సాక్షి, అమరావతి : చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తోన్న సమీక్షలను టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే ఎల్లో మీడియాలోనూ అభ్యంతరకరంగా వార్తలు వచ్చాయి. ఇవ్వాళ మరోసారి టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మీడియా ముందుకొచ్చి చీఫ్ సెక్రటరీ సమీక్షలను ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు.
అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సమీక్ష చేసే అధికారమే లేదంటూ ఓ వితండ వాదం వినిపించారు. ఎన్నికల ప్రక్రియతో చీఫ్ సెక్రటరీకి అసలు సంబంధమే లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే యనమల వ్యాఖ్యలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ అధికారాలను తగ్గించే పనిలో టీడీపీ నేతలున్నారని ధ్వజమెత్తుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలతోపాటు అన్ని అంశాలపై సమీక్ష చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉందని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు కార్యనిర్వాహక విధులన్నీ చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉంటాయని, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీదేనని వారు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment