిన సందర్భంగా ఏర్పాటైన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ గౌరవం దక్కడం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. విద్య, కళలు, రక్షణ సహా పలు రంగాల్లో భారత్ గత 75ఏళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని, ఇదే ధోరణిలో పయనిస్తే దేశ 100వ స్వాతంత్రదినోత్సవాల నాటికి భారత్ అగ్రగామిగా మారుతుందని చెప్పారు. గతంలో యోగా, కుంభమేళాలకు యునెస్కో ఇలాంటి గుర్తింపునే ఇచ్చింది. ఈ సందర్భంగా దేశ స్వాతంత్య్రోద్యమ వీరులకు ఆయన నివాళులర్పించారు. వారి త్యాగాల వల్లనే మనకు స్వేచ్ఛ లభించిందని గుర్తు చేశారు. -
ప్రజలు ఛీకొడతారన్న కనీస జ్ఞానం టీడీపీకి లేదు’
-
మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో సీబీఐ విచారణ
-
ప్రాథమిక విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రాథమిక విచారణ అనంతరమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ దంపతుల తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులోను, సమాచారం అందుకుని దాడులు చేసిన కేసులోను ప్రాథమిక విచారణ తప్పనిసరి అని పేర్కొన్నారు. ఇది లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసు కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయంటూ 2016లో ప్రస్తుత ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఐఆర్ఎస్ అధికారి టి.విజయలక్ష్మి దంపతుల నివాసంలో సీబీఐ సోదాలు చేసింది. ఈ సమయంలో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేయడంతో.. దాన్ని సవాల్‌చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బుధవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. మంత్రి ఆదిమూలపు సురేశ్, విజయలక్ష్మిలపై సీబీఐ ట్రాప్కేసు నమోదు చేయలేదని, ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసు అని సిద్ధార్థ లూత్రా కోర్టుకు వివరించారు. గతంలో సీబీఐ నమోదు చేసిన పలు కేసులను ప్రస్తావించారు. కేసులో సరైన ఆధారాలు లేనందువల్లే తెలంగాణ హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టేసిందని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా, ప్రాథమిక విచారణ జరపకుండా రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేసిందన్నారు. అంతకుముందు సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ప్రాథమిక ఆధారాలను సేకరించామని తెలిపారు. మంత్రి సురేశ్, విజయలక్ష్మిలతోపాటు మరో 11 మంది అధికారులపైనా కేసు నమోదు చేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికాని కారణంగా ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది. -
అంబానీ ఇంటి వద్ద కలకలం : మరో కీలక పరిణామం
సాక్షి, ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటింముందు పేలుడు పదార్థాలతో దర్శనమిచ్చిన వాహనం వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఈ కేసులో రోజుకో పరిణామంతో, బీజేపీ, శివసేనల మాటల యుద్ధం వాహన యజమాని మన్సుఖ్ హిరేన్ అనుమానాస్పద మరణం తరువాత మరింత ముదురుతోంది. తాజాగా తన బదిలీని వ్యతిరేకిస్తూ ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమబీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను హోం గార్డ్ విభాగానికి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లో దాఖలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరపాలని ఈ సందర్భంగా ఆయనడిమాండ్ చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను మాయం చేసేందుకు తనపై బదిలీ వేటు వేశారని ఆరోపించారు. ఈ కేసులో కీలకమైన సాక్ష్యాలు నాశనం చేయకముందే. తన ఆరోపణలపై హోంమంత్రిపై న్యాయమైన దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ తనకు రక్షణకు కల్పించాల్సిందిగా కోరారు. (వాజే టార్గెట్ వంద కోట్లు) మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 17 న సింగ్‌ను బదిలీ చేసి, మహారాష్ట్ర డీజీపీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐపిఎస్ అధికారి హేమంత్ నాగ్రేల్ను కొత్తగా నియమించింది. దీంతో హోమ్ గార్డ్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా పరమ్‌బీర్ సింగ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీసు కమిషనర్ బాధ్యతలనుంచి తొలగించిన అనంతరం సింగ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఒక లేఖ రాశారు. హిరేన్ మృతి కేసులో ఎన్ఐఏ అదుపులో ఉన్న సచిన్ వాజే, ఇతర పోలీసు అధికారులను రూ .100 కోట్లు వసూలు చేయాలని రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కోరినట్లు ఈ లేఖలో ఆరోపించారు. ముంబైలోని బార్స్ , రెస్టారెంట్ల నుండి నెలవారీ రూ .50 కోట్ల నుండి 60 కోట్ల వరకు వసూలు చేయాలని కోరారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్ ఖండించారు. హోంమంత్రి రాజీనామా చేసే ప్రసక్తేలేదు : శరద్ పవార్ అటు పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. దేశ్‌ముఖ్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అనిల్ దేశ్‌ముఖ్ ఫిబ్రవరి 5నుండి 15 వరకు ఆసుపత్రిలో ఉన్నారు, ఫిబ్రవరి 15 నుండి 27 వరకు అతను నాగ్‌పూర్‌లో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలను, రికార్డులన్నింటినీ మహారాష్ట్ర ముఖ్యమంత్రితో అందించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశ్‌ముఖ్ రాజీనామాకు సంబంధించి సేన నుండి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై బీజేపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిపోయాయి. రాజ్యసభలో బీజేపీ ఎంపీలు ఇదే అంశంపై చర్చ చేయాలని డిమాండ్ చేయగా, లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మహారాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. కాగా ఫిబ్రవరి 25 న అంబానీ నివాసం వెలుపల పేలుడు పదార్థాలతో నిండిన ఎస్‌యూవీని ఉంచడంలో వాజే ఆరోపించిన పాత్రను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
సుజనాకు చెన్నై కోర్టు సమన్లు
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరికి మనీ ల్యాండరింగ్ చట్టం కింద చెన్నై కోర్టు నోటీసులు జారీ చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంక్‌ను రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకును రూ.159 కోట్లు.. మొత్తం రూ.363 కోట్ల మేర మోసం చేసిన కేసులో ఈనెల 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) డైరెక్టర్లు, ఆయన నేతృత్వంలోని పలు కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేసింది. సుజనా .. అక్రమాల ఖజానా సుజనా చౌదరి ప్రత్యక్షంగా, పరోక్షంగా నిర్వహిస్తున్న వాటిలో బీసీఈపీఎల్, సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్, సుజనా మెటల్ ప్రొడక్డ్, సుజనా టవర్స్ వంటి లిస్టెడ్ కంపెనీలతో పాటు మరో 126 ఇతర కంపెనీలు ఉన్నాయి. బార్టోనిక్స్ కూడా లిస్టెడ్ కంపెనీయే. సుజనా నేతృత్వంలోని ఎనిమిది కంపెనీలు (సుజనా యూనివర్శల్, సుజనా మెటల్ ప్రొడక్ట్స్, సుజనా టవర్స్, విజయ్ హోం అప్లయన్సెస్, బార్టోనిక్స్, మెడ్‌సిటీ, లక్ష్మీగాయత్రి, బెస్ట్ అండ్ క్రాంప్టన్) తప్ప మిగిలినవన్నీ షెల్ (డొల్ల) కంపెనీలే. ఇవి సర్క్యులర్ ట్రేడింగ్, బుక్ బిల్డింగ్, మనీ లాండరింగ్, పన్ను ఎగవేత వంటి అక్రమ కార్యకలాపాలలో దిట్టలు. ఆ సంస్థల్లో లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చూపించి సుజనా గ్రూపు సంస్థలు వివిధ జాతీయ, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి మొత్తం రూ.5,700 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నాయి. అయితే సుజనా చౌదరి సంస్థల ఆస్తుల విలువ రూ.132 కోట్లకు మించదనే సమాచారంతో ఈ గ్రూపు కంపెనీల (లిస్టెడ్ కంపెనీలు) వాటాలను కొన్న షేర్ హోల్డర్లు భారీగా నష్టపోయారు. సీబీఐ విచారణలో సుజానా దోపిడీ రట్టు డొల్ల కంపెనీల పేర్లతో రుణం తీసుకుని చెల్లించకుండా మోసం చేశారంటూ సుజనా చౌదరిపై బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదు చేసింది. కాగితంపై మాత్రమే కన్పించే పరిశ్రమల్లో చేయని ఉత్పత్తిని చేసినట్లు చూపి, భారీగా పన్నులు చెల్లిస్తున్నట్లు చూపి పలు బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న సుజానా చౌదరి వాటిని సూట్ కేసు కంపెనీల ద్వారా దారిమళ్లించి దోచేశారని సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుజనా చౌదరి కంపెనీల కేసు నమోదు చేసి విచారణ చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో సుజానా చౌదరికి చెందిన కంపెనీలు, ఇళ్లు, ఆయా సంస్థల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించింది. ఒక్క హైదరాబాద్ నాగార్జున హిల్స్‌లోని సుజానా చౌదరి ఇంట్లోనే 126 సూట్ కేసు కంపెనీలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. బ్యాంకులను మోసం చేసి తీసుకున్న రుణాన్ని సూట్ కేసు కంపెనీల ద్వారా దారిమళ్లించి మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ తేల్చింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ల బ్యాంకుల నుంచే రూ.363 కోట్లు కొల్లగొట్టి మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు తేల్చి.. చెన్నై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారణకు చేపట్టిన చెన్నై కోర్టు.. సుజనా చౌదరి, ఆ సంస్థల డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యాంకులను కొల్లగొట్టడంలో ఘనుడు ► సుజనా గ్రూపునకు చెందిన రెండు ప్రధాన కంపెనీలు (సుజనా యూనివర్శల్, సుజనా టవర్స్) కలిపి రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా)కు రూ.920 కోట్లు మేర రుణాలు ఎగవేశాయి. ► సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్, నువాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థలు మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి రూ.107 కోట్లు రుణం తీసుకుని చెల్లించకుండా బోర్డు తిప్పేశాయి. ఈ రుణానికి, సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ భారతదేశంలోని ఆ సంస్థలకు రుణాలు ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు సమాచారం ఇవ్వకుండానే కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మారిషస్ కమర్షియల్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది. ► బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టŠస్ లిమిటెడ్ పేరుతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకోవడానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సుజానా గ్రూపు సమర్పించడంపై సీబీఐకి ఆ బ్యాంకు తాజాగా ఫిర్యాదు చేసింది. ► సుజానా గ్రూపు సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్ట్‌మ్స్, ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో రూ.962 కోట్లు ఎగ్గొట్టడంపై కేసుల విచారణ వివిధ దశల్లో ఉంది. దోపిడీ సొమ్ముతో భారీగా భూముల కొనుగోలు బ్యాంకుల నుంచి దోచేసిన సొమ్ముతో దేశ, విదేశాల్లో సుజానా చౌదరి భారీ ఎత్తున ఆస్తులు పోగేశారు. చంద్రబాబుకు సయామీ కవల అయిన సుజనా చౌదరి 2014లో రాజధానిపై ప్రకటన వెలువడక ముందే.. ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా సీఆర్డీఏ పరిధిలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. బ్యాంకులను దోచేసిన సొమ్ముతోనే సుజానా ఈ ఆస్తులను కొన్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. సుజనా చౌదరి ఏర్పాటు చేసిన 126 కంపెనీల్లో ఒకటైన శివసత్య పిగ్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సీఆర్డీఏ పరిధిలోని చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో సర్వే నంబర్లు 432–1, 403–5, 433, 434, 402–1ఏ, 429, 428, 412, 410–2, 427–2, 413, 415, 416, 431, 437, 399–7, 404–11, 407–4లలో 110.6 ఎకరాల భూమిని రైతుల నుంచి తక్కువ ధరకు ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేస్తూ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2018లో తన సంస్థ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సోదరుడు యలమంచిలి జతిన్ కుమార్ పేరుతో ఏర్పాటు చేసిన శివజ్యోతి ఫ్లైకాన్ బ్లాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సర్వే నంబర్లు 404–1, 404–5, 404–6లో 11.56 ఎకరాలను ఎకరం రూ.5 లక్షల చొప్పున కొనుగోలు చేసి 2014లోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కుటుంబ సభ్యులు, షెల్ కంపెనీల పేర్లతో రాజధాని ప్రాంతంలో 623.12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు ఈడీ నిగ్గు తేల్చడం గమనార్హం. ఈ అక్రమాల నుంచి బయటపడేందుకే చంద్రబాబు సూచనల మేరకు బీజేపీలో సుజానా చేరారనే అనుమానాలు ఉన్నాయి. -
సీబీఐకి మాజీ సీఎంపై లైంగిక దాడి కేసు
తిరువనంతపురం : కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారిక ఎల్డీఎఫ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీతోపాటు పార్టీలోని ఇతర నేతలపై నమోదైన లైంగిక దాడి కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో 2016, 2018, 2019లలో నమోదైన అయిదు కేసులను ప్రభుత్వం సీబీఐకు అప్పజెప్పనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉండగా కేరళలో గత యూడీఎఫ్ ప్రభుత్వంలో వెలుగు చూసినసోలార్ ప్యానెల్ స్కామ్‌లో ప్రధాన నిందితురాలుగా న్న సరితా నాయర్.. 2012లో వీరందరూ తనను లైంగికంగా వేధించారని గతంలో ఫిర్యాదు చేశారు. చాందీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణు గోపాల్, కాంగ్రెస్ ఎంపీలు హిబి ఎడెన్, అదూర్ ప్రకాశ్, మాజీ మంత్రి ఏపీ అనిల్ కుమార్, ఏపీ అబ్దుల్‌కుట్టి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని సరితా ఆరోపించారు. అయితే అప్పటి కాంగ్రెస్ నేత జోస్ కే మణిపై కూడా ఆరోపణలు చేసినప్పటికీ అతను అనంతరం ఎల్డీఎఫ్లో చేరడంతో తనపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. సోలార్ స్కాంపై దర్యాప్తు చేసిన జ్యుడిషియల్ కమిషన్ 2017లో చాందీ, వేణుగోపాల్‌తోపాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయాలని సిఫారసు చేసింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చాందీ, ఇతరులు తనను లైంగికంగా వేధించారని, సోలార్ సంస్థ ద్వారా అక్రమంగా లాభార్జన పొందటానికి అనుమంతించారని నిందితురాలు కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొంది. దీంతో వీరందరిపై క్రిమినల్ కేసులను నమోదు చేయాలని సీపీఎం ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ వ్యతిరేకంగా ఉండటంతో ఈ కేసులలో పెద్దగా పురోగతి కనిపించలేదు. అంతేగాక చాందీ హైకోర్టును ఆశ్రయించి అతనిపై ఉన్న కేసును రద్దు చేసుకున్నాడు. అలాగే లేఖలోని విషయాలను చర్చించకుండా మీడియాను నిరోధించుకున్నాడు. తర్వాత మహిళ కాంగ్రెస్ నాయకులపై కొత్తగా ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు.. అంతేగాక ఈ కేసులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇటీవల ఆమె ముఖ్యమంత్రి పినరయి విజయన్ను సంప్రదించారు. కేసులను సీబీఐకు అప్పగించడం వెనుక రాజకీయ ఉద్దేశ్యం లేదని ఆ మహిళ తెలిపింది. అయితే దీనిపై స్పందించిన చాందీ తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. కాగా కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న చర్యని కాంగ్రెస్ తప్పుపట్టింది.తమ పార్టీ నేతలపై ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైన ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడటంతో తమను ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టింది. మరోవైపు మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఎల్డీఎఫ్ ప్రభుత్వం సీబీఐకి ఈ కేసులను అప్పగిస్తోందని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ ఆరోపించారు. -
హథ్రాస్ కేసు.. సుప్రీం కీలక నిర్ణయం
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐ దర్యాప్తును అలహాబాద్ కోర్టు పర్యవేక్షించనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ దర్యాప్తు పూర్తయిన తర్వాత ఉత్తర ప్రదేశ్ నుంచి దేశ రాజధానిలోని కోర్టుకు మార్చాలని బాధితురాలి కుటుంబం తరఫున హాజరైన న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. 19 ఏళ్ల దళిత యువతిపై సెప్టెంబర్ 14న హథ్రాస్‌లో నలుగురు ఉన్నత కులస్తులు అత్యాచారం చేసి దారుణంగా చంపేశారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 29న కన్నుమూసింది. బాధితురాలి దహన సంస్కారాలు అర్థరాత్రి నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ అంశం విచారణ సందర్భంగా సామాజిక కార్యకర్త, న్యాయవాది ఇందిరా జైసింగ్ ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదనే భయాన్ని వ్యక్తం చేశారు. అలానే పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు ఉత్తరప్రదేశ్‌లో న్యాయమైన విచారణ జరగదంటూ సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ క్రమంలో అక్టోబర్ 15న వెల్లడించాల్సిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి ఎస్ఐ బొబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం రిజర్వు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి, సాక్షులకు కల్పించిన భద్రత, రక్షణకు సంబంధించి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్‌ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు సమర్పించారు. (చదవండి: హథ్రాస్ కేసు.. డీఐజీ భార్య ఆత్మహత్య) ఇప్పటికే కేసును సీబీఐకి బదిలీ చేసి, సుప్రీం కోర్టు పర్యవేక్షణకు సమ్మతి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, సాక్షి రక్షణపై, బాధితుడి కుటుంబం న్యాయవాదిని ఎన్నుకున్నదా అనే దాని గురించి ఉన్నత న్యాయస్థానం కోరిన వివరాల మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది. బాధితురాలి కుటుంబం న్యాయవాదిని నియమించుకున్నప్పటికి.. ప్రభుత్వం నియమించిన న్యాయవాదిని తమ తరఫున కేసును వాదించాలని కోరారు -
హాథ్రస్ భాధిత కుటుంబానికి గాంధీల పరామర్శ
-
న్యాయం జరిగేదాకా పోరుబాటే
లక్నో/హాథ్రస్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పారు. శనివారం వారు హాథ్రస్లో బాధితురాలి కుటుంబ సభ్యులను ఆమె ఇంట్లో పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా.. బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని ప్రియాంక అన్నారు. బాధితుల గొంతును ఎవరూ నొక్కలేరని రాహుల్ అన్నారు. రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా హాథ్రస్లో బాధిత యువతి ఇంటి వద్దకు భారీగా జనం చేరుకున్నారు. కాగా, హత్యాచార ఘటనపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. ఢిల్లీ–యూపీ సరిహద్దులో హైడ్రామా ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ సరిహద్దులోని ఢిల్లీ–నోయిడా డైరెక్టు ఫ్లైవే(డీఎన్డీ) వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. ఢిల్లీకి 180 కిలోమీటర్ల దూరంలోని హాథ్రస్‌కు వెళ్లి, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకా అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి రావడం, పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. చివరకు, కోవిడ్ నిబంధనల దృష్ట్యా రాహుల్, ప్రియాంకసహా ఐదుగురు కాంగ్రెస్ నేతలనే హాథ్రస్‌కు వెళ్లడానికి యూపీ పోలీసులు అంగీకరించారు. దీంతో శనివారం సాయంత్రం వారు తమ వాహనాల్లో ముందుకు కదిలారు. మరోవైపు హాథ్రస్ చుట్టూ ఉన్న బారికేడ్లను పోలీసులు శనివారం తొలగించారు. ఆంక్షలను ఎత్తి వేశారు. గ్రామంలోకి మీడియా ప్రతినిధులను వెళ్లనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్ సెక్రెటరీ(హోం) అవనీశ్ అవస్తి, డీజీపీ హెచ్‌సీ అవస్తి కూడా శనివారం హాథ్రస్లో యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని, యువతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇచ్చారు. వారణాసిలో శనివారం కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వాహన శ్రేణిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం స్మతి ఇరానీ విలేకరులతో మాట్లాడారు. హాథ్రస్ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. దళిత యువతిపై జరిగిన కిరాతకం విషయంలో సాధారణ దర్యాప్తుతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని బీఎస్పీ చీఫ్ మాయావతి చెప్పారు. హాథ్రస్‌కు వెళ్లకుండా ప్రియాంక దుస్తులు పట్టుకుని అడ్డుకుంటున్న పోలీసు -
సీఆర్డీఏ భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు
అమరావతి : సీఆర్డీఏ పరిధిలో వేలాది ఎకరాల భూకుంభకోణం జరిగిందని, రికార్డులు కూడా తారుమారు చేశారని వెల్లడవడంతో ఈ వ్యవహారంపై నిజాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ కోరేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు సంసిద్ధమయ్యారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్)లో కూడా అంతులేని అవినీతి చోటుచేసుకుందని తెలియడంతో ఈ బాగోతంపైనా సీబీఐ దర్యాప్తు కోరాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ రెండు కుంభకోణాలపై గతంలోనే వైఎస్సార్సీపీ సీబీఐ దర్యాప్తు కోరినా, నెలల తరబడి కేంద్రం పెండింగ్‌లో పెట్టడంతో ఈ పార్లమెంటు సమావేశాల్లో దానిపై గట్టిగా నిలదీయాలని పార్టీ ఎంపీలు నిర్ణయించినట్టు సమాచారం. చదవండి : పార్లమెంట్లో ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతాం గతంలో రాజధాని పరిధిలో చోటుచేసుకున్న భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ స్కామ్ సాధారాణ కుంభకోణాలు కావని, చంద్రబాబుకు సన్నిహితులైన వారు ఎందరో వాటి వెనక ఉన్నారని వైఎస్సార్సీపీ ఎంపీలు విస్పష్టంగా పేర్కొంటున్నారు. సీబీఐ దర్యాప్తు చేపడితే ఈ కుంభకోణాల వెనుక పెద్దల హస్తం బయటపడుతుందని నిజానిజాలు వెలుగుచూస్తాయని వైఎస్సార్సీపీ ఎంపీలు భావిస్తున్నట్టు తెలిసింది. ఉన్నతస్ధాయి విచారణతోనే చంద్రబాబు బాగోతం వెలుగుచూస్తుందని వారు చెబుతున్నారు. -
నాడు వద్దని.. నేడు సీబీఐ విచారణ కోరుతున్నారు
సాక్షి, తాడేపల్లి: ‘అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు నాయుడు ప్రవేయం ఉంది. గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుది. సీబీఐ రాష్టానికి రావద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు నేడు సీబీఐ విచారణ కోరుతున్నారు. మా చిత్తశుద్ధి నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు’ అన్నారు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆమె శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో వైఎస్సార్ ఆసరా పథకం గురించి మాట్లాడుతూ.. ‘డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు నేడు పండగ రోజు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ ఆసరా ద్వారా హామీ నిలబెట్టుకున్నారు. మహిళలు కోసం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు అడుగులు వేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి నాలుగు అడుగులు ముందుకు వేస్తున్నారు. 90 లక్షల మందికి వైఎస్సార్ ఆసరా ద్వారా మేలు జరిగింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్పప్పటికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. చంద్రబాబులాగా కుంటి సాకులు చెప్పడం జగనన్నకు తెలియదు’ అన్నారు రోజా. (చదవండి: ‘మాకు చిరకాలం మీరే సీఎంగా ఉండాలి’) ఆమె మాట్లాడుతూ.. ‘మహిళలు, విద్యార్థులు కోసం సీఎం జగన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు. ఆడవారికి అండగా ఉంటున్న ముఖ్యమంత్రికి మహిళలు అందరూ రుణపడి ఉంటారు. మహిళలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చంద్రబాబు మహిళలను మోసం చేశారు. ప్రజలను తమ సొంత కుటుంబ సభ్యులుగా జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దళిత మహిళను హోమ్ మంత్రి, ఎస్టీ మహిళను డిప్యూటీ సీఎం చేసిన ఘనత జగనన్నకు దక్కుతుంది. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించారు. స్త్రీల ఆకాంక్ష మేరకు మద్యపాన నిషేధాన్ని దశల వారిగా అమలు చేస్తున్నారు. మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తున్నారు. ఆడవారి కోసం చంద్రబాబు ఒక మంచి పథకం కూడా ప్రవేశ పెట్టలేదు. వైఎస్సార్ ఆసరా మీద చంద్రబాబు నిందలు వేస్తున్నారు. కులాలు, మతాలకు అతీతంగా సీఎం జగన్ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నారు’ అని ప్రశంసలు కురిపించారు. -
అంతర్వేది ఘటన.. సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం
-
అంతర్వేది ఘటన.. సీబీఐ దర్యాప్తుకు నిర్ణయం
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసు దర్యాప్తును రాష్ట్ర పోలీసులు సవాలుగా తీసుకున్నారు. అయినా కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోను, సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. (చదవండి: రథం చుట్టూ రాజకీయం!) అంతేకాక కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం జగన్ రాష్ట్ర డీజీపీని ఆదేశించడమైనది. అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర డీజీపీ కార్యాలయం హోం శాఖకు లేఖ పంపింది. ఇందుకు సంబంధించి రేపు (శుక్రవారం) జీవో వెలువడనుంది. -
ఆమె ఖర్చుల భారం సుశాంత్‌దే!
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. తన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి విమాన టికెట్లు, హోటల్ ఖర్చులను సుశాంత్ భరించాడని వెల్లడైంది. రియా సోదరుడి ఖర్చులు కూడా సుశాంత్ భరించాడని బ్యాంక్ స్టేట్మెంట్లో తేలింది. సుశాంత్ విషాదాంతంపై దర్యాప్తు చేపట్టిన బిహార్ పోలీసులు ముంబైకు చేరుకుని విచారణను వేగవంతం చేయడంతో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి : ఆమె విషకన్య.. సంచలన ఆరోపణలు కుంగుబాటుతో బాధపడుతున్న సుశాంత్‌కు 2019 నవంబర్ నుంచి చికిత్స అందిస్తున్న డాక్టర్ కేసరి చావ్దానూ బిహార్ పోలీసులు సంప్రదించారు. కొద్దినెలలుగా సుశాంత్ మందులు సరిగ్గా వేసుకోవడం లేదని, ఆహారం సవ్యంగా తీసుకోవడం లేదని డాక్టర్ వెల్లడించారు. సుశాంత్ సరిగ్గా స్పందించపోవడంతో తాను కూడా వైద్య సలహాలు ఇవ్వడం విరమించానని ఆయన పోలీసులకు తెలిపారు. సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్రపై సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు రంగంలోకి దిగారు. సుశాంత్ ఖాతా నుంచి రూ 15 కోట్లు వేరే ఖాతాలకు బదిలీ అయ్యాయని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆమె విషకన్య.. సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూడిల్లీ : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ రాజ్‌పుత్ విషాదాంతంపై ఆయన తండ్రి సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై పట్నాలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో ఈ కేసు మలుపు తిరిగింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదుతో బిహార్ పోలీసులు రంగంలోకి దిగడంతో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వ్యవహారంపై ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా సుశాంత్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు కనిపిస్తోందని బిహార్ మంత్రి, జేడీయూ నేత మహేశ్వర్ హజారి అన్నారు. ఈ కేసులో రియా చక్రవర్తి కాంట్రాక్ట్ కిల్లర్‌లా వ్యవహరించారని, ఆమె విషకన్యని హజారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్‌ను ప్రేమ పేరుతో ఆటాడుకున్న రియా అతడి నుంచి డబ్బులు గుంజుకుని ఆపై వదిలివేశారని ఆరోపించారు. ‘ఇది ఆత్మహత్య కాదు..హత్యే, పథకం ప్రకారం సుశాంత్‌ను రియా అంతమొందించారు..దీనిపై దర్యాప్తు జరగాల’ని హజారి స్పష్టం చేశారు. సుశాంత్ మరణంపై ముంబై పోలీసులు సరిగ్గా తమ పని చేయడం లేదని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సుశాంత్ కుటుంబానికి బిహార ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగేలా అవసరమైన సాయం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సుశాంత్ రాజ్‌పుత్‌కు న్యాయం జరగాలని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం భావిస్తున్నారని చెప్పారు. మరోవైపు రియా పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసే ముందు తమ వాదన వినాలని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో గురువారం కేవియట్ దాఖలు చేసింది. సుశాంత్ రాజ్పుట్ జూన్ 14న ముంబై బాంద్రా నివాసంలో విగతజీవిగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. సుశాంత్ అనుమానాస్పద మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని పలువురు అభిమానులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి : సుశాంత్ సింగ్ కేసులో మరో ట్విస్ట్ -
సుశాంత్ మృతిపై ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన ఆరోపణలు
-
సుశాంత్ మృతిపై స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్‌ను హత్య చేశారని ఆరోపించిన స్వామి ముంబై పోలీసుల ఎఫ్ఐఆర్పై పలు సందేహాలు వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ డాక్యుమెంట్‌ను ట్విటర్లో పోస్ట్ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 పాయింట్లలో 24 పాయింట్లు ఇది హత్యేనని పేర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. స్వామి ట్వీట్ చేసిన డాక్యుమెంట్ ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు. సుశాంత్ రాజ్‌పుత్ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని, ఇది నరహత్యను సూచిస్తోందని అన్నారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం సుశాంత్ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్ నోట్ లేదని ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు. సుశాంత్ కంటే ముందు బలవన్మరణానికి పాల్పడిన మేనేజర్ దిశా సలియాన్‌కు కొన్ని అంశాలు తెలిసిఉంటాయని చెప్పుకొచ్చారు. ముంబై పోలీసులు సుశాంత్ కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ను అనుసరించారా అని సుబ్రహ్మణ్య స్వామి సందేహం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని స్వామి డిమాండ్ చేశారు. సుశాంత్ మరణంపై ఆయన బుధవారం బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో మాట్లాడారు. సుశాంత్ మరణానికి ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని బాంద్రా నివాసంలో ఉరి వేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ బలవన్మరణంతో సినీ పరిశ్రమలో వేళ్లూనుకున్న బంధుప్రీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. చదవండి : రియాతో బంధం తెంచుకోవాలనుకున్నాడు: అంకిత -
‘సుశాంత్ మృతికి కారణం తెలియాలి’
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుట్ మరణంపై పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తుండగా, తాజాగా సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ఈ కేసుపై అత్యున్నత దర్యాప్తు సంస్థచే విచారణ జరిపించాలని కోరారు. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని హోంమంత్రి అమిత్ షాకు ఆమె బుధవారం సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. హోంమంత్రిని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్లో’ సుశాంత్ అనూహ్యంగా మనకు దూరమై ఇప్పటికి నెలరోజులు దాటింది..నాకు ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది..న్యాయాన్ని నిలబెట్టేందుకు ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ జరిపించాలని మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నా’నని పేర్కొన్నారు. సుశాంత్ ఎందుకు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నారో తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని..సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ను ముగించారు. కాగా ఓ ఇన్స్టాగ్రాం యూజర్ తనపై లైంగిక దాడి జరిపి చంపేస్తానని బెదిరిస్తున్నాడని అంతకుముందు ఆమె ఆ మెసేజ్ స్ర్కీన్‌షాట్‌ను షేర్ చేశారు. "నన్ను గోల్డ్ డిగ్గర్ అన్నారు, సహించాను.. హంతకురాలని నిందించారు.. భరించాను, సిగ్గు లేదని మొహం మీదే తిట్టిపోశారు.. మౌనంగా ఊరుకుండిపోయాను.. కానీ నేను ఆత్మహత్య చేసుకోవాలని, లేకపోతే అత్యాచారం చేసి చంపేస్తానని బెదిరించే హక్కు మీకెక్కడిది? అని ప్రశ్నించారు. తనపై బెదిరింపు వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోండంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ట్యాగ్ చేశారు. సుశాంత్ చావుకు రియా కూడా కారణమంటూ కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. చదవండి : ప్రశాంతంగా ఉండు సుశీ... -
‘నా కుమార్తెను చంపేశారు’ : నిత్యానంద మరో అకృత్యం
సాక్షి, బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద అకృత్యాలకు సంబంధించి మరో హృదయ విదారక గాథ తాజాగా వెలుగులోకి వచ్చింది. నిత్యానంద ఆశ్రమంలో అమ్మాయిలను (శిష్యులను) భక్తి ముసుగులో లోబర్చుకోవడం, లైంగిక వేధింపులతో నరకం చూపిస్తున్నారంటూ కలకలం రేపిన ఇటీవలి కథనాలు, బాలికల మాయం ఉదంతాలు వెలు చూసిన అనంతరం ఓ బాధిత తల్లి తన గోడును మీడియా ముందు వెల్లడించారు. 2014లో నిత్యానంద ఆశ్రమంలో తన కుమార్తెను హింసించి, దారుణంగా హత్య చేశారని ఝాన్సీ రాణి అనే మహిళ ఆరోపించారు. బిడ్డను, భర్తను కోల్పోయాను.. కుటుంబం మొత్తం సర్వ నాశనమైపోయింది. తనలాంటి దుస్థితి మరెవ్వరికీ రాకూడదు..దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు. ఇండియా టుడే టీవీ కథన ప్రకారం నిత్యానంద బెంగళూరు ఆశ్రమంలో తన కుమార్తె సంగీత అర్జున్ను అక్రమంగా బంధించి, హత్యచేశారని ఝాన్సీరాణి ఆరోపణ. త్రిచికి చెందిన సంగీత అర్జునన్ 2008 - 2014 కాలంలో నిత్యానంద ఆశ్రమంలో కంప్యూటర్ విభాగానికి హెడ్‌గా పనిచేసేది. మరణించే నాటికి (డిసెంబర్28, 2014) ఆమె వయసు 24 మాత్రమే. ఆశ్రమంలో చాలా దారుణమైన పరిస్థితుల్లో సంగీత జీవిస్తున్న విషయాన్ని గమనించి ఆమెను ఇంటికి తీసుకొచ్చానని, అయితే వెంటనే నలుగురు వ్యక్తులు వచ్చి బలవంతంగా సంగీతను తీసుకెళ్లారని, పైగా ఆశ్రమనుంచి ఎత్తుకొచ్చావంటూ తనమీదే కేసు పెడతామని బెదిరించాని ఆమె పేర్కొన్నారు. ఆ తరువాత తన బిడ్డను మళ్లీ సజీవంగా చూడలేకపోయానని ఆమె కన్నీంటి పర్యంతమయ్యారు. ఆశ్రమంలో ఉండే హంసానంద, ప్రణయానంద ఇద్దరూ కనీసం తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడటానికి అనుమతించలేదని రాణి చెప్పారు. చాలాసార్లు ఆశ్రమానికి సంగీతను కలవడానికి వెళ్లి...గంటల తరబడి గేటు ముందు వేచి చూసినా ఫలితం లేదని, చివరకు గుండెపోటుతో చనిపోయిందంటూ ఆమె మృతదేహాన్ని అప్పగించారని వాపోయారు. కచ్చితంగా తన బిడ్డను హత్య చేశారని, దీనిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తును చేపట్టాలని ఆమె కోరుతున్నారు. అంతేకాదు సంగీత అంత్యక్రియలు కూడా ఆశ్రమంలోనే చేయాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యారని ఝాన్సీ రాణి చెప్పారు. అంత్యక్రియలు నిర్వహించడానికి తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకురావాలని పట్టుబట్టడంతోనే మొదటి పోస్ట్‌మార్టం జరిగిందని ఆమె తెలిపారు. అయితే సంగీతం మృతదేహంపై కాళ్లపై వాపు, బ్లడ్ క్లాట్స్ బంధువులు గమనించడంతో బెంగళూరులోని రాంగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంతోపాటు, రెండవసారి పోస్ట్‌మార్టం కోసం పట్టుబట్టినట్టు ఆమె చెప్పారు. దీంతో ఆమె శరీరంలోని అవయవాలన్నీ మాయమయ్యాయని రెండవ పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. అయితే మొదటి శవపరీక్షలో వాటిని తొలగించినట్టు గత ఏడాది హైకోర్టు జడ్జికి తెలిపారన్నారు. కర్ణాటక కోర్టులో కేసు వేసి ఐదేళ్ళు అయ్యింది. గత ఏడాది ఈ కేసులో సీబీఐకి అప్పగిస్తున్నట్టు చెప్పారు. కానీ ఆ తరువాత పదిరోజుల్లోనే ఆ సదరు న్యాయమూర్తి బదిలీ అయ్యారు. దీంతో విచారణలో ఎలాంటి పురోగతి లేదని, ఈ నేపథ్యంలో తక్షణమే స్పందించి బీఐతో విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. సంగీత చనిపోయిన రెండేళ్లకే కుమార్తె చనిపోయిన బాధతో కుమిలిపోయిన తన భర్త కూడా ఈ లోకాన్ని వీడారని, నిత్యానంద నిర్వాకంతో సర్వం కోల్పోయానని ఝాన్సీరాణి ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కుటుంబంలో గుండెపోటు వ్యాధికి సంబంధించిన హిస్టరీ ఉన్న కారణంగా జెనెటిక్‌గా వచ్చిన గుండెపోటుతో అతి చిన్న వయసులోనే సంగీత చనిపోయిందని ఆశ్రమ వర్గాలు తమ వెబ్సైట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా స్వామి ముసుగులో ఆశ్రమంలో లైంగిక కార్యకలాపాలు, అత్యాచార ఆరోపణలను ఇప్పటికే ఎదుర్కొంటున్న నిత్యానందపై మరోసారి తీవ్ర ఆరోపణలు చెలరేగాయి. అమ్మాయిలతో బలవంతపు విరాళాలు వసూలు కోసం పిల్లలను కిడ్నాప్ చేసి, తప్పుగా నిర్బంధించినందుకు నిత్యానందపై గత వారం కేసు నమోదైంది. అయితే నిత్యానంద దేశం విడిచి పారిపోయాడని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీ‘ఐ’
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతో పాటు మరికొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ స్థాయిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారణ అయిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని సీబీఐని కోరాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావిం చారు. యరపతినేని మైనింగ్ అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారని, ఈ పిటిషన్‌పై తీర్పును వెలువరించాల్సి ఉందని ఆయన ధర్మాసనానికి గుర్తు చేశారు. ఇప్పుడు ఈ కేసులో కోర్టు తీర్పు అవసరం లేదని, ప్రభుత్వమే యరపతినేని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని, ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు అధికారిక సమాచారం ఇచ్చారని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. గత విచారణలో కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను.. ఈ కేసులో భారీ అక్రమాలు జరిగినట్లు లభించిన ప్రాథమిక ఆధారాలను.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రతిపక్ష పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కావడంతో సీఐడీ దర్యాప్తును కొనసాగిస్తే అది కక్ష సాధింపుగా భావించేందుకు అవకాశం ఉందని.. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిర్ణయించిందని చెప్పారు. అందువల్ల టీజీవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని రీ ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన హైకోర్టు కృష్ణారెడ్డి వ్యాజ్యాన్ని సోమవారం రీ ఓపెన్ చేస్తామని తెలిపింది. యరపతినేని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా లైమ్‌స్టోన్ తవ్వకాలు చేస్తున్నారని, కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అలాగే యరపతినేని అక్రమ మైనింగ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆయన హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం యరపతినేని అక్రమ మైనింగ్‌పై దర్యాప్తు జరపాలని కేంద్ర దర్యాప్తు సంస్థలను మీరే ఎందుకు కోరకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని నిర్ణయించింది. -
‘ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ’
బెంగళూర్ : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై యడియూరప్ప నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ఆదివారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గతంలో హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్- కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ బీజేపీ నేతలు, సీనియర్ పోలీస్ అధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేసిందనే ఆరోపణల నిగ్గుతేల్చేందుకు యడియూరప్ప ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. గతంలో ఎవరెవరి ఫోన్లు ఏ కారణం చేత ఏ సమయంలో ట్యాప్ చేశారనే వివరాలు రాబట్టేందుకు కేసును సీబీఐకి అప్పగించినట్టు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారని కర్ణాటక ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. మరోవైపు అంతర్జాతీయ ఏజెన్సీతో విచారణకైనా తాను సిద్ధమేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. సీబీఐ విచారణ లేదా అంతర్జాతీయ ప్రమాణాలతో మరే విచారణనైనా వారు చేపట్టనివ్వండి..ట్రంప్‌తో అయినా మాట్లాడుకోనివ్వండంటూ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ వ్యాఖ్యానించారు. -
సీబీఐ ముందు హాజరుకావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో తమ ముందు హాజరుకావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులను గౌరవించి తీరాల్సిందేనని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి)కి హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సీబీఐ నిర్దేశించిన మే 4న కాకుండా మే 27, 28 తేదీల్లో సీబీఐ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు బెంగళూరులోని సీబీఐ అధికారుల ముందు హాజరు కావాలని పేర్కొంది. ఆ రెండు రోజుల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన విరామం ఇవ్వాలని సూచించింది. అధికారుల విచారణకు పూర్తి స్థాయిలో సహకరించాలని సుజనాకు స్పష్టం చేసింది. విచారణ సమయంలో న్యాయవాది వెంట ఉంచుకోవచ్చని పేర్కొంది. సీఆర్పీసీ సెక్షన్ 160 కింద విచారణ పేరుతో సుజనా చౌదరిని అరెస్ట్ చేయడం గానీ, శారీరకగా, మానసికంగా వేధింపులకు గానీ గురిచేయొద్దని పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేశారు. సీబీఐ తనకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సుజనా చౌదరి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ అమర్నాథ్గౌడ్ విచారణ జరిపారు. ప్రాథమిక ఆధారాలున్నాయి.. సీబీఐ న్యాయవాది కె.సురేందర్ వాదనలు వినిపిస్తూ, సీఆర్పీసీ సెక్షన్160, 161 కింద నోటీసులు ఇచ్చినప్పుడు, విచారణను ఎదుర్కోవడానికి నిరాకరించడానికి వీల్లేదన్నారు. తాము సీఆర్పీసీ సెక్షన్ 41 కింద జరుపుతున్న విచారణ కాదన్నారు. సుజనా గ్రూపు కంపెనీల వ్యవహారాలకు సంబంధిం చిదర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగితాలపైనే లావాదేవీలు చూపినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయన్నారు. అందుకే పిటిషనర్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ దశలో ఈ కేసు పూర్వాపరాల గురించి ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయట్లేదన్నారు. సీబీఐ చెప్పిన మే 4న కాకుండా, ఈ నెల 27, 28 తేదీల్లో ఆ సంస్థ ముందు హాజరు కావాలని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధం లేదు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తూ.. చెన్నైకి చెందిన బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజ్టెక్ట్స్ కంపెనీకి కానీ, ఆ కంపెనీ అధికారులతో కానీ సుజనా చౌదరికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు ఇచ్చిన నోటీసులకు సంబంధించి సీబీఐని పిటిషనర్ మరింత సమాచారం, అలాగే ఎఫ్ఐఆర్ కాపీ కోరుతూ లేఖ రాశారన్నారు. అయితే సీబీఐ నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. ఎన్నికల దృష్ట్యా మే 19వ తేదీ వరకు అందుబాటులో ఉండలేనని సీబీఐకి చెప్పారన్నారు. -
మావోయిస్టుల దాడి రాజకీయ కుట్ర
రాజ్‌నంద్‌గావ్(ఛత్తీస్‌గఢ్): దంతెవాడలో ఎమ్మెల్యే భీమా మాండవిని మావోయిస్టులు పొట్టనబెట్టుకున్న ఘటనను రాజకీయ కుట్రగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అభివర్ణించారు. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నియోజకవర్గంలోని డొంగర్‌గావ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ‘మా పార్టీ ఎమ్మెల్యే మాండవిపై మావోయిస్టుల దాడి సాధారణ ఘటన కాదు, అది రాజకీయ కుట్ర గా భావిస్తున్నాం. మాండవి భార్య కూడా సీబీ ఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ ఘటనలో నిజాలు వెలికి తీయాలని ముఖ్యమంత్రి బఘేల్ నిజంగా భావిస్తే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి’అని కోరా రు. ‘సీబీఐ అంటే సీఎం బఘేల్ ఎందుకు భయపడుతున్నారు? దర్యాప్తు సంస్థ ముం దుగా తమ అనుమతి తీసుకోవాలని ఎందుకు ఉత్తర్వులిచ్చారు?’అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిపోయాయన్నారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేకం గా ప్రధానమంత్రిని నియమించాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్‌పై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ మౌనం వీడి వైఖ రిని స్పష్టం చేయాలన్నారు. భారత్ నుంచి కశ్మీర్ విడిపోవాలని ఈ నేతలు కోరుకుంటున్నా రని ఆరోపించారు. చిట్టచివరి బీజేపీ కార్యకర్త ఉన్నంతవరకు దేశం నుంచి కశ్మీర్‌ను ఎవరూ విడదీయలేరని పేర్కొన్నారు. బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలపై దాడి అనంతరం దేశ ప్రజలం తా సంబరాలు జరుపుకుంటే పాకిస్తాన్‌తోపాటు కాంగ్రెస్ కార్యాలయంలోనూ విషాదచాయలు అలుముకున్నాయని ఎద్దేవా చేశారు. -
రాకేష్ ఆస్ధానాకు ఢిల్లీ హైకోర్టు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్ధానాతో పాటు సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్ దేవేందర్ కుమార్, దళారి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన కేసును కొట్టివేసేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. నేర విచారణలపై ఆస్ధానాకు కల్పించిన మధ్యంతర ఊరటను తొలగించారు. ఆస్ధానా సహా ఇతరులపై నమోదైన కేసు విచారణను పది వారాల్లోగా పూర్తిచేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఆస్ధానాకు వ్యతిరేకంగా దాఖలు చేసిన నేరపూరిత కుట్ర, అవినీతి, నేర ప్రవర్తన అభియోగాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా, మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీ ప్రమేయంతో కూడిన మనీల్యాండరింగ్ కేసు నుంచి తనను తప్పించేందుకు తాను ముడుపులు ముట్టచెప్పానని హైదరాబాద్‌కు చెందిన సాన సతీష్ బాబు ఫిర్యాదు ఆధారంగా ఆస్ధానా తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మరోవైపు సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మపై ఆరోపణలు చేసినందుకే తనపై ముడుపుల కేసును ముందుకు తెచ్చారని, తనపై అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని రాకేష్ ఆస్ధానా కోర్టుకు నివేదించారు. ఇక ఫైర్ సర్వీసుల డీజీ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన ఆలోక్ వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సీబీఐ దర్యాప్తును రాష్ట్రం అడ్డుకోలేదు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు రాష్ట్రంలో దాడులు, దర్యాప్తు చేసేందుకు అనుమతి ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని న్యాయ వర్గాలు తప్పుపడుతున్నాయి. అనుమతి ఉపసంహరణకు ప్రభుత్వం చెప్పిన కారణం హాస్యాస్పదంగా ఉందంటున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం సీబీఐపై ఏ రకమైన ప్రభావం చూపదంటున్నాయి. కేంద్రప్రభుత్వ పరిధిలోకొచ్చే అంశాల విషయంలో సీబీఐ నేరుగా దర్యాప్తు చేయవచ్చునని, ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదంటున్నాయి. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారాల్ని పొందుపరిచారని, అలాగే ఉమ్మడి అధికారాలనూ ప్రస్తావించారని, అంతిమంగా రాష్ట్ర అధికారంపై కేంద్ర అధికారమే చెల్లుబాటవుతుందని గుర్తు చేస్తున్నాయి. తనమీద ఉన్న అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎక్కడ దర్యాప్తు చేసి జైలుపాలు చేస్తుందోనన్న భయంతోనే సీఎం చంద్రబాబు రాజకీయ కోణంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోనక్కర్లేదు.. కేంద్రప్రభుత్వ పరిధిలోకొచ్చే అంశాలు, కేంద్రప్రభుత్వ నిధులతో ముడిపడిన వ్యవహారాలు, జాతీయ కంపెనీలు, బ్యాంకులు తదితరాలపై వచ్చే ఫిర్యాదులమీద సీబీఐ నేరుగా దర్యాప్తు చేయవచ్చు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విషయాల్లో ఇప్పటివరకు నమోదు చేసిన కేసులన్నింటిలోనూ సీబీఐ రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోలేదు. భవిష్యత్తులోనూ సీబీఐ ఇలానే స్వతంత్రంగా వ్యవహరిస్తుందని పేర్కొంటున్నాయి. రాష్ట్రచట్టాల పరిధిలోకొచ్చే అంశాలకు సంబంధించి దర్యాప్తు చేయాలంటేనే రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నాయి. అవినీతి ఆరోపణలపై విచారణ నుంచి తప్పించుకునేందుకే.. ఇప్పటివరకు సీబీఐకి అనుమతిని ఉపసంహరించిన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఆ నిర్ణయాన్ని రాజకీయకోణంలోనే తీసుకున్నాయని న్యాయవర్గాలు చెప్పాయి. సీఎంలమీద వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించే వీలున్నప్పుడు, వారిపై సీబీఐ కేసు నమోదు చేసినప్పుడు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఉపసంహరణవైపు మొగ్గుచూపాయంటున్నాయి. ఉత్తరాఖండ్, సిక్కిం, కర్ణాటక.. ఇలా ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా తమ సీఎంల అవినీతిపై సీబీఐ దర్యాప్తును అడ్డుకునేందుకు సీబీఐకి అనుమతిని ఉపసంహరిస్తూ ఉత్తర్వులిచ్చాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగానే నిర్ణయం తీసుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. విజయ్‌మాల్యా, నీరవ్మోదీలతోపాటు ఆర్థిక అవకతవకలకు సంబంధించి పలువురు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వ్యక్తులపై సీబీఐ నేరుగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిందని, ఇందులో ఎక్కడా రాష్ట్రప్రభుత్వ అనుమతే తీసుకోలేదని న్యాయవర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీలు రుణాలు తీసుకుని ఎగవేసినప్పుడు జాతీయ బ్యాంకులు చేసే ఫిర్యాదులపైనా సీబీఐ నేరుగా దర్యాప్తు చేసిందేతప్ప రాష్ట్రాల అనుమతి కోరలేదన్నాయి. బ్యాంకుల అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ స్వతంత్రంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. మధ్యప్రదేశ్‌లో వ్యాపం స్కాం విషయంలోనూ రాష్ట్రప్రభుత్వ అనుమతితో సంబంధం లేకుండా సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఇలా అనేక కేసుల్లో సీబీఐ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోందని, ఏ వ్యవహారానికి సంబంధించైనా ప్రాథమిక విచారణ జరిపే విషయంలో సీబీఐ సంబంధిత రాష్ట్రప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరమే లేదని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిప్పు అయితే భయమెందుకు? సీఎం చంద్రబాబుకు ఆయన అవినీతి గురించి చాలా స్పష్టతుంది. అందుకే తనపై ఎక్కడ సీబీఐ దర్యాప్తు జరుగుతుందోనని ఆయన భయపడుతున్నారు. ఎవరైనా తాను నిజాయితీపరుడినని భావిస్తే ఏ విచారణకైనా సిద్ధమని సవాలు చేస్తారు. దీనికి విరుద్ధంగా చంద్రబాబు సీబీఐ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివెనుక దురుద్దేశాలున్నాయి. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే. సీబీఐలో అంతర్గత విభేదాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామంటూ ఆయన చెబుతున్న కారణం నవ్వు తెప్పిస్తోంది. గుమ్మడికాయ దొంగలెవరంటే భుజాలు తడుముకున్నట్లు చంద్రబాబు వైఖరుంది. ప్రభుత్వ పెద్దలు ఎంత పెద్ద అవినీతికి పాల్పడినా సీబీఐ పట్టించుకోవద్దన్న మాట. సీబీఐకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముంది. – జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి -
యూపీలో 12,460 నియామకాల రద్దు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన రెండు భారీ రిక్రూట్మెంట్లపై అలహాబాద్ హైకోర్టు గురువారం కీలక ఉత్తర్వులిచ్చింది. మొదటి దశలో 12,460 మందిని ప్రభుత్వం ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపిక చేయగా, వారందరి ఉద్యోగాలనూ కోర్టు పూర్తిగా రద్దు చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన ప్రకటన 2016 డిసెంబర్లో వెలువడగా, నియామక ప్రక్రియను ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి చేపట్టి మూడు నెలల్లో పూర్తి చేయాలని కోర్టు తాజాగా ఆదేశించింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తయిందే కానీ ఇంకా ఎవరినీ ఉద్యోగాల్లో నియమించలేదు. ఇక రెండో ప్రక్రియలో 68,500 ఉద్యోగాలకు ఇప్పటికే రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఈ ప్రక్రియపై సీబీఐ విచారణకు కోర్టు ఆదేశించింది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం లంచాలు తీసుకుని, నిబంధనలు పాటించకుండా తమకు ఇష్టమైన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తోందంటూ పలువురు ఉద్యోగార్థులు కోర్టును ఆశ్రయించడంతో అలహాబాద్ హైకోర్టు ఈ ఉత్తర్వులిచ్చింది. రెండో నియామక ప్రక్రియలో అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా మార్చేశారనే ఆరోపణలున్నాయి. -
తమిళనాడు సీఎంకు మద్రాసు హైకోర్టు షాక్
-
ముఖ్యమంత్రికి షాకిచ్చిన హైకోర్టు
సాక్షి, చెన్నై : తమిళనాడు ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి పళనిస్వామి ఆయాచితంగా తన అనుచర వర్గానికి, బంధువులకు రోడ్డు కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనే ఆరోపణలపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ముఖ్యమంత్రి పళనిస్వామిపై ప్రతిపక్ష డీఎంకే చేసిన ఆరోపణలపై విచారణ చేస్తున్న విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు జడ్జి ఏడీ జగదీష్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రిపై వెల్లువెత్తిన ఆరోపణలపై పారదర్శక విచారణ జరగాలనే ఉద్దేశంతోనే కేసును సీబీఐకి అప్పగించినట్టు ఆయన వ్యాఖ్యానించారు. విజలెన్స్ దర్యాప్తులో క్లీన్ చిట్ కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టు పనులు పళనిస్వామి తన బంధువర్గానికి కట్టబెట్టారనే డీఎంకే ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రాష్ట్ర విజిలెన్స్ డిపార్ట్మెంట్ పళనిస్వామికి క్లీన్ చిట్ ఇచ్చింది. డీఎంకే ఆరోపణల్లో నిజం లేదని తేల్చింది. డీఎంకే హైకోర్టును ఆశ్రయించడంతో ఈ కీలక తీర్పు వెలువడింది. -
సీబీఐ విచారణకు ఆదేశించండి
భువనేశ్వర్/కటక్ : ప్రతిష్టాత్మకమైన పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో స్వామి కొలువుదీరిన శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి అదృశ్యంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో బుధవారం ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ వ్యవహారంపై జగన్నాథుని భక్తుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ సంఘటనపై న్యాయ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ అధ్యక్షతన న్యాయ కమిషను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కాగా, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ అనుమతితో నిపుణుల బృందం.. భారతీయ పురావస్తు శాఖ రత్న భాండాగారాన్ని ఇటీవల సందర్శించింది. రత్న భాండాగారం అంతా బాగానే ఉందని, ఎటువంటి ఢోకా లేనట్లు శ్రీజగన్నాథ మందిరం పాలక వర్గం(ఎస్జేటీఏ) ప్రకటించింది. ఇంతలో భాండాగారం తాళం చెవి కనిపించడం లేదనే వార్త బయటకు పొక్కింది. దీంతో నిపుణుల బృందం రత్న భాండాగారాన్ని పరిశీలించడం బూటకమని తేలిన నేపథ్యంలో.. దిలీప్ కుమార్ మహాపాత్రో అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్షంగా చొరవ కల్పించుకుని ఈ సందిగ్ధత తొలగించాలని అభ్యర్థించారు. జగన్నాథుని ఆస్తులు అపారం ప్రపంచ ప్రఖ్యాత శ్రీ జగన్నాథునికి అమూల్యమైన స్థిరచరాస్తులు ఉన్నాయి. దాదాపు 60,410 ఎకరాల స్థలాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. స్వామి ఆస్తులు పలుచోట్ల అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. వీటికి విముక్తి కలిగించలేని దయనీయ స్థితిలో పాలక వర్గం కొట్టుమిట్టాడుతోంది. స్థిరాస్తుల్లో గనులు కూడ ఉన్నాయి. వీటిలో అక్రమ తవ్వకాలు జోరందుకున్నాయి. శ్రీ జగన్నాథుడు కొలువు దీరిన శ్రీ మందిరం సముదాయంలో ఏర్పాటు చేసిన రత్న భాండాగారంలో అమూల్యమైన సంపద ఉంది. రత్నాలు, వైఢూర్యాలు వంటి ఎంతో విలువైన సంపద ఉన్నా.. ఇప్పటికీ సమాచారం స్పష్టంగా తెలియడం లేదు. చివరి సారిగా 1985లో రత్న భాండాగారాన్ని లెక్కించినట్లు తెలుస్తోంది. అధికారవర్గం పూర్తి నిర్లక్ష్యం శ్రీ జగన్నాథుని అమూల్య రత్న సంపద నిర్వహణపై అధికార వర్గం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికార వర్గాల వ్యతిరేకంగా కఠిన చర్యలకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించాలని పిటిషనరు అభ్యర్థించారు. అధికారులందరినీ ప్రశ్నించాలని కోరారు. తాళం చెవి గల్లంతు సంఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిటీ నియమించి.. రాష్ట్ర హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని విన్నవించారు. క్షేత్ర స్థాయిలో ఈ కమిటీ విచారణ జరిపి రత్న భాండాగారంలో అలనాటి రత్న సంపద, ప్రస్తుతం రత్న సంపద గణాంకాల్ని సమీక్షిస్తే వాస్తవ స్థితిగతులు స్పష్టమవుతాయన్నారు. సీబీఐ దర్యాప్తునకు అభ్యర్థిస్తు హైకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక కమిటి విచారణని అభ్యర్థించడం విశేషం. ఈ కేసులో 10 మందిని కక్షిదారులుగా నమోదు చేశారు. వీరిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు, కలెక్టరు, శ్రీ జగన్నాథ మందిరం పాలక వర్గం ఉపాధ్యక్షుడు, శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి – సీఏఓ, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రముఖ ప్రత్యర్థులుగా పేర్కొన్నారు. తాళం గల్లంతుపై కమిషన్ ∙జస్టిస్ రఘువీర్ దాస్ అధ్యక్షతన నియామకం భువనేశ్వర్: జగన్నాథుని రత్న భాండాగారం తాళం చెవి గల్లంతైన సందర్భంగా జస్టిస్ రఘువీర్ దాస్ న్యాయ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఏర్పాటు చేసింది. హై కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రఘువీర్ దాస్ అధ్యక్షతన ఏర్పాటైన న్యాయ కమిషన్ తాళం చెవి గల్లంతుకు సంబంధించి 3 నెలల వ్యవధిలో సమగ్ర నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. శ్రీ మందిరం రత్న భాండాగారం తాళం చెవి గల్లంతవడంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ న్యాయ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు న్యాయ విచారణ పట్ల పెదవి విరిచి భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. -
చంద్రబాబుపై సీబీఐ విచారణ చేపట్టాలి
కిర్లంపూడి (జగ్గంపేట): అవినీతి సామ్రాట్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సీబీఐ, ఇన్‌కంట్యాక్స్, ఈడీ తదితర శాఖల ద్వారా ఏకకాలంలో దర్యాప్తు చేయించి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రధాని నరేంద్రమోదీకి శుక్రవారం లేఖ రాశారు. లేఖ సారాంశం ఈ విధంగా ఉంది.. ప్రత్యేక హోదా, ప్యాకేజీ గురించి మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒప్పందం చేసుకున్నారో తెలియదు గానీ ఆ హోదా సాధన పేరుతో ప్రజాధనాన్ని, అతిదారుణంగా ఖర్చు చేస్తూ రాష్ట్ర ఖజానాకు నష్టం చేస్తున్నారన్నారు. ఈ అబద్ధాల ముఖ్యమంత్రి ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినా అరెస్టు నుంచి కాపాడడమే పెద్ద తప్పిదమన్నారు. చంద్రబాబును ఆరోజే జైలుకు పంపించి ఉంటే రెండు రకాల నష్టం జరిగి ఉండేదికాదన్నారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పనులు రాష్ట్ర పర్యవేక్షణలో చేయాలనే నిర్ణయంతో అడ్డగోలు అవినీతికి తెరదీసిందన్నారు. ప్రకృతి ప్రసాదించిన ఇసుకను ఉచితం పేరుతో రూ.కోట్ల దోపిడీ చేస్తున్నారన్నారు. వారి భాగస్వామ్యంతో ఉన్న గనుల వ్యాపారాలకు, రోడ్లు వేయడానికి రూ.కోట్లు ఇస్తున్నారని, ప్రజల అవసరాల కోసం గుంత రోడ్లను సరిచేయడానికి నిధులు లేవంటున్నారన్నారు. ఈ మధ్య హోదా పోరాటం పేరుతో గత నెల 20న పుట్టిన రోజుకి, 30న పెళ్లి రోజుకి జరిపిన వేడుకల సభలకి ప్రజాధనాన్ని వెచ్చించడం క్షమించరాని నేరమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. పేద రాష్ట్రమని ఓ వైపు చెబుతూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలుచేయడం సమంజసమా అని ప్రశ్నించారు. 40 ఏళ్లుగా ఇటువంటి దోపిడీ ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. చంద్రబాబుపై తక్షణమే దర్యాప్తు చేయాలన్నారు. ప్రత్యేక హోదాను, రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్‌తోపాటు విభజన సందర్భంగా ఇచ్చిన హామీల్లో మిగిలిన హామీలు అమలు చేయాలని లేఖలో కోరారు. -
ఉన్నావ్ అత్యాచార కేసులో గందరగోళం
లక్నో : ఉన్నావ్ అత్యాచార కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. బాధితురాలు మైనర్ కాదు.. మేజర్ అంటూ గతంలో వైద్యులు ఇచ్చిన నివేదికలో ఉండటంతో గందరగోళం మొదలైంది. యువతి వయసు 17గా భావించి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌పై పోక్సో(ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే జూన్ 2017లో వెలువరించిన ప్రాథమిక వైద్య నివేదికలో మాత్రం ఆమె వయసు 19 సంవత్సరాలుగా పేర్కొన్నారు. అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చాక జూన్ 22, 2017న ఉన్నావ్ పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ రేడియాలజిస్ట్ ఎస్ జోహ్రీ బాధితురాలు మేజర్ అని చెబుతూ నివేదికను సమర్పించాడు. ఆపై బాలిక కిడ్నాప్-అత్యాచారం ఆరోపణలతో ముగ్గురు నిందితులను ఆ సమయంలో పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిపై పోక్సో చట్టాన్ని మాత్రం వర్తింప చేయలేదు. తర్వాత బాలికను మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టగా.. ప్రాణభయంతో ఆమె తన వాంగ్మూలంలో సెంగర్ పేరును ప్రస్తావించలేదు. తర్వాత ఏప్రిల్ 12, 2018లో ఆమె రెండో ఎఫ్ఐఆర్లో సెంగర్ పేరును ఆమె ప్రస్తావించగా.. పోలీసులు పోక్సో చట్టం ప్రకారం ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ప్రాథమిక వైద్య పరీక్షలో నివేదికలో మాత్రం ఆమె వయసు 19 ఏళ్లుగా ఉండటం సీబీఐ గమనించింది. దీంతో ఈ గందరగోళం నుంచి బయటపడేందుకు మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాలని సీబీఐ నిర్ణయించింది. శనివారం బాధితురాలిని లక్నో ప్రభుత్వాసుపత్రికి తరలించి పరీక్షలను నిర్వహించగా.. ఆ నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఆమె మైనర్ కాదని తేలితే.. సెక్షన్లను మార్చి దర్యాప్తు కొనసాగిస్తామని వారంటున్నారు. అయితే యువతి తల్లి మాత్రం బాలిక 2002లో జన్మించిందని వాదిస్తుండగా.. స్కూల్ సర్టిఫికెట్లలో కూడా ఆమె పుట్టిన తేదీ 2002గానే ఉంది. -
నిమో గేట్: మరిన్ని షాకింగ్ విషయాలు
సాక్షి, ఢిల్లీ: పీఎన్బీ-నీరవ్‌మోదీ కుంభకోణంలో మరిన్ని కఠోరవాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందునుంచీ అనుమానిస్తున్నట్టుగానే పంజాబ్ నేషనల్‌బ్యాంకు ఉద్యోగుల బండారం బయటపడింది. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా పీఎన్బీ ఉద్యోగులు లంచాలు, కమిషన్లకోసం సంస్థ నెత్తిన భారీ టోపీ పెట్టారు. స్విఫ్ట్ సిస్టమ్(సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్)కు కీలకమైన లెవల్ 5పాస్‌వర్డ్‌లను నీరవ్ మోదీ, తదితరులకు అందించినట్టు నిందితులు అంగీకరించారు. ఏజీఎం అధికారుల స్తాయికి అనుమతి ఉన్న లెవల్ -5 పాస్‌వర్డ్‌ను నీరవ్‌మోదీ అనుచరులుకు అందించినట్టు ఒప్పుకున్నారు. దీంతో వారు పీఎన్బీ కంప్యూటర్లలో లాగిన్ అయ్యి వెరిఫైయ్యర్/ఆథరైజర్‌గా తమ తమ ఎల్ఓయూలను క్లియర్ చేసుకుని, స్విఫ్ట్ మెసేజ్‌లను పంపేవారు. తద్వారా నీరవ్‌మోదీనుంచి అందిన కమిషన్లను ఉద్యోగులందరూ పంచుకునేవారు. సీబీఐ దర్యాప్తులో డిప్యూటీ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, , సింగిల్ విండో క్లర్క్ మనోజ్ ఈ షాకింగ్ విషయాలను వెల్లడించారు. అంతేకాదు ఈ భారీ కుంభకోణంలో ఆరుగురు అధికారుల హస్తం ఉన్నట్టుగా కూడా నిందితులు సీబీఐకి చెప్పారు. అంతేకాకుండా పీఎన్బీ వ్యవస్థలోని అన్ని అకౌంట్ల కంప్యూటర్ లాన్ పాస్వర్డులు, ఆఖరికి బ్యాంకు తాలూకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ కోడ్లు సైతం వారి అందుబాటులో ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. ముఖ్యంగా 2017లో కేవలం 63 రోజుల వ్యవధిలో ఆయన 143 ఎల్ఓయూలను (లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్) జారీ చేశారు. 2011 నుంచి 2017 దాకా జారీ చేసిన ఎల్ఓయూలు 150 కాగా.. కేవలం ఆఖరి 63 రోజుల్లో 143 ఎల్ఓయూలు ఇచ్చారు. అయితే మూడేళ్లలో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన గోకుల్ శెట్టి ..కొనసాగడంపై ప్రశ్నించినపుడు 2013లోనే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినప్పటికీ, రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వకుండా కొనసాగుతూ వచ్చాడని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. అయితే ఇతర అధికారుల పరిజ్ఞానం లేకుండా కేవలం ఈ ఇద్దరు బ్యాంక్ ఉద్యోగులు ఈ స్థాయిలో మోసం చేసే అవకాశం లేదని సీబీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి. కాగా దేశంలో అతిపెద్ద బ్యాంకు కుంభకోణంలో పీఎన్బీ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్‌నాథ్ శెట్టి, సింగిల్ విండో క్లర్క్ మనోజ్ కరత్‌లను శనివారం సీబీఐ అరెస్ట్ చేయగా స్పెషల్ కోర్టు వీరిని 14 రోజుల పోలీస్ కస్టడీకి తరలించిన సంగతి తెలిసిందే . -
767 రోజులుగా మౌన పోరాటం...
తిరువనంతపురం : కేరళలో 767 రోజులుగా ఓ యువకుడు చేస్తున్న పోరాటం సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండేళ్లుగా యువకుడు సెక్రటేరియేట్ ఎదుట అతను మౌన దీక్ష చేస్తున్నాడు. తన అన్న మృతి కేసులో నెలకొన్న అనుమానాల నివృత్తి కోసం అత్యున్నత దర్యాప్తు కోసం అతను డిమాండ్ చేస్తున్నాడు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేకుండా పోయింది. విషయం ఏంటంటే... 2014 మే నెలలో శ్రీజీవ్ అనే యువకుడిని దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగా అతను విషం తాగి ప్రాణాలు విడిచాడని పోలీసులు వెల్లడించారు. అయితే ఓ అధికారి కూతురిని ప్రేమించిన కారణంగా పోలీసులే అతన్ని హత్య చేసి సూసైడ్‌గా చిత్రీకరిస్తున్నారని శ్రీజీవ్ సోదరుడు శ్రీజిత్ చెబుతున్నాడు. కేసులో ఆరోపణలు ఎదుర్కున్న అధికారులు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. దీంతో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ శ్రీజిత్ దీక్ష చేపట్టాడు. దీంతో దిగొచ్చిన అప్పటి ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్టపరిహారం.. కేసులో దర్యాప్తునకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చింది. నష్టపరిహారం అందినప్పటికీ.. దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. దీంతో శ్రీజిత్ మరోసారి తన నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నాడు. సెక్రటేరియట్ ఎదుట ఉన్న బస్టాండ్ వద్ద దీక్షను ప్రారంభించాడు. అలా రెండేళ్లు గడిచినా ఫలితం లేకుండా పోయింది. మధ్యమధ్యలో స్థానిక మీడియాలో వార్తలు వచ్చినా వాటినెవరూ పెద్దగా పట్టించుకోలేదు. సోషల్ మీడియాలో ఉద్యమంతో.. ఆర్పీ శివకుమార్ అనే బ్లాగ్ రచయిత శ్రీజిత్ గురించి జనవరి 1న ప్రత్యేక కథనాన్ని ప్రచురించాడు. అందులో శ్రీజిత్ ఆరోగ్యం క్షీణిస్తోందని.. అయినా అధికారులెవరూ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావటంతో అప్పుడు మీడియా సంస్థలన్నీ ప్రముఖంగా ఆ వార్తను ప్రచురించాయి. దీంతో యావత్ కేరళ యువత శ్రీజిత్‌కు మద్ధతుగా దీక్షా వేదిక వద్దకు చేరుకున్నారు. రెండు రోజులుగా వేదిక వద్దకు వేల సంఖ్యలో యువతీయువకులు తరలి వస్తుండటంతో సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీజిత్‌తో హీరో టొవినో.. పక్కన సంఘీభావం తెలిపేందుక చేరిన యువకులు ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు శ్రీజిత్‌కు మద్ధతు ప్రకటించారు. నటులు పృథ్వీరాజ్, నివిన్ పౌలీ, టొవినో థామస్‌లు శ్రీజిత్‌కు సంఘీభావం తెలిపారు. కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు శశిథరూర్, కేసీ వేణుగోపాల్ లు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరో మంత్రి జితేంద్ర సింగ్‌లను కలిసి సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సోమవారం సాయంత్రం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. శ్రీజిత్, అతని తల్లి, స్నేహితులతో భేటీ అయ్యారు. సత్వరమే న్యాయం కలిగేలా చూస్తానని సీఎం హామీ ఇచ్చినప్పటికీ.. అది నెరవేరే దాకా దీక్ష కొనసాగిస్తానని శ్రీజిత్ చెబుతున్నాడు. సీబీఐ విముఖత... ఈ కేసులో సీబీఐ దర్యాప్తునకు గత జూలైలో కేరళ ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసింది. అయితే అది సత్పలితం ఇవ్వలేదు. దీనికితోడు సీబీఐ కూడా తాము పనిభారంతో ఉన్నామని.. ఈ కేసును దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. -
చంద్రబాబు అంకెల గారడీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలకు హద్దే లేకుండా పోయిందని, అంకెలతో గారడీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు అబద్ధాలకు హద్దే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అపోలో టైర్స్ పరిశ్రమపై ముఖ్యమంత్రి మంగళవారం చేసిన ప్రకటనతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగాలు, జీడీపీ లెక్కలు, వీటితో పాటు చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనల్లో కూడా ఎక్కడా వాస్తవం కనిపించటం లేదని మండిపడ్డారు. 2022 నాటికి ఏపీ దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందని, 2019 నాటికి నంబర్ 1గా ఉంటుందని, 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంటుందని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. ఈ పిచ్చి మాటలను ఆయన దార్శనికతకు నిదర్శనంగా మళ్లీ మీడియాలో రాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల అవకతవకలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? అని బహిరంగ సవాల్‌ను విసిరారు. సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టంచేశారు. -
‘ఓటుకు కోట్లు’లో చంద్రబాబుకు పాత్ర
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు కేసు’లో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నా తెలంగాణ ఏసీబీ అందుకు తగిన సాక్ష్యాధారాలు సేకరించడంలో విఫలమవడమే కాకుండా తదుపరి దర్యాప్తును ఆపేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టుకు ఓ ప్రజాహిత వ్యాజ్యంలో నివేదించారు. కేసులో అత్యంత ప్రభావశీలురు నిందితులుగా ఉన్నందున దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన ఈ రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న ప్రధాన పిటిషన్‌కు జత చేసి రెండూ కలిపి విచారిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యే ఆళ్ల తరఫున న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్ రెడ్డి, టి.విజయ భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం దృష్టికి నివేదించారు. ఈ పిటిషన్లో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, టీడీపీ(ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు) ఎమ్మెల్యే ఎ.రేవంత్‌రెడ్డి, బిషప్ హారీ సెబాస్టియన్, రుద్ర ఉదయ్ సింహా, మత్తయ్య జెరూసలేంలను ప్రతివాదులుగా చేర్చారు. పిటిషన్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ‘ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుంచి సీబీఐకి అప్పగించేలా ఆదేశించండి. ఓటుకు కోట్లు కేసును దర్యాప్తు చేయడంలో ఏసీబీ విఫలమైంది. ఈ కేసులో ఏ1గా ఉన్న నిందితుడు ఒక ఎమ్మెల్యే. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు.. ఏపీ ముఖ్యమంత్రి. వీరిద్దరూ ప్రభావశీలురు. తెలంగాణ ఏసీబీని ప్రభావితం చేయగలిగిన వారు. దర్యాప్తు తొలిరోజుల్లో ఈ కేసులో అనేక సాక్ష్యాలు దొరికినా ఒత్తిళ్లకు తలొగ్గి వాటిని తదుపరి చార్జ్‌షీట్‌లో చేర్చలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేసును దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే రెండు రాష్ట్రాల్లో పలుకుబడి కలిగిన ఈ నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉంది. మరోవైపు నిందితులు సాక్ష్యాధారాలను లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఉంది..’అని పిటిషన్లో పేర్కొన్నారు. క్రిమినల్ అప్పీలుతో జత చేసిన ధర్మాసనం ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలు పిటిషన్‌ను లోతుగా విచారిస్తామని 06.03.2017న సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. తాజా రిట్ పిటిషన్‌ను ఈ క్రిమినల్ అప్పీలు పిటిషన్‌కు జత చేస్తూ సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని పేర్కొంది. న్యాయానికి అండగా సుప్రీంకోర్టు: ఎమ్మెల్యే ఆర్కే సాక్షి, న్యూఢిల్లీ: ఓటుకు కోట్లు కేసు దర్యా ప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు న్యాయానికి, ధర్మానికి అండగా నిలిచిందని ఏపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం అనంతరం ఆర్కే మీడియా తో మాట్లాడారు. ‘ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఏవిధంగా అడ్డంగా దొరికిపోయారో తెలుగు ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో ఫోన్ లో మాట్లాడింది సీఎం చంద్రబాబే అని, ఆ ఫోన్‌ను లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్ నుంచి వినియోగించారని లొకేషన్‌తో సహా ఏసీబీ అప్పట్లో నిర్ధా రించింది. ఈ విషయం ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిందని ఏసీబీ వెల్లడించింది. ఎవిడెన్స్ యాక్ట్–1872లోని సెక్షన్(10) ప్రకా రం కేసు విచారణకు ఈ సాక్ష్యాలు సరిపోతాయి. అయితే చంద్రబాబు, కేసీఆర్‌ల మధ్య కుదిరిన రహస్య ఒప్పందం ప్రకారం ఈ కేసును ఏసీబీ నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే నిలువరించేందుకే ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పిల్ దాఖలు చేశాం. ఇక ఈ కేసు నుంచి చంద్రబాబు తప్పించుకోలేరు’ అని ఆర్కే పేర్కొన్నారు. -
డీమ్డ్ వర్సిటీలపై ‘సుప్రీం’ కొరడా!
న్యూఢిల్లీ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముందస్తు అనుమతి లేనిదే దూర విద్యా కోర్సులు కొనసాగించొద్దని సుప్రీంకోర్టు అన్ని డీమ్డ్ యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే 4 డీమ్డ్ యూనివర్సిటీలకు గడిచిన కాలం నుంచి అమల్లోకి వచ్చేలా అనుమతులివ్వడంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్రానికి సూచించింది. 2001–05 మధ్య కాలంలో రాజస్తాన్‌లోని జేఆర్‌ఎన్ రాజస్తాన్ విద్యాపీఠ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎస్ఈ), అలహాబాద్ అగ్రికల్చరల్ ఇనిస్టిట్యూట్(ఏఏఐ), తమిళనాడులోని వినాయక మిషన్స్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఆ నాలుగు డీమ్డ్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ చేసిన విద్యార్థుల పట్టాలను నిలిపివేయాలని సూచించింది. ఈ వర్సిటీలకు యూజీసీ ఇచ్చిన అనుమతులు చెల్లవని స్పష్టం చేసింది. ఆ విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని ఏఐసీటీఈని ఆదేశించింది. -
నేరెళ్ల ఘటనపై ఎస్పీ వాదన ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాల్లో దళితులపై పోలీసులు దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ జిల్లా ఎస్పీ, సస్పెండైన ఎస్సైలు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. నేరెళ్ల మరో 2 గ్రామాల్లోని దళితుల పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరించారని, విచక్షణారహితంగా కొట్టారని, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మంగళవారం మరోసారి హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇదే అంశంపై హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి చంద్రకుమార్ రాసిన లేఖనూ పిల్‌గా పరిగణించి.. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి ఎం.గంగారావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎస్పీ, సస్పెన్షన్‌కు గురైన ఎస్సైలు తమ వాదనలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని వారి న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. దాంతో విచారణ వారం రోజులపాటు వాయిదా పడింది. -
అనిత దళిత ద్రోహి: గిడ్డి ఈశ్వరి
విశాఖపట్నం: ఎమ్మెల్యే అనిత దళిత ద్రోహి అంటూ గరగపర్రు ఘటనపై ఆమె ఎందుకు మాట్లాడడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నిలదీశారు. ఆదివారం ఇక్కడ జరిగిన పార్టీ ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిని, లోకేష్‌ను, మంత్రి గంటాను ఎవరైనా విమర్శిస్తే వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేయిస్తారు గానీ దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడరా అని మండిపడ్డారు. దళిత, మహిళలు, ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతూంటే అనిత ఎందుకు మాట్లాడతలేరని ప్రశ్నించారు. మాజీ మంత్రి పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ నేతలు విశాఖను నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని, భూ దందాలకు మాత్రమే వ్యతిరేకం అని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని రాష్ట్ర ప్రయోజనాలను బాబు తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి జగన్ ఎక్కడ అడ్డుపడుతున్నారో బాబు చెప్పాలని ప్రశ్నించారు. టీడీపీ నేతల భూదందాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. లోకేశ్‌కు దమ్ము ఉంటే మీ నాన్న పాలనపై నమ్మకం ఉంటే.. ఈ మూడేళ్లలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని హితవు పలికారు. వోక్స్ వ్యాగన్ గురించి ఆరోపణలు వస్తే ఆనాడు దివంగత వైఎస్ సీబీఐ విచారణకు ఆదేశించారని గుర్తు చేశారు. విశాఖ భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంవత్సరం ఓపిక పట్టండి.. రామన్న రాజ్యం వస్తుంది ఇంకొక సంవత్సరం ఓపిక పట్టండి... రామన్న రాజ్యం వస్తుందని బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ ప్లీనరీలో మాట్లాడుతూ విశాఖ జిల్లాలో టీడీపీ దొంగలు పడ్డారని, విలువైన భూములు దోచేస్తున్నారని ఆరోపించారు. ఈ భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2019లో వైసీపీదే అధికారం అని, వైఎస్ పధకాలు కొనసాగాలంటే జగన్ సీఎం కావాలని అన్నారు. విశాఖలో ఒక్క కొత్త కంపెనీ రాలేదని, విభజన హామీలు ఎక్కడా అమలు కాలేదని, చంద్రబాబు పెట్టుబడిదారులనే పట్టించుకుంటున్నారు.. గిరిజనులను, సామాన్య ప్రజలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. -
నటుడి మృతి కేసు సీబీఐకి బదిలీ
తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతి కేసును సీబీఐ ఛేదించనుంది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐబీకి బదిలీ చేశారు. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థను గత నెలలో ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు అంతకుముందు సీబీఐ నిరాకరించడంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్టుపట్టారు. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. -
నటుడి మృతిపై సీబీఐ దర్యాప్తు
తిరువనంతపురం: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై ఏడాదిగా మిస్టరీ కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేయాలని సీబీఐని కేరళ హైకోర్టు ఆదేశించింది. నెలరోజుల్లోగా విచారణ ప్రారంభించాలని కేంద్ర దర్యాప్తు సంస్థకు సూచించింది. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు వారం రోజుల క్రితం సీబీఐ నిరాకరించింది. దీంతో కళాభవన్ మణి భార్య, సోదరుడు కోర్టును ఆశ్రయించారు. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి గతేడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేరళ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళాభవన్ మణి దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడికావడంతో ఆయనకు విషం ఇచ్చి చంపారన్న అనుమానాలు బలపడ్డాయి. మణి మృతి వెనుక అతడి స్నేహితుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. మణి స్నేహితులకు నార్కో ఎనాలిసిస్ పరీక్షలు నిర్వహించినా పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో సీబీఐ దర్యాప్తుకు మణి కుటుంబ సభ్యులు పట్ట్టారు. సీఎం పినరయి విజయన్ కూడా సీబీఐ విచారణకు మొగ్గు చూపారు. అయితే దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ నిరాకరిచింది. మరోవైపు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ మణి సోదరుడు ఆర్ఎల్వీ రామకృష్ణన్ మూడు రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు సరిగా దర్యాప్తు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. -
అమ్మ మృతిపై సీబీఐ విచారణ చేయించండి
న్యూఢిల్లీ: జయలలిత మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని అన్నాడీఎంకే ఎంపీ పీఆర్ సుందరం లోక్‌సభలో డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం గూటికి చేరిన సుందరం.. శుక్రవారం లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తారు. జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం విచారణ జరిపించినా, రహస్యాలు బయటకు రాకుండా తొక్కిపెడతారని, సీబీఐతో దర్యాప్తు చేసేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని సుందరం డిమాండ్ చేశారు. ఇటీవల పన్నీరు సెల్వం కూడా ఇదే డిమాండ్ చేశారు. జయలలిత మృతిపై ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప, సినీ నటి గౌతమి సహా పలువురు ప్రముఖులు కూడా జయలలిత మృతిపై సీబీఐతో విచారణ చేయించాలని గతంలో డిమాండ్ చేశారు. జయలలిత బంధువులు కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. పన్నీరు వర్గానికి చెందిన నాయకులు.. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రోజు లోక్‌సభలో జీరో అవర్‌లో అన్నాడీఎంకే ఎంపీలు శ్రీలంకలోని తమిళుల సమస్యలను ప్రస్తావించారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, తమిళులపై దాడులు జరుగుతున్నాయని, ఆ దేశాన్ని మిత్రదేశంగా పరిగణించరాదని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ ఈ విషయంపై స్పందిస్తూ.. శ్రీలంకలోని తమిళుల సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. -
నాపై కేసు కొట్టేయండి...
హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసిన లేఖను పిల్‌గా భావించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదే శించిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి విజిలెన్స్ నివేదికలో పిటిషనర్‌కు వ్యతిరేకంగా ప్రస్తావన లేదన్నారు. అప్పటి ఏపీ ఐఐసీ ఎండీగా పిటిషనర్ వ్యవహరించి నప్పటికీ, ఎమ్మార్‌కు భూకేటాయింపులు, ధర నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదేనని, ఆయన వివరించారు. -
సీబీఐ విచారణకు డిమాండ్
పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయంలో తమ కుమార్తె రసీలా రాజు (24) దారుణ హత్యకు గురైన ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేరళ డీజీపీకి వారు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని తమ కుమార్తె మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. దర్యాప్తు సరైన కోణంలోనే జరుగుతోందా.. సరైన నిందితుడినే అరెస్టు చేశారా లేదా అన్న విషయంలో తమకు అనుమానాలు ఉన్నట్లు ఆమె తండ్రి రాజు చెప్పారు. తన కుమార్తెను ఆమె మేనేజర్ మానసికంగా చిత్రహింసలకు గురిచేశారని, బెంగళూరు బదిలీ కోరినా ఇవ్వకుండా అదనపు గంటలు పనిచేయించారని చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన సెక్యూరిటీ గార్డు అసలు ఆ భవనంలో పనిచేయడని, అలాంటప్పుడు అతడు ఆమె ఆఫీసులోకి, అందులోనూ క్యూబికల్ వరకు ఎలా రాగలిగాడని రాజు ప్రశ్నించారు. ఐడీ కార్డులు స్వైప్ చేస్తే తప్ప ఎవరూ క్యాంపస్‌లోకి కూడా వెళ్లలేరని, అలాంటిది ఒక సెక్యూరిటీ గార్డు అక్కడకు ఎలా వెళ్లిపోయాడని అన్నారు. టీమ్ లంచ్‌కి రానని చెప్పినందుకు ఆదివారాలు కూడా రాత్రి వరకు ఒక అమ్మాయితో పనిచేయించడం ఏంటని అడిగారు. ఇప్పటికి తన కుమార్తె మరణించి 11 రోజులైనా ఇప్పటికీ పుణె పోలీసులు తమను సంప్రదించలేదని, కుటుంబ సభ్యులను ఎలాంటి వివరాలు అడగలేదని అన్నారు. ఇప్పటివరకు తాము ఆమె అంత్యక్రియలలో బిజీగా ఉన్నామని, ఇప్పుడు అక్కడకు వెళ్లి అసలు ఏం జరుగుతోందో చూస్తామని రాజు చెప్పారు. కేవలం ఒక్క సెక్యూరిటీ గార్డు మాత్రమే ఇదంతా చేశాడంటే నమ్మేలా లేదని, అసలు ఏం జరిగిందన్న విషయంపై తమకు స్పష్టమైన సమాధానం కావాలని అన్నారు. పుణెలోని ఇన్ఫోసిస్ భవనం తొమ్మిదో అంతస్థులో గల కాన్ఫరెన్స్ రూంలో తన క్యూబికల్ వద్ద రసీలా హత్యకు గురైన విషయం తెలిసిందే. కంప్యూటర్ కేబుల్‌ను ఆమె పీకకు బిగించి చంపేశారు. ఈ కేసులో భాబెన్ సైకియా అనే సెకయూరిటీ గార్డును పోలీసులు అరెస్టు చేశారు. -
ఎంబ్రాయర్’ పై సీబీఐ విచారణ!
న్యూఢిల్లీ : యూపీఏ ప్రభుత్వ పాలనలో బ్రెజిల్ విమాన సంస్థ ఎంబ్రాయర్తో కుదిరిన ఒప్పందంలో ముడుపుల ఆరోపణలపై విచారణ చేపట్టాలని రక్షణ శాఖ బుధవారం సీబీఐకి లేఖ రాసింది. కాగా యూపీఏ హయాంలో 2008లో బ్రెజిల్ సంస్థ ఎంబ్రాయర్, డీఆర్డీవో మధ్య మూడు విమానాలు (స్వదేశీ రాడార్ వ్యవస్థను అనుసంధానం చేసి) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. మొత్తం రూ. 14వేల కోట్లతో ఈ ఒప్పందం జరిగింది. 208 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.14వేలకోట్లు) విలువైన ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయంటూ అమెరికా న్యాయశాఖ విచారణ జరుపుతోంది. అయితే ఎంబ్రాయర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకునేందుకు అప్పటి ప్రభుత్వంలో కొందరికి (ఎవరికి అనేది తెలియదు) ముడుపులిచ్చిందని అమెరికా విచారణ సంస్థలు గుర్తించాయి. దీనిపై ఇప్పుడు భారత్ వివరాలు సేకరించే పనిలో పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది దేశాల్లో కాంట్రాక్టులు పొందేందుకు ఎంబ్రాయర్ సంస్థ ఆయా ప్రభుత్వాలకు ముడుపులు ముట్టజెప్పిందనే ఆధారాలున్నాయని తెలిపింది. దీనిపై సమాచారం అందుకున్న డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) మరిన్ని వివరాలు అందుకునేందుకు విచారణ జరపనుందని.. భారత రక్షణ శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో 15 రోజుల్లో ఈ కాంట్రాక్టుతోపాటు అవినీతికి సంబంధించిన ఆరోపణలపై పూర్తి సమాచారాన్ని ఇవ్వాలంటూ ఎంబ్రాయర్ విమాన తయారీ సంస్థను డీఆర్డీవో కోరింది. అయితే బ్రెజిల్ సంస్థ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా తదుపరి చర్యలుంటాయని రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ జరపాలంటూ రక్షణ శాఖ లేఖ రాయటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
స్వాతి హత్య కేసును సీబీఐ విచారించాలి
హైకోర్టులో రామ్‌కుమార్ తల్లి పిటిషన్ కేకే.నగర్: చెన్నై, నుంగంబాక్కంకు చెందిన ఇన్పోసిస్ ఉద్యోగి స్వాతి గత జూన్ నెల నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తిరునెల్వేలి జిల్లా సెంగోడుకు చెందిన రామ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరు పరచి జైల్లో నిర్భంధించారు. ఈ నేపథ్యంలో పోలీసులు నిజమైన నిందితుడిని రక్షించి అమాయకుడు అయిన తన కుమారుడిని అరెస్టు చేసినట్లు అందువలన ఈ హత్య కేసు సీబీఐ విచారణకు మార్చాలని మద్రాసు హైకోర్టులో రామ్‌కుమార్ తల్లి పుష్పం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. ఆ సమయంలో పిటిషన్‌దారులు పుష్పం తరఫున న్యాయవాది హాజరై ఈ హత్య కేసుపై నుంగంబాక్కం పోలీసులు సరిగ్గా విచారణ జరపలేదని, ఇంకనూ ఈ హత్య కేసులో ముత్తుకుమార్, ఇస్మాయిల్‌లకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారిని పోలీసులు విచారణ జరపలేదని వాదించారు. స్వాతి శరీరంపై గల కత్తిపోట్లను చూస్తే ఒకే వ్యక్తి హత్య చేసేందుకు అవకాశం లేదన్నారు. ఇంకనూ ఈ హత్య కేసులో తమను పోలీసులు విచారించరాదని ముఖ్యమంత్రి విభాగానికి పిటిషన్‌దారులు లేఖ రాశారని అన్నారు. అయినా ఈ కేసులో సంబంధం గల వారిని విచారించకుండా నిజమైన నిందితులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నందున ఈ కేసును సీబీఐ విచారణకు బదిలీ చేయాలని వాదించారు. పోలీసుల తరఫున హాజరైన న్యాయవాది ఈ కేసుకు సంబంధించి బదులు పిటిషన్ గాని, నివేదికను కాని దాఖలు చేయడానికి తాము ఇష్టపడలేదన్నారు. అందుకు బదులుగా స్వాతి హత్య కేసులో పోలీసులు జరిగిన సమగ్ర విచారణ వివరాలను కోర్టులో దాఖలు చేస్తామన్నారు. ఆ తరువాత న్యాయస్థానం తీసుకునే నిర్ణయంపై తాము కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఇరు తరఫున వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు తీర్పును వాయిదా వేశారు. -
80 కేజీల బంగారం మాయంపై సీబీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న దాదాపు రూ.25 కోట్ల విలువైన బంగారం మాయమైన ఘటనలో సీబీఐ విచారణకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గడిచిన నాలుగేళ్లలో కస్టమ్స్ అధికారుల ఆధీనంలో ఉన్న సుమారు 80 కేజీల బంగారు కడ్డీలు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమారు రూ. 25 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. బంగారం మాయమవడంపై ఢిల్లీ పోలీసులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. 2012 నుంచి ఈ ఏడాది జూన్ వరకు స్వాధీనం చేసుకున్న బంగారంలో చాలా వరకు మాయమైందని ఫిర్యాదులు నమోదయ్యాయి. దీని వెనుక కస్టమ్స్ అధికారుల ప్రమేయం ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆమోదం తెలిపారు. -
సీబీఐ చేతికి రేప్ కేసు విచారణ
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో అత్యంత దారుణంగా జరిగిన గ్యాంగ్‌రేప్ కేసు విచారణ బాధ్యతలను సీబీఐ తీసుకుంది. కారులో వెళ్తున్న తల్లీకూతుళ్లను బయటకు లాగి వారిని దోచుకుని ఆపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన యావద్దేశాన్ని కుదిపేసింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆ కేసు విచారణను సీబీఐ తీసుకుంది. ఈ విషయాన్ని సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ నిర్ధారించారు. దీనిపై ఐపీసీ సెక్షన్లు 395, 397, 376డి, 342లతో పాటు పోస్కో చట్టం కింద కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. 91వ నెంబరు జాతీయ రహదారిపై బులంద్ షహర్ జిల్లాలో జూలై 29న ఈ దారుణం జరిగింది. నోయిడాకు చెందిన ఆరుగురు సభ్యుల కుటుంబం కారులో వెళ్తుండగా.. కొంతమంది దుండగులు వారిని ఆపి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మరణించడంతో వారిని పలకరించేందుకు షాజహాన్‌పూర్ వెళ్తున్నారు. తాము ఫిర్యాదుచేసినా పోలీసులు సరిగా పట్టించుకోలేదని బాధితులు ఆరోపించారు. చివరకు కేసు దర్యాప్తు కూడా సక్రమంగా సాగకపోవడంతో.. చివరకు హైకోర్టు సూచనల మేరకు సీబీఐ రంగప్రవేశం చేసింది. -
ఎంసెట్–2 లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి
పాపిరెడ్డి, కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలి టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు వరంగల్ : ఎంసెట్–2 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించి అందుకు బాధ్యులను చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డిలను వెంటనే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణరావు డిమాండ్ చేశారు. హన్మకొండ బాలసముద్రంలోని టీడీపీ జిల్లా కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లక్షలా ది మంది విద్యార్థుల తల్లిదండ్రులతో కంటతడి పెట్టిస్తున్న ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో అస లు ముద్దాయి ప్రభుత్వమే అని, ఇందుకు బా ధ్యులను కఠినంగా శిక్షించాలన్నారు. చైర్మన్, డి ప్యూటీ సీఎం, వైద మంత్రి ప్రమేయం ఉన్నప్పటికి వారిని కాపాడేందుకు దళారులు ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన వ్యక్తులను, కొంత మం ది విద్యార్థులను బలిపశువులుగా చేస్తూ తప్పిం చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎంసెట్ ఆన్లైన్ కోసం సంబంధించిన టెండర్‌ను ప్రభుత్వ రంగ సంస్థకు అప్పజెప్పకుండా ఏకపక్షంగా ప్రైవేటు సంస్థకు అప్పగించడం వె నుక ముఖ్యమంత్రి కుటుంబ పెద్దల ఒత్తిడి ఉం దని ఆరోపించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్లూరు అశోక్‌కుమార్, తెలుగు రైతు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడుచాడా రఘునాథరెడ్డి, హన్మకొండ సాంబ య్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటో త్ సంతోష్‌నాయక్,కార్యాలయ కార్యదర్శి మార్గం సారం గం, ఎర్రబెల్లి రామేశ్వర్రావు, రాజగోపాల్, వల్లెపు శ్రీనివాస్, తాళ్లపల్లి రాజు, జయశంకర్ పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ ఉదంతంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లీకేజీ ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దీనిలో ప్రమేయమున్న పెద్ద చేపలను పట్టుకోవాలని వారు గురువారం ఒక ప్రకటనలో సీఎంని కోరారు. -
లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి : భట్టివిక్రమార్క
హైదరాబాద్: ఎంసెట్ లీకేజీలో పెద్దల ప్రమేయాన్ని తేల్చడానికి సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 లీకేజీలో చాలా మంది పెద్దల హస్తముందని అనుమానం వ్యక్తం చేశారు. లీకేజీలో ప్రమేయమున్న పెద్దలను బయటకు లాగాలని భట్టి డిమాండ్ చేశారు. నిషా మత్తులో కేసీఆర్ నిర్ణయాలు: పొన్నం సీఎం కేసీఆర్ నిషా మత్తులో రాత్రిపూట నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న 15 నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టిందన్నారు. రెండున్నరేళ్లుగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీసీల నియామకం చేపట్టడాన్ని హైకోర్టు మరోసారి తప్పుబట్టిందని, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. -
అగ్రిగోల్డ్ పునర్నిర్మాణానికి అనుమతివ్వండి
- హైకోర్టుకు ఆ కంపెనీ తరఫు న్యాయవాది ప్రతిపాదన - తప్పక పరిశీలిస్తామన్న ధర్మాసనం - తదుపరి విచారణ జూలై 13కు వాయిదా సాక్షి, హైదరాబాద్: తమ కంపెనీ పునర్నిర్మాణానికి అనుమతినివ్వాలని అగ్రిగోల్డ్ సంస్థ తరఫు సీనియర్ న్యాయవాది ఓ ప్రతిపాదనను హైకోర్టు ముందుంచారు. దాన్ని తప్పక పరిశీలిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. డిపాజిట్ల ఎగవేత వ్యవహారాన్ని సీబీఐ దర్యాప్తునకు అప్పగించే విషయంలో వైఖరిని వచ్చే విచారణ నాటికి తెలియజేస్తామని ఏపీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. దీంతో విచారణను జూలై 13కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్యుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ వేల కోట్లు సేకరించి మోసం చేసిన వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది ఎల్.రవిచందర్ స్పంది స్తూ, తమ వద్ద 3 ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉన్నాయని, అందులో ఒకటైన కంపెనీ పునర్నిర్మాణానికి అనుమతించాలని కోరా రు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఖాతాదారులు చెల్లించిన మొత్తాలు పొందేందుకు మరికొంత కాలం వేచి చూడాలా? అని ప్రశ్నించింది. 2 వారాల గడువిస్తే ప్రతిపాదన వివరాలను సమర్పిస్తామని రవిచందర్ చెప్పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ ప్రతిపాదన వల్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందంటే తమకు అభ్యంతరం లేదని అంది. ధర్మాసనం, ఖాతాదారులకు వెంటనే కొంత మొత్తమైనా చెల్లిస్తేనే కంపెనీ ప్రతిపాదనలపై నమ్మకం కలుగుతుందని వ్యాఖ్యానించింది. -
రాష్ట్రంలోనే అతిపెద్ద భూ కుంభకోణం
♦ ‘సత్రం’ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయించాలి- ♦ విజయవాడలో బీజేపీ ధర్నా విజయవాడ (గాంధీనగర్) : సదావర్తి సత్రం భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని బీజేపీ విజయవాడ నగర అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయ భూములను పరి రక్షించాలని కోరుతూ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలోని అలంకార్ సెంటర్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దాసం మాట్లాడుతూ.. ఎకరం రూ. 50 లక్షల విలువచేసే సదావర్తి సత్రం భూములను కేవలం రూ. 22 లక్షలకే టీడీపీ నాయకులు బినామీల పేర్లతో కాజేయడం దారుణమన్నారు. ఇది రాష్ట్రంలోనే అతి పెద ్ద భూ కుంభకోణమని చెప్పారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే భూముల వేలాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి కారణి సుబ్రహ్మణ్యం ఆర్ముగమ్ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న వ్యక్తే ఈ భూ కుంభకోణంలో ఉన్నారని విమర్శించారు. సత్రం’ భూముల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని, లేనిపక్షంలో తామే బీజేపీ జాతీయ కమిటీకి తెలియజేసి విచారణ జరిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర నాయకులు పువ్వాడ మాలకొండయ్య, ఎల్.ఆర్.కె.ప్రసాద్, ఎ.వి.రంగారావు, నగర ప్రధాన కార్యదర్శి తోట శివనాగేశ్వరరావు, రాష్ర్ట కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ కేసు సీబీఐకి!
- సంసిద్ధత వ్యక్తం చేసిన ఏపీ సర్కారు - మీ వైఖరి ఏమిటో చెప్పాలని టీ సర్కార్‌కు ఆదేశం - సంసిద్ధత లేఖలిస్తే పరిశీలించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తాం - తేల్చి చెప్పిన హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత కేసుల దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు కేసులను సీబీఐకి అప్పగించే విషయంలో వైఖరి ఏమిటో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీబీఐకి దర్యాప్తు బాధ్యతలను అప్పగించే విషయంలో సంసిద్ధత లేఖలను తదుపరి విచారణ నాటికి తమ ముందుంచాలని, వాటిని పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐ దర్యాప్తు చేపట్టినంత మాత్రాన ఆస్తుల వేలం ఆగదని, తమ పర్యవేక్షణలో ఇప్పుడు జరుగుతున్న విధంగానే వేలం ప్రక్రియ కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. అదే విధంగా గురు, శుక్రవారాల్లో తలపెట్టిన అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని వేలం పర్యవేక్షణ కమిటీకి తేల్చి చెప్పింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ యాజమాన్యం ఖాతాదారుల నుంచి రూ.7వేల కోట్లు వసూలు చేసి ఎగవేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో వేర్వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం వాటిని మరోసారి విచారించింది. డిపాజిట్ చేశారా? లేదా?... విచారణ ప్రారంభం కాగానే తాము ఆదేశించిన మేర వేలం నిర్వహణ ఖర్చుల కోసం డిపాజిట్ చేయమని చెప్పిన రూ.25 లక్షలను డిపాజిట్ చేశారా? లేదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అగ్రిగోల్డ్ యజమానులు జైల్లో ఉన్నందున డిపాజిట్ చేయలేదని వారి తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ కోర్టుకు నివేదించారు. ఈ వాదనను పట్టించుకోని న్యాయస్థానం తాము ఆదేశించిన విధంగా రూ.25 లక్షలను డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. తరువాత ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. దీంతో ఈ విషయమై తమ వైఖరిని స్పష్టం చేయాలని ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. -
మథుర ఘర్షణలపై సీబీఐ విచారణకు సుప్రీం నో
న్యూఢిల్లీ : మథురలో జరిగిన ఘర్షణలపై సీబీఐతో విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఉత్తరప్రదేశ్ మథురలోని జవహర్‌బాగ్ లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా జరిగిన హింసాకాండలో 29మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 3000 మంది ఆక్రమణదారులపై 45 కేసులు నమోదు చేశారు. మథురలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది. అశ్విని ఉపాధ్యాయ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ... యూపీ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మరోవైపు విపక్షాలు కూడా ఈ హింసాత్మక ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. -
ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు
♦ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు ♦ శాసనసభలో అధికారపక్షం తీరుపై ధర్మాన ధ్వజం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సోమవారం నాటి కార్యక్రమాలన్నీ ఏకపక్షంగా సాగాయని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక ఆత్మరక్షణలో పడిం దని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా వెనుకాడిం దని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు విచారణకు సిద్ధపడటం అధికారంలో ఉన్నవారికి కొత్తేమీ కాదని, విచారణ జరిపితే అభివృద్ధి ఆగిపోతుందనే వితండ వాదాన్ని ప్రభుత్వం తెరమీదకు తేవడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అవి శ్వాస తీర్మానం పెట్టలేదని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని గాడి లో పెట్టాలనే ఈ అస్త్రం ఉపయోగించామన్నారు. తమకు ఓట్లేసిన వారే ప్రజలు, ఓట్లు వేయని వారు అసలు ఈ రాష్ట్ర ప్రజలే కాదనే విధంగా వారి హక్కులను హరించి వివక్షను ప్రదర్శిస్తున్నారన్నారు. అధికారపక్షానికి ధీటుగా ప్రతిపక్షం ఉన్నపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని కానీ అవినీతి సొమ్ముతో ప్రలోభపెడుతూ అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని యోచిస్తూ ఉండటం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. విమర్శలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షంపై మితిమీరిన విధంగా ఎదురుదాడికి దిగడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు. -
'వారికి లక్షల్లో ఫోన్ కాల్స్.. సీబీఐని ఆదేశించండి'
న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారీ మొత్తంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అక్రమంగా విరాళాలు వస్తున్నాయని, ఆ పార్టీకి చెందిన నేతలు భారీ అవినీతికార్యక్రమాలకు పాల్పడుతున్నారని, వీటన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని దాఖలైన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. గతంలోనే ఈ అంశంపై చాలా స్పష్టమైన వివరణ ఇచ్చినందున పిటిషన్ ను విచారణకు స్వీకరించలేమని తెలిపింది. గతంలో ఇలాంటి ఆరోపణలే ఆప్ ప్రభుత్వంపై రాగా వాటిని పరిశీలించాలని కేంద్రాన్ని ప్రశ్నించగా అప్పుడు ఆప్ కు కేంద్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. గతంలో ఉన్న ప్రభుత్వం ఆప్ పై ఆరోపణల విషయంలో దర్యాప్తు చేయించిందని అయినా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదని చెప్పింది. కానీ, తాజాగా ఎంఎల్ శర్మ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో దుబాయ్ వంటి ఎన్నో నగరాలనుంచి ఢిల్లీకి లక్షల సంఖ్యలో ఫోన్ కాల్స్ వచ్చాయని, ముఖ్యంగా ఆప్ లో ఉన్న ముస్లిం నేతలకు ఇవి వచ్చాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమ నిధుల ప్రవాహం కోసమే ఆ ఫోన్లు చేసినట్లు పిటిషన్ దారు పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, శాంతి భూషణ్, ప్రశాంత్ భూషణ్ పేర్లను పేర్కొన్నారు. -
రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరుడు
-
షీనాబోరా కేసులో కీలక మలుపు
ముంబయి : మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్యకేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. ఈ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఇంద్రాణీ ముఖర్జియా, మరో ఇద్దరు నిందితులపై సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పదిరోజుల కిందట మహారాష్ట్ర ప్రభుత్వం షీనాబోరా హత్య కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. ఇంద్రాణీ, ఆమె మాజీ భర్త సంజయ్ ఖన్నా, అప్పటి వారి కారు డ్రైవర్ శ్యామ్ వర్ పింటురామ్ రాయ్ పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అయితే, కిడ్నాప్, హత్య, సాక్ష్యాలు తారుమారు చేసినందుకు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తమ వద్ద ఉన్న రిపోర్టును రాష్ట్ర డీజీపీ సంజీవ్ దయాల్ సీబీఐకి అప్పగించారు. 2012, ఏప్రిల్ 24న షీనాబోరా హత్యకు గురైన విషయం విదితమే. -
ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలి
-
రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన ఎంపి రాపోలు!
-
వ్యాపమ్ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశం
-
వ్యాపమ్ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశం
దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వ్యాపమ్ కుంభకోణంపై సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది. వరుస అనుమానాస్పద మరణాలతో కిల్లింగ్ స్కాం పేరుగాంచిన ఈ కుంభకోణం కేసును ఉన్నత న్యాయస్థానం సీబీఐ అప్పగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటూ సీబీఐ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సుప్రీం తెలిపింది. గవర్నర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. సీబీఐ విచారణకు ఆదేశించాలా లేదా అనేది తేల్చకుండా తాత్సారం చేసిందని మండిపడింది. ఈ విషయం హైకోర్టు చేతిలో ఉందంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణకు ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా ఈ కుంభకోణంపై దాదాపు తొమ్మిది పిటిషన్లు దాఖలుకాగా పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. -
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి
‘వ్యాపమ్’పై హైకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి స్కామ్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు విచారణ భోపాల్/న్యూఢిల్లీ: వరుస మరణాలతో మృత్యు ఘంటికలు మోగిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో.. ఈ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మంగళవారం మధ్యప్రదేశ్ హైకోర్టును కోరింది. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు మరో రెండు రోజుల్లో(గురువారం) విచారించనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో మంగళవారం మధ్యాహ్నం హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా హైకోర్టును కోరుతున్నా’నన్నారు. అనుమానాస్పద మరణాలపై కూడా సీబీఐ దర్యాప్తు జరుపుతుందన్నారు. ఆ వెంటనే, ఈ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపమ్ దర్యాప్తును ఇప్పటికే హైకోర్టు నియమించిన సిట్ పర్యవేక్షిస్తున్నందున సీబీఐ విచారణ అవసరం లేదని తాము భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరువురూ సోమవారం స్పష్టం చేయడం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు ఒక్కటే సరిపోదని, ఆ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగితేనే న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు, ఈ స్కామ్‌పై అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, స్కాం బయటపడడానికి ప్రధానకారకులైన ఆశిశ్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే దాఖలు చేసిన పిటిషన్లనూ సుప్రీంకోర్టు జూలై 9న విచారించనుంది. ఈ స్కామ్‌ను పరిశోధించేందుకు వెళ్లి, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ శరీర అంతర్గత భాగాలను పరీక్షల నిమిత్తం మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. అక్షయ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ ద్వారా విచారణ జరపాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ‘సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి’ సీబీఐ ద్వారా విచారణ జరపడం ఒక్కటే సరిపోదని, ఈ స్కామ్‌లో నిజానిజాలు వెల్లడయేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు సాగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని సీఎం శివరాజ్ సింగ్ హైకోర్టును కోరడం.. వాస్తవాలను కప్పిపుచ్చే మరో ప్రయత్నమని పేర్కొంది. అర్థంలేని కారణాలు చూపుతూ నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ సమాచార విభాగం చీఫ్ రణదీప్ సూర్జెవాలా విమర్శించారు. ఈ స్కామ్‌పై స్వతంత్ర దర్యాప్తు జరగాలని అరుణ్ జైట్లీ.. తన మద్దతుదారుల ప్రాణాల గురించి భయమేస్తుందని ఉమాభారతి.. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్టీఎఫ్ అధికారులు కూడా తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారని ఎస్టీఎఫ్ చీఫ్ చంద్రేశ్ భూషణ్.. వ్యాఖ్యానించిన విషయాన్ని సుర్జెవాలా గుర్తు చేశారు. ‘దేశంలో ఏం జరుగుతుందనే విషయాలపై ప్రధాని అస్సలు మాట్లాడరు. టునీసియా, అల్జీరియాల్లో జరిగే ఘటనలపై మాత్రం ట్వీట్లు చేస్తుంటారు’ అని మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. 2జీ స్కామ్‌లో మాదిరిగా వారం వారం ఈ స్కామ్ దర్యాప్తు పురోగతిని సమీక్షించాలని సుప్రీంను కోరుతానన్నారు. ‘అవినీతి, నేరం’ ఈ రెండింటి ప్రమాదకర సమ్మేళనం వ్యాపమ్ అని అభివర్ణించిన సీపీఎం.. దీనిపై సుప్రీం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తోపాటు, చౌహాన్ రాజీ డిమాండ్‌తో ఈ నెల 16న రాష్ట్రవ్యాప్త బంద్ చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. శవరాజకీయాలపైనే ఆసక్తి: బీజేపీ వ్యాపమ్‌పై కాంగ్రెస్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ పార్టీకి శవ రాజకీయాలపైనే ఆసక్తి ఉంటుందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. వ్యాపమ్ స్కాంపై ఎలాంటి విచారణ జరపాలన్నది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. కూలంకష దర్యాప్తు సాగాలన్నదే బీజేపీ అభిమతమని, దర్యాప్తు తరువాత కాంగ్రెసే దోషిగా తేలుతుందని అన్నారు. సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలనే విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం సీఎం శివరాజ్ సింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, అలా చేస్తేనే విపక్ష దాడిని ఎదుర్కోగలమని భావించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ స్కామ్ చిన్న విషయమని, దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దానిపై విమర్శలు రావడంతో, ఆ తరువాత ఆ వ్యాఖ్య లలిత్ మోదీ వ్యవహారానికి సంబంధించి చేశానని వివరణ ఇచ్చారు. అసహజమే కానీ.. అనుమానాస్పదం కాదు: సిట్ చీఫ్ వ్యాపమ్ స్కామ్‌తో సంబంధమున్న వ్యక్తుల వరుస మరణాలపై ఆ స్కామ్‌ను పర్యవేక్షిస్తున్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రేశ్ భూషణ్ స్పందించారు. వాటిని అనుమానాస్పద మరణాలుగా భావించలేమన్నారు. అయితే, అవి అసహజ మరణాలేనన్న విషయంలో అనుమానం లేదన్నారు. ఆ మరణాలన్నింటి పైనా దర్యాప్తు జరపాలని స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించానన్నారు. ఈ మరణాలకు, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధం ఉన్నట్లు ఏమైనా అధారాలు లభిస్తే మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఈ స్కామ్‌పై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సీబీఐ దర్యాప్తు కోరడంపై తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు. ఇదిలా ఉండగా, వ్యామప్ దర్యాప్తులో భాగం పంచుకుని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ శరీర అంతర్గత అవయవ భాగాల శాంపుల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించనున్నారు. -
చౌహాన్లో చలనం!
అందరూ కోరుతున్నారని మాత్రమే కాదు... ఆ డిమాండు సహేతుకమైనదని తెలిసినా సరే ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపడానికి సిద్ధపడింది. మొన్నీమధ్యే ఎమర్జెన్సీ విధించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా అద్వానీ మొదలుకొని ఎందరో నేతలు వర్తమాన పరిస్థితుల గురించి మాట్లాడారు. అది మరోసారి వచ్చినా రావొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ మళ్లీ వచ్చే అవకాశం లేనేలేదని కొందరు వాదించారు. ఈ వాదప్రతివాదాలతో నిమిత్తం లేకుండానే దేశంలో ఆ తరహా వాతావరణం ఉన్నదని చెప్పడానికి మధ్యప్రదేశ్ అన్నివిధాలా సరిపోతుందని వ్యాపమ్ కుంభకోణం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనిస్తే అర్థమవుతుంది. వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం, సర్కారీ కొలువుల్లో నియామకాల వ్యవహారాలను చూస్తున్న వ్యాపమ్ కుంభకోణం బయటి ప్రపంచానికి వెల్లడైనప్పటినుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాంతి కరంగా ఉన్నాయి. మన దేశంలో కుంభకోణాలు కొత్తగాదు...అలాంటివి బయటపడినప్పుడు కొన్ని అనుమానాస్పద మరణాలు సంభవించడమూ కొత్తగాదు. ఇందుకు 40 ఏళ్లక్రితం జరిగిన ఆనాటి రైల్వేమంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా కేసు మొదలుకొని ఎన్నిటినో ఉదహరించవచ్చు. కానీ వ్యాపమ్ స్కాం ఇలాంటివాటన్నిటినీ తలదన్నింది. ప్రవేశపరీక్షల్లో ఫలితాలను తారుమారు చేసేందుకు...సర్కారీ కొలువు ఇప్పించేందుకు ఒక్కొక్కరినుంచి రూ. 15 లక్షలు మొదలుకొని రూ. 50 లక్షల వరకూ వసూలు చేశారని ఈ కుంభకోణాన్ని బయటపెట్టినవారిలో ఒకడైన యువకుడు ఆశిష్ చతుర్వేది చెప్పారంటే దీని విస్తృతి ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. ఈ కేసుతో ప్రమేయమున్నవారిలో ఒకరు కాదు..ఇద్దరు కాదు, ఇప్పటికి 48మంది మరణించారు. ఒక కుంభకోణంలో మారణహోమం అనదగ్గ స్థాయిలో ఒక్కొక్కరూ రాలిపోతుంటే చావుపుట్టుకలు అత్యంత సహజమన్నట్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించింది. ఈ మరణాల విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉన్నది కనుక సీబీఐకి అప్పగించాలని అన్ని పక్షాలూ అడుగుతున్నా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందుకు ససేమిరా అన్నారు. తాము నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతున్నదని, దాన్ని హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పర్యవేక్షిస్తున్నదని ఎదురు వాదనకు దిగారు. హైకోర్టే సీబీఐ దర్యాప్తు అనవసరమని చెప్పి తమ చేతులు కట్టేసిందన్నట్టు మాట్లాడారు. చౌహాన్‌కు తోచకపోతే పోయింది... కనీసం బీజేపీ అధిష్టానమైనా విజ్ఞతతో వ్యవహరిస్తుందనుకుంటే అదీ లేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చౌహాన్‌ను మించిపోయారు. ‘సుప్రీంకోర్టునో, హైకోర్టునో మేం ఆదేశించలేం. సీబీఐ దర్యాప్తు అవసరమని వారనుకుంటే ఆదేశాలిస్తారు. మేం పాటిస్తాం’ అని ప్రకటించి రాజ్‌నాథ్ అందరినీ ఖంగుతినిపించారు. చావుకు పెడితే లంకణానికి వచ్చినట్టు... వ్యాపమ్ స్కామ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సోమవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాక కదలిక వచ్చింది. ఇన్నాళ్లూ తాము నిస్సహాయులమని మాట్లాడినవారు ఇప్పుడు తీరు మార్చుకున్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించమని హైకోర్టును కోరనున్నట్టు చౌహాన్ ప్రకటించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు మొదలుపెట్టాక అరెస్టయిన 1,800మందిలో చాలామంది బెయిల్ మంజూరైనా ఈనాటికీ జైళ్లను వదలడంలేదు. అలా బెయిల్ లభించి బయటికెళ్లినవారిలో అనేకులు అనుమానాస్పద స్థితిలో మరణించడమే అందుకు కారణం. ఇంతవరకూ మరణించినవారిలో కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు గుండెపోటుతోనో, మరో ఇతర కారణంతోనో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతుల బంధువులందరూ ఈ మరణాల్లో కుట్ర ఉన్నదని అనుమానించారు. గత అయిదారు రోజుల పరిణామాలను గమనిస్తేనే ఇందులో నిజం ఉన్నదని అనిపిస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇండోర్ జైల్లో ఉన్న పశుసంవర్థక శాఖ అధికారి నరేంద్ర సింగ్ తోమర్ గుండెపోటుతో మరణించారు. ఇది ఖచ్చితంగా హత్యేనని ఆరోపించిన కుటుంబసభ్యుల్ని అజ్ఞాత వ్యక్తులు బెదిరించారు. ఈ కేసులోనే అరెస్టయి బెయిల్‌పై విడుదలై శవంగా మారిన నమ్రత అనే యువతి మరణంలో మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన ఒక చానెల్ పాత్రికేయుడు అక్షయ్‌సింగ్ ఉన్నట్టుండి నురుగలు కక్కుకుని చనిపోయారు. స్కామ్‌కు సంబంధించి అవసరమైన అనేక పత్రాలను దర్యాప్తు బృందానికి అందజేసిన జబల్పూర్ వైద్య కళాశాల డీన్ న్యూఢిల్లీలోని ఒక హోటల్ రూంలో కన్నుమూశారు. 6,300 కోట్ల రూపాయల ఈ స్కామ్ వెనక బలమైన మాఫియా ఉన్నదని, అది సాక్ష్యాలను మాయం చేయడానికి ఈ మారణహోమం సాగిస్తున్నదని ఆరోపణలు వచ్చినప్పుడు సున్నితంగా ఆలోచించగలిగిన ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలనుకుంటుంది. కానీ, మధ్యప్రదేశ్ సర్కారు, దానికి కర్తవ్య నిర్దేశం చేయాల్సిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచించలేకపోయాయి. సాధారణంగా నిలదీసేవారినీ, సవాల్ చేసేవారినీ రాజ్యం క్షమించదు. ఉగ్రరూపమెత్తి విరుచుకుపడుతుంది. అంతా ‘సవ్యంగా’ ఉన్నదనుకునేవరకూ ప్రశాంతంగా ఉండదు. మరి వ్యాపమ్ కుంభకోణంలో దర్యాప్తు చేస్తుండగా వరసబెట్టి నిందితులుగా ఉన్నవారూ, ఈ కేసు గురించి ఆరా తీసేవారూ చనిపోతుంటే రాజ్యం ఇలా చేతగానట్టు, చేష్టలుడిగినట్టు ఎందుకుండిపోయింది? కుంభకోణాన్ని బయటపెట్టినవారు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటే ఎందుకంత నిస్సహాయతలో పడింది? అధికారంలో ఉన్నవారికీ, కుంభకోణాన్ని నడిపించిన మాఫియాకూ సాన్నిహిత్యం ఉంటే తప్ప ఇలా జరగడం సాధ్యంకాదు. మధ్యప్రదేశ్‌లో అంతుచిక్కని మరణాల రహస్యం అందులో ఉంది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అయినా సక్రమంగా జరిగి బాధ్యుల్ని గుర్తిస్తే...ఈ మరణాల వెనకున్న కూపీ లాగితే అది వ్యవస్థపై ఉండే నమ్మకాన్ని నిలబెడుతుంది. అలా నమ్మకాన్ని నిలబెట్టదల్చుకున్నారా... ఎప్పటిలా దాన్ని నవ్వులపాలు చేయదల్చుకున్నారా అన్నది పాలకులు తేల్చుకోవాలి. -
సీబీఐ దర్యాప్తుతో ఏమౌతుంది?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మరణమృదంగం మోగిస్తున్న వ్యాపమ్ కుంభకోణం కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చివరకు తన మంకుపట్టు వీడారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా హైకోర్టుకు సిఫారసు చేస్తానని మంగళవారం ఆదరబాదరగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ఇంతకాలం సీబీఐ దర్యాప్తునకు ససేమిరా అన్న ఆయన ఎందుకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారో సులభంగానే గ్రహించవచ్చు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ సహా పలువురు విజిల్‌బ్లోవర్స్ పిటీషన్లు దాఖలు చేయడం, వాటిని ఈ నెల 9వ తేదీన విచారణ జరుపుతామని సుప్రీం కోర్టు ప్రకటించింది. కేసు సీబీఐ చేతికి పోయినా ఫర్వాలేదుగానీ సుప్రీం కోర్టు పర్యవేక్షణలోకి వెళ్లకూడదని భావించిన చౌహాన్, సీబీఐ దర్యాప్తు నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టమౌతోంది. ఇప్పటికే లలిత్‌గేట్ కుంభకోణంతో తలబొప్పికట్టిన కేంద్రంలోని బీజీపి ప్రభుత్వం, ఉన్నంతలో పరువు దక్కించుకునేందుకు ఈపాటికే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్ల ఇప్పటికే ఎంతో పరువు పోగొట్టుకుంది. సీబీఐ దర్యాప్తునకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ఆందోళనకు అనవసరమైన ఆస్కారమిచ్చింది. పైగా వ్యాపమ్ కుంభకోణం ‘సిల్లీ’ విషయం అంటూ సాక్షాత్తు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వ్యాఖ్యానించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్న పరువు కాస్త ఊడగొట్టుకుంది. సీబీఐ దర్యాప్తునకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంగానీ ఎందుకంత భయపడుతుందో అర్థం కావడం లేదు. సీబీఐ ఎలాంటి ప్రలోభాలకు, ప్రభావాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుపుతుందని, కుంభకోణంతో సంబంధమున్న రాజకీయ నేతల గుడ్డలిప్పి దోషులుగా నగ్నంగా నిలబెడుతుందని ఈ ప్రభుత్వాలు భావిస్తున్నాయా? యూపీఏ ప్రభుత్వం కుంభకోణాలపై దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి ఆ ప్రభుత్వం చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారడమేనంటూ తానే స్వయంగా చేసిన విమర్శలను బీజేపీ అప్పుడే మరిచిపోయిందా ? లేక ఇప్పటికీ సీబీఐపై కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉందని భయపడుతుందా ? సీబీఐ తటస్థంగా వ్యవరిస్తుందని, దానికి వ్యాపమ్ కేసును అప్పగిస్తే ‘మ్యాజిక్’లా దోషులంతా దొరికిపోతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయోమోగానీ సామాన్య ప్రజలకు అంత విశ్వాసం కలగడం లేదు. ఎందుకంటే 2జీ, అక్రమ బొగ్గు కేటాయింపుల కేసుల్లో సీబీఐని సాక్షాత్తు సుప్రీంకోర్టు ‘పంజరంలో రామచిలక’ అని అభివర్ణించింది. ఇప్పటివరకు ఈ కేసు విచారణకు సంబంధించిన బంతి రాష్ట్రం కోర్టులో ఉండగా.. ఇక మీదట కేంద్రం కోర్టులోకి వెళ్తుందన్న మాట. -
'వ్యాపమ్'పై సీబీఐ విచారణకు సిఫారసు
భోపాల్: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యాపమ్ కుంభకోణం కేసును సీబీఐకి అప్పగించేందుకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారు. ఈ కేసును విచారణ చేయాల్సిందిగా సీబీఐని ఆదేశించాలని చౌహాన్ మధ్యప్రదేశ్ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోట్లాది రూపాయల వ్యాపమ్ కుంభకోణం మిస్టరీగా మారింది. ఈ కేసులో సాక్షులు, నిందితులు దాదాపు 48 మంది అనుమానస్పద స్థితిలో చనిపోయారు. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సీబీఐ విచారణకు మొదట్లో నిరాకరించిన మధ్యప్రదేశ్ సీఎం చివరకు అంగీకరించారు. -
కూలీల కాల్చివేతపై సీబీఐ దర్యాప్తు
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశం రూ. 5 లక్షల చొప్పున తక్షణ మధ్యంతర పరిహారం చెల్లించాలి సమాచారం ఇవ్వడంలో ఏపీ విముఖత ప్రదర్శిస్తోంది వచ్చే నెల 9న ఏపీ సీఎస్, డీజీపీ హాజరుకావాలి న్యూఢిల్లీ: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఎన్హెచ్ఆర్సీ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 7, 2015న తమిళనాడుకు చెందిన ఆరోపిత ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన సంఘటనపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సూమోటోగా కేసు నమోదు చేసింది. బాధితుల పూర్వాపరాలను, ఎఫ్ఐఆర్ ఆలస్యంగా నమోదైన తీరును, సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ప్రకటనలను, సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాల స్వభావం పరిశీలించిన మీదట, ప్రత్యక్ష సాక్షులు శేఖర్, ఎ.బాలచంద్రన్, ఎం.ఇలాంగో వాంగ్మూలాలు విన్న తరువాత, రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘటనపై ప్రాథమిక సమాచారం పంచుకోవడానికి ఇష్టపడటం లేదని గ్రహించిన తరువాత కొన్ని విషయాలను ఈ కమిషన్ గ్రహించింది. 1. శేషాచలం అడవుల్లో పోలీసులు 20 మందిని చంపివేయడం తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. 2. బాధితులు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. 3. ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తు గానీ, ఇతర నిష్పాక్షిక దర్యాప్తు సంస్థ అంతిమ నివేదిక వచ్చేంతవరకు ఆయా కుటుంబాలు ఆకలితో చనిపోయే పరిస్థితి రానివ్వరాదు. ఈ నేపథ్యంలో కమిషన్ మొత్తం ఆరు ఆదేశాలు, సిఫారసులు చేసింది. ఇవీ ఆదేశాలు, సిఫారసులు 1. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున తక్షణ మధ్యంతర సాయంగా ఏపీ ప్రభుత్వం అందజేయాలి. పరిహారం చెల్లించినట్టుగా ఆధారాలతో ఎనిమిది వారాల్లో నివేదిక ఇవ్వాలి. 2. చనిపోయినవారిలో 13 మంది గిరిజనుల కుటుంబాలకు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని 12(4)వ నిబంధన కింద ఆర్థిక సాయం సక్రమంగా అందేలా చిత్తూరు జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకుని ఎనిమిది వారాల్లో నివేదిక సమర్పించాలి. 3. భారత, ఏపీ ప్రభుత్వాలు ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఇందుకు అవసరమైన లాంఛనాలు పూర్తిచేసి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలి. 4. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను తమిళనాడులోని అధీకృత మెజిస్ట్రేట్ వద్ద నమోదు చేయించాలి. 5. ప్రత్యక్ష సాక్షులు శేఖర్, ఎ.బాలచంద్రన్, ఎం.ఇలాంగో, వారి కుటుంబ సభ్యులు, పంచాయతీ అధ్యక్షులకు వారు నివసిస్తున్న ప్రాంతంలో తగిన రక్షణను కొనసాగించేలా తమిళనాడు డీజీపీ చర్యలు తీసుకోవాలి. 6. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ జూన్ 9న ఉదయం 11 గంటలకు కమిషన్ ముందు స్వయంగా హాజరుకావాలి. కమిషన్ అడిగిన సమాచారంతో హాజరుకావాలి. సీఎస్‌తో డీజీపీ చర్చలు సాక్షి, హైదరాబాద్: శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఎన్హెచ్ఆర్సీ సీబీఐ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫారసు చేసిన నేపథ్యంలో డీజీపీ జేవీ రాముడు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశమయ్యారు. సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఎన్హెచ్ఆర్సీ సూచించడం పోలీసు అధికారుల్లో కలకలం రేపింది. శుక్రవారం ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు వెలువడగానే డీజీపీ జేవీ రాముడు హడావుడిగా సచివాలయం చేరుకుని ఐవైఆర్ కృష్ణారావుతో చర్చలు జరిపారు. అనుసరించాల్సిన విధానంపై సుదీర్ఘంగా చర్చించారు. -
ప్రత్యేక చర్చ: చనిపోయారా? చంపేశారా?
-
14 లక్షలమంది సంతకాలతో మోదీకి పిటిషన్
బెంగళూరు: కర్ణాటక వాణిజ్యపన్నుల అడిషనల్ కమిషనర్ డీకె రవి అనుమానాస్పద మృతిపై కర్ణాటక ఐఏఎస్ ఆఫీసర్లు ఆన్ లైన్ లో పోరాటానికి సిద్ధపడ్డారు. నిజాయితీపరుడైన తమ సహచరుని మృతిపై సీబీఐ విచారణను కోరుతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక ఆన్లైన్ పిటిషన్‌పై సంతకాలు చేశారు. వీరి పోరాటానికి మద్దతుగా ఉత్తిష్ట భారతి అనే స్వచ్ఛంద సంస్థ దీనిపై ఆన్లైన్ ప్రచారాన్ని చేపట్టింది. దీంతో ఈ పిటిషన్‌పై ఇప్పటికే దాదాపు పధ్నాలుగు లక్షల మంది ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణ మీద తమకు నమ్మకంలేదన్నారు ఐఏఎస్ ఆఫీసర్ ఎం.మదన్ గోపాల్. డీకే రవి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికి మూడు సార్లు రవిమీద హత్యాప్రయత్నాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. దీన్ని తాము సహించమనీ, తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని గోపాల్ డిమాండ్ చేశారు. యువ ఐఏఎస్ ఆఫీసర్ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీ ఉభయ సభల్లోనూ ప్రతిపక్షాలు గళమెత్తాయి. ప్రభుత్వం నిరాకరించడంతో ధర్నాకూడా నిర్వహించాయి. అయినా ప్రభుత్వం ససేమిరా అంది. మరోవైపు మృతుని తల్లిదండ్రులు తమ కుమారుని మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
సీబీఐ విచారణపై రాబర్ట్ వాద్రాకు ఊరట
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు హైకోర్టులో ఊరట లభించింది. వాద్రా భూముల కొనుగోళ్ళ వ్యవహారంపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి నిరాకరించింది. పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం కొట్టేసింది. రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు హర్యానాలోని గుర్గావ్లో జరిపిన భూముల లావాదేవీలపై సీబీఐతో దర్యాప్తు జరింపిచాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)దాఖలైన విషయం తెలిసిందే. వ్యవసాయ భూములను ప్రతిపాదిత అవసరాల కోసం కాకుండా వేరే అవసరాలకు వాడుకోవడానికి అనుమతించడంపైన కూడా విచారణ జరపాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ జి రోహిణి, జస్టిస్ ఆర్ ఎస్ ఎండ్లా...సీబీఐ విచారణకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
జర్నలిస్టు ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు
మాజీ సీనియర్ పాత్రికేయుడు చారుదత్త దేశ్‌పాండే ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశ్‌పాండే గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ముంబై సహా పలు వర్గాల నుంచి ఆయన మృతి గురించి విచారణ చేయించాలని విజ్ఞప్తులు రావడంతో మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఈ కేసు దర్యాప్తు వివరాలను గురువారం సాయంత్రం తర్వాత సీబీఐకి బదిలీ చేశారు. టాటా స్టీల్ అధికారుల కారణంగానే దేశ్‌పాండే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని, అందుకే స్థానిక పోలీసులు కూడా ఈ కేసును సరిగా పట్టించుకోకుండా వదిలేశారని ఆయన కుటుంబ సభ్యులతోపాటు ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా ఆరోపించారు. ఈ మేరకు వారు వేర్వేరుగా హోం మంత్రి పాటిల్‌కు లేఖలు ఇచ్చారు. సీనియర్ పాత్రికేయుడు, టాటా స్టీల్ పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ అయిన దేశ్‌పాండే 2013 జూన్ 28న ఆత్మహత్య చేసుకున్నారు. -
కోర్టుకు ‘మౌళివాకం’
సాక్షి, చెన్నై:మౌళివాకం బహుళ అంతస్తుల భవనం కుప్పకూలిన వ్యవహారం మద్రాసు హైకోర్టుకు చేరింది. ఈ కేసు సీబీఐకు అప్పగించాలని డిమాం డ్ చేస్తూ, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ప్రైమ్ సృష్టి డెరైక్టర్ బాల గురుస్వామి, ఇంజనీరు కార్తీక్‌ను అరెస్టు చేశారు. మౌళివాకం అపార్ట్మెంట్ 61 మందిని బలిగొన్న ఈ ప్రమాదంపై ఓ వైపు న్యాయ విచారణ, మరో వైపు సిట్ విచారణ సాగుతోంది. అయితే, ఈ విచారణలు న్యాయ బద్దంగా జరిగే అవకాశాలు లేవన్న ఆరోపణలున్నాయి. నాణ్యతా లోపంతో పాటుగా, అనుమతుల మంజూరు వ్యవహారంలో ఉన్న పెద్దల బండారం బయటకు రావాలంటే, కేసును సీబీఐకు అప్పగించాల్సిందేనన్న డిమాండ్ వస్తోంది. ఈ పరిస్థితుల్లో విచారణను సీబీఐకు అప్పగించాలంటూ సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మంగళవారం కోర్టుకు ఎక్కారు. కోర్టులో పిటిషన్ : మౌళివాకం ఘటనను తన పిటిషన్లో వివరిస్తూ, ఈ కేసు న్యాయబద్ధంగా జరగాలంటే సీబీఐకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడు అధికారులతో కూడిన కమిషన్లు, సిట్ బృందాలు విచారించినా, వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నేతృత్వంలో ప్రత్యేక బృందంతోగానీ, సీబీఐతో గానీ విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగ్ని హోత్రి, న్యాయమూర్తి సుందరేశన్ నేతృత్వంలో ప్రధాన బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ, తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వే సింది. అరెస్టు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ఈ కేసు దర్యాప్తుకు సిట్ బృందం రంగంలోకి దిగింది. కమిషనర్ జార్జ్ పర్యవేక్షణలో జాయింట్ కమిషనర్ శ్రీధర్ నేతృత్వంలోని బృందం విచారణను వేగవంతం చేసింది. మాంగాడు పోలీసుల నుంచి కేసు వివరాలను సేకరించే పనిలో పడింది. అరెస్టయిన ప్రైమ్ సృష్టి నిర్వాహకుడు మోహన్ రాజ్, ఆయన కుమారుడు ముత్తుల్ని ఇప్పటికే కస్టడీకి తీసుకుని మాంగాడు పోలీసులు విచారించే పనిలో ఉండగా, మిగిలిన నలుగుర్ని కస్టడీకి తీసుకునేందుకు శ్రీ పెరంబదూరు కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ప్రైమ్ సృష్టి డెరైక్టర్ బాల గురు స్వామి, ఇంజనీర్ కార్తీక్‌లను అరెస్టు చేశారు. ఈ ఘటనకు తాము బాధ్యత వహించేది లేదని, ఇది ప్రకృతి విలయతాండవం అంటూ బాల గురు వాదించిన విషయం తెలిసిందే. ఛలో రాజ్ భవన్: మౌళివాకం ఘటనను సీబీఐకు అప్పగించాలన్న డిమాండ్‌తో ఛలో రాజ్ భవన్‌కు డీఎంకే పిలుపు నిచ్చింది. సుమారు 25 వేల మందితో ఈ ర్యాలీని విజయవంతం చేయడానికి డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధం అయ్యారు. తిరువళ్లూరు, చెన్నై, కాంచీపురం జిల్లాల్లోని పార్టీ శ్రేణులకు మంగళవారం ఆయన పిలుపునిచ్చారు. ఈనెల 12న జరిగే ఛలో రాజ్‌భవన్ కార్యాక్రమాన్ని అన్నా అరివాలయం వద్ద కరుణానిధి ప్రారంభించబోతున్నారు. ఈ ర్యాలీలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళితో పాటుగా ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. విద్యార్థులకు షిఫ్ట్ పద్ధతిలో పాఠాలు : మౌళివాక్కంలో ప్రైమ్ సృష్టి రెండో భవనం పక్కనే ప్రభుత్వ మహోన్నత పాఠశాల ఉంది. మొదటి భవనం కుప్ప కూలడం, రెండో భవనం ప్రమాదం అంచున ఉన్నట్లు తేలింది. దీంతో ఆ రెండో భవనం పరిసరాల్లోని సుమారు ఇరవై ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ ఇళ్లలోని వారు తమ బంధువులు ఇళ్లల్లో తలదాచుకున్నారు. ఈ భవనానికి పక్కనే ఉన్న మహోన్నత పాఠశాలలో సుమారు 700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత నెల 28వ తేదీ నుంచి ఈ పాఠశాలను మూసి వేశారు. ఎప్పుడు పాఠశాల పునఃప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిన దృష్ట్యా, సోమవారం పాఠశాల పునః ప్రారంభం అవుతుందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురు చూశారు. అయితే, అందుకు తగ్గ చర్యలు అధికారులు తీసుకోలేదు. మౌళివాకంలోని మరో పాఠశాలలో షిఫ్టుల పద్ధతిలో ఇక్కడి విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. బుధవారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు, మధ్యాహ్నం 1గంట నుంచి 4 గంటల వరకు తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులకు తరగతుల్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. పరిహారం: మౌళివాకం ఘటనలో 61 మంది విగత జీవులైన విషయం తెలిసిందే. ఇందులో ఉత్తరాంధ్ర వాసులు 35 మంది ఉన్నారు. మరో 14 మంది తమిళులు, మిగిలిన వారు ఒడిశా వాసులు. మృతుల కుటుంబాలకు తలా రెండు లక్షలు పరిహారాన్ని సీఎం జయలలిత ప్రకటించారు. అయితే, రాష్ట్రానికి చెందిన వారు సైతం ఉండడంతో పరిహారం పెంచారు. రాష్ట్రానికి చెందిన 14 మంది మృతుల కుటుంబాలకు మరో ఐదు లక్షలు అదనంగా ప్రకటించారు. మొత్తం తలా ఏడు లక్షల్ని బాధిత కుటుంబాలకు మంగళవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జయలలిత అందజేశారు.