Lv Subramaniam
-
రాష్ట్రంలో పేట్రేగిపోతున్న వ్యక్తిత్వ హంతకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యక్తిత్వాన్ని హననం చేసే హంతకులు రోజురోజుకు పేట్రేగిపోతున్నారని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వీవీఆర్ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కేరక్టర్ అసాసినేషన్ చేసే వారు వేల సంఖ్యలో పెరిగిపోయారని, నిత్యం కొన్ని వేల మందిని వెంటాడి వేధిస్తున్నారని చెప్పారు. గతంలో ఏపీలో పని చేసి మాజీలైన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం శోచనీయమని అన్నారు. వారి చేష్టలు ఒక వర్గానికి, ఒక పార్టీకి, ఒక నాయకుడికి అనుకూలంగా ఉంటున్నాయని, వారికి ఇష్టం లేని మరో నాయకుడి వ్యక్తిత్వాన్ని హత్య చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఎన్నికల సంఘం మాజీ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అండ్ కో, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ రమేష్ ఎన్నికల ముందు వైఎస్ జగన్ పరిపాలనను, జగన్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు. దీని కోసం సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సంస్థను ఏపీ వరకే పరిమితం చేశారని, తెలంగాణ వైపు కన్నెతి చూడలేదన్నారు. వీరి కార్యకాలపాలన్నీ వైఎస్ జగన్ అండ్ కోని అధఃపాతానికి తొక్కేయాలన్న విధంగానే సాగాయని తెలిపారు. వారి లక్ష్యం పూర్తయిందని, ఇప్పుడు వారి జాడ లేదని, సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యక్రమాలు లేవని చెప్పారు.ఇప్పుడు తాజాగా మరికొందరు వైఎస్ జగన్‌ని టార్గెట్ చేశారని తెలిపారు. ఆయనకు పరిపాలన చేతకాదని, ఎవరినీ గౌరవించడని, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి మీద పాలనంతా వదిలేశారంటూ వింత విషయాలు చెబుతున్నారని చెప్పారు. తాజాగా ఎల్వీ సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్‌లు ఖాళీగా ఇంట్లో ఉండి వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని చెప్పారు. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేసి అక్కడ రాజధాని పెడదామని జగన్ చెప్పారని సుబ్రమణ్యం అనడం వింతగా ఉందన్నారు. జగన్ రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారంలో అనుభవం ఉందని, స్టీల్ ఫ్యాక్టరీ అమ్మటం సాధ్యం కాదని ఆయనకు తెలీదా అని అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు పరం చేయొద్దని జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారని తెలిపారు.జగన్‌కి పాలన తెలీదని అని అంటున్న ఐఏఎస్ సుబ్రమణ్యంకి కూడా తెలియని విధంగా వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు, పాలనా సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. వైఎస్ జగన్ 30లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని, ఇలా ఇమ్మని ఎల్వీ గానీ, ఇక్బాల్ కానీ చెప్పారా.. అని నిలదీశారు. ఎల్వీ సుబ్రమణం ఫైల్స్ ఏమీ తేల్చడనే ప్రచారం ఉందని, టీటీడీ నిధులను విలాసాలకు వాడుకొన్నారన్న ఆరోపణలు ఉన్నాయని, వీటికి ఆయన ఏమి సమాధానం చెబుతారని అన్నారు.2019 ఎన్నికల కౌంటింగ్ కాగానే జగన్‌ను కలిసి ఆయన ప్రాపకం కోసం ఎందుకు ప్రయతి్నంచారని, గవర్నర్ ఆదేశిస్తేనే కలవాలి కదా.. అని నిలదీశారు. ఇక్బాల్ వక్ఫ్ బోర్డు అధికారిగా ఉన్నప్పుడు ఆయన సామాజికవర్గం వారే ఇక్బాల్ పనికిరాడని ఆరోపించారన్నారు. ఇక్బాల్ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ జగన్ ఎమ్మెల్సీగా ఎంపిక చేశారని చెప్పారు. జగన్‌కు పాలన తెలియదని వీరు ఎలా అంటారని ప్రశి్నంచారు. వీరి వెనుక ఉన్న మూల విరాట్ ఎవరో అందరికీ తెలుసునని అన్నారు. -
వైద్య రంగంలో సంస్కరణలకు సీఎం కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి : ప్రజల సమస్యలను తెలుసుకుని సత్వర చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన (ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈక్రమంలో రాష్ట్ర వైద్య రంగంలో సంస్కరణలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. వైద్య రంగంలో సంస్కరణల అమలుకు కమిటీని నియమిస్తున్నట్టు సీఎం జగన్ చెప్పారు. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తున్నట్టు ఆదేశాలు జారీ చేశారు. కో చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ సుజాతారావును నియమించారు. వివిధ విభాగాలకు చెందిన 10 మందిని సభ్యులుగా నియమిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులను స్వయం ప్రతిపత్తి సంస్థలుగా మార్చేందుకు సీఎం ఒక కమిటీని నియమించారు. వైద్యవిద్య డైరెక్టర్, ఏపీవీవీపీ కమిషనర్, మాజీ వీసీ ఐవీ రావు, ఎన్ఆర్హెచ్ఎం ఎండీ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈమేరకు వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక రాష్ట్ర విద్యారంగంలో సంస్కరణలపై ఏర్పాటైన కమిటీతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో తాము గుర్తించిన అంశాలపై కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈసందర్భంగా.. అమ్మఒడి, నాడు-నేడు కార్యక్రమాలపై సంస్కరణల కమిటీ ప్రశంసలు కురిపించింది. -
నైపుణ్యాభివృద్ధిరస్తు
సాక్షి, అమరావతి: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చదువులు, శిక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చదువులు ముగించుకొని విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ యూనివర్సిటీ కింద ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్పై ముఖ్యమంత్రి శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన కార్యక్రమాలపై సంబంధిత అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, మేకపాటి గౌతమ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం మన రాష్ట్రంవైపు చూసేలా.. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడని, ప్రపంచం మొత్తం మన రాష్ట్రంవైపు చూసేలా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పరిశ్రమలకు అవసరమైన స్థాయిలో మానవ వనరులను అందించి, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ఆలోచనలు సరే.. సమన్వయమే లేదు స్కిల్ డెవలప్మెంట్, ఉపా«ధి కల్పన విషయంలో మంచి ఆలోచనలే ఉన్నప్పటికీ శాఖల మధ్య సమన్వయం, పరస్పర సహకారం లేవని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖ ఈ కార్యక్రమాలపై నచ్చిన రీతిలో నిధులు ఖర్చు చేస్తోందని, ఈ విధానాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలన్నారు. దీనికోసం రాష్ట్రస్థాయిలో కొత్తగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న 25 కళాశాలలు ఈ యూనివర్సిటీకి అనుబంధంగా పని చేస్తాయన్నారు. ప్రభుత్వం తరఫున చేపట్టే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఇందులో భాగస్వామిగా మారుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనూ అత్యుత్తమ శిక్షణ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, భవిష్యత్తు అవసరాల కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తగిన ప్రణాళికలను రూపొందిస్తుందని సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీకాం సహా ఇతరత్రా డిగ్రీలు చదువుతున్న వారిలో నైపుణ్యాలు పెంచడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీతో అనుసంధానిద్దామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో(ఏఐ) విద్యార్థులకు అత్యుత్తమ నైపుణ్యాలను నేర్పించే బాధ్యతను యూనివర్సిటీ స్వీకరిస్తుందని వివరించారు. ఈ యూనివర్సిటీ, దాని పరిధిలో కాలేజీల ఏర్పాటుపై నెల రోజుల్లోగా కార్యాచరణ పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. జాబ్ మేళాలతో ప్రయోజనమేదీ? ప్రభుత్వంలో వివిధ శాఖలు చేపడుతున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, జాబ్ మేళాల గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎవరు శిక్షణ ఇస్తున్నారు? శిక్షణ ఇస్తున్నవారిలో నాణ్యత ఉందా? లేదా? అన్నది పట్టించుకోవడం లేదని, దీనివల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని వైఎస్ జగన్ పేర్కొన్నారు. జాబ్ మేళాలు కూడా ఆశించినట్టుగా లేవన్నారు. ఒకటి రెండు నెలలు శిక్షణ ఇచ్చినంత మాత్రాన పెద్దగా ప్రయోజనం ఏముంటుందని వ్యాఖ్యానించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో(ఎన్ఏసీ) మాదిరిగా శిక్షణ ఉండాలన్నారు. ఇలాంటి శిక్షణా కార్యక్రమాల కోసం ప్రభుత్వ శాఖలు విడివిడిగా ఖర్చు చేయడం నిలిపేయాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్కు ఇకపై ఆర్థిక శాఖ నుంచే నేరుగా నిధులు ఖర్చు చేస్తామని సీఎం వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం, కళాశాలల ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఆయా పనుల పర్యవేక్షణకు ఒక ఐఏఎస్ అధికారిని నియమించనున్నట్టు చెప్పారు. మూడు నాలుగు రోజుల్లో నియామకం జరగాలన్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలకు డిజిటల్ ఎక్స్టెన్షన్ ప్రస్తుతం ఉన్న ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలకు డిజిటల్ ఎక్స్టెన్షన్ ఉండాలని స్పష్టం చేశారు. ఓలా, ఉబర్ తరహాలో యాప్ రూపొందించాలన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఎక్కడున్నాయన్న దానిపై మ్యాపింగ్ చేయాలని, గ్రామ సచివాలయాల స్థాయిలో ఈ మ్యాపింగ్ జరగాలని చెప్పారు. ప్లంబర్, మెకానిక్, డ్రైవర్.. ఇలా నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా సరే యాప్‌లో రిజిస్టర్ చేయించుకుంటే, వారి సేవలను సులభంగా పొందగలిగే అవకాశం ఉంటుందని, వారికి తగిన ఉపాధి కూడా లభిస్తుందని వివరించారు. అప్రెంటీస్ పూర్తయ్యాకే పరీక్షలు విద్యార్థులు మొక్కుబడిగా డిగ్రీలు పూర్తి చేయడం కాకుండా, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యుత్తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీఏ, బీకాం వంటి కోర్సుల పాఠ్యప్రణాళికను పునఃపరిశీలించేందుకు ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్ ఉండాలని చెప్పారు. కాలేజీ నుంచి విద్యార్థి బయటకు రాగానే ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా సిలబస్, శిక్షణ ఉండాలని అన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, బీకాం సహా డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ విద్యార్థులతో అదనంగా ఏడాది పాటు అప్రెంటీస్ చేయించాలని సూచించారు. అప్రెంటీస్ చేశాక అవసరం అనుకుంటే మళ్లీ ఆరు నెలలపాటు శిక్షణ ఇవ్వాలని, ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. దీనిపై నెలరోజుల్లోగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. -
‘ఆర్థిక మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు’
సాక్షి, అమరావతి : ఆర్థిక మోసాలకు పాల్పడే వారికి సకాలంలో శిక్షలు పడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం దర్యాప్తు సంస్థలను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎల్వీ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన రిజర్వు బ్యాంకుకు సంబంధించి 17వ రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. మోసాలకు పాల్పడే నకిలీ చిట్‌పండ్ కంపెనీలు, ఇతర ప్రైవేటు ఆర్థిక సంస్థలపై సకాలంలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక మోసాలను ఆరికట్టేందుకు సంబంధిత కేంద్ర, రాష్ట్ర విభాగాలు, ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, చిట్‌ఫండ్ కంపెనీల్లో ప్రజలు పొదుపు చేసే సొమ్ముకు భరోసాగా నిలబడాలని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే రీతిలో వివిధ ఆర్థిక సంస్థలు జారీ చేసే ప్రకటనలను నిరంతరం పరిశీలించడంతోపాటు.. ఎప్పటికప్పుడు ఆడిటింగ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో రిజర్వు బ్యాంకు రీజనల్ డైరెక్టర్ సుభ్రతా దాస్, ఆర్థిక, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు ఎస్ ఎస్ రావత్, కిశోర్, కేంద్ర రాష్ట ప్రభుత్వ ఏజెన్సీల అధికారులు పాల్గొన్నారు. -
ఇకపై ప్రతి 15 రోజులకు కేబినెట్ సమావేశం
సాక్షి, అమరావతి : ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి రాష్ట్ర కేబినెట్ సమావేశం కానున్నట్లు ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ప్రతి నెలా రెండు, నాలుగు బుధవారాల్లో కేబినెట్ సమావేశం కానుంది. అయితే బుధవారం సెలవు దినమైతే మరుసటి రోజు సమావేశం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రతి శాఖ సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. ఒకటి, మూడు శనివారాల్లో శాఖల వారీగా ప్రతిపాదనలు తెలపాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. -
సీఎం జగన్ మూడు నెలల్లోనే అద్భుత పనితీరు..
-
సీఎం జగన్ మూడు నెలల్లోనే అద్భుత పనితీరు..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల పథకానికి తమ వంతు కృషి అందిస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయని ఆయన ప్రశంసించారు. మూడు నెలల్లోనే అద్భుత పనితీరు చూపారని కితాబిచ్చారు. సచివాలయంలో నీతి ఆయోగ్ బృందంతో సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు.. వాటి పరిస్థితులపై రంగాల వారీగా అధికారులు...నీతి ఆయోగ్ వైఎస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌కు ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో నిరక్షరాస్యతను అధిగమించడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని సీఎం వైఎస్ జగన్ వారికి తెలిపారు. దీనికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మెరుగైన పనితీరును కనబర్చారని, జగన్ ఆలోచన విధానం, అంకితభావం, విజన్ తనను ఎంతో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. రాష్ట్రాన్నిఅభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తమ వంతు సహయం అందిస్తామని తెలిపారు. రాష్టంలో నిరక్ష్యరాసత్య జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉందని, మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్లో మానవ వనరుల వృద్ధి కోసం సగానికి పైగా కేటాయించడం అభినందనీయమన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్ల నిర్మాణంపై, పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై.. సీఎం దృష్టి పెట్టాలని రాజీవ్ కుమార్ కోరారు. దేశవ్యాప్తంగా పప్పు దినుసులు, నూనెగింజల సాగును పెంచడానికి తాము ప్రయత్నిస్తున్నామని, వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. మహిళల్లో రక్తహీనత అధికంగా ఉందని, దీనిపై తగిన చర్యలు తీసుకోని మహిళా, శిశుసంక్షేమంపై దృష్టి సారించాలని రాజీవ్ కుమార్ సూచించారు. చదవండి: సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ భేటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. నిరక్ష్యరాస్యతను జీరో స్థాయికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనికోసం బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా ఉన్న పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని, మొదటి దశలో 15వేల పాఠశాలల్లో 9 రకాల కనీస సదుపాయలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చేఏడాది నుంచి ఒకటి నంచి ఎనిమిదవ తరగతి వరకు, తరువాత సంవత్సరంలో 9, 10 తరగతుల్లో.. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో అన్ని సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, జనవరి 26 నుంచి అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తన్నట్లు స్పష్టం చేశారు. ఏడాదికి రూ. 15 వేలు అందిస్తామని, అలాగే పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉందని, పౌష్టికాహార లోపాన్ని నివారించడానికి చేపడుతున్న చర్యలను నీతి ఆయోగ్ అధికారులకు వివరించారు. ప్రతి ఇంటికి పరిశుభ్రమైన తాగు నీటిని అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ను తీసుకు వస్తున్నామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, మధ్యాహ్నా భోజన పథకం కింద పంపిణీ చేస్తున్న ఆహారంలో నాణ్యతను పెంచి విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామని సీఎం స్పష్టం చేశారు. అమ్మ ఒడిని కేంద్ర మానవవనరుల అభివృద్ది శాఖ స్పాన్సర్ చేస్తే ఈ పథకం దేశానికి స్పూర్తిగా నిలుస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఆరోగ్య సమస్యలపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని, దీనికోసం ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేర్చుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలన్నింటిని జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని, వీటిని నాడు-నేడు కింద అభివృద్ధి చేస్తున్నమని తెలిపారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.‘‘రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నాం. విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగింది. దాన్ని అధిగమించేందుకు నీతి ఆయోగ్ సహకారం అవసరం. పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం.. ఈరంగాలే రాష్ట్ర అభివృద్ధికి చోదకాలు. 15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రాభివృద్ధితో రాష్ట్రాన్ని మోడల్ స్టేట్‌గా తయారు చేయాడానికి సీఎం సంకల్పించారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా కడప స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశాం. రాష్ట్రాన్ని పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితోపాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్, గుమ్మనూరు జయరాములు, ఇతర ప్రధాన అధికారులు పాల్గొన్నారు. -
టీటీడీ అధికారులతో సీఎస్ సమీక్ష
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులతో సమీక్ష నిర్వహించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఆర్టీసీ బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం గురించి ఆయన ఈ సందర్భంగా ఆరా తీశారు. ఈ విషయంలో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక అందచేస్తామని తెలిపారు. దేవాదాయ శాఖకు చెందిన ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల సమగ్ర వివరాలను సేకరించాలని ఆదేశాలు ఇచ్చామని, ఆలయాల్లో అన్యమతస్తులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయాల పవిత్రత కాపాడటమే లక్ష్యంగా అవసరమైతే నివాస గృహాల్లో ఆకస్మిత తనిఖీలు కూడా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బస్సు టికెట్లలో అన్యమత ప్రచార ఘటనలు జరగడం బాధాకరమని, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో ఇలాంటివి జరుగకుండా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. మరోవైపు అన్నమాచార్యుల తాళపత్ర గ్రంధాలను సమాజానికి ఉపయోగపడేలా తీసుకోవాల్సిన చర్యలు, భక్తులకు తిరుమల మ్యూజియం సేవలను మరింత మెరుగ్గా అందించడంపై చర్చించామని ఆయన తెలిపారు. ఇక ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో రూ.5కోట్ల కుంభకోణంపై సీఎస్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సెప్టెంబర్ 30 నుంచి జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనపై కూడా టీటీడీ అధికారులతో చర్చించారు. అంతకు ముందు ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. -
సీఎంతో జపాన్ కాన్సుల్ జనరల్ భేటీ
సాక్షి, అమరావతి: చెన్నైలోని జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరొ ఉచియామ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి చాంబర్లో ఇరువురు సమావేశమై రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జపాన్‌లో పర్యటించాలంటూ సీఎంను ఉచియామ ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇరువురి భాగస్వామ్యాలు ఉండాలని ఆకాంక్షించారు. కొత్తగా తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ మానిటరింగ్ చట్టం ద్వారా పెట్టుబడుల ఆలోచన నుంచి ఉత్పత్తి దశ వరకూ కూడా పూర్తిస్థాయిలో సహాయకారిగా ఉంటామని సీఎం పేర్కొన్నారు. పరిశ్రమలు వృద్ధి చెందాలంటే శాంతియుత వాతావరణం కూడా అవసరమని, ఇందులో భాగంగానే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించేలా రిజర్వేషన్లు తెచ్చామని స్పష్టం చేశారు. నైపుణ్యాభివృద్ధి ఉన్న మానవ వనరుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు అంశాన్నీ వివరించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని, ఆ దిశగా పెట్టుబడులు పెట్టే ఆలోచన చేయాలని సీఎం కోరారు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఔషధ తయారీ పరిశ్రమల కోసం భూములు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కోల్డ్ స్టోరేజీలు, గోదాములు, అగ్రిల్యాబ్‌లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టబడులకు అవకాశాలను పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తి పెంపుదల, మత్స్యరంగాల్లో అవకాశాలపై జపాన్ వ్యవసాయశాఖ మిజుహో ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇప్పటికే విశ్లేషణ చేయిస్తోందని ఉచియామ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పెట్టుబడులు సీఎస్‌తో సమావేశమైన కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామ ఏపీ ప్రభుత్వం తగిన భూమిని సమకూర్చితే డెడికేటెడ్ ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అభివృద్ధి చెందిన ఓడరేవులకు తగిన మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో తోడ్పడేందుకు జపాన్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ కాన్సుల్ జనరల్ కొజిరో ఉచియామ పేర్కొన్నారు. నూతన ప్రభుత్వం ప్రాధాన్యతలకు అనుగుణంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంతో ఆయన భేటీ అయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ వ్యాపారం అంశంలో ఆంధ్రప్రదేశ్‌ను జపాన్ కంపెనీలు అత్యంత ప్రాధాన్యతా డెస్టినేషన్ పాయింట్‌గా భావిస్తున్నట్టు ఉచియామ తెలిపారు. రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజి, వేర్ హౌసింగ్, సోర్సింగ్ కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్, తదితర మౌలిక సదుపాయాలకు తోడ్పాటును అందించేందుకు జపాన్ పెట్టుబడిదారులు ఆసక్తి కనబరుస్తున్నట్టు వివరించారు. ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులతో ఎక్సేంజ్ ప్రోగ్రామ్స్‌కు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే జపాన్ కంపెనీలకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. -
పన్నులు కట్టండి.. కర్తవ్యాన్ని పాటించండి
సాక్షి, విజయవాడ: 159వ ఇన్‌కం టాక్స్ డేను పురస్కరించుకుని నగరంలో ఆదివారం ‘వాక్ ఫర్ ఐకర్ భారత్’ పేరుతో ఆదాయం పన్ను కార్యాలయం వద్ద నుంచి 4కే రన్ నిర్వహించారు. ఈ 4కే రన్‌ను ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించి.. రన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్‌కంటాక్స్ వాకథాన్‌ను దేశవ్యాప్తంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. ప్రజలు తమకు విధించిన ట్యాక్స్‌లను సకాలంలో చెల్లించాలని, పన్నులు సక్రమంగా చెల్లిస్తేనే.. వ్యవస్థలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చునని చెప్పారు. టాక్స్‌లు చెల్లించడం ద్వారా పౌరుల మధ్య వ్యత్యాసాలు తగ్గుతాయన్నారు. ప్రజలంతా తమ పరిధిలోని పన్నులు చెల్లించి.. తమ కర్తవ్యాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. -
నగరపాలక సంస్థ కమిషనర్‌గా ప్రశాంతి
సాక్షి, అనంతపురం న్యూసిటీ: నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్ ప్రశాంతి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌తో పాటు అహుడా వైస్ చైర్‌పర్సన్‌గా కూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ఈమె కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా పని చేస్తున్నారు. అంతకు ముందు అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(అహుడా) వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినా.. ఏ మాత్రం లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో ఆమెను కర్నూలు కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కర్నూలులో ఆమె ఐదు నెలలుగా కమిషనర్ హోదాలు పని చేస్తున్నారు. ఇదిలాఉంటే ప్రస్తుతం అనంతపురం కమిషనర్‌గా పని చేస్తున్న పీవీవీఎస్ మూర్తి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. కర్నూలులో రిలీవ్ ఐఏఎస్ పి.ప్రశాంతి కర్నూలులో శనివారం రిలీవ్ అయ్యారు. త్వరలోనే అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పి.ప్రశాంతి పేరు వినగానే కొందరు అధికారులు, సిబ్బందిలో వణుకు పుడుతోంది. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వెళ్లడంతో పాటు అభివృద్ధి విషయంలో రాజీలేకుండా విధులు నిర్వహిస్తారనే పేరున్న అధికారిణి కావడంతో అక్రమార్కులు అప్పుడే ఆలోచనలో పడ్డారు. -
సీఈసీ కోర్టుకు కేబినెట్ బంతి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ(కేబినెట్) సమావేశం ఈ నెల 14వ తేదీన జరుగుతుందా? లేదా? అనేది కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) నిర్ణయంపై ఆధారపడి ఉంది. ముఖ్యమంత్రి కా ర్యాలయం(సీఎంవో) పంపిన నాలుగు ఎజెండా అంశాలతో ఈ నెల 14న కేబినెట్ భేటీ నిర్వహణకు అనుమతించాలంటూ సీఈసీకి లేఖ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ‘‘ఫొని తుపాను సçహాయక చర్యలు, రాష్ట్రంలో తాగునీటి పరిస్థితి, కరువుతోపాటు వాతావరణ పరిస్థితులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు, ఉపాధి పరిస్థితి అనే అంశాలపై చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీనికి ఆయా శాఖల అధికారులంతా హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయండి’’అంటూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎంవో ముఖ్యకార్యదర్శి సాయిప్రసాద్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు మంగళవారం లేఖ సమర్పించిన విషయం విదితమే. దీనిని ఆయన సాధారణ పరిపాలన(జీఏడీ–పొలిటికల్) కార్యదర్శితోపాటు ఆయా శాఖల కార్యదర్శులకు పంపించి, గురువారం స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ నాలుగు అజెండా అంశాలపై చర్చించిన సీఎస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సీఎంవో పంపిన ఎజెండాను యథాతథంగా ఆమోదించి, సీఈసీ ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. ‘‘ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చి, ఈ నాలుగు అజెండా అంశాలపై ఈ నెల 14న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించేందుకు అనుమతించాలి’’అని కోరుతూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) గోపాలకృష్ణ ద్వివేది ద్వారా నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. కొత్తగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేరు స్క్రీనింగ్ కమిటీ నిర్ణయం మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ పంపుతారు. దీనిని సీఈవో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిస్తారు. లేఖ అందిన 48 గంటల్లోగా కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యుల బృందం సమావేశమై, ఈ వినతిని పరిశీలిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు ప్రస్తుత పరిస్థితుల్లో కేబినెట్ నిర్వహించాల్సిన అవసరం ఉందా? లేదా? అంత ప్రాధాన్యం ఉందా? అనే అంశాలను సీఈసీ బృందం సమీక్షించి నిర్ణయం తీసుకుంటుంది. సీఈసీ అనుమతిస్తే ఈ నెల 14న కేబినెట్ సమావేశం ఉంటుంది. తిరస్కరిస్తే ఉండదు. ‘‘ఇప్పుడు బంతి సీఈసీ కోర్టుకు చేరింది. సీఈసీ కోర్టులో అది గోల్ అవుతుందో, ఫౌల్ అవుతుందో తేలాల్సి ఉంది’’అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అన్నారు. ఒకవేళ 14వ తేదీన కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతించినా.. ఎజెండాలోని నాలుగు అంశాలపై చర్చించడం తప్ప కొత్తగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుండదని మరో సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. -
సీఎస్ సమీక్షలు.. యనమల వితండవాదం!
సాక్షి, అమరావతి : చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తోన్న సమీక్షలను టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే ఎల్లో మీడియాలోనూ అభ్యంతరకరంగా వార్తలు వచ్చాయి. ఇవ్వాళ మరోసారి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మీడియా ముందుకొచ్చి చీఫ్ సెక్రటరీ సమీక్షలను ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సమీక్ష చేసే అధికారమే లేదంటూ ఓ వితండ వాదం వినిపించారు. ఎన్నికల ప్రక్రియతో చీఫ్ సెక్రటరీకి అసలు సంబంధమే లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే యనమల వ్యాఖ్యలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ అధికారాలను తగ్గించే పనిలో టీడీపీ నేతలున్నారని ధ్వజమెత్తుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలతోపాటు అన్ని అంశాలపై సమీక్ష చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉందని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు కార్యనిర్వాహక విధులన్నీ చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉంటాయని, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీదేనని వారు స్పష్టం చేశారు. -
కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి : మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేది, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, డీజీపీ ఆర్పీ ఠాకూర్లు సమీక్షకు హాజరయ్యారు. జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్‌కు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. -
బంగారం వివాదంలో..టీటీడీకి సంబంధమే లేదు
తిరుపతి అర్బన్ : చెన్నైలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) నుంచి తిరుపతికి తీసుకొస్తూ పట్టుబడ్డ 1,381 కిలోల బంగారం వ్యవహారంలో టీటీడీకి ఎలాంటి సంబంధంలేదని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. సోమవారం తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఈవో మీడియాతో మాట్లాడారు. 2000వ సంవత్సరం ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు.. 2015కు చెందిన రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు టీటీడీ బంగారాన్ని జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే 2016 ఏప్రిల్ 18న పంజాబ్ నేషనల్ బ్యాంకులో టీటీడీకి చెందిన 1,311 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. అందుకుగానూ ఈనెల 18తో గడువు ముగిసే ఆ డిపాజిట్‌కు వడ్డీతో కలిపి పీఎన్బీ అధికారులు టీటీడీకి 1,381 కిలోల బంగారాన్ని అప్పగించాల్సి ఉందన్నారు. అయితే, ఎన్నికల ప్రక్రియలో భాగంగా తమిళనాడు పోలీసుల జరిపిన తనిఖీల్లో ఆ బంగారం పట్టుబడడం, అనంతరం పూర్తి విచారణ, పరిశీలన తర్వాత ఎన్నికల అధికారులు దానిని విడుదల చేసినట్లు ఈవో వివరించారు. ఈ కారణంగానే రెండు రోజులు ఆలస్యంగా ఈనెల 20న రాత్రి తిరుపతిలోని టీటీడీ ఖజానాకు బంగారం చేరిందన్నారు. ఈ సమయంలో తమ బంగారు విభాగం నిపుణులు, సంబంధిత అధికారులు నాణ్యత, పరిమాణం అంశాలను పరిశీలించాకే 1,381 కిలోలను తీసుకోవడం పూర్తిచేశామన్నారు. కానీ, తాము బ్యాంకులో డిపాజిట్ చేసిన బంగారాన్ని వడ్డీతో కలిపి తిరిగి తమకు అప్పగించే వరకు పూర్తి బాధ్యత పీఎన్బీ అధికారులదేనని ఈవో వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో బంగారం తరలింపు విషయంలో చోటుచేసుకున్న వివాదానికి టీటీడీ ఏమాత్రం బాధ్యత వహించబోదన్నారు. టీటీడీకి చెందిన బంగారం డిపాజిట్ విషయంలో పూర్తిగా ఆర్బీఐ నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టంచేశారు. అందుకే అయితే ‘బోర్డు మీటింగ్’ అక్కర్లేదు చెన్నై పీఎన్బీ నుంచి తిరుపతికి తరలించిన బంగారం వివాదం కోసమే అయితే టీటీడీ బోర్డు మీటింగ్ అక్కర్లేదని ఈవో సింఘాల్ స్పష్టంచేశారు. ఈ విషయంలో టీటీడీ పూర్తి పారదర్శకంగానే వ్యవహరించిందన్నారు. అయితే, ఈ వివాదం అంశంపై త్వరలో బోర్డు మీటింగ్ నిర్వహించనున్నట్లు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రకటించారన్న అంశానికి ఈవో పైవిధంగా స్పందించారు. గడువు ముగిసిన బంగారం డిపాజిట్లను తిరిగి ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, లేదా ఇతరత్రా నిర్ణయాలు మాత్రం బోర్డుతో పాటు ఆయా సబ్ కమిటీల నిర్ణయాల మేరకే ఉంటాయన్నారు. ఈ విషయంపై స్వామీజీలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈ ప్రెస్‌మీట్ ద్వారా సమాధానం లభించినట్లేనని ఈవో తెలిపారు. సూచనలిచ్చేందుకే సీఎస్ విచారణకు ఆదేశం ఇదిలా ఉంటే.. 1,381 కిలోల బంగారం విషయంలో నాలుగు రోజులుగా రగులుతున్న వివాదం దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం టీటీడీ అధికారులకు ఏమైనా సూచనలు ఇచ్చేందుకే విచారణకు ఆదేశించి ఉంటారని ఈవో పేర్కొన్నారు. టీటీడీ పాలనతోపాటు ఇతర అనేక విషయాల్లో సంపూర్ణ అవగాహన కలిగిన ఆయన విచారణను తాము స్వాగతిస్తామన్నారు. -
పోలింగ్‌కు రెండ్రోజుల ముందు.. రూ.5,000 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: అధికారం చివరి రోజుల్లో ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో సీఎం చంద్రబాబు ఇష్టానుసారంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఓట్ల పథకాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమీషన్లు కాజేసేందుకు బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో అత్యధిక వడ్డీలకు భారీ అప్పులు చేశారు. హద్దు లేకుండా అప్పుల మేళా కొనసాగిందని ఆర్థిక శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. గత ఏడాదంతా చేబదుళ్లు, ఓవర్ డ్రాఫ్ట్‌లతోనే ప్రభుత్వం నెట్టుకొచ్చిందని పేర్కొంటున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వానికి అప్పులూ పుట్టని పరిస్థితిలోకి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు దిగజార్చారని ప్రభుత్వ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అప్పుడూ బాబు ఇదే తీరు... ఉమ్మడి రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు ఇదే తరహాలో ఖజానాను ఖాళీ చేసి భారీ రెవెన్యూ, ఆర్థిక లోటులోకి నెట్టేశారని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ నెల నుంచి ప్రారంభమైన కొత్త ఆర్థిక ఏడాదిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రకారం 3 శాతం మేర బడ్జెట్లో ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.32,000 కోట్లు అప్పు చేసేందుకు అనుమతించాలని కేంద్ర ఆర్థికశాఖను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే దీన్ని పరిగణనలోకి తీసుకోబోమని, తమ లెక్కల ప్రకారమే ఎంత మేర అప్పులను అనుమతించాలో నిర్ధారిస్తామని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. నాలుగు నెలలకు మాత్రమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను అసెంబ్లీ ఆమోదించినందున ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.8,000 కోట్ల అప్పులకు అనుమతించింది. ఎన్నికల ముందు భారీగా అప్పు మరోవైపు కొత్త ఆర్థిక ఏడాదిలో సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్ మార్కెట్లో భారీ అప్పు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అయింది. అయితే ఆర్బీఐ ఏప్రిల్ 2వ తేదీన సెక్యూరిటీల విక్రయాన్ని రద్దు చేసింది. అనంతరం 9వ తేదీన సెక్యూరిటీల విక్రయానికి అనుమతించింది. దీంతో రాష్ట్రంలో పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఈ నెల 9వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా ఓపెన్ మార్కెట్లో రూ.5,000 కోట్ల అప్పు చేసింది. 8.18 శాతం వడ్డీకి ఈ అప్పు తీసుకుంది. ఒక్క నెలలోనే రూ.5,000 కోట్ల అప్పు చేయడంతో ఇక మూడు నెలల్లో ఓపెన్ మార్కెట్ ద్వారా ఇక రూ.3,000 కోట్ల అప్పు చేసేందుకు మాత్రమే అనుమతి ఉంది. ఓపెన్ మార్కెట్ రుణాలు కష్టమే! 14వ ఆర్థిక సంఘం కాలపరిమితి ఈ ఆర్థిక సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు శాతం లోపల అప్పులు చేశారా? అంతకు మించి అప్పులు చేశారా? అనే లెక్కలను కేంద్ర ఆర్థికశాఖ సేకరించనుంది. మూడు శాతానికి మించి అప్పులు చేస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకునే అప్పులో ఆ మేరకు కోత విధించనుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఈ ఆర్థిక ఏడాదిలో ఓపెన్ మార్కెట్ ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉండదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరం చివరిలో అదనంగా తీసుకున్న రూ.6 వేల కోట్ల అప్పులను ఈ ఆర్థిక ఏడాదిలో తగ్గించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు కచ్చితంగా అప్పులు పుట్టని స్థితిలోకి రాష్ట్రాన్ని గెంటేశారని స్పష్టమవుతోంది. అధిక వడ్డీలకు అప్పులపై సీఎస్ ఆరా ఇష్టానుసారంగా అధిక వడ్డీలకు అప్పులు తేవడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తప్పుబట్టారు. 8 శాతం లోపలే వడ్డీ ఉండాలని తొలుత జీవోలు జారీ చేసి ఆ తరువాత అంతకన్నా ఎక్కువ వడ్డీతో అప్పులకు ఎలా అనుమతించారని ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా ప్రశ్నించారు. బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ఏకంగా 9 శాతానికిపైగా వడ్డీలతో అప్పులు చేసేందుకు అనుమతివ్వడం, వాటికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడంపైనా సీఎస్ ఆరా తీశారు. నియమ నిబంధనలను తాము ప్రభుత్వం దృష్టికి తెచ్చినా కేబినెట్ ద్వారా ఆమోదించుకోవడంతో ఏమి చేయలేకపోయామని ఆర్థికశాఖ అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈనెల 15వ తేదీన మరో వెయ్యి కోట్ల రూపాయల అప్పు చేయాలని ఆర్థిక శాఖ ప్రయత్నించినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అందుకు అనుమతించలేదు. -
సంయమనమే మన విధి
సాక్షి, అమరావతి: అఖిల భారత సర్వీస్ అధికారులు(సివిల్ సర్వెంట్లు) ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరు రెచ్చగొట్టినా సంయమనంతో, ప్రశాంతతతో ముందుకెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. అవతలి వాళ్లు రెచ్చగొట్టారని నోరుజారితే ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఎవరెంత రెచ్చగొట్టినా సంయమనం పాటిద్దామని అన్నారు. జీవితం క్రికెట్ మ్యాచ్ లాంటిదని, ఒక్క బంతి సరిగ్గా ఆడకపోయినా ఔట్ అయినట్లేనని పేర్కొన్నారు. బ్యాడ్మింటన్, టెన్నిస్‌లో అయితే ఒక బంతి అడటంలో విఫలమైనా మరోసారి సర్వీస్ చేసే అవకాశం ఉంటుందని, క్రికెట్లో అలా ఉండదని గుర్తుచేశారు. సివిల్ సర్వెంట్ ఉద్యోగం లాంగ్‌టర్మ్ క్రికెట్ మ్యాచ్ లాంటిదని, వివాదాలకు, తప్పులకు తావివ్వకుండా పని చేయాలని సూచించారు. సివిల్ సర్వెంట్ డే సందర్బంగా శనివారం తాత్కాలిక సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అఖిల భారత సర్వీస్ అధికారులను ఉద్దేశించి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. తన సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను వివరించారు. అధికారులు ఎలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలో ఉద్బోధించారు. ఏం చేయాలో? ఏం చేయకూడదో విశదీకరించారు. విలువలను కాపాడడంలో సివిల్ సర్వెంట్లు కీలకపాత్ర పోషించాలని, సీనియర్ అధికారులు మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ, సంక్షేమ పాలనే అంతిమ లక్ష్యాలు దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ స్థానంలో నిలిపేలా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. ‘‘మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సంయమనంతో, ప్రశాంతతతో ముందుకెళ్లాలి. అవతలి వాళ్లు రెచ్చగొట్టారని నోరుజారి ఉద్యోగాలు పోగొట్టుకున్న అధికారులు నాకు తెలుసు. ఒకటో బ్లాక్‌లో చేసినా, రెండో బ్లాక్‌లో చేసినా తేడా ఏమీ ఉండదు.(స్పెషల్ సీఎస్‌గా ఉన్నా, సీఎస్‌గా పనిచేసినా అని పరోక్షంగా చెప్పారు) ప్రజల ఆశయాలకు అనుగుణంగా సమాజ సర్వతోముఖాభివృద్ధికి, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అఖిల భారత సర్వీస్ అధికారులు చురుకైన పాత్ర పోషించాలి. సమాజంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకుని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. రాజ్యాంగ పరిరక్షణ, మానవత్వం, సంక్షేమ పాలనే అంతిమ లక్ష్యాలుగా పని చేయాలి. వారసత్వ సంపద, సంస్కృతీ సంప్రదాయాలు, భాషా పరిరక్షణ, ప్రోత్సాహానికి సివిల్ సర్వెంట్లు అన్ని విధాలా కృషి చేయాలి. విలువలను కాపాడడంలో కీలకపాత్ర పోషించాలి. జూనియర్లకు సీనియర్లు ఆదర్శంగా నిలవాలి’’ అని ఎల్వీ సుబ్రహ్మణ్యం కోరారు. చైనాలో సివిల్ సర్వెంట్ల విధానం మనకంటే ముందుగానే అమల్లోకి వచ్చిందని హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ పూర్వపు డైరెక్టర్ జనరల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్ అధ్యక్షులు, విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.ప్రశాంత మహాపాత్ర తెలిపారు. మానవ వనరుల అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. అవినీతి నియంత్రణకు కృషి చేయాలి సివిల్ సర్వెంట్లు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని గుజరాత్ రాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజిమెంట్ డైరెక్టర్ జనరల్ పి.కె.తనేజ సూచించారు. శాంతి భద్రతలను కాపాడడంలో న్యాయబద్ధమైన నియమాలకు అనుగుణంగా పనిచేయాలని అన్నారు. అవినీతిని నియంత్రించేందుకు ధైర్యంగా కృషి చేయాలన్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డి.చక్రపాణి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
నాపై కేసు కొట్టేయండి...
హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ కేసులో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు.. వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివ శంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రాసిన లేఖను పిల్‌గా భావించిన హైకోర్టు, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదే శించిందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి విజిలెన్స్ నివేదికలో పిటిషనర్‌కు వ్యతిరేకంగా ప్రస్తావన లేదన్నారు. అప్పటి ఏపీ ఐఐసీ ఎండీగా పిటిషనర్ వ్యవహరించి నప్పటికీ, ఎమ్మార్‌కు భూకేటాయింపులు, ధర నిర్ణయం పూర్తిగా ప్రభుత్వానిదేనని, ఆయన వివరించారు. -
ఎంబీబీఎస్ సీట్లపై జాతీయ విధానానికి వెళ్లం
సాక్షితో వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాల విషయంలో నేషనల్‌పూల్(జాతీయ విధానం)లో చేరేది లేదని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. దీంతో ఏపీ పరిధిలోని మెడికల్ కాలేజీ సీట్ల కోసం ఆ ప్రాంత విద్యార్థుల మధ్యే పోటీ ఉంటుంది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ లంకా వెంకట సుబ్రమణ్యం సాక్షితో ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. అటానమస్ సంస్థలైన శ్రీవెంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (స్విమ్స్), పద్మావ తి మెడికల్ కళాశాలల్లో ఉన్న సీట్లకు కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే సీట్లు కేటాయిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రవాస భారతీయ కోటా (ఎన్ఆర్ఐ) సీట్ల భర్తీని కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా చేపడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తయ్యాకే ఏపీలో నిర్వహిస్తామన్నారు. 15 శాతం నాన్‌లోకల్ కోటా కింద ఉస్మానియా, గాంధీ వంటి పేరున్న కళాశాలల్లో చేరేవారుంటారన్నారు. అలాంటి వాళ్లు తెలంగాణ కౌన్సెలింగ్‌తో చేరిపోతారనీ ,ఆ తర్వాత ఏపీలో సీట్ల భర్తీ జరిగితే బదిలీ సమస్య అనేది ఉండదన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ, ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో యాజమాన్య కోట సీట్ల భర్తీ పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. -
ఎందుకు తొలగించకూడదు
సాక్షి ప్రతినిధి, కడప: రిమ్స్ డెరైక్టర్ సిద్దప్ప గౌరవ్‌ను ఎందుకు తొలగించకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం డిపార్టుమెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)ను ఆదేశించారు. ఆ మేరకు ఈనెల 13న మెమో 8800/ఏ.2/2014ను జారీ చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు డెరైక్టర్‌గా డాక్టర్ సిద్దప్పగౌరవ్ అనర్హుడని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ నాన్‌గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. అనస్థీషియా ప్రొఫెసర్‌గా సిద్దప్పకు అర్హత లేదని, కోర్టు ఉత్తర్వుల కారణంగా అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి మాత్రమేనని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్‌కు డెరైక్టర్‌గా ఉండే అర్హత ఎంతమాత్రం లేదని ఎన్జీఓ అసోసియేషన్ వివరించింది. దీంతో రిమ్స్ డెరైక్టర్‌గా సిద్దప్పగౌరవ్‌ను ఎందుకు తొలగించకూడదో స్పష్టమైన కారణాలు వివరించాలని డీఎంఈని ఆదేశించింది. మరో ఏడాది అవకాశం ఇవ్వండి.. రిమ్స్ డెరైక్టర్‌గా మరో ఏడాది అవకాశం ఇవ్వాలని డాక్టర్ సిద్దప్ప గౌరవ్ డీఎంఈని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. తర్వలో రిమ్స్ డెరైక్టర్‌గా పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన మరో అవకాశం కోసం అభ్యర్థించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎన్జీఓ హైదరాబాద్ విభాగం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఆధారంగా మెడికల్ అండ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్జీఓల ఫిర్యాదుపై స్పందించిన ఆయన చర్యల నిమిత్తం డీఎంఈ వివరణ కోరారు. డెరైక్టర్‌ను తొలగించాలి.. రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ సిద్దప్పగౌరవ్‌ను తొలగించాలని ఏపీ మెడికల్ అండ్ హెల్త్ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజడంచౌదరి, ప్రధాన కార్యదర్శి అహరోన్‌లు కోరారు. తమ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని పరిగణలోకి తీసుకొని తక్షణమే డీఎంఈ డెరైక్టర్ తొలగింపునకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటనను ఆదివారం విడుదల చేశారు.