ఎమ్మార్ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు.
విజిలెన్స్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసిన లేఖను పిల్‌గా భావించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదే శించిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి విజిలెన్స్ నివేదికలో పిటిషనర్‌కు వ్యతిరేకంగా ప్రస్తావన లేదన్నారు. అప్పటి ఏపీ ఐఐసీ ఎండీగా పిటిషనర్ వ్యవహరించి నప్పటికీ, ఎమ్మార్‌కు భూకేటాయింపులు, ధర నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదేనని, ఆయన వివరించారు.